మతిస్థిమితం లేని బాలికపై వెకిలిచేష్టలు
మతిస్థిమితం లేని బాలికపై వెకిలిచేష్టలు
Published Sat, Jan 7 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
రామడుగు(కరీంనగర్): మానవత్వం మరిచిన కొందరు మతిస్థిమితం లేని బాలికపై అసభ్యంగా ప్రవర్తించటంతోపాటు సెల్‌లో చిత్రీకరించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేటలో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ బాలికకు మతిస్థిమితం లేకపోవటంతో వీధుల్లో సంచరిస్తుంది. అదే గ్రామానికి చెందిన మల్లేష్, రాకేష్ అనే యువకులతో పాటు రాజయ్య అనే వారు ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారు.
అంతటితో ఆగక ఈ తంతును సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అది అందరికీ తెలియటంతో బాధితురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు రాజయ్య, రాకేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మల్లేష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement