అయ్యో తరుణ్‌.. మూడేళ్లకే ఇంత కష్టమా.. | 3 Years Old Kid Struggling With Cancer Please Donate And Save His Life | Sakshi
Sakshi News home page

అయ్యో తరుణ్‌.. మూడేళ్లకే ఇంత కష్టమా..

Published Tue, Aug 17 2021 12:36 PM | Last Updated on Tue, Aug 17 2021 1:13 PM

3 Years Old Kid Struggling With Cancer Please Donate And Save His Life - Sakshi

బుడిబుడి అడుగులతో  అల్లరి చేయాల్సిన తరుణ్‌ అందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఉ‍న్నాడు. ఆటపాటలతో అల్లరి చేయాల్సిన వాడు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. పుట్టిన మూడేళ్లకే ప్రాణాంతకమైన క్యాన్సర్‌ బారిన పడ్డాడు.

నవ్వుల తరుణ్‌
ప్రసవం జరిగింది మొదలు స్రవంతికి ఆమె కొడుకే ప్రాణంగా బతుకుతోంది. బిడ్డను వదిలి క్షణం కూడా ఉండలేకపోయేది. నిరంతరం పిల్లాడితే గడిపేయడంతో బాబుకి ఎప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు చిరాకు పడుతున్నాడనే విషయాలను వెంటనే గుర్తించేది. అతడి బోసి నవ్వులు చూసి మురిసిపోయేది. ప్రైవేటు సంస్థలో చిరుద్యోగిగా భర్త తెచ్చే సంపాదన అంతంత మాత్రమే. అయితే స్రవంతి ముద్దుల కొడుకు తరుణ్‌ అల్లరితో ఆ ఇంట్లో సుఖశాంతులకు లోటు లేకుండా పోయింది.

క్యాన్సర్‌
ఎప్పుడు యాక్టివ్‌గా అల్లరి చేసే తరుణ్‌ కొంత కాలంగా నీరసంగా ఉండటం స్రవంతి గమనించింది. తరచి చూస్తే ఒళ్లు వేడిగా ఉంటున్నట్టు గుర్తించింది. వెంటనే తరుణ్‌ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ నీరసం ఇంకా ఎక్కువైంది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్తే రకరకాల పరీక్షలు చేశారు. క్యాన్సర్‌ లక్షణాలు కనిపిస్తుండటంతో వ్యాధి నిర్థారణ కోసం హైదరాబాద్‌ వెళ్లాలంటూ సూచించారు.
 
రూ. 20 లక్షలు కావాలి
తరుణ్‌కి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్లు చెప్పిన విషయం విన్న స్రవంతికి గుండె ఆగినంత పనైంది. తన ముద్దుల కొడుక్కి ప్రాణాంతకమైన మైలోమియా లుకేమియా క్యాన్సర్‌ ఉన్నట్టుగా వైద్యులు తేల్చి చెప్పారు. వెంటనే కీమోథెరపీ చేయకపోతే బిడ్డ మృత్యువుకు చేరువ అవుతాడంటూ హెచ్చరించారు. సాధ్యమైనంత త్వరగా వైద్య చికిత్స కోసం రూ.20లక్షలు సర్థుబాటు చేసుకోవాలంటూ సూచించారు.

సాయం చేద్దాం రండి

రెక్కాడితే గానీ డొక్కాడని స్రవంతి కుటుంబానికి రూ.20 లక్షలు సర్థుబాటు చేయడం కలలో కూడా జరగని పని. అలా అని బిడ్డ మృత్యు ఓడికి చేరుతుంటే చూస్తూ ఊరుకోలేక పోతుంది. కళ్లలో నీళ్లు ఇంకేలా ఏడుస్తూనే ఉంది. చివరకు బిడ్డ వైద్య చికిత్స కోసం ఫండ్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మూడేళ్ల తరుణ్‌ ఈ లోకంలో అందాలను చూడాలంటే అతనికి భవష్యత్తును అందివ్వాలంటే మనమంతా తలా ఓ చేయి వేయాల్సిన అవసరం ఏర్పడింది. సాయం చేయడానికి  ఇక్కడ క్లిక్ చేయండి




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement