Sivaganga
-
Dog Temple: నా బిడ్డ కంటే ఎక్కువ! అందుకే..
విశ్వాసం మాటకొస్తే.. ముందుగా గుర్తుకు వచ్చేది శునకమే. ఆ పోలిక ప్రతీదాంట్లోనూ కనిపిస్తుంది. అందులో కొందరు వాటిని అమితంగా ప్రేమిస్తుంటారు కూడా. అఫ్కోర్స్.. అవి కూడా అంతే ప్రేమను పంచుతాయనుకోండి. ఇదిలా ఉంటే.. తమిళనాడులో ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన పెంపుడు కుక్కకు గుర్తుగా ఏకంగా గుడిని కట్టించాడు. శివగంగ జిల్లా మనమధురైకు చెందిన ముత్తు(82) తన పెంపుడు కుక్క టామ్ గుర్తు కోసం ఈ పని చేశాడు. ముత్తు కుటుంబం మూడు తరాలుగా శునకాలను పెంచుకుంటోందంట. అలాగే ఆయన, టామ్‌ను 2010 నుంచి పెంచుకున్నాడు. దానిని ఒక ఇంటి మనిషిలాగా అపురూపంగా చూసుకున్నాడు. అయితే 2021లో జబ్బు చేసి టామ్ చనిపోయింది. అందుకే దానికి గుర్తుగా.. ఇలా విగ్రహంతో గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. ఇందుకోసం తాను సేవింగ్స్ రూపంలో దాచుకున్న 80వేల రూపాయలు ఖర్చు చేసి మార్బుల్ విగ్రహాన్ని తయారు చేయించాడు. ప్రతీ శుక్రవారం టామ్ విగ్రహానికి దండలు వేసి పూజలు చేస్తున్నాడాయన. ఆ గుడి ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్లలోనూ ఫేమస్ అయ్యింది. -
శివగంగైలో టైమ్బాంబ్
చెన్నై, సాక్షి ప్రతినిధి: శివగంగైలోని ఒక టాస్మాక్ దుకాణంలో టైమ్బాంబ్ బయటపడింది. పైపు రూపంలో ఒక గోనె సంచిలో రహస్యంగా దాచి ఉంచిన ఈ బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో పెద్దప్రమాదం తప్పింది. శివంగంగై గాంధీకి వీధి సమీపంలో జిల్లా ఉపాధికల్పనా కార్యాలయ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణానికి ఎదురుగుండా టాస్మాక్ దుకాణం, దీనికి అనుబంధంగా బార్ ఉంది. కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి రాత్రి 10 గంటలకు టాస్మాక్ మూసివేసే వరకు భారీ సంఖ్యలో మందుబాబులు గుమిగూడారు. టాస్మాక్ మూసివేసిన తరువాత సిబ్బందిని పంపివేసి కొందరు మాత్రం లోపలే నిద్రించారు. అర్ధరాత్రి వేళ వారిలో ఒకడు మూత్ర విసర్జన కోసం లేచివెళుతుండగా ఒక మూల నుంచి టిక్‌టిక్ అనే శబ్దం వినిపించింది. భయాందోళనకుగురైన ఆ వ్యక్తి ఇతరులను నిద్రలేపాడు. టాస్మాక్ దుకాణం నలుమూలల పరిశీలించగా ఒక గోతం నుంచి ఆశబ్దం వస్తున్నట్లు కనుగొన్నారు. బాంబుగా అనుమానించిన వారు టాస్మాక్ యజమానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ నిపుణులు అక్కడికి చేరుకున్నారు. అది బాంబుగా నిర్ధారించారు. జాగ్రత్తగా గోతాంను తెరచిచూడగా అర అడుగున్న పైపు రూపంలో బాంబు, రెండు సిలిండర్లు, బ్యాటరీలు, ఒక డయలు కలిగి ఉన్న టైమ్‌బాంబు కనిపించింది. వాటి అనుసంధానాన్ని జాగ్రత్తగా కట్‌చేసి బాంబును నిర్వీర్యం చేశారు. దీనిపై ఓ అధికారి మాట్లాడారు. ఇది చాలా శక్తివంతమైనదని, సుమారు 300 అడుగుల పరిధిలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించగలదని చెప్పారు. భవనాలను కూల్చివేయడంతోపాటు ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉండేదని చెప్పారు. టైమ్బాంబుగానేగాక రిమోట్ సహాయంతో పేల్చేసే వసతి ఉందన్నారు. -
తనయుడి తొలిపోరు... తండ్రి తుదిపోరు
ఎన్నికల పోటీలో లేనేలేని కేంద్ర ఆర్ధిక మంత్రి పళనియప్పన్ చిదంబరం లెక్కలు ఈ సారి తప్పేట్టున్నాయా? అందుకే ఆయన ఎన్నికల పరీక్ష రాయకుండా, తనకు బదులు కొడుకు కార్తిని రంగంలోకి దించారా?తమిళనాట శివగంగ నియోజకవర్గంలో 1984 నుంచి అప్రతిహతంగా సాగతున్న చిదంబరం విజయపరంపర ఈ సారి ఆగిపోవడం ఖాయమేనా? ఛార్టర్డ్ అకౌంటెంట్ గా, బ్యాంకర్ గా, రాజీవ్ గాంధీ ప్రసంగాల తమిళ అనువాదకుడుగా, మంచి డిబేటర్ గా పేరున్న చిదంబరం ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయినా ఆయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ సారి చిదంబరం పోటీ చేయక, కార్తి ఓడిపోతే ఆయన రాజకీయ జీవితం దాదాపు చరమాంకంలోకి ప్రవేశించినట్టే. ఆర్ధిక మంత్రి ఆఖరి ప్రయత్నం 1984 నుంచి ఇప్పటి వరకు మధ్యలో 1999 ఎన్నికల్లో మినహా అన్నిసార్లు చిదంబరాన్ని ఆదరించారు శివగంగ ఓటర్లు. అయితే చిదంబరం సొంత ఇమేజ్ కన్నా పొత్తులు ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాయన్నది వాస్తవం. 2009 ఎన్నికల్లో ఆయన అతికష్టమ్మీద విజయం సాధించారు. ఆ ఎన్నికల వివాదం ఇంకా కోర్టులో నలుగుతోంది. ఈసారి ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. అంతే కాదు. ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెస్ అంటరాని పార్టీ అయిపోయింది. అటు డీఎంకె, ఇటు అన్నా డీఎంకే కాంగ్రెస్‌ను దూరంగా పెట్టాయి. బిజెపి చిన్న చిన్న పార్టీలను చేరదీసి కూటమిని ఏర్పాటు చేసుకుని, మూడో శక్తికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఆ పనీ చేయలేకపోయింది. దీంతో ఈసారి తమిళనాడులో కాంగ్రెస్‌ది ఒంటరి పోరు. దీంతో అసలు పార్టీ పరిస్థితే అంతంత మాత్రం. ఇక చిదంబరం పరిస్థితి చెప్పనక్కర్లేదు. తొలిపోరులో తనయుడు చిదంబరం కొడుకుగా తప్ప తమిళనాడులో కార్తీకి అంతగా పాపులారిటీ లేదు. దానికి తోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్దగా కేడర్ లేకపోవడం కార్తీ కష్టాల్ని రెట్టింపు చేస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, సీపీఐ, బీఎస్పీ, ఆప్ సహ 26 మంది అభ్యర్థుల్ని కార్తీ తన తొలి రాజకీయ పోరాటంలో ఎదుర్కొంటున్నారు. చెన్నైకి దాదాపు 450 మైళ్ల దూరంలో ఉండే శివగంగలో కుటీరపరిశ్రమలు, వ్యాపారాలు, బ్యాంకింగ్ కి ప్రసిద్ధి. అలనాడు అటు బర్మా నుంచి ఇటు జపాన్ దాకా వ్యాపారాలు చేసిన నాట్టుకోట్టై చెట్టియార్లకు ఈ నియోజకవర్గం పేరెన్నిక గన్నది. చిదంబరం కూడా అదే వర్గానికి చెందిన నాయకుడు. ఆయన అనేక సంవత్సరాల రాజకీయ జీవితంలో నియోజకవర్గమంతా బ్యాంకులు, ఏ టీ ఎంలు పెట్టించారు. కానీ ఏటీఎంలు, బ్యాంకులు డబ్బులైతే ఇస్తాయి కానీ ఓట్లు కురిపించవు కదా! -
చిక్కుల్లో చిదంబరం కుమారుడు కార్తి
చెన్నై: శివగంగ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం చిక్కుల్లో పడ్డారు. అతని నామినేషన్‌ను తిరస్కరించాలని ఆదాయపు పన్నుశాఖాధికారులు ప్రధాన ఎన్నికల కమిషన్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. కార్తీ నామినేషన్ పత్రంతోపాటూ సమర్పించిన స్థిర, చరాస్తుల ధృవీకరణ పత్రంలో వాస్తవాలు దాచిపెట్టారని ఆదాయపు పన్నుశాఖాధికారి ఎస్.కె.శ్రీ వాత్సవ ఈసీ దష్టికి తీసుకెళ్లారు. వ్యాపారం తన వృత్తి అని పేర్కొన్న కార్తీ, తాను చేసే వ్యాపారానికి పెట్టుబడి ఎంత, ఆ వ్యాపారానికి అతను యజమానా, భాగస్తుడా, డైరెక్టరా లేక షేర్లు కొన్నాడా వంటి ఏ వివరాలు పొందపరచలేదని వివరించారు. తమది ఉమ్మడి కుటుంబమని, బ్రైక్రిప్ట్ తోటలోని స్థిరాస్తిలో కార్తీకి, ఇతర కుటుంబ సభ్యులకు వాటా ఉందని గత లోక్‌సభ ఎన్నికల్లో పి.చిదంబరం తన నామినేషన్లో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. కార్తీ తన నామినేషన్లో ఆ ఆస్తుల వివరాలను తప్పుగానూ, మార్కెట్ విలువకంటే తక్కువగానూ చూపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 1951 నాటి ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చిన ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ, కార్తీ చిదంబరం సమర్పించిన 147 పేజీల నామినేషన్ పత్రాలను ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు పంపుతానని, ఆ నామినేషన్‌లోని వివరాలను ఎన్నికల వెబ్సైట్లో పెడతామని స్థానిక ఎన్నికల అధికారి వివరించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, శ్రీవాత్సవ చేప్పినవన్నీ నిరాధార ఆరోపణలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదబంరం కొట్టిపారేశారు. అతను కోర్టులో అనేక కేసులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. -
సారీ.. ! టైం లేదు
