Ambanis gift designer closets to Isha Ambani’s twins, video goes viral - Sakshi
Sakshi News home page

ఇషా ట్విన్స్‌కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్‌: వీడియో వైరల్‌

Published Sat, Mar 11 2023 4:27 PM | Last Updated on Sat, Mar 11 2023 4:45 PM

Ambanis gifts designer closets to Isha Ambani twins video viral - Sakshi

సాక్షి,ముంబై: బిలియనీర్‌, రిలయన్స్‌చైర్మన్‌ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ అమ్మమ్మ, తాతయ్యలుగా కవల మనవలకు బ్రహ్మాండమైన గిఫ్ట్‌ ఇచ్చారు.  ఆకర్షణీయమైన ఐదడుగుల అల్ట్రా-లగ్జరీ క్లోసెట్‌ను బహుమతిగా ఇచ్చారు. మనవడు కృష్ణ మనవరాలు ఆదియా పుట్టిన సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన అంబానీ దంపతులు తాజాగా వారికిచ్చిన గిఫ్ట్‌ వైరల్‌గా మారింది.

పాపులర్‌  మహిళా పారిశ్రామిక వేత్త, అంబారీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్ దంపతులకు 2022 నవంబరులో   కవల పిల్లలకు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ కవలల కోసమే లగ్జరీ క్లోసెట్‌( కప్‌బోర్డ్‌)ను ప్రత్యేకంగా కస్టమైజ్‌ చేసి ఆకర్షణీయంగా  తీర్చిదిద్దడం విశేషం.  దీనికి  సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతోంది. 

ఎల్లో కలర్‌ రూంలో హాట్-ఎయిర్ బెలూన్‌లతో మేఘాల వాల్‌పేపర్‌తో ఆకట్టుకుంటోంది. అలాగే టెడ్డీ బేర్‌లు, ఆకర్షణీయమైన రంగుల కృత్రిమ పువ్వులు, రెండు స్పెషల్‌ బాక్స్‌లతోపాటు, ఒక గ్లోబ్, రెండు పాస్‌పోర్ట్‌లు, ఒక చిన్న విమానాన్ని కూడా ఇందులో పొందుపర్చారు. అలాగే కస్టమైజ్డ్ క్లోసెట్ డోర్ పైన "అడ్వెంచర్స్ ఆఫ్ ఆదియా అండ్ కృష్ణ" అని రాసి ఉండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement