ఓనం సెలబ్రేషన్స్‌లో స్టార్ కపుల్.. ట్విన్స్‌తో తొలిసారిగా! | Nayanathara And Vignesh Shivan Celebrates Onam Festival With Twins | Sakshi
Sakshi News home page

Nayanathara: ఓనం సెలబ్రేషన్స్‌లో నయన్-శివన్.. ట్విన్స్‌తో కలిసి తొలిసారిగా!

Published Sun, Aug 27 2023 2:15 PM | Last Updated on Mon, Aug 28 2023 10:07 AM

Nayanathara And Vignesh Shivan Celebrates Onam Festival With Twins - Sakshi

సౌత్ ఇండియా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ను కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న భామ గతేడాది జూన్‌లో  ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లిదండ్రులయ్యారు. అయితే నయన్ దంపతులు సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఇప్పటివరకు తమ పిల్లల మొహాలను ఇప్పటివరకు అభిమానులకు చూపించలేదు.

(ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో.. పక్కా ప్లాన్‌తో ప్రజల్లోకి!)

తాజాగా కేరళలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓనం పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి తొలిసారిగా ఓనం జరుపుకోవడం సంతోషంగా ఉందంటూ విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. సెలబ్రేషన్స్‌తో పాటు తన భార్య, పిల్లలతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. 'మా జీవితంలో అందమైన, అద్భుతమైన క్షణాలు.. ఉయిర్, ఉలగంతో కలిసి తొలిసారిగా ఓనం పండుగ జరుపుకుంటున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement