Akshay Kumar breaks Guinness World Record for clicking 184 selfies in 3 minutes - Sakshi
Sakshi News home page

Akshay Kumar: సెల్ఫీతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించిన అక్షయ్‌ కుమార్‌

Published Fri, Feb 24 2023 11:43 AM | Last Updated on Fri, Feb 24 2023 11:54 AM

Akshay Kumar Smash Guinness World Record With 184 Selfie in 3 Minutes - Sakshi

బాలీవుడ్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్ గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. సెల్ఫీతో ఆయన తాజాగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుకు ఎక్కాడు. అభిమానులతో ఏకదాటిగా సెల్పీలు దిగి అక్షయ్‌ ఈ రికార్డును నెలకొల్పాడు. కేవలం మూడు నిమిషాల్లోనే 184 సెల్ఫీలు దిగి హాలీవుడ్‌ నటుడు జేమ్స్ స్మిత్ రికార్ట్‌ను బ్రేక్ చేశాడు. ఇటీవల ముంబైలోని మెహబూబ్‌ స్టూడియోలో గిన్నిస్‌ బుక్‌ అధికారుల అధ్వర్యంలో అక్షయ్‌తో సెల్పీ పోటీని నిర్వహించారు. దీనికి దాదాపు 240 మంది అభిమానులు హాజరు కాగా అక్షయ్‌ వారితో ఒక్కొరిగా ఫొటో దిగాడు.

చదవండి: మిస్‌ ఇండియాతో నాగార్జున రొమాన్స్‌!

మూడు నిమిషాల్లో ఆయన 209 సెల్ఫీలు దిగగా అందులో కొన్ని డిస్ క్వాలిఫై అయ్యాయి. బ్లర్‌గా వచ్చిన ఫొటోలను తీసివేయగా చివరకు 184 సెల్ఫీలతో ఆయన ఈ రికార్డ్‌ను సృష్టించాడు. ఈ మేరకు అధికారులు అక్షయ్‌కి ఈ రికార్డుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని అందించారు. అనంతరం అక్షయ్‌ అనందం వ్యక్తం చేస్తూ ఈ రికార్డు అభిమానులకు అంక్షితం ఇచ్చాడు. ఈ సం‍దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇంత వరకు వచ్చింది అభిమానుల వల్లే. వారందరికి నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని నా అభిమానలకే అంకితం ఇస్తున్నా’ అని తెలిపాడు.

చదవండి: ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్‌.. దాదాపు 200 థియేటర్లో రి-రిలీజ్‌కు రెడీ

కాగా ఇప్పటి వరకు 168 సెల్ఫీతో హాలీవుడ్‌ నటుడు జేమ్స్‌ స్మిత్‌కు ఈ రికార్డ్‌ ఉండగా దీనిని తాజాగా అక్షయ్‌ బ్రేక్‌ చేయడం విశేషం. 2015లో సాన్‌ అండ్రీయాస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ 105 సెల్ఫీలతో తొలి రికార్డు క్రియేట్‌ చేశాడు. కాగా వెండితెరపై తనదైన నటన, వైవిధ్యమైన పాత్రలతో అభిమానులను అలరిస్తుంటాడు అక్షయ్‌. ఆయన తాజా చిత్రం సెల్ఫీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు శుక్రవారం(ఫిబ్రవరి 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement