జయించు జీవించు
►ప్రపంచ జనాభాలో 4.4 శాతం ( 32.20 కోట్ల మంది) మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు.
►ఇండియాలో 5.20 కోట్ల మంది కుంగుబాటు రుగ్మతతో బాధపడుతున్నారు.
మనసు లేని బతుకొక నరకం.. మరువలేని మనసొక నరకం అన్నట్లు శరీరానికి తలనొప్పి, కడుపునొప్పి వచ్చినట్లే.. మనసుకూ బాధ కలిగితేమహాపరాధమేమీ కాదు. దాన్ని దాచి పెట్టుకుని.. మరింత పెంచుకుని బలైపోవడం కంటే బయటపడి కుంగుబాటును జయించి జీవించడం మంచిది. అందుకు విశ్వాసపాత్రులు, విజ్ఞానవంతులు, అనుభవజ్ఞులు సాయం పొందవచ్చు. మనిషిలో ఉన్న శతకోటి కోరికలు, బలహీనతల కారణంగా ఒక్కొక్కప్పుడు ప్రతి మనిషిలోనూ అసాధారణ ప్రవర్తన, సాధారణ ప్రవర్తనకు భిన్నమైన ప్రవర్తనా శైలి చోటు చేసుకుంటుంది. ఇది నిస్సందేహంగా కుంగుబాటే. ఇది తాత్కాలికం కావచ్చు.. కొంతకాలం ఉండొచ్చు. ఈ మానసిక రుగ్మతకు కూడా ఆస్పత్రులు ఉన్నాయి. చికిత్స పొందవచ్చు. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్యదినోత్సవం. ఈ ఏడాది ఆరోగ్యదినోత్సవం సందర్భంగా తీసుకున్న థీమ్ డిప్రెషన్. దీన్నే కుంగుబాటు అంటారు. దీనిపై ప్రత్యేక కథనం.
1 పరీక్షలో ఉత్తీర్ణతసాధించలేకపోయాననే మనస్తాపంతో మదనపల్లెలో మార్చి 30న గణేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
2 కుటుంబ కలహాలతో చంద్రగిరి నరసింగాపురానికి చెందిన బాలాజీ మార్చి 28న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీ వయసు కేవలం 33 సంవత్సరాలు. అతడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది.
3 నాగలాపురం మండలం టీపీ పాళేనికి చెందిన సెల్వీ ముగ్గురు కుమారులతో సహా మార్చి 22న ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారు ఆమెను వేధింపులకు గురిచేయడంతోనే అఘాయిత్యానికి పాల్పడింది.
చిత్తూరు, సాక్షి: పరీక్ష పాస్ కాలేదని ఒక రు, పాసైనా తక్కువ మార్కులొచ్చాయని ఇంకొకరు. వచ్చినా కోరుకున్న కాలేజీలో సీటు రాలేదని మరొ కరు.. క్యాంపస్ సెలెక్షన్లలో ఉద్యోగం రాలేదని.. ప్రేమ విఫలమైందని.. సఫలమైనా పెళ్లి వరకు వెళ్లలేదని .. అప్పుల బాధతో.. భర్త పుట్టింటికి పంలేదని.. పెంపుడు కుక్క కనిపించలేద ని .. ఇంట్లో చెల్లి రిమోట్ ఇవ్వలేదని.. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ.. చాలా సందర్భల్లో çకుంగు బాటుకు గురై చావులోనే పరిష్కారం వెదుక్కుంటున్నారు.
కుంగుబాటుతోనే అధికశాతం ఆత్మహత్యలు
ఆత్మహత్యలు ఎక్కువగా కుంగుబాటుతోనే జరుగుతున్నాయి. ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన మార్పులతో ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకోడానికి కూడా సమయం దొరకడం లేదు. దీంతో ఏదైనా అనుకోని ఆప ద ఎదురైనా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మానసికంగా మళ్లీ మామూలు మనిషిని చేయడానికి స్నేహితులు కూడా వారివారి పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఎవరికి చెప్పుకోవాలో తెలీక చాలా మంది సతమతం అవుతుం టారు. కొన్నిసార్లు పెద్ద సమస్య లేకపోయినా కుంగుబాటుకు లోనవుతున్నారు. ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతుండటం వల్ల ఆత్మహత్యలకు కారణం అవుతోంది.
క్షణికావేశంలో చేసే పొరపాటు వల్ల కలిగే నష్టాలు..
క్షణికావేశంలో చేసే పొరపాటు వల్ల కలిగే నష్టాలు అపారం. వీరిపై ఆధారపడి ఉన్న జీవితాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. వృద్ధులు, మహిళలు, పిల్లలు, దిక్కుమొక్కులేని జీవితాన్ని వెళ్లదీస్తారు. కుటుం బాలు వీధిన పడతాయి. ఆర్థికంగా చితికిపోతాయి. తల్లిదండ్రులకు గుండెలు పగిలినంత శోకం ఎప్పటికీ ఉంటుంది.
కుంగుబాటు అంటే..
నిరంతరం బాధ, ఆందోళన, ఎప్పుడూ నిరాశలోనే కూరుకుపోవడం, జీవితం నిస్సారం అనిపించడం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చికాకు, కుదురుగా ఉండకపోవడం గతంలో ఆనందంగా అనిపించిన విషయాలే ఇప్పుడు నిరాసక్తంగా అనిపించడం నలుగురిలో కలవలేకపోవడం వంటి వి కుంగుబాటు లక్షణాలు.
పోషకాహారలేమి..
డిప్రెషన్ రావడానికి కారణం పోషకాహారలేమి అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక పో షకం కంటే ఎక్కువ పోషకాల లోపం కారణంగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒమేగా 3, ఒమేగా 6 ఫాటీ ఆసిడ్ లోపం కార ణంగా డిప్రెషన్ కలుగుతుంది. మెదడు పనితీరు, మానసిక ఆరోగ్యానికి ఈ ఆసిడ్లు చాలా అవస రం. అలాగే అమైనో ఆసిడ్ల లోపం కూడా మరో కారణం. మెదడు కీలకమైన విధులకు అమైనో ఆసిడ్లు చాలా అవసరం రోజు వారీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి. విటమిన్–బి లోపం తో డిప్రెషన్ కలుగుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
309 సెక్షన్ తొలగింపు..
భారతీయ శిక్షాస్మృతి 309 ప్రకారం ఆత్మహత్య చేసుకో వడం నేరం. ఈ సెక్షన్ ప్రకారం ఆత్మహత్యకు పాల్పడి బతికినవారికి జైలు శిక్ష విధిస్తారు. దీన్ని తొలగించాలని 1971 నుంచే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బతకడంతో పాటు చావడంలోనూ విఫలమై తీవ్రంగా కుమిలి పోతున్న బాధితులపై నేరం మోపి శిక్షించడం అమానుషమని న్యాయ సంఘం సూచనలు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ సంఘం సూచనల మేరకు ఇలాంటి కేసులను తీవ్ర మానసిక ఒత్తిడి పేరుతో నమోదు చేసుకుని మానసిక వైద్య నిపుణులతో చికిత్సలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం చేయాల్సింది ఇదీ..
కుంగుబాటు, ఆత్మహత్యలపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ మానసిక రోగులకు కౌన్సెలింగ్ సెంటర్లు, హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు రూపొందిం చాలి. దీనివల్ల కొన్ని మరణాలనైనా ఆపవచ్చు. యువకులే ఎక్కువ ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి కాబట్టి.. కళాశాల స్థాయిలో సైలకాలజీని ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెడితే ఉపయోగం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
డిప్రెషన్ రకాలివీ..
మేజర్ డిప్రెషన్, క్రానిక్ డిప్రెషన్, బైపోలార్ డిప్రెషన్, సీజనల్ డిప్రెషన్, సైకోటిక్ డిప్రెషన్, పోస్టు పార్టమ్ డిప్రెషన్, సీజన్ డిప్రెషన్,సబ్‌స్టెన్స్ ఇండ్యూస్‌డ్ మూడ్ డిసార్డ్‌ర్ (ఎస్‌ఐఎండీ), డిప్రెషన్ ముఖ్యమైనవి. వీటితోపాటు డబుల్ డిప్రెషన్, సెకండరీ డిప్రెషన్, ట్రీట్‌మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్, మాస్క్‌డ్ డిప్రెషన్‌లు ఉన్నాయి.
కుంగుబాటుతోనే ఆత్మహత్యలు
ప్రతి లక్ష మందిలో వెయ్యి మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు. కుంగుబాటు కూడా మిగిలిన వ్యాధిలాంటిదే. ఈ వెయ్యి మందిలో వంద మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మెదడులోని న్యూరోట్రాన్స్‌మిట్టర్ తగ్గిపోవడం వల్లనే కుంగుబాటు వ్యాధి వస్తుంది. న్యూరోట్రాన్స్‌మిట్టర్స్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ తాలూకా ఆదేశాలు తగ్గిపోతాయి. దీంతో జీవితం వ్యర్థం అనుకోవడం, ఆత్మన్యూనతా భావం, జీవితం అంతా అంధకారం అనుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మందులు లేకుండానే నివారించవచ్చు. కుంగుబాటుతో బాధపడేవారు తమకు ఉల్లాసాన్నిచ్చే వ్యక్తులు, వాతావరణంలో ఉంటే కొంత మేర ప్రయోజనం ఉంటుంది. –డాక్టర్ ఎన్.ఎన్‌రాజు, సైకియాట్రిస్ట్