Tragic Scene of 4 days old Baby Head in Dog’s Mouth Seen in Madurai - Sakshi
Sakshi News home page

శునకం నోటిలో పసికందు తల

Published Thu, Sep 9 2021 7:42 AM | Last Updated on Thu, Sep 9 2021 1:29 PM

Months Baby Head Found In Dog Mouth Became Tragedy Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: పసికందు తలను నోట కరచుకుని.. ఓ శునకం మదురై పీపీకులం పరిసరాల్లో చక్కర్లు కొట్టింది. ఓ యువకుడు అతికష్టం మీద శునకం నుంచి  బిడ్డ తలను లాగేసుకుని పోలీసులకు అప్పగించాడు. ఆథ్యాత్మిక నగరం మదురై పీపీకులం ఇండియన్‌ బ్యాంక్, ఐటీ కార్యాలయం పరిసరాల్లోకి హఠాత్తుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చిన ఓ శునకం కలకలం సృష్టించింది.

ఆ శునకం నోటిలో మరణించిన పసికందు తల ఉండడంతో చూసిన వారందరి హృదయాలు బరువెక్కాయి. దాడి చేస్తుందనే భయంతో ఆ శునకం దగ్గరకు వెళ్లలేదు. ఈ సమయంలో సెల్లూరుకు చెందిన అయ్యనార్‌ పరుగులు తీస్తూ.. పసికందు తల ను కుక్క విడిచిపెట్టే విధంగా చేశాడు. పోలీసులు బిడ్డ తలను స్వా«దీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా శిశువు పుట్టి నాలుగు రోజులై ఉండవచ్చునని వైద్యులు తేల్చారు. 
(చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త మెడకు చీరచుట్టి..ఆపై!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement