ఒకే పోలికలుండే కవలలను గుర్తు పట్టడానికి ఎవరైనా తికమక పడుతుంటారు. అలాంటిది ఒకే గ్రామంలో పదుల సంఖ్యలో కవలలుంటే?.. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడిలో 20 మంది వరకు కవలలు ఉండడంతో.. ఆ గ్రామాన్ని కవలల విలేజ్‌గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఐదు కవలల జంటలు స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో విద్య అభ్యసిస్తుండగా.. మిగతా పిల్లలు ఇతర చోట్ల చదువుతున్నారు. గ్రామ పాఠశాలలో విరాట్–విశాల్, కావ్య–దివ్య, గౌతమి–గాయత్రి, హర్షిత్–వర్షిత్, ప్రణాళిక–ప్రత్యక్ష చదువుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
కవలల అడ్డా.. వడ్డాడి
Published Sat, Sep 21 2024 11:51 AM | Last Updated on Sat, Sep 21 2024 11:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment