సెల్ఫీలు రోజుకు ఎన్ని తీస్తారో తెలుసా? | Average youth clicks 14 selfies a day, says Google survey | Sakshi
Sakshi News home page

సెల్ఫీలు రోజుకు ఎన్ని తీస్తారో తెలుసా?

Published Sun, Aug 23 2015 6:33 PM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

సెల్ఫీలు రోజుకు ఎన్ని తీస్తారో తెలుసా?

సెల్ఫీలు రోజుకు ఎన్ని తీస్తారో తెలుసా?

న్యూఢిల్లీ : కొందరు దీన్ని పిచ్చి అనుకోవచ్చు.. మరికొందరు ఇది వ్యసనం అని అంటారు. ఏదేమైతేనేం యువత సాధారణంగా రోజుకు 14 సెల్ఫీలు క్లిక్ అనిపిస్తుంటారట. సెల్ఫీలు తీసుకునే వారిలో ఈ వయసు వాళ్లదే అగ్రస్థానం. ప్రపంచ వ్యాప్తంగా జరిపిన ఓ సర్వేలో ఇదే విషయాన్ని ఇటీవలే వెల్లడించారు. రోజులో సుమారు 11 గంటలకు పైగా మొబైల్ వినియోగిస్తున్న వారు దాదాపు 14 సెల్ఫీలు, 16 ఫొటోలు లేదా కొన్ని వీడియోలు తీసుకుంటారని గూగుల్ సంస్థ నిర్వహించిన సర్వే ఈ విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియా వెబ్సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర ఖాతాలను 21 సార్లు ఓపెన్ చేస్తుంటారని, 25 టెక్ట్స్ మెస్సెజ్ లు పంపుతారని పరిశోధనలో తేలింది.

ఇదిలాఉండగా, నడి వయస్కులు, అంతకంటే పెద్ద వయుసున్న వారు మాత్రం రోజుకు 4 ఫొటోలు, ఓ వీడియో, 2.4 సెల్ఫీలు తీసుకుంటారట. టీనేజీ వాళ్లయితే 6.9 ఫొటోలు, ఓ వీడియో, 4.7 సెల్ఫీలు తీస్తారు. ఈ నేపథ్యంలో గూగుల్ ఓ ఫొటో యాప్ విడుదల చేసింది. మరీ అధికంగా సెల్ఫీలు తీసుకోవడం ఓ మానసిక రుగ్మతగానే భావించాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కిమ్ కర్దాషియన్ సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఓ ఏనుగు దాడికి గురైన విషయం విదితమే. కానీ సెల్ఫీలు వినూత్నంగా తీసుకోవడానికి యత్నించి చాలా మంది ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement