మనుబోలు: ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడు చనిపోయాడు అనుకుని గుర్తు తెలియని మృతదేహానికి కుటుంబీకులు అంత్యక్రియలు చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడిలో జరిగింది. వడ్లపూడి సర్పంచ్ పాలేటి రమాదేవికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సతీష్ (25) ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇతనికి మానసికపరమైన సమస్యలు ఉన్నాయి. నాలుగు రోజుల కిందట సతీష్ ఇంట్లో అలిగి బైక్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు.
కుటుంబసభ్యులు సతీష్ ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం మనుబోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతలో శనివారం వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో గుర్తుపట్టలేని విధంగా ఉన్న యువకుడి మృతదేహం బయటపడింది. ఎత్తు, బరువు సతీష్ లాగే ఉండడంతో అతనేనని భావించిన కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని వడ్లపూడికి తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. చిన్న కర్మ జరుపుతుండగా సతీష్ ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూసి అందరూ షాకయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment