![Madhya Pradesh Man Offers Rs 10000 Cash Reward Parrot Goes Missing - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/2/Untitled-4.jpg.webp?itok=xU8UwOdl)
భోపాల్: సాటి మనిషి మీద దయ చూపని ఈ సమాజంలో కొందరు మాత్రం జంతువులు మీద కూడా అంతులేని ప్రేమను చూపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం, ఉత్తరప్రదేశ్‌లో సరస్ క్రేన్, ఒక వ్యక్తి మధ్య స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దామోహ్ నుండి ఈ తరహా ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీపక్ సోనీ తన తప్పిపోయిన చిలుక కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు.
అంతేకాకుండా తన చిలుక ఆచూకీతో తెలిపితే ₹ 10,000 నగదు బహుమతిని అందజేస్తూ, పట్టణం అంతటా పోస్టర్లు వేశాడు. తప్పిపోయిన పక్షిని కనుగొనే ప్రయత్నంలో నగరం అంతటా పోస్టర్లు అంటించేందుకు అతను ఒక ఆటోరిక్షా డ్రైవర్లకు సహాయం తీసుకున్నాడు. అందుకు వారికి డబ్బులు కూడా చెల్లించాడు. ‘గత నెలలో ఎగిరిపోయి దానికదే ఇంటికి తిరిగొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎగిరిపోయింది.
ఇంకా తిరిగి రాలేదు. వీధి కుక్కలు దానికేమైనా హాని చేశాయోనని భయపడుతున్నాము. చిలక అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం. దాని ఆచూకీ తెలిపిన వారికి పదివేలు, అంతకంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధం. దానిని కనుగొన్న వారు నా నంబర్‌కు కాల్ చేయగలరు ’ అని వారి ప్రాంతంలో పోస్టర్లు వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment