ప్రపంచంలోనే అరుదైన కేసుల్లో ఒకటిగా పేర్కొంటున్న వైద్యులు
ఇండోర్(మధ్యప్రదేశ్): ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు కవలలకు జన్మనిచ్చారు. ప్రపంచంలోనే ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మైయెలాయిడ్ లుకేమియా అనే ప్రాణాంతక రక్త క్యాన్సర్‌తో బాధ పడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా చూడటం సవాల్‌తో కూడుతున్న వ్యవహారమని ఆస్పత్రిలోని క్లినికల్ హెమటాలజీ విభాగం ప్రొఫెసర్ అక్షయ్ లహోటీ తెలిపారు.
‘ఈ గర్భవతిని మా ఆస్పత్రిలో చేరి్పంచిన సమయంలో ఆమె శరీరంలో తెల్ల రక్త కణాల(డబ్ల్యూబీసీ)సంఖ్య సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో, కీమో థెరపీతోపాటు సాధారణ క్యాన్సర్ మందులు ఇవ్వలేకపోయాం’అని ఆయన చెప్పారు. ‘దేశ, విదేశాల్లోని నిపుణులను సంప్రదించాక ఆమె ఆరోగ్యంతోపాటు గర్భంలోని ఇద్దరు శిశువులకు ఎటువంటి హాని వాటిల్లకుండా ప్రత్యేకంగా మందులు ఇచ్చాం’అని లహోటీ తెలిపారు.
‘మొదటిసారి గర్భం దాలి్చన బాధితురాలికి బ్లడ్ క్యాన్సర్ ఉన్న విషయం చెప్పలేదు. గర్భవతిగా ఉండగా ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. ఆమెకు సాధారణ ప్రసవం చేశాము. బాబు, పాప జని్మంచారు. వారు ఆరోగ్యంగా ఉన్నారు’ అని గైనకాలజిస్ట్ డాక్టర్ సుమిత్రా యాదవ్ వివరించారు. మైయెలాయిడ్ లుకేమియా ఉన్న మహిళలకు సురక్షిత ప్రసవం ప్రపంచంలోనే అరుదైన కేసుల్లో ఒకటని వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment