దుండిగల్: కరోనాతో బాధపడుతున్న ఓ గర్భిణి బుధవారం కవలలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. గాజులరామారం ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి ఈ నెల 25న పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే బుధవారం ఆమె ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. పుట్టిన పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా ఆస్‌బెస్టాస్ కాలనీ నెహ్రునగర్‌కు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 16న నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించగా 17న ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే 25న చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో మళ్లీ నిలోఫర్‌కు తరలించగా అనుమానం వచ్చిన వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ అదే రోజు చిన్నారి మృత్యువాత పడింది.(వారిద్దరూ అమ్మ వారసులే )
బాలింతకు సైతం పాజిటివ్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆమె కుటుంబసభ్యులు 11 మందిని హోం క్వారంటైన్ చేశారు. బుధవారం జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌కు చెందిన యువకుడు, జీడిమెట్ల నెహ్రునగర్‌కు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment