![TDP Social Media Village Coordinator Ashok Attempt Molestation on girl - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/28/tdp.jpg.webp?itok=jkTZiUm9)
దాచేపల్లి: తొమ్మిదేళ్ల బాలికపై టీడీపీ సోషల్ మీడియా గ్రామ కో–ఆర్డినేటర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి బాలికను ఓ ఇంట్లోకి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తమ పాఠశాలలో తెలియజేసిన ‘బ్యాడ్ టచ్’ను గుర్తించిన బాలిక కేకలు వేయడంతో దుండగుడు పారిపోయాడు.
ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. బాలిక తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేసానుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రెండో తరగతి బాలిక రాత్రి ఎనిమిది గంటల సమయంలో తన తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది.
ఆ బాలిక వద్దకు టీడీపీ సోషల్ మీడియా గ్రామ కో–ఆర్డినేటర్ వినుకొండ అశోక్‌బాబు(23) వచ్చి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి సమీపంలోని ఓ ఇంట్లోకి తీసుకువెళ్లాడు. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికదాడికి ప్రయత్నించడంతో ఆ చిన్నారి కేకలు వేసింది. దీంతో అశోక్‌బాబు పారిపోయాడు.
వెంటనే ఈ ఘటన గురించి బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. మంగళవారం ఉదయం బాధిత బాలికను తీసుకుని ఆమె తల్లిదండ్రులు, బంధువులు వెళ్లి అశోక్‌బాబు, అతని తల్లిదండ్రులను ప్రశ్నించగా, వారు గొడవకు దిగారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు సీఐ బిలాలుద్దీన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వివరాలు సేకరించిన పోలీసులు... పోక్సో చట్టం కింద అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌బాబు టీడీపీ సోషల్ మీడియా గ్రామ కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తూ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుడినని చెప్పుకుంటూ ఆ పార్టీకి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.
బాలికను కాపాడిన గుడ్ టచ్.. బ్యాడ్ టచ్
మహిళలు, బాలికల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘దిశ’తోపాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహిళలు, బాలికలపై లైంగిక దాడుల నివారణ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు.
ఈ క్రమంలో కేసానుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న సదరు బాలికకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగింది. నిందితుడు అశోక్‌బాబు తనను బ్యాడ్ టచ్ చేస్తున్నట్లు బాలిక గమనించి కేకలు వేసింది. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసులు ఆ చిన్నారిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment