సాక్షి ,హైదరాబాద్(రాజేంద్రనగర్): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని వాట్సాప్ ద్వారా చాటింగ్ చేశాడు. ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళదామని చెప్పి స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరు గంటల పాటు నరకయాతన అనుభవించిన సదరు యువతి 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో సెల్ సిగ్నల్ ద్వారా రాజేంద్రనగర్ పోలీసులు ఆమెను కాపాడారు. నిందితుడిని అదుపులోకి తీసుకునిని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇన్‌స్పెక్టర్ కనకయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సులేమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన సాజిత్(27) జూలాయిగా తిరిగేవాడు. రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోష్‌నగర్‌కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. వాట్సాప్ నంబర్ సేకరించి చాటింగ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళదామని చెప్పడంతో ఆమె అతడిని కలిసేందుకు వచ్చింది. అనంతరం ఆమె సులేమాన్‌నగర్‌లోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటమేగాక హింసించాడు.
ఆరు గంటల పాటు అతడి చెరలో ఉన్న బాధితురాలు సెల్‌ఫోన్ ద్వారా 100 నంబర్‌కు ఫోన్ చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇన్‌స్పెక్టర్ కనకయ్య ఆధ్వర్యంలో యువతిని బంధించిన ఇంటిపై దాడి చేసి సాజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: మామూలు‘లేడీ’ కాదు.. ఎస్‌ఐనంటూ నమ్మించి.. ఏకంగా లక్షల్లో మోసం)
Comments
Please login to add a commentAdd a comment