
సాక్షి, నిర్మల్: జిల్లాలోని కడెం మండలం కింగాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు లక్కవత్తుల రాజు అనే వ్యక్తిని తాళ్లతో కట్టేసి రోడ్డుపై పడేశారు. సర్పంచ్ తనయుడు నిందితున్ని కర్రతో చితకబాదాడు. అయితే, తన కొడుకుకు మతి స్థిమితం లేదని, అతన్ని విడిచిపెట్టాలని రాజు తల్లి కాళ్లావేళ్లా పడినా లాభం లేకపోయింది. స్థానికులు, సర్పంచ్ తనయుడు ఆమె మాట వినకుండా రాజుపై మరోసారి దాడి చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment