తుమకూరు: ఒకప్పటి పాత సినిమాలలో మాంత్రికుని ప్రాణం ఏడు సముద్రాల అవతల ద్వీపంలో ఉన్న చిలుకలో ఉంటుందని కథ సాగుతుంది. ఆ చిలుక కోసం కథానాయకుడు వేట సాగిస్తాడు. అంత కాకపోయినా ఇక్కడ చిలుకను పడితే రూ.50 వేలు కానుక పొందవచ్చు.
తుమకూరు నగరంలోని జయనగర లేఔట్‌లో నివసిస్తున్న ఒక కుటుంబం రెండు చిలుకలను పెంచుతోంది. ఏటా చిలుకల జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇటీవల ఒక చిలుక ఎక్కడికో ఎగిరిపోయింది. ఆ పక్షి కోసం పగలూ రాత్రి గాలిస్తున్నారు. అయినా ఆచూకీ లభించలేదు. రెండున్నర ఏళ్లుగా ఎంతో ప్రేమగా సాకుతున్న చిలుక తప్పిపోయిందని, దానిని వెతికి తీసుకువస్తే రూ. 50 వేల బహుమతిని అందిస్తామని సదరు కుటుంబం ప్రకటించింది. నగరంలో అక్కడక్కడ బ్యానర్లు కట్టారు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
More Video for Missing Parrot -#Tumakuru: A family that rears parrots at home in Tumakuru has announced Rs 50,000 cash for those who can find their favourite bird which went missing.#Karnataka #Missing #Tumakuru pic.twitter.com/C2vfbxz3UU
— Chaudhary Parvez (@ChaudharyParvez) July 19, 2022
Comments
Please login to add a commentAdd a comment