
లేడీ సూపర్ స్టార్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన భామ.. సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షారుక్ ఖాన్ సరసన జవాన్‌లో నటిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఎప్పుడు సినిమాలతో బిజీగా నయన్.. చిన్న పిల్లలకు టైం కేటాయించేందుకు వీలు కాదు. అలా ప్రొఫెషనల్ లైఫ్‌తో పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తోంది ముద్దుగుమ్మ.
(ఇది చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!)
ఆదివారం కాస్తా తన కుమారులతో అమ్మతన్నాని ఆస్వాదిస్తోంది. సినిమాల్లో ప్రియురాలుగా, భర్తకు భార్యగా, బిడ్డకు తల్లిగా ఎంతగా ప్రేమను చూపిన అది నటనే కాబట్టి అందులో మమతాను రాగాలు ఉండవు. అదే నిజ జీవితంలో ఇప్పుడు నయనతార అమ్మతనాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. అందులో సహజ సిద్ధంగా కలిగే మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు.
అలా ఆదివారం కాస్తా తీరిక లభించడంతో తన బిడ్డను లాలిస్తూ మురిసి పోతున్న దృశ్యాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఫొటో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తమ ప్రాణంగా ప్రేమించే పిల్లలతో సమయాన్ని ఆనందంగా గడిపినట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నయనతార హిందీలో షారుక్ ఖాన్‌తో తొలిసారిగా జతకట్టిన జవాన్ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తన 75 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. గత ఆరేళ్లకు పైగా ప్రేమించుకుంటూ సహజీవనం చేసిన దర్శకుడు విఘ్నేష్ శివన్.. గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
(ఇది చదవండి: హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది: ప్రముఖ నటుడు )
Comments
Please login to add a commentAdd a comment