Months baby
-
రూ. 90 వేలకు పసికందు విక్రయం.. కన్నతల్లిని మభ్యపెట్టి..
ఎనిమిది నెలల బాలికను రూ.90 వేలకు విక్రయించిన కేసులో జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ పోలీసులు ఇద్దరు మహిళలు, ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసులు ఆ బాలికను స్వాధీనం చేసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్లో ఆ బాలిక తండ్రి రాహుల్ సాహ్ని ఇచ్చిన ఫిర్యాదులో తాను ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపాడు. నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగిందని, అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నానని పేర్కొన్నాడు. 2023, డిసెంబర్లో తన భార్య తమ ఎనిమిది నెలల కుమార్తె అనన్యతో కలిసి హజారీబాగ్‌లోని పుట్టింటికి వెళ్లిందని పేర్కొన్నాడు. అయితే 2024, ఫిబ్రవరి 11న తన భార్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తమ కుమార్తె అనన్య కుమారి ఆమెతో లేదని తెలిపాడు. బాలిక తండ్రి రాహుల్ సాహ్ని తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం అతని భార్య పుట్టింటి నుండి తిరిగి వచ్చిన తరువాత.. ఆమెను కుమార్తె గురించి అడిగినప్పుడు.. కొన్ని రోజుల క్రితం రాహుల్ కుమార్ రామ్, రీటా దంపతులు తనను సంప్రదించారని.. వారు నీ భర్త కాలు విరిగిందని, మీ పరిస్థితి బాగోలేదని చెబుతూ , తమ కుమార్తెను వారికిస్తే జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారని, భర్త ఆరోగ్యం కుదుటపడ్డాక, కుమార్తెను తిరిగి తీసుకువెళ్లవచ్చని చెప్పడంతో ఆమె కుమార్తెను వారికి అప్పగించిందని తెలిపాడు. తన భార్య తమ కుమార్తె అనన్య కుమారిని రామ్‌ఘర్ టేకర్ స్టాండ్ దగ్గర ఆ దంపతులకు అప్పగించినట్లు రాహుల్ సాహ్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత భర్త.. భార్యను మందలించి, రాహుల్ కుమార్, రీటాదేవిలను సంప్రదించగా, వారు తాము ఆ చిన్నారిని రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్ దంపతులకు రూ.90 వేలకు విక్రయించినట్లు తెలిపారు. రాహుల్ కుమార్, రీటా దేవిలు తన భార్యను ప్రలోభపెట్టి, ఆమె వద్ద నుంచి తమ కుమార్తెను తీసుకుని.. రీనా కుమారి, గౌతమ్ కుమార్‌లకు అమ్మేశారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నాడు. రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్‌లు రాహుల్ కుమార్ రామ్‌కు బంధువులు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బాలికను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలికను తండ్రికి అప్పగించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. అయితే ఆ బాలికను ఆమె తల్లే విక్రయించిందా? లేక ఇతరులు బాలిక పెంపకం సాకు చూపి, ప్రలోభాలకు గురిచేసి విక్రయించారా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఒక నిందితుడు పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
నెలల తక్కువ కవలలు
సాధారణంగా తొమ్మిది నెలలు నిండాక పిల్లలు పుట్టడం సహజం. నెల ముందే పుట్టిన వాళ్లని నెల తక్కువ గడుగ్గాయిలు అంటూంటారు. అయితే ఈ పిల్లలు నాలుగు నెలలు ముందు పుట్టి.. వారి కుటుంబానికి, వైద్యం చేసిన డాక్టర్స్‌కి షాకిచ్చారు. కేవలం తల్లి గర్భంలో.. 22 వారాలు మాత్రమే ఉండి.. సుమారు 126 రోజుల ముందే పుట్టారు. ‘ఆదియా, అడ్రియాల్ నడరాజా’ అనే ఈ కెనడియన్ కవలలు.. 2022 మార్చి 4న జన్మించారు. వీరు పుట్టినప్పుడు బతకడానికి ‘జీరో చాన్స్’ అని చెప్పారు డాక్టర్లు. బతకడమే కష్టం అని వైద్యులు తేల్చేస్తే.. 2023 మార్చికి ఏడాది పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించారు. కేవలం 330 గ్రాములు (0.72 పౌండ్లు.), 420 గ్రాములు (0.92 పౌండ్లు.) బరువుతో పుట్టిన ఈ చిన్నారులు.. అత్యంత తక్కువ బరువున్న కవలలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచారు. -
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
అయ్యో బిడ్డా.. మరీ ఇంత అనాగరికమా?
క్రైమ్: దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. న్యూమోనియాకు చికిత్స పేరుతో మూడు నెలల పసికందుపై అనాగరిక చర్యకు దిగారు గిరిజన పెద్దలు. దీంతో సకాలంలో చికిత్స అందక.. ఆ చిన్నారి పదిహేను రోజులు పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడింది. షాహ్‌దోల్ జిల్లా పరిధిలోని ఓ గిరిజన తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆ చిన్నారికి.. నాటు వైద్యం పేరుతో 51 సార్లు కాల్చిన కడ్డీతో కడుపు మీద వాతలు పెట్టారు తండా పెద్దలు. అయితే అది వికటించి.. బిడ్డ ప్రాణం మీదకు వచ్చింది. దీంతో స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు చికిత్స పొందుతూ ఆ చిన్నారి కన్నుమూసింది. ఇదిలా ఉంటే.. చిన్నారి కన్నుమూసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని బంధువులు ఖననం చేశారు. అయితే విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. చిన్నారి మృతదేహాన్ని బయటకు వెలికి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సకాలంలో న్యూమోనియాకు చికిత్స అందకపోవడం, పైగా కడ్డీ కాల్చిన గాయాల ప్రభావంతో బిడ్డ మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై స్థానిక అంగన్వాడీ సిబ్బంది స్పందించారు. ఆ బిడ్డ తల్లికి వద్దని చెప్పినా పట్టించుకోకుండా.. ఆ చర్యకు దిగిందని వెల్లడించారు. మధ్యప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో ఇలా జబ్బులకు కడ్డీలను కాల్చి వాతలు పెట్టడం కొందరు ఆచారంగా భావిస్తారు. అయితే ఈ విధానం జబ్బును నయం చేయకపోగా, గాయాలకు కారణం అవుతోందని.. ఒక్కోసారి ఉన్న సమస్యలే ఆరోగ్యాన్ని క్షీణింపజేసి మరణాలకు సైతం దారి తీస్తోందని స్థానిక వైద్య సిబ్బంది చెబుతున్నారు. అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. వాళ్లు మాత్రం ఆచారాలు కొనసాగిస్తున్నారని జిల్లా కలెక్టర్ వందనా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శునకం నోటిలో పసికందు తల
సాక్షి, చెన్నై: పసికందు తలను నోట కరచుకుని.. ఓ శునకం మదురై పీపీకులం పరిసరాల్లో చక్కర్లు కొట్టింది. ఓ యువకుడు అతికష్టం మీద శునకం నుంచి బిడ్డ తలను లాగేసుకుని పోలీసులకు అప్పగించాడు. ఆథ్యాత్మిక నగరం మదురై పీపీకులం ఇండియన్ బ్యాంక్, ఐటీ కార్యాలయం పరిసరాల్లోకి హఠాత్తుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చిన ఓ శునకం కలకలం సృష్టించింది. ఆ శునకం నోటిలో మరణించిన పసికందు తల ఉండడంతో చూసిన వారందరి హృదయాలు బరువెక్కాయి. దాడి చేస్తుందనే భయంతో ఆ శునకం దగ్గరకు వెళ్లలేదు. ఈ సమయంలో సెల్లూరుకు చెందిన అయ్యనార్ పరుగులు తీస్తూ.. పసికందు తల ను కుక్క విడిచిపెట్టే విధంగా చేశాడు. పోలీసులు బిడ్డ తలను స్వా«దీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా శిశువు పుట్టి నాలుగు రోజులై ఉండవచ్చునని వైద్యులు తేల్చారు. (చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త మెడకు చీరచుట్టి..ఆపై!) -
మానవ మృగానికి మరణ దండన
జైపూర్: ఏడు నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పింటూ(19) అనే యువకుడికి రాజస్తాన్‌లోని అళ్వార్ జిల్లా కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో ఈ ఏడాది మే 9న ఏడు నెలల వయసున్న బాలికను పింటూ రేప్ చేశాడు. దీంతో పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్టుచేశారు. కేసును విచారించిన ప్రత్యేక జడ్జి జగేంద్ర అగర్వాల్.. పింటూను జూలై 18న దోషిగా నిర్ధారించారు. అనంతరం ఐపీసీ 363, 336ఏ, 376ఏబీ, పోక్సో చట్టం కింద దోషికి శనివారం మరణశిక్ష విధించారు. 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగికదాడికి పాల్పడే నేరస్తులకు మరణదండన విధించేలా నేరచట్టాన్ని సవరిస్తూ రాజస్తాన్ సర్కారు ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక రాజస్తాన్‌లో తొలిసారి సెక్షన్ 376ఏబీ కింద దోషికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. -
11 నెలల చిన్నారి అవయవదానం
చండీగఢ్: చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. తల్లిదండ్రుల అంగీకారంతో బతికే అవకాశంలేని 11 నెలల చిన్నారి కిడ్నీలను ఓ వ్యక్తికి అమర్చారు. నేపాల్‌కు చెందిన దంపతులు 11 నెలల వయసున్న తమ బాబుతో కలసి చండీగఢ్‌లో ఉంటున్నారు. జూలై 6న పిల్లాడు ఊయల నుంచి కిందపడడంతో తలకు దెబ్బతగిలి స్పృహ కోల్పోయాడు. చికిత్స కోసం పీజీఐఎంఈఆర్‌కు తరలించారు. పిల్లాడు బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. తల్లిదండ్రుల అంగీకారంతో పిల్లాడి 2 కిడ్నీలను మరో వ్యక్తికి ఆపరేషన్‌చేసి అమర్చారు. ఆస్పత్రి చరిత్రలో అవయవదానం చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా ఈ పిల్లాడు నిలిచాడు. కిడ్నీలను చిన్నారులకే అమర్చాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఓ రోగితో బాలుడి కిడ్నీలు మ్యాచ్ కావడంతో ఆ వ్యక్తికే అమర్చారు. -
శ్రీదేవి మళ్లీ పుడితే.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: ‘అతిలోక సుందరి’ శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ చిన్నారి వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుబాయ్‌లో తన మేనల్లుడి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లిన నటి శ్రీదేవి ఫిబ్రవరి 24 రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. గతేడాది వైరల్ అయిన ఈ చిన్నారి ‘శ్రీదేవి’ వీడియో నటి చనిపోయిన నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెలల వయసున్న ఓ చిన్నారి అచ్చం.. చిన్నప్పుడు శ్రీదేవి ఎలా ఉండేవారో అలాగే ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. శ్రీదేవి మళ్లీ పుడితే ఇలాగే ఉంటుందంటూ ఆమె అభిమానులు ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న చిన్నారి కళ్లు, ముక్కు, ముఖకవలికలు అచ్చు నటి శ్రీదేవిని పోలి ఉండటంతో ఆమె అభిమానులు నటిని స్మరించుకుంటూ మరోసారి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్లు చేస్తున్నారు. కాగా, బాలనటిగా సినీ జీవితంలోకి ప్రవేశించిన శ్రీదేవి అందంతోనే కాదు తనదైన నటనతో టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా ఆమె నటించిన అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన విషయం తెలిసిందే. -
మరోసారి వైరల్‌గా మారిన చిన్నారి వీడియో
-
నెలల బుడ్డోడి విన్యాసం.. వైరల్ వీడియో
సిడ్నీ : ఓ తల్లి తన నెలల బుజ్జాయి ఈత కొలనులో చేసిన అద్భుత విన్యాసాన్ని ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పెర్త్‌కు చెందిన రోక్షాన్నే టర్నర్ కు సంతానం తొమ్మిది నెలల బాబు మ్యాక్స్. తన బాబుకు స్మిమ్మింగ్ నేర్పించాలని భావించిన టర్నర్ స్మిమ్మింగ్ పూల్ కు మ్యాక్స్ ను తీసుకెళ్లింది. ఈత నేర్పించే ట్రైనర్ డైరాకు చిన్నారి మ్యాక్స్ కు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఇటీవల స్మిమ్మింగ్ కు తల్లితో కలిసి వెళ్లాడు మ్యాక్స్. పుల్లో పడేసిన తర్వాత సొంతంగా వెల్లకిలా ఎలా మారాలో, నీటిపై ఎలా తేలియాడాలో ట్రైనర్ డైరా నేర్పించారు. ట్రైనర్ రెండు చేతులతో మ్యాక్స్‌ను కొలనులో వేయగా తన కుమారుడు చేసిన విన్యాసాన్ని వీడియో తీసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. పేరెంట్స్ అందరూ ఈ వీడియో చూడాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
నెలల బుడ్డోడి విన్యాసం.. వైరల్ వీడియో
-
బాలింతగా ఉద్యోగానికి వెళుతున్నారా?
నెలల బిడ్డను వదిలి ఉద్యోగానికి వెళుతున్నప్పుడు తల్లి పరిస్థితి చాలా అయోమయంగా ఉంటుంది. అటు ఆఫీసులోగాని, ఇటు ఇంట్లోగాని ఏ పని చేసినా పూర్తిగా మనసుపెట్టలేరు. అలాగని ఏ పనీ చేయకుండా ఉండలేరు. ఆఫీసులో ఉన్నంతసేపు బిడ్డ పనులు, ఇంట్లో ఉన్నప్పుడు ఉద్యోగ లక్ష్యాలు గుర్తుకొస్తుంటాయి. దేనికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేక ఇబ్బందిపడుతుంటారు. మీకు మీరే కొంత ప్లానింగ్ చేసుకుంటే ఈ సమయంలో కూడా ప్రశాంతంగా పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో మీరు లేనపుడు పిల్లలను చూసుకునేవారికి బిడ్డకు సంబంధించిన జాగ్రత్తలు వివరంగా చెప్పండి. ఏదైనా ఇబ్బంది వస్తే మీకు ఫోన్ చేసి చెప్పే సౌకర్యం ఎలాగూ ఉంటుంది కాబట్టి ఆఫీసులో ఉన్నప్పుడు అనవసరంగా ఆందోళన పడాల్సినపనిలేదు బిడ్డకు ఏడాది నిండేవరకూ తల్లికి బోలెడు పని ఉంటుంది కాబట్టి ఇంట్లో మీ పనుల చిట్టాను చక్కగా ప్లాన్ చేసుకుని దాని ప్రకారం పనులు చేసుకోండి. అప్పుడు ఫలానాపని చేయలేకపోయానన్న దిగులు ఉండదు మీ తోటి ఉద్యోగినులతో మీ ఇబ్బందుల్ని పంచుకోండి. అనుభవంతో వారు చెప్పే సలహాలు, సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి మీరున్న పరిస్థితిలో ఆఫీసు పనిని ఏ విధంగా చేయగలరో, ఎలాంటి వెసులుబాటు అవసరమో మీ యజమానితో చెప్పడం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. కొన్ని ఆఫీసుల్లో పరిస్థితుల్ని బట్టి, అవకాశాల్ని బట్టి ఇంటి దగ్గర నుండి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. లేదంటే... పని వేళలు మార్చుకునే అవకాశం ఉన్నా వినియోగించుకోవచ్చు.