జోరుగా ‘పుర’పోరు ప్రచారం ముఖ్యనేతలు మాత్రం దూరం అసెంబ్లీ టికెట్ వేటలో బిజీబిజీ గాడ్పాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు ఎన్నికల వేళ అభ్యర్థుల్లో అయోమయం సాక్షి,మహబూబ్‌నగర్: ప్రస్తుతం జిల్లాలో ని మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి మునిసిపాలిటీతో పాటు నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, కల్వకుర్తి, అయిజ నగర పంచాయతీలకు ఎన్నికలు జ రుగుతున్నాయి. ఈనెల 14 వరకు పుర నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. 18న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు అభ్యర్థులకు గుర్తులు కే టాయించడ ంతో ప్రచారపర్వం కూడా ముమ్మరమైంది. ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం ప్రారంభమై ఐ దురోజులు గడుస్తున్నా..కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎవరూ ప్రచారంలో పాల్గొనడం లేదు. కారణమేమంటే వచ్చే నెల 2వ తేదీ నుంచి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తుంచడంతో టికెట్లు దక్కించుకునేందుకు ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గాంధీభవన్, ఎన్టీఆర్ భవన్, తెలంగాణ భవన్.. ఇలా ఆయా పార్టీల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మునిసిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు తమ గెలుపు కోసం అనుచరులతో కలిసి మాత్రమే ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించుకోవాల్సి వస్తోంది. నగర పంచాయతీల్లో అయితే అభ్యర్థులు చోటామోటా నాయకులను తమవెంట తిప్పుకోవాల్సి వస్తోంది. పుర నామినేషన్ల ఘట్టం మొదలు కాకముందే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గద్వాలలో సభ నిర్వహించి జిల్లాలో లాంఛనంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టివెళ్లారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంఐఎం నేతలు మినహా ప్రధానపార్టీలు నేతలు ఎవరు కూడా జిల్లాలో పర్యటించలేదు. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో 41 వార్డులు ఉన్నాయి. ప్రచారం ప్రారంభంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు తమ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాత్రం తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం లోపాయికారీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక మిగతాపార్టీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. గద్వాలలో టీడీపీ అభ్యర్థుల పక్షాన స్థానిక నేత డీకే సమరసింహారెడ్డి, వనపర్తిలో ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి తమపార్టీ అభ్యర్థుల తరఫున మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నారాయణపేటలో స్థానిక ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరిన తరువాత ఇప్పటివరకు ఆ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారంలో పాల్గొనలేదు. టీడీపీ అభ్యర్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. కల్వకుర్తిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేసేవారే కరువయ్యారు. మాజీమంత్రి జె.చిత్తరంజన్‌దాస్, చల్లా వంశీచందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్‌ను దక్కించుకునే పనిలో ఉండటంతో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనడం లేదని తెలుస్తోంది.దీంతో స్థానిక నాయకులే ఇంటింటా ప్రచారం నిర్వహించుకుంటున్నారు. అలాగే షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారంలో పాల్గొనలేదు. అయిజ నగరపంచాయతీలో అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చల్లా వెంకట్రామిరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం మధ్య అసెంబ్లీ టికెట్ లొల్లి తారాస్థాయికి చేరడంతో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను పట్టించుకోవడం లేదు. టికెట్ కోసం ప్రదక్షిణలు అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న నేతలంతా..ఢిల్లీ, హైదరాబాద్‌లో తమ గాడ్పాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఒక్కో నియోజక వర్గం నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు ముగ్గురి నుంచి ఆరుగురు వరకు ఉండగా, మిగతా పార్టీల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ నుంచే పోటీ తక్కువగా ఉందని చెప్పొచ్చు.