మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ వినియోగంలో నిన్న (గురువారం) కొంత అంతరాయం ఏర్పడింది. భారతదేశంలో ఈ సైట్‌లోకి లాగిన్ అవ్వడంతో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు వినియోగదారులు తెలిపారు. దీని వల్ల వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్స్ రెండూ ప్రభావితమయ్యాయి.
నివేదికల ప్రకారం, రాత్రి 10:18 గంటల సమయంలో చాలా మంది ట్విటర్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపైన సుమారు 5,400 మంది ఫిర్యాదులు చేశారు. డౌన్‌డిటెక్టర్ (Downdetector) ప్రకారం.. భారతదేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నుంచి ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా ఉన్న ట్విటర్ వినియోగదారులు కొంత సమయం ఈ ప్లాట్‌ఫారమ్ ఆపరేట్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఇందులో సుమారు 56 శాతం ఫిర్యాదులను స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నుంచి, 37 శాతం వెబ్‌సైట్ వినియోగదారులు, 8 శాతం సర్వర్ కనెక్షన్‌లో సమస్యలను నివేదించారు.
(ఇదీ చదవండి: డామినర్ 400 పై భారీ డిస్కౌంట్.. బజాజ్ ప్రేమికులకు పండగే)
ట్విటర్ వినియోగంలో అంతరాయం ఏర్పడిన కొద్ది నిమిషాలలోనే మళ్ళీ యధావిధిగా పని చేయడం ప్రారంభించింది. ఆ తరువాత వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ సైట్ మునుపటి మాదిరిగానే పనిచేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా ట్విటర్ సంస్థ భారతదేశంలోని మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేసింది. ఈ రెండు కార్యాలయాల్లో ఉన్న సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులను తగ్గించుకుంటూ సోషల్ మీడియా సేవల్ని అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment