Gautam And Pankhuri Welcome Twins After 5 Years Of Marriage; Insta Post Vial - Sakshi
Sakshi News home page

Pankhuri Awasthy: పెళ్లయిన ఐదేళ్లకు ట్విన్స్.. పోస్ట్ చేసిన బుల్లితెర నటి!

Published Wed, Jul 26 2023 5:05 PM | Last Updated on Wed, Jul 26 2023 6:11 PM

Pankhuri Awasthy Welcome Twins After 5 Years Of Marriage - Sakshi

రజియా సుల్తాన్ అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బుల్లితెర నటి పంకురీ అవస్తీ. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత సూర్యపుత్ర కరణ్, మేడమ్ సార్, యే రిస్తా క్యా కెహ్లాతా పై లాంటి సీరియల్స్‌లో కనిపించింది. సూర్యపుత్ర కరణ్‌ టీవీ షో నటించిన గౌతమ్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది భామ. తాజాగా ఈ జంటకు  కవల పిల్లలు జన్మనిచ్చారు. ఈనెల 25న  బుల్లితెర భామకు ఓ పాప, బాబు జన్మించినట్లు తన ఇన్‌స్టాలో పంచుకుంది.  

(ఇది చదవండి: ఆ సీక్రెట్‌ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్‌ కోసమేనా అంటున్న ఫ్యాన్స్!)

ఇన్‌స్టాలో రాస్తూ..' ఆనందం, కృతజ్ఞతతో నిండిన రెండు మనసులు.. ఇప్పుడు నలుగురిగా ప్రయాణం ప్రారంభించబోతున్నాం. ఈ సందర్భాన్ని ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాం. మా పట్ల మీ అందరి ప్రేమకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన పలువురు నటీనటులు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్పారు. గౌహర్ ఖాన్, రాజ్‌పుత్‌ పాయల్‌తో పాటు దివ్యాంక త్రిపాఠి, దేవోలీనా భట్టాచార్జీ, మొహ్సిన్ ఖాన్, అమీర్ అలీ, భారతీ సింగ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

గౌతమ్-పంకురి ప్రేమకథ

'రజియా సుల్తాన్' షో ద్వారా  పంకురికీ గుర్తింపు దక్కింది.  'సరస్వతీచంద్ర' అనే సీరియల్‌ ద్వారా పేరు తెచ్చుకున్న గౌతమ్.. ఆ తర్వాత  'సూర్యపుత్ర కరణ్' సీరియల్‌లో కలిసి నటించారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఫిబ్రవరి 2018లో రాజస్థాన్‌లోని అల్వార్‌ తిజారా ఫోర్ట్ ప్యాలెస్‌లో జరిగిన గొప్ప వేడుకలో పెళ్లి చేసుకున్నారు.

(ఇది చదవండి: నిహారికతో విడాకులు.. తొలిసారి పోస్ట్ చేసిన చైతన్య!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement