Alia Bhatt: రణ్‌బీర్‌ జోక్‌ చేశాడు.. ఆ మాటల్లో నిజం లేదు | Alia Bhatt Reacts to Ranbir Kapoors Twins Comment | Sakshi
Sakshi News home page

Ranbir Kapoor Twins Comment: రణ్‌బీర్‌ జోక్‌ చేశాడు.. ఆ మాటల్లో నిజం లేదు

Published Thu, Jul 28 2022 12:18 AM | Last Updated on Thu, Jul 28 2022 2:46 AM

Alia Bhatt Reacts to Ranbir Kapoors Twins Comment - Sakshi

హీరోయిన్‌ ఆలియా భట్‌కి కవల పిల్లలు పుట్టబోతున్నారనే వార్తలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం హీరో, ఆలియా భర్త రణ్‌బీర్‌ మాటలే. ఇక ప్రచారంలో ఉన్న వార్త గురించి ఆలియా స్పందిస్తూ ‘ట్విన్సా.. అలాంటిదేం లేదు.. ఒక్కరే’ అంటూ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్‌ ప్రేమపక్షులు రణ్‌బీర్‌ కపూర్‌–ఆలియా భట్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 14న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయిన రెండు నెలలకు తాను తల్లి కాబోతున్నానని ప్రకటించి, సంతోషాన్ని పంచుకున్నారు ఆలియా.

కాగా ఇటీవల ఒక ప్రమోషనల్‌  ఈవెంట్‌లో పాల్గొన్న రణ్‌బీర్‌కి యాంకర్‌ ఓ సరదా టాస్క్‌ పెట్టారు. ఒక అబద్ధం, రెండు నిజాలు చెప్పాలని కోరారు. దీనికి రణ్‌బీర్‌ స్పందించి ‘ట్విన్స్‌ పుట్టబోతున్నారు’ అంటూ సమాధానం ఇచ్చి, అది నిజమా? అబద్ధమా? అనేది మీరే చెప్పుకోండి అన్నారు. ఆయన మాటలతో ఆలియాకి ట్విన్స్‌ పుట్టబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.

దీనిపై తాజాగా ఆలియా స్పందిస్తూ– ‘‘నాకు ట్విన్స్‌ పుట్టబోతున్నారంటూ రణ్‌బీర్‌ జోక్‌ చేశాడు. ఆ మాటల్లో నిజం లేదు. సరదాగా జోక్‌ చేస్తే జనం ఇంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు. నాకు ఒక్కరే పుట్టబోతున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు వద్దు. అయినా అమ్మాయిలకు పెళ్లయితే ఒక టాపిక్, తల్లి కాబోతోందంటే ఒక టాపిక్‌.. ఇలా ఏదైనా టాపిక్కే. పెళ్లి, తల్లవడం అనేది వ్యక్తిగత విషయాలు. ఇవి వృత్తిపరంగా ఎలాంటి ప్రభావం చూపవు’’ అని స్పష్టం చేశారు. కాగా ఆలియా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్స్‌’ ఆగస్టు 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement