విశ్వాసం మాటకొస్తే.. ముందుగా గుర్తుకు వచ్చేది శునకమే. ఆ పోలిక ప్రతీదాంట్లోనూ కనిపిస్తుంది. అందులో కొందరు వాటిని అమితంగా ప్రేమిస్తుంటారు కూడా. అఫ్‌కోర్స్.. అవి కూడా అంతే ప్రేమను పంచుతాయనుకోండి.
ఇదిలా ఉంటే.. తమిళనాడులో ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన పెంపుడు కుక్కకు గుర్తుగా ఏకంగా గుడిని కట్టించాడు. శివగంగ జిల్లా మనమధురైకు చెందిన ముత్తు(82) తన పెంపుడు కుక్క టామ్ గుర్తు కోసం ఈ పని చేశాడు.
ముత్తు కుటుంబం మూడు తరాలుగా శునకాలను పెంచుకుంటోందంట. అలాగే ఆయన, టామ్‌ను 2010 నుంచి పెంచుకున్నాడు. దానిని ఒక ఇంటి మనిషిలాగా అపురూపంగా చూసుకున్నాడు. అయితే 2021లో జబ్బు చేసి టామ్ చనిపోయింది. అందుకే దానికి గుర్తుగా.. ఇలా విగ్రహంతో గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. ఇందుకోసం తాను సేవింగ్స్ రూపంలో దాచుకున్న 80వేల రూపాయలు ఖర్చు చేసి మార్బుల్ విగ్రహాన్ని తయారు చేయించాడు. ప్రతీ శుక్రవారం టామ్ విగ్రహానికి దండలు వేసి పూజలు చేస్తున్నాడాయన. ఆ గుడి ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్లలోనూ ఫేమస్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment