గ్యాస్‌ కట్టేసి... మళ్లీ మళ్లీ చూస్తున్నారు! | Homoeo counseling | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కట్టేసి... మళ్లీ మళ్లీ చూస్తున్నారు!

Published Wed, Jun 7 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

Homoeo counseling

హోమియో కౌన్సెలింగ్‌

నా భర్తకు 35 ఏళ్లు. ఆయన ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రిపూట గ్యాస్‌ ఆపేశామా లేదా అని మళ్లీ మళ్లీ చెక్‌ చేయడం, తలుపులు వేసిన వాటినే మళ్లీ మళ్లీ వెళ్లి చూడడం వంటివి. ఆయన సమస్య ఏమిటి? – నివేదిత, తాడేపల్లిగూడెం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ భర్త అబ్బెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ)  తో బాధడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక మానసిక రుగ్మత. అనవసరమైన ఆలోచనలు, మానసిక ఒత్తిడి వల్ల ఇది వస్తుంది. కొంతమందిలో ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయినా ఈ వ్యాధి వస్తుంది.
ఓసీడీ వ్యాధి ఉన్నవాళ్లు మాటిమాటికీ వాళ్ల వస్తువులను చెక్‌ చేసుకోవడం, వాళ్లు చేసే పనిమీద అనుమానంతో పరీక్షించుకుంటూ ఉండటం, మీరు చెప్పినట్లుగా గ్యాస్‌ స్టౌ ఆపేశారా లేదా అని చూడటం, తాళాలు వేశామా లేదా అని పదే పదే చెక్‌ చేయడం వంటివి అన్నమాట. చేతులు మాటిమాటికీ కడుక్కుంటూ ఉంటారు. దాంతో మానసికంగానూ, శారీరకంగానూ అలసిపోతూ ఉంటారు. ఏదైనా ఆలోచన వచ్చిందంటే అదే రిపీటవుతూ వారి మనసును తొలిచేస్తూ ఉంటుంది.

కారణాలు: ∙జన్యుకారణాలు, పర్యావరణ పరిస్థితులు ∙మానసిక ఒత్తిడి ∙ఇన్ఫెక్షన్స్‌ ∙అధికంగా ఆలోచించడం.

లక్షణాలు: పదే పదే లాక్‌ చెక్‌ చేయడం ∙ అంకెలను మళ్లీ మళ్లీ లెక్కించడం.

చికిత్స: ఓసీడీని హోమియో పద్ధతిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో మూల కారణాన్ని గుర్తించి, దానికి చికిత్స చేయడం వల్ల  ఎలాంటి ఇబ్బందులూ రాకుండా వ్యాధిని నయం చేయవచ్చు. ఓసీడీకి హోమియోలో ఆర్సినికమ్‌ ఆల్బమ్, అర్జెంటమ్‌ నైట్రికమ్, నక్స్‌వామికా, మెరిడోనమ్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో తగిన మోతాదులో వాడితే తప్పక మంచి ఫలితాలు కనిపిస్తాయి.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి హైదరాబాద్‌


మైగ్రేన్‌ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్‌

నా ఫ్రెండ్‌కి 28 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించింది. మైగ్రేన్‌ అన్నారు. మందులతో తగ్గుతుందన్నారు. అయితే అది మాటిమాటికీ తిరగబెట్టే సమస్య అని తెలిసింది. అలా జరగకుండా ఆమె సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా?
– సుమతి, అమలాపురం

మైగ్రేన్‌ అనేది మెదడులో ఉండే రక్తనాళాలకు సంబంధించిన సమస్య. మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల పరిమాణం వ్యాకోచించడం వల్ల నరాలపై ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆ నరాల నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల నొప్పి, వాపు వస్తాయి. రక్తనాళాల పరిమాణం విస్తరించిన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది.

కారణాలు: ∙మానసిక ఒత్తిడి ∙నిద్రలేమి ∙ఉపవాసం ∙హార్మోన్ల సమస్యలు, ∙అధిక వెలుతురు ∙వాసనలు ∙మత్తు పదార్థాలు, పొగాకు, పొగతాగడం, కాఫీ ∙మహిళల్లో బహిష్టు ముందర ఈస్ట్రోజెన్‌ హార్మోన్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల లక్షణాలు రావచ్చు.

లక్షణాలు: ∙తలనొప్పి అధికంగా, తలను ముక్కలు చేస్తున్నట్లుగా ఉండి ఒకవైపు లేదా రెండు వైపులా ఉండవచ్చు ∙నొప్పి సాధారణంగా నుదురు, కళ్లచుట్టూ, తల వెనక భాగంలో రావచ్చు ∙తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు  ∙రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది ∙వికారం, వాంతులు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లూచేతులు చల్లబడటం, వెలుతురు తట్టుకోలేకపోవడం, శబ్దం వినలేకపోవడం వంటి లక్షణాలు తరచూ మైగ్రేన్‌ నొప్పిలో ఉంటాయి ∙నిద్రలేమి, చిరాకు, నీరసం, ఉత్సాహాన్ని కోల్పోవడం, ఆవలింతలు, తీపి ఇంకా కారపు పదార్థాలను ఎక్కువగా ఇష్టపడటం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు.

చికిత్స : ఈ సమస్యకు హోమియోలో సాంగ్వినేరియా, బ్రయోనియా, ఐరస్‌ వెర్స్, నేట్రమ్‌మూర్, పల్సటిల్లా, నక్స్‌వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్‌
డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి
విజయవాడ, వైజాగ్‌


యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 28. ఈ మధ్య వెంటవెంటనే మూత్రం వచ్చినట్లుగా అనిపించడంతో పాటు మంటగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఒక సోదరి, అనంతపురం
మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. మహిళల్లో ఇది సాధారణం. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు.అప్పర్‌ యూరినరీ ట్రాక్ట్‌

ఇన్ఫెక్షన్స్‌: ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్‌ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్‌ అంటారు. జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్‌ను సిస్టయిటిస్‌ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్‌ను యురెథ్రయిటిస్‌ అంటారు.

కారణాలు: యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌లో 90 శాతం కేసుల్లో ఈ–కొలై బ్యాక్టీరియానే కారణం. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద ఉండే పరాన్నజీవి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది.మూత్రపిండాల్లో రాళ్లు మూత్రవిసర్జనకు అడ్డంకిగా మారడం వల్ల కూడా బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు.

లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందు లేదా తర్వాత విపరీతమైన మంట, ఎక్కువసార్లు మూత్రవిసర్జన, మూత్రంలో రక్తం, పొత్తికడుపు నొప్పి, చలిజ్వరం, వాంతులు.

చికిత్స: యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తితత్వాన్ని బట్టి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.

డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి సీనియర్‌ డాక్టర్‌
పాజిటివ్‌ హోమియోపతి హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement