
Dinesh Karthik And Dipika Pallikal Blessed With Two Baby Boys: టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన భార్య దీపికా పల్లికల్ ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చిందని గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘ముగ్గురం ఐదుగురం అయ్యాం’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఇక్కడ డీకే తన పెంపుడు కుక్కను కూడా కుటుంబంలో కలుపుకుని చెప్పడం విశేషం. కాగా, దినేష్ కార్తీక్, దీపికా పల్లికల్‌లకు 2015లో వివాహం జరిగింది. దీపికా పల్లికల్ దేశంలోని ప్రముఖ స్క్వాష్ ప్లేయర్లలో ఒకరు.
చదవండి: పాక్ గెలుపు సంబురాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు: యూపీ సీఎం