Ginnesbuk of World Records
-
నెలల తక్కువ కవలలు
సాధారణంగా తొమ్మిది నెలలు నిండాక పిల్లలు పుట్టడం సహజం. నెల ముందే పుట్టిన వాళ్లని నెల తక్కువ గడుగ్గాయిలు అంటూంటారు. అయితే ఈ పిల్లలు నాలుగు నెలలు ముందు పుట్టి.. వారి కుటుంబానికి, వైద్యం చేసిన డాక్టర్స్‌కి షాకిచ్చారు. కేవలం తల్లి గర్భంలో.. 22 వారాలు మాత్రమే ఉండి.. సుమారు 126 రోజుల ముందే పుట్టారు. ‘ఆదియా, అడ్రియాల్ నడరాజా’ అనే ఈ కెనడియన్ కవలలు.. 2022 మార్చి 4న జన్మించారు. వీరు పుట్టినప్పుడు బతకడానికి ‘జీరో చాన్స్’ అని చెప్పారు డాక్టర్లు. బతకడమే కష్టం అని వైద్యులు తేల్చేస్తే.. 2023 మార్చికి ఏడాది పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించారు. కేవలం 330 గ్రాములు (0.72 పౌండ్లు.), 420 గ్రాములు (0.92 పౌండ్లు.) బరువుతో పుట్టిన ఈ చిన్నారులు.. అత్యంత తక్కువ బరువున్న కవలలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచారు. -
సెల్ఫీతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అక్షయ్ కుమార్
బాలీవుడ్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్ గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. సెల్ఫీతో ఆయన తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కాడు. అభిమానులతో ఏకదాటిగా సెల్పీలు దిగి అక్షయ్ ఈ రికార్డును నెలకొల్పాడు. కేవలం మూడు నిమిషాల్లోనే 184 సెల్ఫీలు దిగి హాలీవుడ్ నటుడు జేమ్స్ స్మిత్ రికార్ట్‌ను బ్రేక్ చేశాడు. ఇటీవల ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో గిన్నిస్ బుక్ అధికారుల అధ్వర్యంలో అక్షయ్‌తో సెల్పీ పోటీని నిర్వహించారు. దీనికి దాదాపు 240 మంది అభిమానులు హాజరు కాగా అక్షయ్ వారితో ఒక్కొరిగా ఫొటో దిగాడు. చదవండి: మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్! మూడు నిమిషాల్లో ఆయన 209 సెల్ఫీలు దిగగా అందులో కొన్ని డిస్ క్వాలిఫై అయ్యాయి. బ్లర్‌గా వచ్చిన ఫొటోలను తీసివేయగా చివరకు 184 సెల్ఫీలతో ఆయన ఈ రికార్డ్‌ను సృష్టించాడు. ఈ మేరకు అధికారులు అక్షయ్‌కి ఈ రికార్డుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని అందించారు. అనంతరం అక్షయ్ అనందం వ్యక్తం చేస్తూ ఈ రికార్డు అభిమానులకు అంక్షితం ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇంత వరకు వచ్చింది అభిమానుల వల్లే. వారందరికి నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని నా అభిమానలకే అంకితం ఇస్తున్నా’ అని తెలిపాడు. చదవండి: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. దాదాపు 200 థియేటర్లో రి-రిలీజ్‌కు రెడీ కాగా ఇప్పటి వరకు 168 సెల్ఫీతో హాలీవుడ్ నటుడు జేమ్స్ స్మిత్‌కు ఈ రికార్డ్ ఉండగా దీనిని తాజాగా అక్షయ్ బ్రేక్ చేయడం విశేషం. 2015లో సాన్ అండ్రీయాస్ ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 105 సెల్ఫీలతో తొలి రికార్డు క్రియేట్ చేశాడు. కాగా వెండితెరపై తనదైన నటన, వైవిధ్యమైన పాత్రలతో అభిమానులను అలరిస్తుంటాడు అక్షయ్. ఆయన తాజా చిత్రం సెల్ఫీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు శుక్రవారం(ఫిబ్రవరి 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
గిన్నిస్‌లోకి ‘టైగర్ సర్వే’
న్యూఢిల్లీ: భారత్‌లో పులుల సంఖ్యను లెక్కించేందుకు 2018–19లో నిర్వహించిన సర్వే.. గిన్నిస్ ప్రపంచరికార్డు సృష్టించింది. ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్‌లైఫ్ సర్వేగా ఇది రికార్డుకెక్కింది. దేశంలో 2,967 పులులు ఉన్నట్లు సర్వే తేల్చింది. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం పులులు భారత్‌లో ఉన్నాయి. సర్వే గిన్నిస్ రికార్డు పొందడంపై పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది అరుదైన ఘనత అని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఒక గొప్ప ఉదాహరణ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పులుల గణన సర్వేలో భాగంగా 1,21,337 చదరపు కిలోమీటర్ల (46,848 చదరపు మైళ్లు) విస్తీర్ణంలో 26,838 ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి 34,858,623 ఫొటోలను చిత్రీకరించాయి. ఇందులో 76,651 ఫొటోలు పులులకు సంబంధించినవి. పులి పిల్లలు మినహా దేశంలో మొత్తం 2,461 పులులు ఉన్నట్లు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఫొటోలను విశ్లేషించి గుర్తించారు. పిల్లలతో కలిపితే 2,967 పులులు ఉన్నట్లు తేల్చారు. -
పోలీసులతో జతకట్టిన అతిచిన్న మహిళ!
ముంబై: కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ అతిచిన్న మహిళ జ్యోతి అమ్గే మంగళవారం నాగపూర్ పోలీసులకు మద్దతుగా నిలిచారు. లాక్డౌన్లో ఇంట్లోనే ఉండాలని ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు భౌతిక దూరం ఒక్కటే మార్గమని, ఇందుకోసం లాక్డౌన్ అమలును ప్రజలు తప్పనిసరిగా పాటించి మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో కలిసి నాగపూర్ సమీపంలోని ఇతర ప్రాంతాలలో అవగాహన చర్యలు చేపట్టారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు లాక్‌డౌన్‌కు ఇంట్లోని ఉండి సహకరించాలని. అదే విధంగా కరోనా వైరస్‌పై పోరాడేందుకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు మద్దతుగా నిలవాలి’ అంటూ సందేశాన్నిచ్చారు. (శభాష్ పోలీస్) ఈ సందర్భంగా జ్యోతి ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. ఈ ప్రాణాంతక వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగస్వామి కావాలని నాగపూర్ పోలీసులు తనని కోరినట్లు చెప్పారు. వారి పిలుపు మేరకు ప్రజలంతా ఇంట్లోనే ఉండేలా కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడానికి పోలీసులకు మద్దతుగా వచ్చానని ఆమె తెలిపారు. కాగా 26 ఏళ్ల వయసున్న జ్యోతి కేవలం 62.8 సెంటీమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిచిన్న మహిళగా గిన్నిస్ బుక్కు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇక ముంబైకి చెందిన 242 మందితో సహా మొత్తం 352 మందికి సోమవారం కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 2334కు చేరుకోగా.. మరణాల సంఖ్య 160కి పెరిగిందని అధికారులు తెలిపారు. -
జగ్దీప్.. బాప్‌రేబాప్..
పాత బాలీవుడ్ సినిమాల్లో ఇదో రొటీన్ సీను.. హీరో ఓ పోలీసు.. విలన్ ఏదో అంటాడు.. అప్పుడు మన హీరో.. ‘కానూన్ కా హాత్ బహుత్ లంబే హోతేహై’అంటూ స్టైల్‌గా ఓ డైలాగు విసురుతాడు. అంటే దానర్థం చట్టం చేతులు చాలా పొడవైనవి.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని.. ఇక్కడ చట్టం చేతులే కాదు.. మనిషి కూడా చాలా పొడవే!! జగ్దీప్ సింగ్.. పంజాబ్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ పోలీసు. ఇతని ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. బరువు 190 కిలోలు. ప్రపంచంలోనే అతి పొడవైన పోలీసు అని పేరు. త్వరలోనే గిన్నిస్ బుక్ వారు కూడా ఈ రికార్డును గుర్తించనున్నారని జగ్దీప్ చెబుతున్నాడు. ఇతడి షూ సైజు 19. మన దేశంలో దొరకదు. దీంతో విదేశాల నుంచి తెప్పించుకుంటాడు. షోరూంలో బట్టలు దొరకవు. ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సిందే. ఇక బైకు, కారు ప్రయాణాల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్నకార్లలో అయితే.. మనోడు పట్టడు. బైకులయితే.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం టైపులో ఇతడి ముందు వెలవెలబోతుంటాయి. మొన్నమొన్నటి వరకూ ఇతడికి పిల్లనిచ్చేవారు కూడా కరువయ్యారు. ఇంత ఎత్తు అంటే ఏదో ఆరోగ్య సమస్య ఉంటుందన్న కారణంతో.. అయితే.. మనోడి అదృష్టం కొద్ది.. అమ్మాయి దొరికింది. జగ్దీప్ అంత హైటు కాకున్నా.. ఇతడి సతీమణి ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. జగ్దీప్ పర్సనాలిటీ చూసి.. సోషల్ మీడియాలో ఇతడిని రాక్షసుడు అన్నవారూ ఉన్నారు. అదే సమయంలో సెల్ఫీల కోసం ఎగబడినవాళ్లూ ఉన్నారు. అలా మనోడి జీవితం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం టైపులో బాగానే నడిచిపోతోందట. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
వచ్చింది మర్చిపోయేలా చేసిన సినిమా...
దీలో హవా చల్ రహా హై అంటే... వాడి టైమ్ బాగుంది అన్నట్టు! ‘నవా హవా’ అంటే కొత్తగాలి వీస్తోందని! అయినా కొండ అడ్డం ఉంటే గాలి ఎలా వీస్తుంది? నవాజ్ సిద్దిఖి కూడా అలాగే ఆలోచించాడు. అమ్మ ఆశీర్వాదం అన్న ఉలి పట్టుకుని నమ్మకం అన్న ఒక సుత్తిని సంపాదించి ఏకంగా ఆ కొండనే తవ్వేశాడు. ఇది నవాజ్ నిజజీవితంలో కథ... తను నటించిన ‘మాంఝీ’ సినిమా కథ కూడా! నేనేదో పుట్టను పర్వతం చేస్తున్నాననుకుంటే... క్లారిటీ కోసం ఈ కొండ గాలిని స్పృశించి చూడండి. వచ్చే నెల బాలీవుడ్లో ఒక సినిమా రిలీజ్ కానుంది. పేరు ‘మాంఝీ’. కొండను లొంగదీసిన ఒక అసామాన్యుడి కథ అది. బిహార్‌లోని గయ దగ్గర దారికి అడ్డంగా ఉండే కొండ వల్ల దశరథ్ మాంఝీ అనే రైతుకూలీ భార్య సకాలంలో వైద్యం అందక మరణించింది.కొండ లేకుంటే పట్టణానికి దారి దగ్గరయ్యేది. కొండ వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో ప్రమాదంలో ఉన్నవారి ప్రాణం పోతోంది. దీనిని ఆపాలి అనుకున్న మాంఝీ కొండ మీద తిరగబడ్డాడు. ఎందరు హేళన చేస్తున్నా వినకుండా కేవలం ఒక సుత్తీ శానంతో 22 ఏళ్ల పాటు ఒక్కడే దారిని తొలిచి పల్లెకూ పట్టణానికి మధ్య దూరాన్ని 55 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు తగ్గించాడు. అందుకే అందరూ అతణ్ణి ‘మౌంటేన్ మేన్’ అని కీర్తించారు.అయితే ఆ పాత్రను పోషించిన నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా అంతకు ఏ మాత్రం తక్కువ కాదు. జేబులో రూపాయి లేదు. ఊరి నుంచి డబ్బు అందుతుందిలే అనుకోవడానికి ఉత్తరప్రదేశ్‌లోని పల్లెలో ఉన్న తల్లిదండ్రులకే తినడానికి తిండి లేదు. తను పెద్ద కొడుకు. ఏదైనా సంపాదించి పెట్టాల్సింది పోయి మిగిలిన ఎనిమిది మంది తోబుట్టువులను వాళ్ల భారానికే వదిలిపెట్టి వచ్చే శాడు. ముంబైలో ఎవరూ తెలియదు. వేషం కావాలి సార్ అని అడిగితే- రంగు తక్కువగా పొట్టిగా ఉత్త పల్లెటూరి బైతులా ఉన్న ఇతణ్ణి చూసి ప్రతి ఒక్కరూ ఈసడించడమే. రూమ్మేట్కు వంట వండే షరతు మీద కొంతకాలం రూమ్ సంపాదించాడు. నటన నేర్పిస్తానంటూ వర్క్‌షాప్‌లు పెట్టి యాభై వంద వస్తే పొట్ట పోసుకున్నాడు. పేవ్మెంట్ మీద దనియాలు అమ్మాడు. ఎక్స్ట్రా వేషాలు కట్టి గుంపులో గోవిందయ్యగా బతికాడు. నిజంగా చాలా కఠినమైన రోజులు అవి. భవిష్యత్తు అనే పర్వతానికి మొదలేదో మొన ఏదో తెలియని రోజులు. తల్లి అప్పుడప్పుడు ఉత్తరం రాసేది. ఏరా.. ఏదైనా చాన్స్ దొరికిందా... లేదమ్మా... దొరుతుందిలే అని జవాబు రాసేవాడు. తల్లి ధైర్యం చెబుతూ మళ్లీ రాసేది.ఏం కాదులేరా... చెత్తను కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకు ఎత్తి పారేస్తారు. నువ్వు మనిషివి. నీకు అవకాశం రాకుండా ఉంటుందా అని చెప్పేది. అది అబద్ధమే. కొడుక్కి ధైర్యం చెప్పడానికి ఏ తల్లయినా రాసే మాటే. కాని ఆ అబద్ధాన్ని అతడు నమ్మేవాడు. ఎప్పటికైనా తనకూ రోజు వస్తుందని ఎదురు చూసే వాడు. నిజంగానే ఆ రోజు రావడానికి పన్నెండేళ్లు పట్టింది. నీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే ఎవరైనా సరే పెద్ద పెద్ద పేర్లు చెప్పడానికి ఇష్టపడతారు. కాని నవాజుద్దీన్ సిద్దిఖీని అడిగితే ‘దాదా కోండ్కే’ పేరు చెబుతాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాలు తీసి వరుసగా తొమ్మిది సిల్వర్‌జూబ్లీ హిట్స్ కొట్టి గిన్నెస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కిన మరాఠా సూపర్‌స్టార్ దాదా కొండ్కే. అతడి సినిమాల్లో ఏమున్నా తెర మీద అతడు నటించే తీరు మాత్రం ప్రతి ఒక్కరినీ అబ్బుర పరుస్తుంది. ముజఫర్‌నగర్ జిల్లాలోని సొంత పల్లె బుధానాలో చిన్నప్పుడు కోండ్కే సినిమాలను చూసే నటన మోజులో పడ్డాడు నవాజుద్దీన్. అసలు ఇంత ఈజ్‌గా ఏ మాత్రం ఇన్హిబిషన్స్ లేకుండా ఎలా నటించగలడు అని వెర్రెత్తిపోయాడు. చేస్తే ఇలా యాక్ట్ చేయాలి ఇంత ఈజ్‌గా చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అప్పుడు పడ్డ పురుగు బిఎస్సీ చదివినా లోపల పురుగు తొలుస్తూనే ఉంది. కొన్నాళ్లు గుజరాత్ ఆయిల్ కంపెనీల్లో కెమిస్ట్‌గా పని చేశాడుగానీ గల్ఫ్ నుంచి వచ్చే క్రూడాయిల్ని టెస్ట్ చేస్తూ గడిపే ఆ పనిలో తన జీవితం శిథిలం అయిపోతుందని అనిపించింది. అప్పటికే అక్కడ నటన మొదలెట్టాడు. నాటక సమాజాలలోని మిత్రులు నవాజ్ యాక్టింగ్ గమనించి- నువ్వుండాల్సింది ఇక్కడ కాదు... ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అక్కడకు వెళ్లు అని సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. ఢిల్లీ రానైతే వచ్చాడుగానీ బతకడం ఎలా? గోడ మీద యాడ్ కనిపించింది- సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. పగటి డ్యూటీ అయితే చేస్తాను అని చెప్పి చేరిపోయాడు. పగలు పనికి. రాత్రి నాటకానికి. అలా చదువుకుంటూ నాటకాలు వేసుకుంటూ సెక్యూరిటీ గార్డ్‌గా తినడానికి రొట్టె సంపాదించుకుంటూ 1998 ప్రాంతంలో ముంబై చేరుకున్నాడు. ఏదో స్టూడియోలో ఏదో సినిమా షూటింగ్. డెరైక్టర్ ఎవరు అనడిగితే తెలుగతను పేరు రామ్‌గోపాల్ వర్మ అని చెప్పారు. నేరుగా కలవొచ్చా.. అని అడిగితే కుదర్దు ఆయన అదో టైప్ అని సమాచారం. సరే ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా అక్కడే కుర్చీలో కూచుని సీన్ రాసుకుంటున్న గడ్డం మనిషి కనిపించాడు. పేరు అనురాగ్ కశ్యప్ అట. ఆ సినిమాకు రైటర్ అట. సార్... నాకు వేషం ఇప్పించండి- ఎన్ఎస్డి నుంచి వచ్చాను అని నవాజ్ అతనికి తను చేసిన ఓ నాటకంలోని బిట్ చేసి చూపించాడు. అతడికి నచ్చింది. సిగరెట్ ఆఫర్ చేస్తూ- మిత్రమా... నువ్వు ఎక్కడ ట్రైన్ అయ్యావనేది నాకు అనవసరం. ఎంత బాగా చేయగలవు అనేదే ముఖ్యం. నువ్వు బాగా చేస్తున్నావు. కాని నా ఖర్మ కొద్దీ నేను కూడా లాటరీలు కొడుతున్నాను. నా రోజులు బాగున్నప్పుడు నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను... అన్నాడు. అయితే ఆ అవకాశం వెంటనే రాలేదు. బొంబాయిలో సినిమా కష్టాలు. భయంకరమైన ఆకలి పస్తులు. తట్టుకోలేక చివరకు యాడ్స్‌లో కూడా ఎక్స్ట్రాగా కనిపించాడు. సచిన్ టెండూల్కర్ నటించిన ఒక యాడ్‌లో వెనుక బట్టలు ఉతుకుతూ ఉండే ధోబీలలో నవాజుద్దీన్ సిద్దిఖ్ ఒకడు. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు... ఎన్నో సంవత్సరాలు అలా గడిచిపోయాయి. కాని విశేషం ఏమంటే నవాజుద్దీన్ తనను తాను పతనం కాకుండా కాపాడుకున్నాడు. కులరాజకీయాలు, హత్యలు, బందిపోటు దొంగతనాలు ఇవి నిత్యం ఉండే గ్రామంలో పుట్టి పెరిగి కూడా చదువుకోగలిగాడు. రకరకాల వ్యసనాలు, పతనాలు, పలాయనాలు ఉండే ముంబైలో అన్నాళ్లు ఖాళీగా ఉండి కూడా ఏకాగ్రతను కాపాడుకుంటూ ఏ పని కోసం వచ్చాడో ఆ పనికే నిబద్ధుడై ఉన్నాడు. అలాంటి వాడికి తప్పకుండా అవకాశం వస్తుంది. నవాజుద్దీన్‌కి కూడా వచ్చింది. సినిమా పేరు బ్లాక్ ఫ్రైడే. 1993 నాటి ముంబై పేలుళ్ల మీద తీసిన సినిమా అది. డెరైక్టర్ అనురాగ్ కశ్యప్. అందులో పోలీసుల చేతికి చిక్కి చిత్రహింసల పాలయ్యే ముస్లిం కుర్రాడి వేషం నవాజ్ చేశాడు. కొద్దిపాటి మాటలే ఉంటాయి. కాని చూసినవాళ్లకు కన్నీళ్లు తిరుగుతాయి. ఇతడెవడో ఈ వేషానికి బాగున్నాడు అని పోలీస్ టార్చర్ ఉన్న ప్రతి వేషానికీ బాలీవుడ్లో నవాజుద్దీన్‌ని పిలవడం మొదలుపెట్టారు. అలాంటివే ఆరు వేషాలు వచ్చాయి. ఆ తర్వాత 2010లో పీప్లీ లైవ్ వచ్చింది. లోకల్ రిపోర్టర్ రాకేష్‌గా అదరగొట్టాడు. 2011లో మరో రెండు సినిమాలు రిలీజయ్యాయి. కహానీ... గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్. ఎవరీ పొట్టి మిరపకాయ్ అని అందరూఆశ్చర్యపోయారు. అంతవరకూ ఒకటీ అరా ప్లేట్లో పడేస్తూ వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీ దేశవిదేశాల్లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో నవాజుద్దీన్ నటనకు వచ్చిన ప్రశంసలు చూసి సందేహాలు మాని అతణ్ణి సంపూర్ణంగా అంగీకరించింది. కాలం పుటం పెట్టడం అంటే ఇదే కాబోలు. ఒకప్పుడు చిన్న పంచె ముతక చొక్కా కట్టుకొని తన పల్లెలో పొలాల్లో ఆవారాగా తిరిగిన నవాజుద్దీన్ సిద్దిఖీ 2012 కాన్స్ ఫిల్మ్ ఫిస్టివల్‌లో తన సినిమా ‘మిస్ లవ్లీ’ ప్రదర్శన సందర్బంగా రెడ్ కార్పెట్ మీద బ్లాక్ టక్సెడో ధరించి హుందాగా అడుగులు వేశాడు. అమితాబ్ బచ్చన్ పోస్టర్లు ఉన్న తన ఇంటి వీధిలో తన పోస్టర్లు కనిపించేలా చేశాడు. ఇది కొండల్ని పిండికొట్టడం లాంటి పనే. నవాజుద్దీన్ సిద్ధిఖీ చేశాడు. ఎందుకంటే తాను ఆ పని చేయగలను అని గట్టిగా నమ్మాడు. ది లంచ్‌బాక్స్, కిక్, బద్లాపూర్, బజ్రంగీ భాయ్‌జాన్... ఇవన్నీ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన వలన మెరిసిన సినిమాలు. షారూక్ ఖాన్‌తో ‘రయీస్’ రాబోతూ ఉంది. సల్మాన్, షారూక్ తర్వాత ఆమిర్‌ఖాన్‌ను ఛాలెంజ్ చేయడం ఎంత పని? ‘నేను ప్రపంచంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే నటుణ్ణి కావాలి’ అంటాడు నవాజుద్దీన్.ఎందుకంటే ‘స్టార్ నటుడు కాదు. కాని స్టార్‌కు ఎక్కువ చెల్లిస్తారు. మరి నటుడికెందుకు తక్కువ ఇస్తారు’ అంటాడు. బాలీవుడ్లో రాబోయే రోజుల్లో అత్యంత ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసే నటుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ కనిపించవచ్చు. అతడి కోసమే మంచి మంచి సినిమాలు తీయవచ్చు.ఈ ఒడ్డూ ఈ పొడవు ఉన్న వాడు ఇంత చేయగలడా అని అనిపించవచ్చు. నిజమే. నవాజుద్దీన్ ఐదున్నర అడుగుల వాడు మాత్రమే. కాని చేతిలో నటన, నైపుణ్యం అనే సుత్తీ శానంలు ఉన్నాయని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అవి ఉన్నవాడికి ఏ పర్వతమైనా ఒక లెక్కా? వచ్చింది మర్చిపోయేలా చేసిన సినిమా... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమా ‘మిస్ లవ్లీ’. దర్శకుడు అషిమ్ అహ్లువాలియా. బాలీవుడ్లో తయారయ్యే సిగ్రేడ్ పోర్నో మూవీల మీద తీసిన సినిమా అది. కథాంశం రీత్యా సినిమాలోని పాత్రలకు బి- గ్రేడ్, సి- గ్రేడ్ ఆర్టిస్టులను తీసుకున్నారు. ముఖ్యపాత్రకు నవాజుద్దీన్‌ని తీసుకున్నారు. మొదటి రోజు డెరైక్టర్ అతడి దగ్గరకు వచ్చి చెప్పాడు- మీకు చాలా వచ్చు. నేర్చుకున్నారు. కాని ఈ సినిమాలో మీ పక్కన ఉన్నది చాలా నాసీరకం నటులు. మీరు ఏమీ చేయకండి. ఏది చేసినా వీళ్ల స్థాయికి దిగి చేయండి అన్నాడు. నేర్చుకున్నదంతా మర్చిపోయి చేయాల్సిన సందర్భం అది. పండితుడు పామరస్థాయి దిగడమే అసలైన పాండిత్యం కదా అంటాడు నవాజుద్దీన్ ఆ సినిమా చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ. సాక్షి ఫీచర్స్ ప్రతినిధి