
Ranbir Kapoor Says He Having Twins With Alia Bhatt: బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగానే రణ్‌బీర్‌తో యాంకర్ సరదాగా ఒక గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో 'రెండు నిజాలు, ఒక అబద్ధం' చెప్పాల్సిందిగా రణ్‌బీర్‌ను ఆ యాంకర్ కోరారు. ఈ గేమ్‌లో మూడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు రణ్‌బీర్ కపూర్.
యాంకర్ అడిగిన ప్రశ్నకు 'నేను కవలలకు తండ్రి కాబోతున్నాను. నేను చాలా పెద్ద పౌరాణిక చిత్రంలో భాగం కాబోతున్నాను. నేను పని నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నాను' అని మూడు ఆసక్తికర విషయాలు చెప్పాడు రణ్‌బీర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఏవి రెండు నిజాలు, ఏది ఒక అబద్ధం అని తేల్చుకోలేకపోతున్నారు నెటిజన్స్. తన భార్య అలియా భట్‌తో కలిసి బ్రహ్మాస్త్రం సినిమాలో రణ్‌బీర్ నటిస్తున్న విషయం తెలుసు కాబట్టి, పౌరాణిక చిత్రంలో భాగం కానున్నాను అనేది నిజమేనని ఊహించడం తేలికైంది.
మిగతా రెండు విషయాలకొస్తే నిజంగా అలియా భట్‌కు ట్విన్స్ పుట్టనున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రణ్‌బీర్ సుధీర్ఘ విరామం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే రణ్‌బీర్ సినిమా కెరీర్‌కు రెండేళ్లు గ్యాప్ (2018లో చివరి సినిమా విడుదలైంది) వచ్చింది. దీంతో మరోసారి నిజంగా గ్యాప్ తీసుకుంటారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే 'అతను తండ్రి కాబోతున్నాడు. విరామం తీసుకునే అవకాశం ఉంది' అని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ఈ ప్రశ్నలన్నింటికి అసలైన సమాధానం దొరకాలంటే అలియా భట్ డెలివరీ దాకా ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment