
నా పేరు లావణ్య, ఉన్న ఊర్లో ఆస్తులేమీ లేకపోవడంతో మా కుటుంబం హైదరాబాద్‌కి మారిపోయాం. నా భర్త భూపాల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న మా జీవితంలో మరో ఆనందం చోటు చేసుకుంది. గర్భిణీగా ఉన్న నన్ను పరీక్షించిన డాక్టర్లు కడుపులో కవలలు ఉన్నారని చెప్పారు. ఆ వార్త విన్నప్పటి నుంచి మేము ఇద్దరం రాబోయే పిల్లల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాం.
ప్రసవించే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఆయాసం, అలసట ఎక్కువయ్యాయి. ఒకరోజు ఉన్నట్టుండి ఒకరోజు ఆయాసం, కడుపులో నొప్పి పెరిగిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే నెలలు నిండకుండానే కవలలైన ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చాను.
మా కంటి పాపలను కళ్లారా చూడాలనిపించింది. నా బిడ్డలిద్దరు ఎక్కడా అని డాక్టర్లను అడిగితే పిల్లలు ఇద్దరికీ ఆరోగ్యం బాగా లేదని వాళ్లని ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. నెలలు నిండకుండా పుట్టినందు వల్ల వారి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు.. వారిని సర్‌ఫాక్టంట్ మెకానికల్ వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వాళ్లిద్దరి ఆరోగ్యం మెరుగవ్వాలంటే కనీరం రెండు నెలల పాటు ఎన్‌ఐసీయూలో చికిత్స అందివ్వాలని చెప్పారు.
సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
కడుపులో నలుసు పడ్డట్టప్పటి నుంచి ప్రసవం వరకు ఆస్పత్రి ఖర్చుల కోసం ఇప్పటికే నా భర్త భూపాల్ రెండు లక్షల వరకు అప్పు చేశాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లల ప్రాణాలు దక్కాలంటే రెండు నెలలు చికిత్స అవసరం. దాని కోసం ఏకంగా రూ. 13,50,000 ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.
సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
ఓ వైపు తన మనవరాళ్లు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న అత్తమామలు మరోవైపు పిల్లల వైద్య చికిత్సకు అవసరమైన డబ్బుల కోసం అలసట అన్నదే లేకుండా తిరుగుతున్న భర్త. ఎక్కడ ప్రయత్నించినా మాకు డబ్బులు సర్థుబాటు కాలేదు. ఇంతలో అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఫండ్ రైజింగ్ చేసే కెటో గురించి తెలిసి వారిని సంప్రదించాం. మా పాప వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం సాయం చేయండి. వారి ప్రాణాలను కాపాడండి.
Comments
Please login to add a commentAdd a comment