Mental disorder
-
Health: సందేహం.. రోగ భయం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలలోని మానసిక జబ్బుల విభాగానికి ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. అలాగే ప్రైవేటుగా ఉండే మానసిక వ్యాధి నిపుణుల వద్దకు సైతం ప్రతిరోజూ 400 నుంచి 500 మంది చికిత్స కోసం వస్తారు. వీరిలో 20 శాతం మంది తమకు ఏ జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మదనపడుతూ వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు తిరుగుతూ ఎక్కడా ఎలాంటి పరిష్కారం లభించక చివరకు మానసిక వైద్యుల వద్దకు వస్తున్నారు.ఫలానా చోట సెలూన్‌కు వెళ్లి గుండు/సేవింగ్ చేయించుకుంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని, ఛాతీలో ఎక్కడైనా కొద్దిగా నొప్పిగా ఉన్నా, భారంగా అనిపించినా, గుండె వేగంగా కొట్టుకున్నా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందేమోనని అనుమానం తరచూ వస్తుంటుంది. ఇలాంటి వారు ముందుగా ఆయా వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు వెళతారు. అక్కడ అన్ని పరీక్షలు చేయించుకున్నా నార్మల్‌గా ఉందని డాక్టర్ చెప్పినా అనుమానం తీరదు. మళ్లీ ఇంకో డాక్టర్‌ను సంప్రదించి ముందుగా చేసిన పరీక్షలు చూపించకుండా మళ్లీ పరీక్షలు చేయిస్తారు. అక్కడ కూడా నార్మల్‌గా రిపోర్టులు వచ్చినా వారి మనస్సు శాంతించదు. ఏమీ లేకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతోందని వైద్యులను ప్రశి్నస్తుంటారు. ఇలాంటి వారికి నచ్చజెప్పి చికిత్స చేసేందుకు వైద్యులు చాలా కష్టపడుతుంటారు.కోవిడ్ తర్వాత మరింత అధికం..ప్రజల జీవనశైలి కోవిడ్‌కు ముందు...ఆ తర్వాత అన్నట్లు తయారయ్యింది. అప్పటి వరకు సాధారణ జీవితం కొనసాగించిన ప్రజలు ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. ఏ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. అయితే ఇందులో తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. ఇంటర్నెట్లో శోధించి, సోషల్ మీడియాలో వచ్చే సమాచారం సరైనదిగా భావించి నమ్మి అనుసరిస్తున్నారు. ఎవరు ఏమి చెబితే దానిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. మరికొందరు అతిగా మద్యం, గంజాయి, ధూమపానం చేయడంతో పాటు వారంలో నాలుగైదు రోజులు బిర్యానీలు, రోజూ ఫాస్ట్ఫుడ్లు తింటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.వీటి ఫలితంగా వారి ఆరోగ్యస్థితిగతుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాల గురించి పట్టించుకోకుండా ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. వైద్యులకు వారే ఫలానా వ్యాధి వచ్చి ఉంటుందని, ఈ వైద్యపరీక్షలు చేయాలని, ఫలానా మందులు రాయాలని సూచిస్తున్నారు. వైద్యపరీక్షల్లో ఏమీ లేదని నిర్ధారణ అయినా మరో వైద్యుని వద్దకు వెళ్లి వారికున్న ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెట్టి మళ్లీ చికిత్స చేయించుకుంటున్నారు. ఇలా వారు ఏ ఒక్క పరీక్షనూ, వైద్యున్నీ సరిగ్గా నమ్మకుండా ఇంట్లో గుట్టలుగా వైద్యపరీక్షలు పేర్చుకుని కూర్చుంటున్నారు. ఏ వైద్యుని వద్దకు వెళ్లినా ఆ పరీక్షలన్నీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇది మానసిక జబ్బని, దీనిని హైపోకాండ్రియాసిస్గా పిలుస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.మహిళల్లో పెరుగుతున్న భయాందోళన..ఇటీవల కాలంలో మహిళల్లో భయాందోళనలు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఆందోళన, డిప్రెషన్, గుండెదడ, తీవ్ర మానసిక ఒత్తిళ్లతో వారు చికిత్స కోసం వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. తనను కుటుంబసభ్యులు, భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదని భావించి లేని రోగాన్ని ఆపాదించుకుని వైద్యుల వద్దకు తిరుగుతున్నారు. వారికి వచ్చిన సమస్య నుంచి బయటపడేందుకు ఏదో ఒక ఆరోగ్యసమస్య చెబుతూ ఉంటారు. వారు చెప్పే వ్యాధి లక్షణాలకు తాలూకు వైద్యపరీక్షలు చేయిస్తే ఎలాంటి సమస్య ఉండదు. దీనిని సొమటైజేషన్ డిజార్డర్ అంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లు ఉంటారు. వీరికి ఆరోగ్యం బాగైనా కూడా బాగున్నట్లు చెప్పరు. అలా చెబితే మళ్లీ తనను కుటుంబసభ్యులు సరిగ్గా పట్టించుకోరని వారి అనుమానం. ఇలాంటి వాటికి సైకోథెరపీ, మందులు వాడాల్సి ఉంటుంది.కర్నూలు నగరం గాం«దీనగర్‌కు చెందిన లలితకుమారికి ఇటీవల గ్యాస్ పట్టేసినట్లు అనిపించింది. ముందుగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకుని వచ్చింది. మరునాడు మళ్లీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆయన ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించి రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయని చెప్పి పంపించారు. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఆమె ఛాతీలో బరువుగా ఉందని మరో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆమెకు మానసిక సమస్య ఉండటంతో ఇలా ప్రవర్తిస్తోందని వైద్యులు నిర్ధారించారు.కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవికి గుండెలో పట్టేసినట్లు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి ఈసీజీ తీయించుకున్నారు. ఈసీజీ నార్మల్‌గా ఉందని మందులు వాడాలని వైద్యులు సూచించారు. ఆ మరునాడు మళ్లీ తనకు గుండె దడగా ఉందని, నీరసంగా అనిపిస్తోందని, ఆయాసంగా ఉందని చెప్పడంతో మరో డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించారు. అన్నీ పరీక్షలు నార్మల్‌గా రావడంతో ఏమీ లేదని కంగారు పడాల్సిందేమి లేదని వైద్యులు నిర్ధారించారు...వీరిద్దరే కాదు సమాజంలో ఇలాంటి వారి సంఖ్య ఇటీవల తరచూ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. తలనొస్తుందంటే ఎంఆర్ఐ, చేయి నొప్పి పెడుతుందంటే హార్ట్ ప్రాబ్లం ఉందని, కాస్త త్రేన్పులు వస్తే గ్యాస్ ఎక్కువైందని ఎండోస్కోపి చేయించుకుంటే మేలనే ధోరణిలో పలువురు తయారయ్యారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్య విషయాలకు సంబంధించి తెలిసీ తెలియని వ్యక్తులు ఇచ్చే సూచనలు, సలహాలు ప్రజలను గందరగోళానికి నెట్టేస్తున్నాయి. ఫలితంగా సాధారణంగా మనిíÙలో ఏదైనా కనిపించే ప్రతి ఆరోగ్య అవలక్షణాన్ని భూతద్దంలో చూస్తూ జనం బెంబేలెత్తుతున్నారు. దీనిని వైద్యపరిభాషలో హైపోకాండ్రియాసిస్గా పేర్కొంటారు.హైపోకాండ్రియాసిస్ బాధితుల సంఖ్య పెరిగింది..ప్రతిసారీ ఏదో ఒక జబ్బు ఉన్నట్లు భ్రమిస్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్లి ఫలానా పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తుంటారు. వారు ఒక డాక్టర్ చికిత్సతో సంతృప్తి చెందరు. ఎలాంటి వ్యాధి లేదని చెప్పినా మళ్లీ మళ్లీ ఇంకో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. వీరిలో భయం, ఆందోళన, డిప్రెషన్ కూడా ఉంటుంది. దీనిని హైపోకాండ్రియాసిస్ అంటారు. సమాజంలో 2నుంచి 5 శాతం మందిలో ఈ సమస్య ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి సైక్రియాటిక్ మందులతో పాటు కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. ఇది ఎక్కువగా మధ్య వయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఇలాంటి సమస్య వల్ల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా నష్టపోతుంటారు. – డాక్టర్ ఎస్. ఇక్రముల్లా, మానసిక వైద్యనిపుణులు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికోవిడ్ అనంతరం ఆందోళన పెరిగింది..కోవిడ్ అనంతరం చాలా మందిలో వారి ఆరోగ్యం పట్ల భయం, ఆందోళన మరింత పెరిగింది. ఫలితంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వారిలో భయం, ఆందోళన పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత చిన్న వయస్సులోనే గుండెపోటు, స్ట్రోక్ బాధితుల సంఖ్య పెరగడం కూడా దీనికి ఒక కారణం. ఆకస్మిక మరణాలు కూడా ప్రజల్లో ఆందోళనకు ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్న జ్వరం వచ్చినా ఆందోళన చెంది వైద్యుల వద్దకు పరిగెత్తే వారి సంఖ్య బాగా పెరిగింది. దీనికితోడు ఒత్తిడితో కూడిన జీవితం ఈ తరంలో అధికమైంది. సోషల్ మీడియాలో సమాచారం చూసి తమ ఆరోగ్యంపై వ్యతిరేక భావాన్ని అన్వయించుకునే వారు ఎక్కువయ్యారు. తక్కువ సమయంలో జీవితంలో స్థిరపడిపోవాలనే వారి సంఖ్య ఎక్కువైంది. ఆకస్మిక మరణాలకు కారణం ఆల్కహాలు, గంజాయి సేవనం కూడా ఒక కారణం. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. – డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్, జనరల్ ఫిజీషియన్, కర్నూలుఅతిగా అవగాహన పెంచుకోవడం వల్లే..సాధారణంగా వైద్యులు కావాలంటే ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్, స్పెషలిస్టు డాక్టర్ అయితే మరో మూడేళ్లు, సూపర్ స్పెషలిస్టు కావాలంటే ఇంకో మూడేళ్లు చదవాల్సి ఉంటుంది. ఆయా పీజీ సీట్లు సాధించాలంటే రెండు, మూడేళ్లు కష్టపడి చదివి సీటు సంపాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి వైద్యునిగా పూర్తిస్థాయి పట్టా తీసుకునేందుకు 12 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుంది. కానీ కొంత మంది ఎలాంటి విద్యార్హత లేకుండా యూ ట్యూబ్‌లు, సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు.వైద్యుల మాట కంటే ఇలాంటి వారు చెప్పే మాటాలు వినేవారు ఇటీవల అధికమయ్యారు. వీరు చెప్పిన విషయాలను చూసి తనకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మానసికంగా బాధపడే వారి సంఖ్య అధికమైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మీడియాలో వచ్చే వ్యాధులకు సంబంధించి లక్షణాలను ఎవరికి వారు తమకు ఆపాదించుకుంటూ భయంతో వైద్యుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి మరింత అధికమైంది. కోవిడ్ అనంతరం ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, సలహాలు సోషల్ మీడియాలో మరింత అధికమయ్యాయి.ఇవి చదవండి: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..! -
ఐఫోన్ నుంచి కాళ్లకి వేసుకునే షూ వరకు అప్‌గ్రేడ్..ఇదేమైనా వ్యాధా?
ఇటీవల యువత గాడ్జెట్ల వ్యామోహం ఓ రేంజ్లో ఉంది. మార్కెట్లోకి ఏ కొత్త ఫీచర్ వచ్చినా క్షణం కూడా ఆగరు. రిలీజ్ చేస్తున్న డేట్ ఇవ్వంగానే కొనేసేందుకు రెడీ. ఇంట్లో తల్లింద్రండ్రుల వద్ద డబ్బు ఉందా లేదా అనేది మేటర్ కాదు. ఆరు నూరైనా..కేవలం ఆ కొత్త ఫీచర్ మనం వద్ద ఉండాల్సిందే అన్నంతగా ఉన్నారు యువత. ఇది అసలు మంచిదేనా?..ఒకవేళ్ల అలా కొత్త టెక్నాలజీ కొత్త ఫ్యాషన్‌కి అప్‌గ్రేడ్ కాకపోతే ఏదో పెద్ద నష్టం జరిగనట్టు లేదా భయానక అవమానం జరిగిన రేంజ్లో యువత ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. ఏంటిదీ? దీని వల్ల ఏం వస్తుంది? ఎవరికీ లాభం? నిజానికి యువత ముఖ్యంగా కాలేజ్‌కి వెళ్లే టీనేజ్‌ల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్న పెద్దవాళ్ల వరకు అందరికి అప్‌గ్రేడ్ అనే జబ్బు పట్టుకుంది. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫీచర్ లేదా టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అయిపోవాల్సిందే!. లేదంటే ఓర్నీ..! ఎక్కడ ఉన్నవురా? అంటూ ఎగతాళి. పైగా నిన్న మొన్నటి టెక్నాలజీని కూడా తాతాల కాలం నాటిది అంటూ తేలిగ్గా తీసిపడేస్తాం. ఇలా ధరించే దుస్తులు దగ్గర నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకు మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్త బ్రాండ్లతో అప్‌గ్రేడ్ అవ్వడం నాగరికత లేక ఓ గొప్ప ట్రెండ్‌గా ఫీలవుతున్నారా? అంటే..ఇక్కడ ఇలా అప్‌గ్రేడ్ పేరుతో మార్కెట్లోకి వచ్చే ప్రతిది కొంటున్న యువతకు కూడా ఇలా ఎందుకు అనేది వారికే స్పష్టత లేదు. కానీ ఓ ఆందోళనకరమైన విషవృక్షంలా మనుషుల్లో ఈ విధానం విజృంభిస్తుంది. మన పక్కోడు ఆ కొత్త టెక్నాలజీకి వెళ్లపోయినంత మాత్రనా వాడు ఏదో సాధించినట్లు కాదు. ముందు మనం దేన్ని ఎంతవరకు కొనాలి. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ధోరణిని మర్చిపోయేలా మాయాజాలం సృష్టిస్తున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలు. ఉదహారణకి ఐఫోన్ పరంగా చూస్తే 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ అవ్వాలని నీ వద్ద ఉన్న ఫోర్జీ ఫోన్‌ని వదిలేసి కొత్తదానికి వెళ్లాల్సినంత పనిలేదు. మహా అయితే వీడియో లేదా స్టోరేజ్‌కి సంబంధించి కాస్త బెటర్ ఫీచర్ ఉండొచ్చు. దానికోసం ఇలా వేలవేలకు వేలు దుబారా చేయడం సరియైనది కాదు. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్‌ని మర్చిపోతున్నాం. మనం ఓ ఫోన్ లేదా ఏ వస్తువైన కొనుక్కుంటున్నాం. దానికి కంపెనీ ఇన్ని ఏళ్లు అని వ్యారెంటీ ఇచ్చేది. మనం కొనుక్కుని వెళ్లిపోతే వాడివద్దకు మళ్లా కస్టమర్లు రారు. వాళ్ల బ్రాండ్‌ని మర్చిపోతారు. నిరంతరం కస్టమర్లతో టచ్‌లో ఉండేలా తన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకునే దృష్ట్యా కంపెనీలు చేసే ఇంద్రజాలం ఇది. దీన్ని గమనించక మన జేబులు గుల్లచేసుకుంటూ అప్‌గ్రేడ్ అంటూ మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త బ్రాండ్‌ని కొనేస్తున్నాం. అప్పటి వరకు మనతో ఉన్న వాటిని పక్కన పడేస్తున్నాం. కొందరి యువతలో ఇదొక మానసిక రుగ్మతలా తయారయ్యిందని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కొత్త టెక్నాలజీకి చెందిన వస్తువు లేదా మార్కెట్లోకి వచ్చిన ట్రెండీ ఫ్యాషన్ తన వద్ద లేనంత మాత్రన ఆత్మనూన్యతకు గురయ్యిపోతున్నారు. మనుషులకు వారి భావాలకు వాల్యూ ఇవ్వండి. నిజానికి అదేమీ స్టాటస్ కాదు. అది అందరూ గమనించాలి. తల్లిదండ్రులు ఇలాంటి ధోరణి గల పిల్లలను గమనించి కౌన్సిలింగ్ ఇప్పించడం లేదా మీరే చొరవ తీసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడి సరైన గాఢీలో పెట్టాలి లేదంటే ఆ మోజులో జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఎందుకంటే ప్రతీది కొనేయ్యలేం. అలాగే ప్రతి అప్‌గ్రేడ్‌ని ప్రతిసారి అందుకోవడం సర్వత్రా సాధ్యం కాదు. ముందు యువత సానుకూల దృక్పథంతో ఈ వస్తువు లేదా దుస్తులు కొనడం వల్ల ఎవరికీ లాభం, దీన్ని ఎందుకు మార్కెట్లో సొమ్ము చేసుకునేలా ఎందుకు ప్రచారం చేస్తారు అనే దానిపై దృష్టిపెట్టండి. మీ పరిజ్ఞానం ఇలాంటి చిన్న చితక వస్తువులకు బానిసైపోకూడదు. ఏదైనా మనకు ఉపయోగపడేది, మన స్థాయికి, ఉన్న పరిస్థితులకు అనుగుణమైనవి మన వద్ద ఉంటే చాలు. ఈ పిచ్చి విధానం మీ ఉనికిని, మీ వైఖరిని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడం కాదు. టెక్నాలజీనే నువ్వు సృష్టించగలిగే దిశగా నాలెడ్జ్‌ని పెంచుకునేలా అడుగులు వేస్తే మీ భవిష్యత్తు బంగారు పూలబాట అవుతుందని అంటున్నారు మానసికి నిపుణులు. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
చనిపోయాడనుకుని దహన సంస్కారాలు.. చిన్న కర్మ జరుపుతుండగా...
మనుబోలు: ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడు చనిపోయాడు అనుకుని గుర్తు తెలియని మృతదేహానికి కుటుంబీకులు అంత్యక్రియలు చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడిలో జరిగింది. వడ్లపూడి సర్పంచ్ పాలేటి రమాదేవికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సతీష్ (25) ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇతనికి మానసికపరమైన సమస్యలు ఉన్నాయి. నాలుగు రోజుల కిందట సతీష్ ఇంట్లో అలిగి బైక్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు సతీష్ ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం మనుబోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతలో శనివారం వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో గుర్తుపట్టలేని విధంగా ఉన్న యువకుడి మృతదేహం బయటపడింది. ఎత్తు, బరువు సతీష్ లాగే ఉండడంతో అతనేనని భావించిన కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని వడ్లపూడికి తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. చిన్న కర్మ జరుపుతుండగా సతీష్ ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూసి అందరూ షాకయ్యారు. -
మానసిక రుగ్మతలతో బాధపడుతున్న కోవిడ్ భాదితులు
-
కరోనా భయంతో కాటికి వెళ్లాలనుకుంది.. కాపాడారు
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్): కరోనా భయంతో మతిస్థిమితం కోల్పోయి ఆస్పత్రిలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వృద్ధురాలికి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన 65 ఏళ్ల పుష్పావతి(పేరుమార్చాం) కరోనా పాజిటివ్‌తో గత నెల 26న గాంధీ ఆస్పత్రిలో చేరింది. కరోనా భయంతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన ఆమె ఏప్రిల్ 28వ తేదీన ఆస్పత్రి భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి రోగులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వృద్ధురాలిని నిలువరించి వార్డులో చేర్చి మంచానికి కట్టేసి వైద్యసేవలు అందించారు. ఈ మేరకు గతనెల 29వ తేదీన ‘కరోనా బాధితురాలి ఆత్మహత్యాయత్నం’ శీర్షికతో సాక్షిలో ప్రచురించిన కథనానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. వృద్ధురాలికి సపర్యలు చేసేందుకు కేర్‌టేకర్‌ను నియమించి ప్రత్యేక వైద్యం అందించారు. మానసిక రుగ్మతలు నివారించేందుకు సైకియాట్రిస్ట్ డాక్టర్ జూపాక అజయ్‌కుమార్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించారు. మరోమారు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో బుధవారం ఆమెను డిశ్చార్జీ చేశారు. సదరు వృద్ధురాలు గతంలో సెరిబ్రోవాసు్కలర్ ఎటాక్ (సీవీఏ)తో బాధపడుతుండేదని, కరోనా సోకడంతో అయోమయానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మానసిక వైద్యుడు అజయ్‌కుమార్ తెలిపారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులు, కృషి చేసిన ‘సాక్షి’ దినపత్రికకు వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ( చదవండి: Coronavirus: కోవిడ్ మళ్లీ సోకితే ఏం చేయాలి? ) -
కన్నవాళ్లు షెడ్డులో వదిలేస్తే.. కుక్క కాపాడింది
చెన్నై: మానసిక వికాలంగురాలైన మహిళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు షెడ్డులో వదిలేశారు. ఈ క్రమంలో మృగాడు మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. జరుగుతున్న దారుణాన్ని గమనించిన ఆ ఇంటి పెంపుడు కుక్క.. ప్రబుద్ధుడి ఆట కట్టించింది. వారం రోజుల క్రితం తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కోయంబత్తూరు సెల్వపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు మానసిక వికాలాంగురాలు కావడంతో తల్లిదండ్రులు ఆమె కోసం ఇంటి పక్కన ప్రత్యేకంగా షెడ్డు నిర్మించి దానిలో ఉంచారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తి గత నెల 29న బాధితురాలి ఇంటికి వచ్చాడు. షెడ్డులో దూరి మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షెడ్డులో పవర్ కట్ చేశాడు. అయితే దిలీప్ కుమార్ చర్యలను గమనిస్తున్న వారి ఇంటి పెంపుడు కుక్క అతడి వెనకే షెడ్డులో ప్రవేశించింది. దిలీప్ కుమార్ ప్యాంట్ పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేసింది. అనుకోని ఈ ఘటనకు బిత్తరపోయిన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ కుక్క మాత్రం అతడిని విడిచిపెట్టలేదు. ఈలోపు ఇంట్లో కరెంట్ ఉండి.. షెడ్డులో పవర్ కట్ కావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా.. అక్కడ కుక్కతో పెనుగులాడుతున్న దిలీప్ కుమార్‌ను గమనించారు. వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచి.. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిలీప్ కుమార్ ఫోన్లో పలువురు మహిళల అసభ్యకర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇక కుక్కన్న పాటి దయ కూడా తల్లిదండ్రులకు లేకుండా పోయింది.. పాపం మానసిక వికలాంగురాలు అని కూడా చూడకుండా ఇలా షెడ్డులో ఉంచడం అమానుషం అంటున్నారు స్థానికులు. కుక్క అతడిని చూడకపోతే ఆ అభాగ్యురాలి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. చదవండి: మతిస్థిమితం లేని యువతిని బైక్‌పై ఎక్కించుకుని -
మరో మదనపల్లె..! రాత్రంతా పిచ్చిపట్టినట్టుగా
విశాఖపట్నం: రాష్ష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె ఘటన తరహాలోనే విశాఖలోనూ ఓ కుటుంబం చేసిన వింత చేష్టలతో స్థానికులు హడలెత్తిపోయారు. వివరాల ప్రకారం.. విశాఖ అజిమాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంటి లోపల గడియపెట్టుకొని రాత్రంతా పిచ్చిపిచ్చి కేకలు, శబ్దాలు చేశారు. ఎంత పిలిచినా బయటకు రాపోవడంతో మదనపల్లి తరహా ఘటన జరిగిందేమోనని స్ధానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. (మైనర్ బాలికపై లైంగిక దాడి..కామాంధుడు అరెస్ట్ ) ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు తీసే ప్రయత్నం చేసినా అటునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు పగలకొట్టి నలుగురు కుటుంబసభ్యులను బయటకు తీసుకువచ్చారు. వారి మాటలను గమనించిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ మళ్ళేశ్వరరావు మానసికంగా ఒత్తిడికి గురవున్నట్టు తెలిపారు. భర్త అబ్దల్ మజీద్ , భార్య మేహరో,కొడుకు నూరుద్దీన్ ,కూతురు నూర్ గత కొన్నాళ్లుగా మానసిక రుగ్మతకు గుర్తె పిచ్చి కేకలు వేస్తున్నట్టు స్ధానికులు చెప్పినట్లు పేర్కొన్నారు. నలుగురుని వ్తెధ్యం కోసం నగరంలోని మానసిక వ్తెద్యశాలకు తరలించినట్లు సిఐ తెలిపారు. (చేతబడి చేసిందని కక్ష పెంచుకుని హత్య) -
పాపం.. తప్పు చేశాడని కాళ్లు విరగ్గొట్టారు
సాక్షి, నిర్మల్: జిల్లాలోని కడెం మండలం కింగాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు లక్కవత్తుల రాజు అనే వ్యక్తిని తాళ్లతో కట్టేసి రోడ్డుపై పడేశారు. సర్పంచ్ తనయుడు నిందితున్ని కర్రతో చితకబాదాడు. అయితే, తన కొడుకుకు మతి స్థిమితం లేదని, అతన్ని విడిచిపెట్టాలని రాజు తల్లి కాళ్లావేళ్లా పడినా లాభం లేకపోయింది. స్థానికులు, సర్పంచ్ తనయుడు ఆమె మాట వినకుండా రాజుపై మరోసారి దాడి చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. -
మతిస్థిమితం లేక.. ఏడేళ్ల తర్వాత స్వగ్రామానికి
సాక్షి, నార్నూర్: మండలంలోని జామ్డా గ్రామానికి చెందిన పూసం మల్కు-సీతాబాయి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పూసం రాధ (36) మతిస్థిమితం సరిగ్గా లేక 2013లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా జాడ కానరాలేదు. 2014లో ఛత్తీస్‌ఘడ్ రాయపూర్‌లో రోడ్డుపై వచ్చిపోయే వారిని రాళ్లతో కొడుతుండగా గమనించిన అక్కడి రిమ్స్ మెంటల్ ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె మానసికస్థితిని గమనించిన వైద్యులు ప్రత్యేక వైద్యం అందించారు. పరిస్థితి మెరుగుపడడంతో వివరాలు సేకరించి ఈ నెల 6న స్థానిక ఎస్సై విజయ్‌కు ఆస్పత్రి సూపరింటెండెంట్ సమాచారాన్ని అందించారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మడావి ముక్తా రూప్‌దేవ్ స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌లకు విషయాన్ని తెలియజేశారు. నిరుపేద కుటుంబం ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రత్యేక చొరవ తీసుకొని ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ వాహనాన్ని సమకూర్చి ఆమెను స్వగ్రామానికి రప్పించారు. ఏడేళ్ల తర్వాత స్వగ్రామానికి పూసం రాధా ఆరోగ్యంగా చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె రాక కోసం ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్లకు ఆదివాసీ, రాయిసెంటర్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాయి సెంటర్ జిల్లా సార్మేడి మెస్రం దుర్గు తెలిపారు. మంత్రి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు కైలాస్‌నగర్(ఆదిలాబాద్): రాష్ట్ర దేవాదాయన, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచటం లేదని అవగాహన రహిత్యంగా మాట్లాడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. మంగళవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ రైతులు కష్టాలను తొలగించేందుకు నూతన వ్యవసాయ చట్టాని తీసుకువస్తే ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. గతేడాది సీసీఐ ద్వారా అత్యధికంగా పత్తి కొనుగోలు చేయడం జరిగిందని, ఈ నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఎంతో లాభం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఉంటూ రైతులను మోసం చేసే విధంగా వాక్యాలు చేయడం సమాంజసం కాదన్నారు. నూతన వ్యవసాయ చట్టం ద్వారా రైతులు దేశంలో ఎక్కడైనా పంటలు అమ్ముకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు పంట దిగుబడులను కొనుగోలు చేసి నెలల తరబడి రైతులు డబ్బులు ఇవ్వలేదని, గతేడాది సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసి వారంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో సీసీఐ ద్వారా కొనుగొల్లు చేపట్టి తీరుతామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు జోగు రవి, దినేష్ మటోలియా, నాయకులు అంకత్ రమేష్, లోక ప్రవీణ్ రెడ్డి, సోమ రవి, రాకేష్, సంతోష్ పాల్గొన్నారు. -
‘వీడియోగేమ్ అడిక్షన్ ఓ మెంటల్ డిజార్డరే’
జెనీవా: ప్రస్తుతం ఏ చిన్నారిని చూసినా మొబైల్ ఫోన్‌తోనే కనిపిస్తున్నారు. వీడియోగేమ్‌ల పేరిట ఆరుబయట ఆడే క్రీడలకు దూరమైపోతున్నారు. అయితే స్కూల్లో పాఠాలు వినడం, లేదంటే మొబైల్ ఫోన్‌ని పట్టుకుని కూర్చోవడం.. ఇదీ ఈ తరం చిన్నారుల లైఫ్‌స్టయిల్. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు వీడియో గేమ్‌లకు బానిసలుగా మారిపోతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. వీడియో గేమ్‌లకు బానిసలైపోతున్న వారి మానసికస్థితి సరిగా ఉండటం లేదని డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. వీడియోగేమ్స్ కారణంగా పిల్లలు మానసిక వ్యాధులబారిన పడుతున్నారని, రోజువారి జీవితంలో ఈ వీడియోగేమ్స్ ప్రభావం కూడా ప్రతికూలంగా ఉంటోందని తేల్చింది. ఎక్కువ సేపు గేమ్స్ ఆడేవారి ఇతర ఆసక్తులను, కార్యకలాపాలను ఈ గేమ్స్ నిర్లక్ష్యం చేస్తున్నాయని, వీడియో గేమ్స్ ఆడుతూ నిద్ర, తిండి కూడా పట్టించుకోవట్లేదని వెల్లడించింది. ‘వీడియో గేమ్ అడిక్షన్’ని మెంటల్ డిజార్డర్‌గా డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ప్రకటించింది. -
దుర్గగుడిపై వ్యక్తి హల్చల్
సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : దుర్గగుడిపై మతి స్థిమితం లేని ఓ వ్యక్తి శుక్రవారం హల్చల్ చేశాడు. ఎటువంటి తాడు లేకుండా ప్రమాదకర పరిస్థితులలో చెట్లు, కొండ అంచులను పట్టుకుని పాకుకుంటూ కొండపైకి చేరుకున్నాడు. మతి స్థిమితం లేని వ్యక్తి చేస్తున్న చర్యలను చూసి పోలీసులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది, భక్తులకు ముచ్చెమటలు పట్టాయి. చివరకు ఆ వ్యక్తి క్షేమంగా కొండపైకి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగ్గయ్యపేట మండలం మర్రిపాకకు చెందిన కుండల నాగేశ్వరరావు కొద్ది రోజుల కిందట లారీ ఎక్కి నగరానికి చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మహా మండపం సమీపంలోని పాత మెట్ల వద్దకు చేరుకున్న నాగేశ్వరరావు కొండపైకి చేరుకోవాలని బావించాడు. మెట్ల మార్గం నుంచి కాకుండా పక్కనే ఉన్న రాళ్లు, చెట్ల మధ్య నుంచి కొండపైకి ఎక్కడం ప్రారంభించాడు. సుమారు అరగంట తర్వాత కొండ సగం దూరం ఎక్కిన నాగేశ్వరరావు కిందకు చూసే సరికి భయం వేసింది. అయినా సరే కొండ రాళ్లు అంచులను పట్టుకుని మెల్లగా పాకుకుంటూ పైకి ఎక్కడం ప్రారంభించాడు. కొంత దూరం ఎక్కిన తర్వాత భయంతో కొండ అంచున కూర్చోవడంతో అతనిని భక్తులు గమనించారు. అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు సిబ్బంది, ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది కొంత మంది కొండ కింద నుంచి, మరి కొంత మంది పై నుంచి నాగేశ్వరరావును పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎక్కడ పట్టుతప్పి కింద పడిపోతాడోనని భయంతో తాడు సహాయంతో పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇంతలో శానిటేషన్ విభాగంలో పనిచేసే ఓ యువకుడు తాడుతో కిందకు దిగి అతనిని పట్టుకుని పైకి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత నాగేశ్వరరావును పోలీసులకు అప్పగించారు. అవుట్ పోస్టులోకి తీసుకువెళ్లగా నాగేశ్వరరావు తన పూర్తి వివరాలను తెలిపాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు. తన మేకలు కొండపైన ఉన్నాయని, వాటిని పట్టుకునేందుకు వచ్చానని పొంతన లేని సమాధానాలు చెప్పసాగాడు. అతనిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఆ నేను ఎవరు?
కొన్ని సందర్భాల్లో కొందరు... ‘నేను’ అనే భావనను విడనాడి... తనను తాను మరచిపోయి... తననుంచి తాను విడిపోయి... వేరొకరిగా మారిపోతారు. ఆ పరిస్థితినే ‘డిసోసియేషన్’ అంటారు. అలా విడిపోవడం ద్వారా వ్యక్తమయ్యే మానసిక రుగ్మతలే డిసోసియేషన్ డిజార్డర్స్. వాటిపై అవగాహన కోసమే ఈ కథనం. ముందుగా ఒక కేస్‌స్టడీ పరిశీలిద్దాం... రాణి ఒక పేదింటి పిల్ల. మునసబుగారి అబ్బాయి ఆమెను వేధిస్తున్నాడు. అతడిది ఆర్థికంగా, సామాజికంగా పెద్ద స్థాయి. అంతటి స్థాయిలో ఉన్న మునసబుగారి అబ్బాయిని ఎదిరించగలిగే మానసిక స్థైర్యంగానీ, బలంగాని రాణికి లేవు. అయితే మరి రాణి ఈ పరిస్థితిని అధిగమించగలిగేది ఎలా? ఇక్కడ ఒక మతలబు ఉంది. మెదడు చాలా తెలివైనది. తనను తాను ఎలా కాపాడుకోవాలో మెదడుకు సహజసిద్ధంగానే తెలుసు. రాణి శరీరంలోకి ఆమె ప్రమేయం లేకుండానే ఆ ఊరి అమ్మవారు ప్రవేశిస్తుంది. ఆమె గొంతు (స్వరం), మాట, ప్రవర్తన అన్నింటిలోనూ చిత్రమైన మార్పు కలుగుతుంది. హావభావాలు మారిపోతాయి. రాణి అమ్మవారుగా మారిపోతుంది. అయితే తనలో సంభవించే ఈ మార్పులు రాణికి కూడా తెలియవు. మెదడు చేసే కొన్ని పనులు ‘సబ్–కాన్షియస్’ స్పృహతో జరగడం వల్ల బాహ్య స్పృహకు అవి జరుగుతున్న విషయమే తెలియకుండ జరుగుతాయి. తన చుట్టూ ఉన్న ప్రాకృతికమైన అంశాలను (నేచర్‌ను) అనుక్షణం పరిశీలించే మెదడు తనను ప్రమాదం నుంచి కాపాడుకోడానికి ఈ పరిస్థితిని ఎంచుకుంటుంది. దీన్నే మనం పూనకం అంటాం.ఇప్పుడు అమ్మవారు పూనాక రాణి స్థాయి సృష్టిలో అందరికన్నా ఎక్కువ. ఆర్థికంగా, సామాజికంగా బలమైన మునసబు కొడుకు కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ. సాక్షాత్తూ ఆమే అమ్మవారు. ఊరిజనం అంతా ఆమెకు పూజలు చేస్తుంటారు. ఆమె ఆజ్ఞలను పాటిస్తుంటారు. రాణి తాత్కాలికంగా తన సమస్యనుంచి బయటపడుతుంది. అంతేకాదు... ఆమె కోరుకోని మరికొన్ని కోరికలూ తీరుతాయి. దాంతో ఇదే అలవాటుగా మారుతుంది. సమస్యలు కలిగినప్పుడల్లా ఆమె ఇతరులను పొసెస్ చేసుకుంటుంది. అంటే అమ్మవారు తనను పూనడాన్ని ఆహ్వానిస్తుంది. కొన్నిసార్లు అమ్మవారే కాకుండా, కొందరిలో వేరే మనిషి గానీ, వారు ఊహించుకునే లేని దెయ్యాలూ, భూతాలు పూనడం కూడా జరుగుతుంది. డీసోసియేషన్ కలిగే పరిస్థితులివి... ♦ తీవ్రమైన ఒత్తిడి ♦ తట్టుకోలేనంత అలసట ♦ తీవ్రమైన డిప్రెషన్ చిన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురైన పరిస్థితుల్లో దృఢమైన, సమన్వయంతో కూడిన ‘నేను’ అనే భావన బలంగా ఏర్పడదు. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే స్టేబుల్, ఇంటిగ్రేటెడ్ సెల్ఫ్ ఫీలింగ్ ఏర్పడదు. అలాంటి పరిస్థితుల్లో వ్యక్తి డీసోసియేషన్కు గురవుతాడు. అప్పుడు ఒకే వ్యక్తిలో అనేక వ్యక్తిత్వాలు (మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్) ఏర్పడవచ్చు. ఉదాహరణకు అపరిచితుడు సినిమాలోని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఈ కోవకు చెందిందేనని చెప్పవచ్చు. ఒక వ్యక్తి తన శరీరాన్ని తనదిగా గుర్తించగలగడానికి స్పర్శ వంటి జ్ఞానేంద్రియాలూ పనిచేయాలి. అలాగే తన స్థితికి సంబంధించిన ఉనికి తెలుసుకునేందుకు ఒక నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అదే లేకపోతే ఒక వ్యక్తికి ‘నా’ అనే భావన ఉండదు. దీన్ని మరింత తేలిగ్గా అర్థమయ్యేలా తెలుసుకోవడం కోసం ఒక ఉదాహరణ చూద్దాం. మన శరీరంలో ఒక భాగానికి మత్తు (అనస్థీషియా) ఇచ్చామనుకోండి. అప్పుడు అక్కడ చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నా సరే... అక్కడేదో జరుగుతోందని మనకు తెలియదు కదా. మనం ఆ భాగాన్ని కళ్లతో చూడకపోతే ఆ భాగం మన శరీరంలోనిది కాదని కూడా అనిపించవచ్చు. డిసోసియేషన్లో కూడా ఇలాంటి భావనే వస్తుంటుంది. అలాంటివే మరికొన్ని ఉదాహరణలు ♦ కొందరు పీర్ల గుండం దగ్గర లేదా కొన్ని ప్రత్యేక ప్రార్థనల సమయంలో నిప్పుల మీద నడుస్తుంటారు. తీవ్రమైన భక్తిభావనకు లోనైనప్పుడు నిప్పుల మీద నడిస్తే బాధ అనే భావనే రాదు. దీన్నే ‘సెన్సరీ డిసోసియేషన్’ అంటే జ్ఞానేంద్రియాలకు... ప్రధానంగా స్పర్శకు సంబంధించిన డిసోసియేషన్‌గా చెప్పవచ్చు. ♦ ఏదైనా తీవ్రమైన సంఘటన సంభవించినప్పుడు మన మెదడు మొద్దుబారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే కొందరికి యాక్సిడెంట్లో తీవ్రమైన గాయాలైనా కొంతసేపటి వరకు నొప్పి కలగకపోవడాన్ని చూస్తుంటాం. ఇది కూడా డిసోసియేషన్ వల్ల జరిగే పరిణామమే. ♦ ఒక సబ్జెక్ట్‌పై చాలా ఆసక్తి కలిగినప్పుడు ఒక విద్యార్థి తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోందో కూడా తెలియనంతగా అందులో లీనమైపోయినపోతాడు. అలాంటి సందర్భాల్లోనూ డిసోసియేషన్ కలుగుతుంది. ♦ అత్యంత భక్తిభావనను మనసు నిండా నింపుకున్న వ్యక్తి ఒక్కోసారి తనలోకి దైవం చేరినట్లుగా అనుభూతి చెందుతాడు. ఇది కూడా ఒక తరహా డిసోసియేషనే. మానసిక వైద్య పరిభాషలో చెప్పాలంటే ఈ స్థితిని ‘పొసెషన్’ అంటారు. కాకపోతే ఇది సంస్కృతి ఆమోదించన అంశం కావడంతో పాటు ఆ వ్యక్తికి గానీ, ఇతరులకు ఇబ్బంది కలగనంతవరకు దీన్ని వ్యాధిగా పరిగణించరు. డిసోసియేషన్ ఆమ్నీషియా : ఏదైనా కారణంతో మనసుకు తీవ్రమైన గాయం కలిగించిన / కలిగిస్తున్న పరిస్థితులనూ / సంఘటనలనూ మరచిపోవడం అన్నది ‘డిసోసియేషన్ ఆమ్నీషియా’ అనే కండిషన్లో కలుగుతుంది. ఈ మరపు అన్నది సాధారణ మరపు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. డిసోసియేటివ్ ఫ్యూగ్ (దేశ దిమ్మరి) : ఒక వ్యక్తి తన నివాస స్థలం నుంచి లేదా తాను పనిచేసే చోటు నుంచి అనుకోకుండా ప్రయాణం మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో సెల్ఫ్‌కేర్ (శుభ్రత, ఆహారం, నిద్ర వంటి అంశాలు) మామూలుగా ఉన్నా... (వెనకకు తిరిగి వచ్చాక) తాను ఆ ప్రయాణంలో ఎక్కడికి వెళ్లిందీ, ఏం చేసిందీ అన్న అంశాలను పాక్షికంగానో / మొత్తంగానో మరచిపోతాడు. ట్రాన్స్ / పొసెషన్ స్టేట్ అంటే... ట్రాన్స్ : తాను అనే తన సొంత భావనను... ఇంగ్లిష్‌లో చెప్పాలంటే... తన ఐడెంటిటీని కోల్పోయే స్థితిని ట్రాన్స్ అంటారు. తన చుట్టూ జరుగుతున్న దానిని గుర్తించని లేదా కొన్నింటిని మాత్రమే గుర్తించే స్థితి ఇది. తన భాష, కదలికలు, భంగిమలు చాలావరకు తగ్గిపోతాయి. ఈ స్థితిలో కేవలం రెండు మూడు మాటలే మాట్లాడుతారు. వ్యక్తిలో కేవలం ఒకే రకమైన ప్రవర్తన ఉండటం కనిపిస్తుంది. పొసెషన్ కండిషన్ : ఒక వ్యక్తి శరీరంలోకి మరొకరు చేరడాన్ని పొసెషన్ అని ఇంతకుముందు ఒక ఉదాహరణలో చెప్పకున్నాం. వ్యక్తిలో మరొక వ్యక్తి ప్రవేశించినట్లుగా భూతం / దెయ్యం / శక్తి ఆవహించినట్లుగా కావడాన్ని ‘పొసెషన్ స్టేట్’ అంటారు. డిసోసియేషన్తో కలిగే సమస్యలు : డిసోసియేటివ్ మోటార్ డిజార్డర్స్ : తనలో ఎలాంటి శారీరక సమస్య లేకపోయినా, నరాలకు సంబంధించిన లోపాలు లేకపోయినా మాటపడిపోవడం (మ్యూటిజం), ఒళ్లు తూలడం, నడవలేకపోవడం, అడుగులు పడకపోవడం, బ్యాలెన్స్ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే అది డిసోసియేటివ్ మోటార్ డిజార్డర్ వల్ల కావచ్చు. డిసోసియేటివ్ కన్వల్షన్స్ : శరీరంలో ఫిట్స్ వచ్చినప్పటిలా కదలికలు సంభవించడం జరుగుతుంది. అలాంటప్పుడు వీళ్లు కిందపడిపోయినా సాధారణంగా ఎలాంటి గాయం కాకపోవచ్చు. అయితే మూర్ఛ వ్యాధి ఉన్నవారిలోలా నాలుక కొరకడం, మూత్రవిసర్జన చేయడం మాత్రం ఉండకపోవచ్చు. లేదా కొందరిలో చాలా అరుదుగా మాత్రమే ఉండవచ్చు. డిసోసియేటివ్ అనస్థీషియా / సెన్సరీ లాస్ : శరీరంలోని ఒక భాగం లేదా మొత్తం శరీరంలో ఏ కారణం లేకుండా స్పర్శ లేకపోవడం. తాకినా, గిచ్చినా, మంటకు ఎక్స్పోజ్ చేసినా ఎలాంటి స్పర్శ జ్ఞానం కలగకపోవడం. కొందరు తమ చూపు, వినికిడి శక్తి, వాసన చూసే శక్తి కోల్పోవడం కూడా జరగవచ్చు. ∙యుద్ధఖైదీలకు చేసే ‘బ్రెయిన్ వాష్’ కూడా ఒక రకమైన డిసోసియేషన్‌గా చెప్పవచ్చు. ∙కొందరికి తమ శరీరం నుంచి తాము విడిపోయి, బయటి నుంచి తమను తాము చూసుకున్న భావన కలుగుతుంది. ఇలాంటి అనుభూతి ‘నియర్ డెత్’ అనుభావాల్లోనూ కలుగుతుంది. ఇవి కూడా డిసోసియేషన్ వల్ల కలిగే అనుభూతులు మాత్రమే. కన్వర్షన్ డిజార్డర్స్ : తీవ్రమైన మానసిక సంఘర్షణ కలిగి, దాన్ని వ్యక్తీకరించలేనప్పుడు మన మెదడు మనకు తెలియకుడానే వాటిని శారీరక లక్షణాలుగా మార్చుకొని వ్యక్తీకరిస్తుంది. మానసిక సమస్యలు శారీరక లక్షణాలుగా వ్యక్తమైనప్పుడు దాన్ని కన్వర్షన్ డిజార్డర్ అంటారు. తమకు తామే హాని చేసుకునేలా, లేదా ఇతరులకు హాని జరిగేలా ‘డిసోసియేషన్’ జరుగుతున్న సందర్భాల్లో రోగులు తప్పనిసరిగా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. డిసోసియేషన్ అంటే ఏమిటి? గతంలో ‘తాను’ అన్న భావనను విస్మరించే వ్యాధులన్నింటినీ కలుపుకొని ‘హిస్టీరియా’గా వ్యవహరించారు. ఒకప్పుడు హిస్టీరియాగా పేర్కొన్న అంశాలకు శాస్త్రీయమైన కారణాలు లభ్యమయ్యాక... వాటిని డిసోసియేషన్/కన్వర్షన్ డిజార్డర్స్‌గా వ్యవహరిస్తున్నారు. డిసోసియేషన్ అంటే ఏమిటో తెలుసుకునే ముందు ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి తన మనసులో ఏర్పడే ఆలోచనలనూ, భావోద్వేగాలనూ... అవన్నీ తనవిగా గుర్తించడాన్ని కలుపుకొని ఇంగ్లిష్‌లో ‘ఐ’ అండ్ ‘మైన్’ అంటారు. దాన్నే తెలుగులో ‘నేను’ అనీ చెప్పవచ్చు. అందరిలోనూ ఉండే ఆ ‘నేను’ అనే ఫీలింగ్... కొంతమందిలో ఒక్కోసారి కొంతసేపు తొలగిపోతుంది. ఆ సమయంలో నేను నేను కానేమోనన్న భావన కలుగుతుంది. అలా జరిగే మానసిక స్థితిని ‘డీ–పర్సనలైజేషన్’ అంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో... అంటే... తీవ్రమైనంతగానూ, తట్టుకోలేనంతగానూ ఏర్పడ్డ మానసిక ఒత్తిడిలో గానీ లేదా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడ్డప్పుడు గానీ కొందరు తన సొంత భావోద్వేగాల నుంచి తామే విడివడతారు. ఇలా తన సొంత ఫీలింగ్స్‌ను తనవి కావన్నంతగా విడివడిపోయే కండిషన్‌ను ‘డిసోసియేషన్ ఆఫ్ అఫెక్ట్స్’ అనవచ్చు. భావోద్వేగాల తీవ్రతతో మనసు ఏమాత్రం పనిచేయని పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది. అపరిచితుడు సినిమాలో హీరో రకరకాల వ్యక్తిత్వాలుగా మారిపోతుంటాడు. ఆ సినిమాలో ఆ కండిషన్‌ను ‘మల్టీపుల్ పర్సనలిటీ డిజార్డర్’ అన్నారు. ఇది కూడా డిసోసియేటివ్ డిజార్డరే! కాకపోతే ప్రస్తుతం దీన్ని ‘డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్’ అంటున్నారు. చికిత్స : ఏవైనా కారణాల వల్ల డిసోసియేషన్ లేదా కన్వర్షన్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు రోగిలో తాను కోల్పోయిన లేదా ఛిద్రమైన ‘సెల్ఫ్’ను పునరుద్ధరించడం ద్వారా ఈ జబ్బులకు చికిత్స చేయవచ్చు. అలా వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా, ఇగో స్ట్రెంగ్త్‌ను పెంచడం ద్వారా ఈ జబ్బులను పరిష్కారించవచ్చు. ఇందుకోసం తమ సమస్యలను తామే పరిష్కరించగలిగేలా వారిలో కొన్ని నైపుణ్యాలు (స్కిల్స్) పెంచడం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను కలిగించడం ద్వారా ఈ జబ్బులకు చికిత్స చేయడం జరుగుతుంది. అవసరమైన కొన్ని మందులు కూడా ఇస్తారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వంటివీ ఇస్తారు. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై , ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ, కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ -
గ్యాస్ కట్టేసి... మళ్లీ మళ్లీ చూస్తున్నారు!
హోమియో కౌన్సెలింగ్ నా భర్తకు 35 ఏళ్లు. ఆయన ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రిపూట గ్యాస్ ఆపేశామా లేదా అని మళ్లీ మళ్లీ చెక్ చేయడం, తలుపులు వేసిన వాటినే మళ్లీ మళ్లీ వెళ్లి చూడడం వంటివి. ఆయన సమస్య ఏమిటి? – నివేదిత, తాడేపల్లిగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ భర్త అబ్బెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) తో బాధడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక మానసిక రుగ్మత. అనవసరమైన ఆలోచనలు, మానసిక ఒత్తిడి వల్ల ఇది వస్తుంది. కొంతమందిలో ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయినా ఈ వ్యాధి వస్తుంది. ఓసీడీ వ్యాధి ఉన్నవాళ్లు మాటిమాటికీ వాళ్ల వస్తువులను చెక్ చేసుకోవడం, వాళ్లు చేసే పనిమీద అనుమానంతో పరీక్షించుకుంటూ ఉండటం, మీరు చెప్పినట్లుగా గ్యాస్ స్టౌ ఆపేశారా లేదా అని చూడటం, తాళాలు వేశామా లేదా అని పదే పదే చెక్ చేయడం వంటివి అన్నమాట. చేతులు మాటిమాటికీ కడుక్కుంటూ ఉంటారు. దాంతో మానసికంగానూ, శారీరకంగానూ అలసిపోతూ ఉంటారు. ఏదైనా ఆలోచన వచ్చిందంటే అదే రిపీటవుతూ వారి మనసును తొలిచేస్తూ ఉంటుంది. కారణాలు: ∙జన్యుకారణాలు, పర్యావరణ పరిస్థితులు ∙మానసిక ఒత్తిడి ∙ఇన్ఫెక్షన్స్ ∙అధికంగా ఆలోచించడం. లక్షణాలు: పదే పదే లాక్ చెక్ చేయడం ∙ అంకెలను మళ్లీ మళ్లీ లెక్కించడం. చికిత్స: ఓసీడీని హోమియో పద్ధతిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో మూల కారణాన్ని గుర్తించి, దానికి చికిత్స చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ రాకుండా వ్యాధిని నయం చేయవచ్చు. ఓసీడీకి హోమియోలో ఆర్సినికమ్ ఆల్బమ్, అర్జెంటమ్ నైట్రికమ్, నక్స్‌వామికా, మెరిడోనమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో తగిన మోతాదులో వాడితే తప్పక మంచి ఫలితాలు కనిపిస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ మైగ్రేన్ తగ్గుతుందా? హోమియో కౌన్సెలింగ్ నా ఫ్రెండ్‌కి 28 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించింది. మైగ్రేన్ అన్నారు. మందులతో తగ్గుతుందన్నారు. అయితే అది మాటిమాటికీ తిరగబెట్టే సమస్య అని తెలిసింది. అలా జరగకుండా ఆమె సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – సుమతి, అమలాపురం మైగ్రేన్ అనేది మెదడులో ఉండే రక్తనాళాలకు సంబంధించిన సమస్య. మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల పరిమాణం వ్యాకోచించడం వల్ల నరాలపై ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆ నరాల నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల నొప్పి, వాపు వస్తాయి. రక్తనాళాల పరిమాణం విస్తరించిన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. కారణాలు: ∙మానసిక ఒత్తిడి ∙నిద్రలేమి ∙ఉపవాసం ∙హార్మోన్ల సమస్యలు, ∙అధిక వెలుతురు ∙వాసనలు ∙మత్తు పదార్థాలు, పొగాకు, పొగతాగడం, కాఫీ ∙మహిళల్లో బహిష్టు ముందర ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వల్ల లక్షణాలు రావచ్చు. లక్షణాలు: ∙తలనొప్పి అధికంగా, తలను ముక్కలు చేస్తున్నట్లుగా ఉండి ఒకవైపు లేదా రెండు వైపులా ఉండవచ్చు ∙నొప్పి సాధారణంగా నుదురు, కళ్లచుట్టూ, తల వెనక భాగంలో రావచ్చు ∙తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు ∙రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది ∙వికారం, వాంతులు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లూచేతులు చల్లబడటం, వెలుతురు తట్టుకోలేకపోవడం, శబ్దం వినలేకపోవడం వంటి లక్షణాలు తరచూ మైగ్రేన్ నొప్పిలో ఉంటాయి ∙నిద్రలేమి, చిరాకు, నీరసం, ఉత్సాహాన్ని కోల్పోవడం, ఆవలింతలు, తీపి ఇంకా కారపు పదార్థాలను ఎక్కువగా ఇష్టపడటం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు. చికిత్స : ఈ సమస్యకు హోమియోలో సాంగ్వినేరియా, బ్రయోనియా, ఐరస్ వెర్స్, నేట్రమ్మూర్, పల్సటిల్లా, నక్స్‌వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గేదెలా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28. ఈ మధ్య వెంటవెంటనే మూత్రం వచ్చినట్లుగా అనిపించడంతో పాటు మంటగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఒక సోదరి, అనంతపురం మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో ఇది సాధారణం. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు.అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో 90 శాతం కేసుల్లో ఈ–కొలై బ్యాక్టీరియానే కారణం. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద ఉండే పరాన్నజీవి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది.మూత్రపిండాల్లో రాళ్లు మూత్రవిసర్జనకు అడ్డంకిగా మారడం వల్ల కూడా బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందు లేదా తర్వాత విపరీతమైన మంట, ఎక్కువసార్లు మూత్రవిసర్జన, మూత్రంలో రక్తం, పొత్తికడుపు నొప్పి, చలిజ్వరం, వాంతులు. చికిత్స: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తితత్వాన్ని బట్టి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
జయించు జీవించు
►ప్రపంచ జనాభాలో 4.4 శాతం ( 32.20 కోట్ల మంది) మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు. ►ఇండియాలో 5.20 కోట్ల మంది కుంగుబాటు రుగ్మతతో బాధపడుతున్నారు. మనసు లేని బతుకొక నరకం.. మరువలేని మనసొక నరకం అన్నట్లు శరీరానికి తలనొప్పి, కడుపునొప్పి వచ్చినట్లే.. మనసుకూ బాధ కలిగితేమహాపరాధమేమీ కాదు. దాన్ని దాచి పెట్టుకుని.. మరింత పెంచుకుని బలైపోవడం కంటే బయటపడి కుంగుబాటును జయించి జీవించడం మంచిది. అందుకు విశ్వాసపాత్రులు, విజ్ఞానవంతులు, అనుభవజ్ఞులు సాయం పొందవచ్చు. మనిషిలో ఉన్న శతకోటి కోరికలు, బలహీనతల కారణంగా ఒక్కొక్కప్పుడు ప్రతి మనిషిలోనూ అసాధారణ ప్రవర్తన, సాధారణ ప్రవర్తనకు భిన్నమైన ప్రవర్తనా శైలి చోటు చేసుకుంటుంది. ఇది నిస్సందేహంగా కుంగుబాటే. ఇది తాత్కాలికం కావచ్చు.. కొంతకాలం ఉండొచ్చు. ఈ మానసిక రుగ్మతకు కూడా ఆస్పత్రులు ఉన్నాయి. చికిత్స పొందవచ్చు. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్యదినోత్సవం. ఈ ఏడాది ఆరోగ్యదినోత్సవం సందర్భంగా తీసుకున్న థీమ్ డిప్రెషన్. దీన్నే కుంగుబాటు అంటారు. దీనిపై ప్రత్యేక కథనం. 1 పరీక్షలో ఉత్తీర్ణతసాధించలేకపోయాననే మనస్తాపంతో మదనపల్లెలో మార్చి 30న గణేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 2 కుటుంబ కలహాలతో చంద్రగిరి నరసింగాపురానికి చెందిన బాలాజీ మార్చి 28న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీ వయసు కేవలం 33 సంవత్సరాలు. అతడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది. 3 నాగలాపురం మండలం టీపీ పాళేనికి చెందిన సెల్వీ ముగ్గురు కుమారులతో సహా మార్చి 22న ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారు ఆమెను వేధింపులకు గురిచేయడంతోనే అఘాయిత్యానికి పాల్పడింది. చిత్తూరు, సాక్షి: పరీక్ష పాస్ కాలేదని ఒక రు, పాసైనా తక్కువ మార్కులొచ్చాయని ఇంకొకరు. వచ్చినా కోరుకున్న కాలేజీలో సీటు రాలేదని మరొ కరు.. క్యాంపస్ సెలెక్షన్లలో ఉద్యోగం రాలేదని.. ప్రేమ విఫలమైందని.. సఫలమైనా పెళ్లి వరకు వెళ్లలేదని .. అప్పుల బాధతో.. భర్త పుట్టింటికి పంలేదని.. పెంపుడు కుక్క కనిపించలేద ని .. ఇంట్లో చెల్లి రిమోట్ ఇవ్వలేదని.. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ.. చాలా సందర్భల్లో çకుంగు బాటుకు గురై చావులోనే పరిష్కారం వెదుక్కుంటున్నారు. కుంగుబాటుతోనే అధికశాతం ఆత్మహత్యలు ఆత్మహత్యలు ఎక్కువగా కుంగుబాటుతోనే జరుగుతున్నాయి. ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన మార్పులతో ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకోడానికి కూడా సమయం దొరకడం లేదు. దీంతో ఏదైనా అనుకోని ఆప ద ఎదురైనా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మానసికంగా మళ్లీ మామూలు మనిషిని చేయడానికి స్నేహితులు కూడా వారివారి పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఎవరికి చెప్పుకోవాలో తెలీక చాలా మంది సతమతం అవుతుం టారు. కొన్నిసార్లు పెద్ద సమస్య లేకపోయినా కుంగుబాటుకు లోనవుతున్నారు. ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతుండటం వల్ల ఆత్మహత్యలకు కారణం అవుతోంది. క్షణికావేశంలో చేసే పొరపాటు వల్ల కలిగే నష్టాలు.. క్షణికావేశంలో చేసే పొరపాటు వల్ల కలిగే నష్టాలు అపారం. వీరిపై ఆధారపడి ఉన్న జీవితాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. వృద్ధులు, మహిళలు, పిల్లలు, దిక్కుమొక్కులేని జీవితాన్ని వెళ్లదీస్తారు. కుటుం బాలు వీధిన పడతాయి. ఆర్థికంగా చితికిపోతాయి. తల్లిదండ్రులకు గుండెలు పగిలినంత శోకం ఎప్పటికీ ఉంటుంది. కుంగుబాటు అంటే.. నిరంతరం బాధ, ఆందోళన, ఎప్పుడూ నిరాశలోనే కూరుకుపోవడం, జీవితం నిస్సారం అనిపించడం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చికాకు, కుదురుగా ఉండకపోవడం గతంలో ఆనందంగా అనిపించిన విషయాలే ఇప్పుడు నిరాసక్తంగా అనిపించడం నలుగురిలో కలవలేకపోవడం వంటి వి కుంగుబాటు లక్షణాలు. పోషకాహారలేమి.. డిప్రెషన్ రావడానికి కారణం పోషకాహారలేమి అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక పో షకం కంటే ఎక్కువ పోషకాల లోపం కారణంగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒమేగా 3, ఒమేగా 6 ఫాటీ ఆసిడ్ లోపం కార ణంగా డిప్రెషన్ కలుగుతుంది. మెదడు పనితీరు, మానసిక ఆరోగ్యానికి ఈ ఆసిడ్లు చాలా అవస రం. అలాగే అమైనో ఆసిడ్ల లోపం కూడా మరో కారణం. మెదడు కీలకమైన విధులకు అమైనో ఆసిడ్లు చాలా అవసరం రోజు వారీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి. విటమిన్–బి లోపం తో డిప్రెషన్ కలుగుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 309 సెక్షన్ తొలగింపు.. భారతీయ శిక్షాస్మృతి 309 ప్రకారం ఆత్మహత్య చేసుకో వడం నేరం. ఈ సెక్షన్ ప్రకారం ఆత్మహత్యకు పాల్పడి బతికినవారికి జైలు శిక్ష విధిస్తారు. దీన్ని తొలగించాలని 1971 నుంచే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బతకడంతో పాటు చావడంలోనూ విఫలమై తీవ్రంగా కుమిలి పోతున్న బాధితులపై నేరం మోపి శిక్షించడం అమానుషమని న్యాయ సంఘం సూచనలు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ సంఘం సూచనల మేరకు ఇలాంటి కేసులను తీవ్ర మానసిక ఒత్తిడి పేరుతో నమోదు చేసుకుని మానసిక వైద్య నిపుణులతో చికిత్సలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేయాల్సింది ఇదీ.. కుంగుబాటు, ఆత్మహత్యలపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ మానసిక రోగులకు కౌన్సెలింగ్ సెంటర్లు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు రూపొందిం చాలి. దీనివల్ల కొన్ని మరణాలనైనా ఆపవచ్చు. యువకులే ఎక్కువ ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి కాబట్టి.. కళాశాల స్థాయిలో సైలకాలజీని ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెడితే ఉపయోగం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ రకాలివీ.. మేజర్ డిప్రెషన్, క్రానిక్ డిప్రెషన్, బైపోలార్ డిప్రెషన్, సీజనల్ డిప్రెషన్, సైకోటిక్ డిప్రెషన్, పోస్టు పార్టమ్ డిప్రెషన్, సీజన్ డిప్రెషన్,సబ్స్టెన్స్ ఇండ్యూస్డ్ మూడ్ డిసార్డ్ర్ (ఎస్ఐఎండీ), డిప్రెషన్ ముఖ్యమైనవి. వీటితోపాటు డబుల్ డిప్రెషన్, సెకండరీ డిప్రెషన్, ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్, మాస్క్డ్ డిప్రెషన్లు ఉన్నాయి. కుంగుబాటుతోనే ఆత్మహత్యలు ప్రతి లక్ష మందిలో వెయ్యి మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు. కుంగుబాటు కూడా మిగిలిన వ్యాధిలాంటిదే. ఈ వెయ్యి మందిలో వంద మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మెదడులోని న్యూరోట్రాన్స్‌మిట్టర్ తగ్గిపోవడం వల్లనే కుంగుబాటు వ్యాధి వస్తుంది. న్యూరోట్రాన్స్‌మిట్టర్స్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ తాలూకా ఆదేశాలు తగ్గిపోతాయి. దీంతో జీవితం వ్యర్థం అనుకోవడం, ఆత్మన్యూనతా భావం, జీవితం అంతా అంధకారం అనుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మందులు లేకుండానే నివారించవచ్చు. కుంగుబాటుతో బాధపడేవారు తమకు ఉల్లాసాన్నిచ్చే వ్యక్తులు, వాతావరణంలో ఉంటే కొంత మేర ప్రయోజనం ఉంటుంది. –డాక్టర్ ఎన్.ఎన్రాజు, సైకియాట్రిస్ట్ -
మతిస్థిమితం లేని బాలికపై వెకిలిచేష్టలు
రామడుగు(కరీంనగర్): మానవత్వం మరిచిన కొందరు మతిస్థిమితం లేని బాలికపై అసభ్యంగా ప్రవర్తించటంతోపాటు సెల్లో చిత్రీకరించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటలో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ బాలికకు మతిస్థిమితం లేకపోవటంతో వీధుల్లో సంచరిస్తుంది. అదే గ్రామానికి చెందిన మల్లేష్, రాకేష్ అనే యువకులతో పాటు రాజయ్య అనే వారు ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగక ఈ తంతును సెల్ఫోన్లో చిత్రీకరించారు. అది అందరికీ తెలియటంతో బాధితురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు రాజయ్య, రాకేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మల్లేష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తున్నారు!
హోమియో కౌన్సెలింగ్ నా భర్త వయసు 35 ఏళ్లు. ఈమధ్య.. చేసిన పనే మళ్లీ చేస్తున్నారు. చేతులు మళ్లీ మళ్లీ కడుక్కోవడం, రాత్రిపూట గ్యాస్ స్టౌను మళ్లీ మళ్లీ చెక్ చేయడం, స్విచ్‌బోర్డు ఆఫ్ చేశారా లేదా అని చూడటం వంటివి చేస్తున్నారు. హోమియోలో పరిష్కారం ఉందా? - నివేదిత, వరంగల్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ భర్త అబ్బెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) సమస్యతో భాపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక మానసిక రుగ్మత. అనవసరమైన ఆలోచనలు, మానసిక ఒత్తిడి వల్ల ఇది వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 1.2 శాతం మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. దాంతో ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం మంది ప్రభావితమవుతున్నారు. కొంతమందిలో ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయినా ఈ వ్యాధి వస్తుంది. ఓసీడీ వ్యాధి ఉన్నవాళ్లు మాటిమాటికీ వాళ్ల వస్తువులను చెక్ చేసుకోవడం, వాళ్లు చేసే పనిమీద అనుమానంతో మాటిమాటికీ పరీక్షించుకుంటూ ఉండటం మీరు చెప్పినట్లుగా గ్యాస్ స్టౌ ఆపేశారా లేదా అని చూడటం, తాళాలు వేశామా లేదా అని పరిశీలించుకోవడం వంటి పనులు పదే పదే చేస్తుంటారు. చేతులు శుభ్రంగా లేవనే భావనతో మాటిమాటికీ చేతులు కడుక్కుంటూ ఉంటారు. దీనివల్ల మానసికంగానూ, శారీరకంగానూ అలసిపోతూ ఉంటారు. ఏదైనా ఆలోచన వచ్చిందంటే అది పదేపదే వారి మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఏదో జరుగుతోందని మాటిమాటికీ అనుకుంటూ ఉంటారు. కారణాలు : జన్యుకారణాలు, పర్యావరణ పరిస్థితులు మానసిక ఒత్తిడి ఇన్ఫెక్షన్స్ అధికంగా ఆలోచించడం. లక్షణాలు : మాటిమాటికీ డోర్ లాక్ చేశారా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండటం తమ అనుమానాలతో ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టడం చాలాసార్లు అంకెలను లెక్కించడం. చికిత్స : ఓసీడీని హోమియో పద్ధతిలో ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో మూల కారణాన్ని గుర్తించి, దానికి చికిత్స చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ రాకుండా వ్యాధిని నయం చేయవచ్చు. ఓసీడీకి హోమియోలో ఆర్సినికమ్ ఆల్బమ్, అర్జెంటమ్ నైట్రికమ్, నక్స్‌వామికా, మెరిడోనమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో తగిన మోతాదులో వాడితే తప్పక మంచి ఫలితాలు కనిపిస్తాయి. బాబులో తగినంత ఎదుగుదల లేదా? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు 14 నెలలు. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. ఏదైనా ఆసరా తీసుకొని కొద్దిగా నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకటి రెండు శబ్దాలు తప్ప... వాడికి ఇంకా ముద్దుమాటలు రావడం లేదు. వాడి వయసు వారిని చూస్తే వాడి ఎదుగుదలలో ఏవైనా లోపాలున్నాయేమోనని అనిపిస్తోంది. ఇతర పిల్లలను చూసినప్పుడు వాణ్ణి చూస్తే చాలా బాధకలుగుతోంది. పిల్లల వికాసం ఏయే వయసుల్లో ఎలా ఉంటుందో తెలియజేయండి. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - రాజేశ్వరి, నకిరెకల్ మీ బాబు ఎదుగుదల విషయంలో కాస్త నిదానంగా ఉన్నాడంటూ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే... మీరలా అనుకోవడానికి నిర్దిష్టంగా కారణలేమీ కనిపించడం లేదు. ప్రతి పిల్లవాడి ఎదుగుదల, వికాసం వేర్వేరుగా ఉంటుంది. పిల్లల డెవలప్మెంట్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఫలానా పిల్లలు ఫలానా సమయంలోనే ఫలానా నైపుణ్యాలను నేర్చుకుంటారని చెప్పడం కుదరదు. కొంతమంది చాలా త్వరగా నడుస్తారు, మాట్లాడతారు. మరికొందరు కాస్త ఆలస్యంగా. అయితే ఎవరు ఎప్పుడు ఆ నైపుణ్యాలు నేర్చుకుంటారన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... నెలలు నిండకముందే పుట్టడం, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి ఏవైనా సమస్యలు రావడం, పుట్టాక జాండీస్, ఇన్ఫెక్షన్స్ వంటివి రావడం, కొన్ని జన్యుపరమైన కారణాలు, పిలల్లను పెంచే ప్రక్రియలో తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండటం, కవల పిల్లలు కావడం వంటి అనేక అంశాలు వాళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నడక: సాధారణంగా పిల్లలు 11 నుంచి 16 నెలల మధ్య నడవడం ప్రారంభిస్తారు. కొందరు ఆలస్యంగా నడవడం మొదలుపెట్టవచ్చు. 18 నెలల పిల్లలు నడవడంతో పాటు ఏదైనా వస్తువులు పట్టుకుని లాగడం, వస్తువులను దూరంగా నెట్టడం, బుక్ చేతికి ఇచ్చినప్పుడు పేజీలు తిప్పడం, క్రేయాన్స్ వంటివి ఇస్తే వాటితో నేలమీద, గోడలపై రాయడం, నేల మీదే దృష్టిపెట్టి పరుగెత్తడం వంటివి సులభంగా చేస్తుంటారు. రెండేళ్లు వచ్చే సరికి తలుపులు తెరవడం, సొరుగులు లాగడం, చేతులు కడుక్కోవడం, మెట్లు ఎక్కడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ పనులు చేయడంలోనూ పిల్లవాడికీ, పిల్లవాడికీ మధ్య తేడాలుంటాయి. మాటలు: ఇక మాటల విషయానికి వస్తే 15 నెలలు నిండిన చిన్నారులు ముద్దుమాటలతో పాటు, ఒకటి రెండు నిజశబ్దాలు పలకడం చేస్తుంటారు. 18 నుంచి 24 నెలల వయసుకు వాళ్లు 15-20 పదాలు పలకడంతోపాటు తల్లిదండ్రుల సూచనలకు రెస్పాండ్ అవుతుంటారు. 18-20 నెలల వయసు వచ్చేటప్పటికి కొద్దిగా కూడా మాటలు రాకపోతే, చుట్టుపక్కల శబ్దాలకు ఏమాత్రం రెస్పాండ్ కాకపోతే... అప్పుడు అలాంటి పిల్లలకు డెవలప్మెంట్ డిలే ఉన్నట్లుగా పరిగణిస్తాం. అలాంటి పిల్లల్లో వినికిడి లోపాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక మీ బాబు విషయానికి వస్తే... అతడు కొన్ని శబ్దాలను పలకడం, కొన్ని వస్తువుల ఆసరాతో నిలబడటం వంటివి చేస్తున్నాడు. ఇతరత్రా సమస్యలేమీ లేవు. డెవలప్మెంట్ డిలేని సూచించే లక్షణాలేమీ కనిపించడం లేదు. అయితే ఇలా డెవలప్మెంట్ డిలే ఉన్నట్లు అనుమానించే పిల్లల విషయంలో క్రమం తప్పకుండా ఫాలో అప్స్‌తో పాటు క్లోజ్ అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. ఒకవేళ నిజంగానే గ్రాస్ డెవలప్మెంట్ డిలే ఉంటే త్వరగా కనుక్కుని అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవడం (అర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్) ద్వారా వాళ్లను సరిచేయడానికి అవకాశం ఉంది. మీరు మీ పీడియాట్రీషియన్ ఆధ్వర్యంలో మీ బాబుకు ఫాలోఅప్స్ చేయించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
అడుగడుగునా అమానుషాలే!
పేగు బంధాన్నీ మర్చిపోతున్న కిరాతకులు కన్న బిడ్డలపైనా కత్తికడుతున్న వైనం ‘‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు... మచ్చుకైనా లేడు చూడు మనసున్న వాడు... అనుబంధ ఆత్మీయత అంతా ఒక బూటకం... ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం...’’ ఏనాడో కవుల కలాల నుంచి జాలువారిన ఈ పాటలు ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చినిజాలవుతున్నాయి. పేగుబంధాన్ని సైతం మర్చిపోతున్న కిరాతకులు కన్న, కడుపున పుట్టిన వారినీ అంతం చేస్తున్నారు. ఈ ఘాతుకాల వెనుక అనేక కారణాలు ఉంటున్నా... ప్రధానంగా మానసిక రుగ్మతలు, పరిపక్వత లేని ఆలోచనలతో పాటు ఆర్థికాంశాలు, క్షణికావేశాలే కారణం. తాజాగా నేరేడ్మెట్ పరిధిలో నివసించే పూర్ణిమ 23 రోజుల వయస్సున్న కన్న బిడ్డను హతమార్చడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ధోరణి పెరగడానికి యాంటీ సోషల్ పర్సనాలిటీ, కొన్ని రకాలైన డిజార్డర్స్ కారణమని మానసిక నిపుణులు చెప్తుండగా... చట్టమంటే భయం... వ్యవస్థ పట్ల గౌరవం లేకపోవడమే కారణమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -సాక్షి, సిటీబ్యూరో ఆర్థిక కారణాలే అధికం... హార్థిక సంబంధాలను మర్చిపోయి తన వారినే పగవారుగా చూసే ధోరణికి ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాలే కారణమవుతున్నాయి. ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదాలు, ఉమ్మడి వ్యాపారంలో వచ్చిన స్పర్థలు సొంత వారి మధ్యే చిచ్చుపెడుతన్నాయి. దీనికి ఈర్ష్యాద్వేషాలు తోడు కావడంతో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆనంద్‌నగర్ కాలనీలో సొంత అన్నను చంపించిన తమ్ముడు, పంజగుట్ట పరిధిలో చోటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ‘సిసోడియాల’ కేసు ఈ కోవలోకే వస్తాయి. కొన్ని సందర్భాల్లో నమ్మకమే పెట్టుబడిగా విదేశాల్లో ఉన్న బంధువుల సొమ్ముకాజేస్తున్న దగాకోరులు లెక్కలు చెప్పాల్సి వచ్చేసరికి కర్కశంగా మారిపోతున్నారు. సికింద్రాబాద్‌లోని ఆర్ఏకే లాడ్జ్‌లో జరిగిన ఎన్ఆర్ఐ కుటుంబం దారుణ హత్య ఇలాంటి కారణాల నేపథ్యంలోనే జరిగింది. కేవలం హత్యలే కాకుండా అనేక కిడ్నాప్‌లు, దాడులు సైతం నిత్యం నగరంలో వెలుగులోకి వస్తూనే ఉంటున్నాయి. చనిపోతూ చంపేస్తున్నారు... తల్లిదండ్రులు చేసిన అనాలోచిత నిర్ణయా లు, ఆర్థిక లావాదేవీలు సైతం పసిబిడ్డల పాలిటి శాపంగా మారుతున్నాయి. వ్యక్తిగత, వ్యాపార కారణాలతో చేస్తున్న అప్పులు తీరే మార్గం లేక... తట్టుకుని నిలబడి, ప్రత్యామ్నాయ మార్గాల్లో సంపాందిచే మానసిక స్థైర్యం లేని వారు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారు. తమతో పాటే తమ వారసులూ ‘రావాలన్న’ ఉద్దేశంతోనో, తామే లేకపోతే తమ వారిని ఎవరు చూస్తారనే భయంతోనే ఆత్మహత్యకు ముందు కడుపున పుట్టిన వారినీ కడతేర్చేస్తున్నారు. హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించిన భార్యాభర్తలు బాలరాజ్, సురేఖ ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. చనిపోయే ముందు 13 నెలల వయస్సున్న కవలలు మేథ, మేఘనల ఉసురుతీశారు. బోరబండ వినాయక్‌నగర్‌కు చెందిన సరిత సైతం ఆత్మహత్య చేసుకుంటూ కడుపున పుట్టిన మూడేళ్ల ప్రత్యుష, తొమ్మిది నెలల శరణ్యలను చంపేసింది. మానసిక రుగ్మతలతో మరో ప్రమాదం... పేగుబంధాలను నిర్ధాక్షణ్యంగా తెంపేస్తున్న ఉదంతాల్లో ఈ ఘాతుకానికి ఒడిగడుతున్న వారి మానసిక రుగ్మతలు మరో ప్రధాన కారణంగా ఉంటున్నాయి. తాము ఊహించుకున్న, భావించిన అంశాలనే నిజాలుగా నమ్ముతూ కన్న వారి ఉసురుతీస్తున్నారు. ఆనక పోలీసుల విచారణలో ఘాతుకానికి ఒడిగట్టిన వారి అనుమానాలు వాస్తవాలు కాదని తేలుతున్నా... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలో నివసించే పద్మ మానసిక స్థితి సరిగ్గా లేనికారణంగా కడుపున పుట్టిన అక్షర, సహస్రల్ని సంపులో పడేసి అంతం చేసింది. ఈ ఘటనతో ఆ కుటుంబం మొత్తం తీవ్రమైన షాక్‌లోకి వెళ్లిపోయింది. ఈస్ట్‌మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీలో నివసించే రజని అకారణంగా తన భర్తనే ‘అనుమానించింది’. కుమార్తెలు తివిష్క, అశ్వికల్ని గొంతుకోసి చంపేసింది. ఇంతటి ఘోరం చేసిన తర్వాత కూడా పోలీసుల ఎదుట బిడ్డలకు ‘విముక్తి’ కల్పించానంటూ చెప్పుకొచ్చింది. ఈ తరహా ఉదంతాల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా నిందితులుగా మారుతున్నారని పోలీసులు చెప్తున్నారు. కనిపించని కిరాతకులెందరో... ఇవన్నీ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరో సమాజానికి తెలిసే ఉదంతాలు. అలాకాకుండా చేయాల్సిన ‘పని’ చేసేసి... సమాజం దృష్టిలో మాత్రం గుట్టుగా బతికేస్తున్నా వారూ ఎందరో ఉంటున్నారు. లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో ఓ ఆడశిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవపంచనామా నేపథ్యంలోనే ఆ శిశువుకు ఉరివేసి, గుండెపై ఏదో వస్తువుతో బాది చంపేసినట్లు తేలింది. ఇలాంటి మృతదేహాలు నిత్యం నగరంలో ఏదో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. వీటిలోనూ కొన్ని కన్నవారు చేసినవే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారెవరో గుర్తించడం సాధ్యం కాక మిన్నకుండిపోవాల్సి వస్తోందంటున్నారు. యాంటీ సోషల్ పర్సనాలిటీయే కారణం ఈ తరహా విపరీత ధోరణులకు మనుషుల్లో పెరుగుతున్న యాంటీ సోషల్ పర్సనాలిటీ ప్రధాన కారణం. మరికొందరిలో ఉంటున్న మానసిక రుగ్మతలు (డిజార్డర్స్) సరైన సమయానికి గుర్తించలేకపోవడం, గుర్తించినా అవసరమైన స్థాయిలో వైద్యం, శ్రద్ధ తీసుకోని కారణంగా విపరీత చర్యలు జరుగుతున్నాయి. మీడియా, సినిమాల ప్రభావంతోనూ కొందరు స్త్రీలు పేగుబంధాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. - డాక్టర్ రాజశేఖర్, మానసిక నిపుణులు -
దొంగతనాలు చేయించే జబ్బు...
మెడి క్షనరీ ఇదో విచిత్రమైన జబ్బు. ఈ మానసిక రుగ్మత ఉన్నవారికి ఒక వింతైన కోరిక పుడుతుంది. అదే దొంగతనం చేయడం. దీన్ని వైద్యపరిభాషలో క్లెప్టోమానియా అంటారు. ఆధునిక వైద్యశాస్త్ర నిపుణులు1816లో ఈ జబ్బును మొదటిసారి నమోదు చేశారు. ఈ జబ్బు ఉన్నవాళ్లు ఎంత అణచుకుందామనుకున్నా తమ నియంత్రణలో లేకుండా చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటారు. తాము కొనగలిగే వస్తువులను సైతం ఇలా తస్కరిస్తుంటారు. అందునా చిత్రవిచిత్రమైన కారణాలతో ఆ పనికి పాల్పడుతుంటారు. కొందరు ఆనందం కోసం, మరికొందరు సరదాకోసం, ఇంకొందరు తమ యాంగ్జైటీ, భయం, ఆందోళన వంటి ఫీలింగ్స్ ఆపుకోలేక ఈ దొంగతనాలకు ఒడిగడుతుంటారు. ఇలాంటి చర్యలు ఒక్కోసారి మనకు ప్రియమైన వారితో పాటు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మన సన్నిహితుల్లో ఎవరికైనా ఇలాంటి రుగ్మత ఉందని తెలిస్తే ఆలస్యం చేయకుండా వారిని ఒకసారి మానసిక నిపుణులకు చూపించడం మేలు. -
మతిస్థిమితం తప్పి భార్యను నరికేశాడు..
కోడేరు (మహబూబ్‌నగర్) : మతిస్థిమితం కోల్పోయి ఓ వ్యక్తి భార్యను నరికి చంపాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఎత్తం గ్రామానికి చెందిన బాలస్వామి (50) కొన్నాళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. శుక్రవారం ఉదయం భార్య చంద్రమ్మతోపాటు సింగవట్నం సంగమేశ్వర గ్రామీణ బ్యాంకుకు వెళ్లి రూ.40వేలు పంట రుణం తీసుకొచ్చాడు. రాత్రి పడుకునే సమయంలో కూడా బాగానే ఉన్నాడు. అయితే అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్య చంద్రమ్మ(46)ను గొడ్డలితో తలనరికి చంపాడు. తలలో మెదడు తీసుకుని శనివారం ఉదయమే ఇంటి ముందు కూర్చుని తాను పొట్టేలును కోసి కుప్పలు వేశానని చుట్టుపక్కల వారికి చూపించాడు. దీంతో గ్రామస్తులు ఇంట్లోకి వెళ్లి చూడగా దారుణం వెలుగుచూసింది. దీనిపై గ్రామస్తులు కోడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలస్వామిని అదుపులోకి తీసుకున్నారు. -
సెల్ఫీలు రోజుకు ఎన్ని తీస్తారో తెలుసా?
న్యూఢిల్లీ : కొందరు దీన్ని పిచ్చి అనుకోవచ్చు.. మరికొందరు ఇది వ్యసనం అని అంటారు. ఏదేమైతేనేం యువత సాధారణంగా రోజుకు 14 సెల్ఫీలు క్లిక్ అనిపిస్తుంటారట. సెల్ఫీలు తీసుకునే వారిలో ఈ వయసు వాళ్లదే అగ్రస్థానం. ప్రపంచ వ్యాప్తంగా జరిపిన ఓ సర్వేలో ఇదే విషయాన్ని ఇటీవలే వెల్లడించారు. రోజులో సుమారు 11 గంటలకు పైగా మొబైల్ వినియోగిస్తున్న వారు దాదాపు 14 సెల్ఫీలు, 16 ఫొటోలు లేదా కొన్ని వీడియోలు తీసుకుంటారని గూగుల్ సంస్థ నిర్వహించిన సర్వే ఈ విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియా వెబ్సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర ఖాతాలను 21 సార్లు ఓపెన్ చేస్తుంటారని, 25 టెక్ట్స్ మెస్సెజ్ లు పంపుతారని పరిశోధనలో తేలింది. ఇదిలాఉండగా, నడి వయస్కులు, అంతకంటే పెద్ద వయుసున్న వారు మాత్రం రోజుకు 4 ఫొటోలు, ఓ వీడియో, 2.4 సెల్ఫీలు తీసుకుంటారట. టీనేజీ వాళ్లయితే 6.9 ఫొటోలు, ఓ వీడియో, 4.7 సెల్ఫీలు తీస్తారు. ఈ నేపథ్యంలో గూగుల్ ఓ ఫొటో యాప్ విడుదల చేసింది. మరీ అధికంగా సెల్ఫీలు తీసుకోవడం ఓ మానసిక రుగ్మతగానే భావించాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కిమ్ కర్దాషియన్ సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఓ ఏనుగు దాడికి గురైన విషయం విదితమే. కానీ సెల్ఫీలు వినూత్నంగా తీసుకోవడానికి యత్నించి చాలా మంది ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. -
లేడీ హంటర్ అలెక్స్ అరెస్ట్
*అమ్మాయిలను మోసగిస్తున్న ఎలెక్స్ జీవితంలో ఆసక్తి కోణాలు *బాధితురాలే పట్టించిన వైనం ఎట్టకేలకు కటకటాలపాలు పెదవాల్తేరు: యువతులపై వ్యామోహం అతనికి మానసిక రుగ్మతగా మారిపోయింది. తనకు తానే హీరో అని భ్రమల్లో విహరించాడు. సమాజం, పరువుతో పనిలేదనుకున్నాడు. అమ్మాయిల ఆకర్షణలో విచక్షణ జ్ఞానం విడిచిపెట్టాడు. ఇలాంటి మానసిక స్థితే అలెక్స్ బెనర్ట్ను లేడి హంటర్‌గా మార్చింది. బుధవారం రాత్రి ఇతడు ఎంవీపీ కాలనీలో యువతులను వేధిస్తూ వెంటపడి పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అలెక్స్ అమ్మాయిల వెంటపడి వేధించడం ఒక హాబీగా మార్చుకున్నాడు. రెండేళ్లుగా ఎంవీపీకాలనీ, సీతమ్మధార ఇలా పలు ప్రాంతాల్లో యువతులను వేధించిన అతడు చివరకు ఓ బాధితురాలి వలలో పడి అరెస్టయ్యాడు. కోర్టు గురువారం అలెక్స్ కు పధ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. స్థిరపడిన కటుంబం: అలెక్స్ నగరంలో స్థిరపడిన కుటుంబం. అలెక్స్ తండ్రి నేవల్ ఉద్యోగి. కేర నుంచి ఇరవై ఏళ్ల కిందట బదిలీపై నగరానికి వచ్చిన వీరి కుటుంబం గాజువాకలో సొంత ఇల్లు కొనుగోలు చేసి నివాసం ఉంటోంది. అలెక్స్ ఇంటీరియల్ డిజైనర్‌గా పని చేస్తూ ఫిట్నెస్ ట్రేనింగ్ సెంటర్ నడిపిస్తూ బీచ్‌రోడ్డులోని బీచ్ వ్యూ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. అతనికి భార్య ఉంది. కుమారుడు చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, కుమార్తె ఉన్నత విద్య చదువుతోంది. ఏభై ఏళ్ల అలెక్స్‌కు కొన్నేళ్లుగా కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. తనపై యువతులు మోజు పడతారని వెంటపడడం మొదలెట్టాడు. రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా నడిచి వెళ్తున్న అమ్మాయిలే టార్గెట్‌గా చేసుకునేవాడు. రోడ్డు మీద నడిచివెళ్తున్న యువతి ముందు అలెక్స్ కారు నిలిపేవాడు. ఏదో ఒక పేరు చెప్పి చిరునామా అడిగేవాడు. పెద్దవాడే కదా అని వారు గౌరవంతో మాట్లాడేసరికి ఇదే అనువుగా మాటలు కలిపేవాడు. అందంగా ఉన్నావు. స్నేహం చేస్తావా అని అడిగేవాడు. ఆ తర్వాత అమ్మాయిలను ముగ్గులోకి దించి వారికి తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్‌మేల్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. కెన్ఫౌండేషన్ ట్రాప్: అలెక్స్ బారిన పడిన చాలామంది యువతులు... కెన్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపి వాపోయారు. ఈ ఫౌండేషన్‌లో ఆరుగురు వాలంటీర్లుగా పని చేస్తున్నారు. వీరిలో నలుగురు యువతులున్నారు. ఇతడి మోసపు నైజాన్ని పసిగట్టిన వీరు రెండు నెలలుగా వేచి చూశారు. గతంలో ఒక పర్యాయం త్రుటిలో తప్పించుకున్నాడు. చివరకు బుధవారం బాధిత యువతి చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుని ఫౌండేషనుకు తెలిపింది. వారి సహాయంతో అలెక్స్‌ను పోలీసులకు పట్టించారు.