సాధారణంగా తొమ్మిది నెలలు నిండాక పిల్లలు పుట్టడం సహజం. నెల ముందే పుట్టిన వాళ్లని నెల తక్కువ గడుగ్గాయిలు అంటూంటారు. అయితే ఈ పిల్లలు నాలుగు నెలలు ముందు పుట్టి.. వారి కుటుంబానికి, వైద్యం చేసిన డాక్టర్స్‌కి షాకిచ్చారు. కేవలం తల్లి గర్భంలో.. 22 వారాలు మాత్రమే ఉండి.. సుమారు 126 రోజుల ముందే పుట్టారు.
‘ఆదియా, అడ్రియాల్ నడరాజా’ అనే ఈ కెనడియన్ కవలలు.. 2022 మార్చి 4న జన్మించారు. వీరు పుట్టినప్పుడు బతకడానికి ‘జీరో చాన్స్’ అని చెప్పారు డాక్టర్లు. బతకడమే కష్టం అని వైద్యులు తేల్చేస్తే.. 2023 మార్చికి ఏడాది పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించారు.
కేవలం 330 గ్రాములు (0.72 పౌండ్లు.), 420 గ్రాములు (0.92 పౌండ్లు.) బరువుతో పుట్టిన ఈ చిన్నారులు.. అత్యంత తక్కువ బరువున్న కవలలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment