కవలలే కానీ.. పుట్టిన ఏడాదులు వేరు | Twins Born Just 15 Mins Apart different years Brother 2021 And Sister 2022 | Sakshi
Sakshi News home page

కవలలే కానీ.. పుట్టిన ఏడాదులు వేరు

Published Wed, Jan 5 2022 6:47 AM | Last Updated on Wed, Jan 5 2022 6:48 AM

Twins Born Just 15 Mins Apart different years Brother 2021 And Sister 2022 - Sakshi

కాలిఫోర్నియా: కలిసి పుట్టే వాళ్లను కవలలంటారు. వారి డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఒకటే ఉంటుంది. కానీ కాలిఫోర్నియాకు చెందిన ఫాతిమా, రాబర్ట్‌ దంపతులకు పుట్టిన కవలలు మాత్రం అరుదైన çఘనత సాధించారు. పేరుకు కవలలే కానీ, వీరి పుట్టిన తేదీ వేరు. అంతేకాదు వీళ్ల పుట్టిన ఏడాది కూడా మారిపోయింది. కలిసి పుట్టారన్న పేరే కానీ వీరిద్దరూ ఇకపై వేర్వేరు రోజుల్లో పుట్టినరోజులు జరుపుకుంటారు. పాత సంవత్సరం ముగిసిపోయే క్షణంలో ఒకరు, కొత్త సంవత్సరం ఆరంభమయ్యే క్షణాల్లో మరొకరు పుట్టడమే ఇందుకు కారణం.

ఫాతిమాకు గత డిసెంబర్‌ 31న నొప్పులొచ్చాయి. ఆమె ఆ రోజు రాత్రి 11.45కు మగబిడ్డకు జన్మనిచ్చింది. సుమారు పావుగంట అనంతరం తేదీ మారగానే అంటే జనవరి 1న ఆడ శిశువును ప్రసవించింది. దీంతో మగపిల్లవాడు (ఆల్ఫ్రెడ్‌ అని పేరు పెట్టారు) 2021లో, ఆడపిల్ల (ఐలిన్‌ అని పేరు పెట్టారు) 2022లో పుట్టినట్లయింది. సో.. వీరు కవలలే కానీ, పుట్టినేడాదులు మాత్రం తేడా అంటూ వీరికి కాన్పు చేసిన ఆస్పత్రి ట్వీట్‌ చేసింది.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement