శునకం మిస్సింగ్‌.. ఆచూకీ చెబితే రూ.5వేలు! | Dog Goes Missing In Tamil Nadu, Owner Announces Rs 5000 Reward | Sakshi
Sakshi News home page

శునకం మిస్సింగ్‌.. ఆచూకీ చెబితే రూ.5వేలు!

Published Fri, Jul 16 2021 6:48 AM | Last Updated on Fri, Jul 16 2021 6:50 AM

Dog Goes Missing In Tamil Nadu, Owner Announces Rs 5000 Reward - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టీ.నగర్‌: కనిపించకుండాపోయిన పెంపుడు కుక్క పిల్ల  ఆచూకీ తెలియజేస్తే రూ.5వేలు బహుమతి ప్రకటించాడో ఆ శునక యజమాని. అంతేకాకుండా పోస్టర్లు సైతం ముద్రించి పలుచోట్ల అతికించాడు. వివరాలు.. శివగంగై జిల్లా, మదగుపట్టి తూర్పు వీధికి చెందిన రైతు వైరవన్‌. ఇతను జల్లికట్టు ఎద్దులను పెంచుతుంటాడు. పెంపుడు జంతువులంటే ఆసక్తి కలిగిన ఇతను నెల క్రితం రామనాథపురం జిల్లా, కముది నుంచి ఒక కుక్క పిల్లను కొనుగోలు చేశాడు.

ఇది ప్రసిద్ధి చెందిన రాజపాళయం జాతికి చెందింది. ఇది మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో వైరవన్‌ కంటికి కునుకు కరువైంది. మనస్తాపానికి గురయ్యాడు. తన పెంపుడు శునకం ఆచూకీ తెలియజేస్తే రూ.5వేలు బహుమతి ఇస్తానంటూ మదగుపట్టి, బాగనేరి, సొక్కనాథపురం ప్రాంతాలలో పోస్టర్లు అతికించారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఆయన కుటుంబీకులు, బంధువులు ఈ శునకం అన్వేషణలో పడ్డారు. ఈ పోస్టర్లు చూసి జనం వెతికేందుకు సిద్ధమయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement