కన్నవాళ్లు షెడ్డులో వదిలేస్తే.. కుక్క కాపాడింది | Tamil Nadu Pet Dog Helps Coimbatore Family Trace Accused Arrested | Sakshi
Sakshi News home page

కన్నవాళ్లు షెడ్డులో వదిలేస్తే.. కుక్క కాపాడింది

Published Mon, Apr 5 2021 10:10 AM | Last Updated on Mon, Apr 5 2021 1:20 PM

Tamil Nadu Pet Dog Helps Coimbatore Family Trace Accused Arrested - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: మానసిక వికాలంగురాలైన మహిళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు షెడ్డులో వదిలేశారు. ఈ క్రమంలో మృగాడు మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. జరుగుతున్న దారుణాన్ని గమనించిన ఆ ఇంటి పెంపుడు కుక్క.. ప్రబుద్ధుడి ఆట కట్టించింది. వారం రోజుల క్రితం తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కోయంబత్తూరు సెల్వపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు మానసిక వికాలాంగురాలు కావడంతో తల్లిదండ్రులు ఆమె కోసం ఇంటి పక్కన ప్రత్యేకంగా షెడ్డు నిర్మించి దానిలో ఉంచారు. 

ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన దిలీప్‌ కుమార్‌ అనే వ్యక్తి గత నెల 29న బాధితురాలి ఇంటికి వచ్చాడు. షెడ్డులో దూరి మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షెడ్డులో పవర్‌ కట్‌ చేశాడు. అయితే దిలీప్‌ కుమార్‌ చర్యలను గమనిస్తున్న వారి ఇంటి పెంపుడు కుక్క అతడి వెనకే షెడ్డులో ప్రవేశించింది. దిలీప్‌ కుమార్‌ ప్యాంట్‌ పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేసింది. అనుకోని ఈ ఘటనకు బిత్తరపోయిన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ కుక్క మాత్రం అతడిని విడిచిపెట్టలేదు. 

ఈలోపు ఇంట్లో కరెంట్‌ ఉండి.. షెడ్డులో పవర్‌ కట్‌ కావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా.. అక్కడ కుక్కతో పెనుగులాడుతున్న దిలీప్‌ కుమార్‌ను గమనించారు. వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచి.. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిలీప్‌ కుమార్‌ ఫోన్‌లో పలువురు మహిళల అసభ్యకర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇక కుక్కన్న పాటి దయ కూడా తల్లిదండ్రులకు లేకుండా పోయింది.. పాపం మానసిక వికలాంగురాలు అని కూడా చూడకుండా ఇలా షెడ్డులో ఉంచడం అమానుషం అంటున్నారు స్థానికులు. కుక్క అతడిని చూడకపోతే ఆ అభాగ్యురాలి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

చదవండి: మతిస్థిమితం లేని యువతిని బైక్‌పై ఎక్కించుకుని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement