truth
-
మళ్లీ చర్చా.. ఆ చాన్సే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో మరో డిబేట్లో పాల్గొనబోనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన బిగ్ డిబేట్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌పై తాను గెలిచానని, ఆమె ఓడిపోయినందునే మరో చర్చ అంటున్నారని తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో గురువారం ప్రకటించారు. జూన్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన మొదటి డిబేట్, ఆ తర్వాత హ్యారిస్‌తో మంగళవారం జరిగిన డిబేట్‌ను ప్రస్తావిస్తూ ఇక మూడోది ఉండబోదని స్పష్టం చేశారు. గెలుపు తనదేనని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని ట్రంప్ చెప్పారు. కాగా, ప్రధాన మీడియా సంస్థల సర్వేల ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బిగ్ డిబేట్‌ను చూసిన వారిలో 63 శాతం మంది కమలా హారిస్ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేయగా, 37 శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గు చూపారని సీఎన్ఎన్ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. -
Donald Trump: ‘ఫాక్స్’లో అయితేనే డిబేట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సెపె్టంబర్ 10న ఏబీసీ చానల్లో హారిస్‌తో జరగాల్సిన డిబేట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ‘‘నిజానికది జో బైడెన్‌తో జరగాల్సిన డిబేట్. ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందున ఆ డిబేట్ కూడా రద్దయినట్టే’’ అని వాదించారు. ఈ మేరకు సొంత సోషల్ మీడియా హాండిల్ ‘ట్రూత్’లో తాజాగా ట్రంప్ పలు పోస్టులు పెట్టారు. ఫాక్స్ న్యూస్ చానల్లో అయితేనే డిబేట్‌కు వస్తానంటూ మెలిక పెట్టారు. ‘‘సెప్టెంబర్ 4న పెన్సిల్వేనియాలో ఫాక్స్ స్టూడియోలో హారిస్ చర్చకు రావాలి. ఖాళీ స్టూడియోలో కాకుండా కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ డిబేట్ చేద్దాం’’ అని సవాలు విసిరారు. దీనిపై హారిస్ వర్గం మండిపడింది. పిరికితనంతో డిబేట్ నుంచి ట్రంప్ పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాకపోయినా కేవలం హారిస్‌తో ఏబీసీ డిబేట్ కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది. డెమొక్రాట్ల తరఫున అధ్యక్షుడు బైడెన్‌కు బదులు హారిస్ అధ్యక్ష రేసులో అడుగు పెట్టినప్పటి నుంచీ ఆమెతో డిబేట్‌కు ట్రంప్ వెనకా ముందాడుతూ వస్తున్నారు. తామిద్దరి గురించీ అమెరికన్లకు ఇప్పటికే అంతా తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ తనతో డిబేట్‌కు రావాల్సిందేనని హారిస్ పట్టుబడుతున్నారు. గూగుల్‌పై ట్రంప్ మండిపాటుతన వార్తలను, ఫొటోలను గూగుల్ సెన్సార్ చేస్తోందని, ప్రజలకు వాస్తవాలు చేరనివ్వడం లేదని ట్రంప్ మండిపడ్డారు. తనకు సంబంధించిన వార్తలను, సమాచారాన్ని ఫేసుబుక్‌లో సెన్సార్ చేసినందుకు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకు క్షమాపణ చెప్పారన్నారు. -
Buried Truth Review In Telugu: ఇంద్రాణి ముఖర్జీ 'బరీడ్ ట్రూత్'.. ఎలా ఉందంటే?
మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీ ఆధారంగా వచ్చి డాక్యు సీరిస్ వివాదాలతో పాటు.. చాలా కొత్త విషయాలను తెరమీదకు తెచ్చింది. కూతురు హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఇంద్రాణి చేస్తున్న వాదనకు మద్దతు పలికేలా ఈ సీరిస్ ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సిరీస్ విడుదలను అడ్డుకోవాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో… ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్‌దీప్ సర్దేశాయితో పాటు ఈ కేసును కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరి ఇంటర్వ్యూలు ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు. పోలిస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లూప్‌హోల్స్ … లీగల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఈ క్రైం కథలో బ్లెండ్ అయ్యాయి. హై ప్రొఫైల్ కేసుల్లో పోలీసుల అత్యుత్సాహం… మీడియా ట్రయల్లాంటి సున్నితమైన అంశాలను కూడా ఈ సిరీస్ టచ్ చేసింది. బరీడ్ ట్రూత్ సిరీస్‌లో ఇంద్రాణి స్వయంగా తన వాదనను తానే టీవీ స్క్రీన్‌పై చెప్పుకోవడం… ఆడియన్స్‌కు మరింత ఆసక్తిని పెంచింది. 2012లో మాయమైన ఇంద్రాణి కూతురు షీనాబోరా హత్యకు గురైందని మూడేళ్ల తరువాత పోలీసులు గుర్తిస్తారు. అదీ ఓ సాధారణ వెహికిల్ చెకింగ్‌లో భాగంగా అరెస్టైన వ్యక్తి చెప్పిన సమాచారంతో ఈ మొత్తం కథ బయటకు వస్తుంది. కూతురు మూడేళ్ల పాటు కనిపించకుండా పోయినా ఇంద్రాణి ఎందుకు మాట్లాడలేదనే విషయంపై ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చాలా వరకు నిజమైన క్యారెక్టర్లతోనే స్టోరీ చెప్పే ప్రయత్నం జరిగింది. షీనాబోరాను తన చెల్లెలుగా మూడోభర్త కుటుంబానికి ఎందుకు పరిచయం చేసిందననే విషయంపై ఇంద్రాణి చెప్పిన సీక్రెట్ హైలెట్‌గా ఉంటుంది. తన తండ్రే తన కూతురికి తండ్రి అన్న విషయాన్ని ఇంద్రాణి ఈ సిరీస్‌లో రివీల్ చేస్తుంది. తాను 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కన్న తండ్రి తనను అత్యాచారం చేసిన విషయాన్ని ఇంద్రాణి చెబుతుంది. ఆ తరువాత మళ్లీ మళ్లీ అత్యాచారానికి గురయ్యానని.. తన తండ్రి ద్వారానే తాను తల్లినయ్యానని ఇంద్రాణి రివీల్ చేస్తుంది. షీనాబోరాను దాదాపు 16 ఏళ్ల పాటు దూరంగా ఉంచిన ఇంద్రాణి.. ఆ తరువాత ఎందుకు తన దగ్గరకు తెచ్చుకుంది. మూడో భర్త కొడుకుతో ఇంద్రాణి కూతురు ప్రేమలో పడటం లాంటి చాలా జుగుప్సాకరమైన విషయాలను ఈ సిరీస్‌లో చూపించారు. పీటర్ ముఖర్జీయా కుమారుడు రాహుల్, ఇంద్రాణి కూతురు షీనాబోరా ప్రేమ వల్లే ఈ హత్య జరిగిందనే చర్చ ఉంది. అయితే షీనాబోరా మిస్సయ్యాక రాహుల్ ఏవిధంగా ఆమెను వెతికే ప్రయత్నం చేశాడో ఈ సిరీస్ ద్వారా బయటకు వచ్చింది. పీటర్ ముఖర్జీయాకు షీనా హత్య గురించి తెలుసా? లేదా అనే విషయంపై ఈ సిరీస్‌లో కీలకమైన పాయింట్ రివీల్ చేశారు. షీనాబోరా హత్యకేసుకు సంబంధించి చాలా విషయాలు ఇప్పటికే అందరికీ తెలిసినా.. ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రేక్షకులకు చివరిగా ఒక మాట… కూతురిని హత్య చేసిందనే ఆరోపణలతో 6 ఏళ్లపాటు జైల్లో ఉన్న ఇంద్రాణి… ఈ సిరీస్‌లో కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడా భయం.. పశ్చాత్తాపం లాంటివి లేకుండా హీరోయిన్లా ఇంద్రాణి డైలాగ్స్ చెప్పడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తన అందం చూసి పార్టీల్లో మగవాళ్లు పిచ్చోళ్లై పోతారని… ఆడవాళ్లు ఇబ్బందిగా ఫీలవుతారని ఇంద్రాణి చెప్పే డైలాగులు ఆమెలోని కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టాయి. మూడో పెళ్లి చేసుకున్నా… కన్న పిల్లలను చెల్లెలు, తమ్ముడిగా చెప్పుకున్నా అది తన ఎదుగుదలకే అని ఇంద్రాణి చెప్పిన మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. కాని మీ కూతురుని మీరు హత్య చేశారా? అనే ప్రశ్నకు… ఇంద్రాణి చెప్పిన సమాధానం… ఈ సీరిస్‌లోనే హైలట్‌గా నిలిచింది. -ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
ముఖ స్తుతి
పొగడ్తకి పొంగిపోని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మనుషులే కాదు దేవతలు కూడా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బై పోతారు. పొగడ్త వినగానే డోపమైన్ అనే హార్మోను విడుదల అవుతుంది. అందుకే దైవాన్ని ఇష్టదైవాన్ని అష్టోత్తరాలు, సహస్రనామాలతో కీర్తిస్తూ ఉంటారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు. జంతువులు కూడా పొగిడితే సంతోషిస్తాయి. పెంపుడు జంతువులున్నవారికి ఇది అనుభవమే. పొగడ్తలు మనిషిని ప్రోత్సహించే వరకు ఉపయోగ పడతాయి. నిజంగా ప్రతిభ ఉన్నవారికి చిన్న మెప్పుదల ఉత్సాహాన్ని ఇస్తుంది. తాము చేస్తున్నది మంచిదే అయినా సాటివారి ఆమోదముద్ర తమ పని మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పొగడ్తలో కొంచెం అయినా నిజం ఉంటుంది. ముఖస్తుతిలో అంటే ఎదురుగా పొగడటంలో నిజం ఉండే అవకాశం తక్కువ. మెరమెచ్చుల కోసం లేనిపోనివి అపాదించి చెప్పటం ముఖస్తుతి. ఆ సంగతి అంటున్నవారికి, వింటున్నవారికి తెలుసు. అయినా ఇష్టం లేనట్టు ముఖం పెట్టి వింటూనే ఉంటారు. లోలోపల సంతోషంగానే ఉంటుంది. ఎటువంటి వారికైనా తమని మెచ్చుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. ‘‘మీ లాగా పొగడ్తలు ఇష్టపడని వారు చాల గొప్పవాళ్ళు. అందుకే మీరంటే నాకు ఎంతో అభిమానం.’’ అంటే బోల్తాపడరా? చిన్నపిల్లల దగ్గర నుండి, దేవతల వరకు. ముఖస్తుతిని ఆశించి, ఆనందించే వారు సాధారణంగా నష్టపోతూ ఉంటారు. తనకి అపాదించబడిన గుణాలు తనలో ఉన్నాయేమో నని భ్రమ పడుతూ ఉంటారు. ఆ భ్రమ వల్ల దానిని నిజం చేయాలనే తాపత్రయంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏవిధంగా ఉంటాయో గమనించ వచ్చు. ఉదాహరణకి: మన్మథుడు, శల్యుడు. ఇంద్రుడు మన్మథుణ్ణి పిలిపించి అతడి సామర్థ్యాన్ని పొగుడుతాడు. అతడు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి ‘‘నేను ఎంతటి వారినైనా ప్రలోభపెట్ట గలను – శివుడైనా సరే!’’ అంటాడు. ఇంద్రుడికి కావలసింది అదే! అంతే! ఇరుక్కుపోయాడు. శరీరాన్ని కోల్పోయాడు. శల్యుణ్ణి దుర్యోధనాదులు పొగిడి కర్ణుడి రథసారథిగా ఒప్పించారు. ససేమిరా, నేను సారథ్యం చేయట మేమిటి? అని భీష్మించుకున్న శల్యుడు తనని కృష్ణుడితో సమానమని పోల్చగానే ఆ పొగడ్తల మాయాజాలంలో పడి రథసారథ్యం చేశాడు. ములగచెట్టు ఎక్కించటం అని చమత్కారంగా అంటూ ఉంటారు. ఆ కొమ్మ పుటుక్కున విరిగిపోతుంది. ముఖస్తుతి చేసే వారు ఎదుట పొగిడినా, వెనుక విమర్శిస్తూ ఉంటారు. పైగా పొగడ్తలకి పడిపోయారని చులకనగా మాట్లాడుతారు. ఈ ఆయుధం కొన్ని మారులు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ‘‘నా బంగారుకొండ మంచివాడు. చక్కగా అన్నం తిని నిద్రపోతాడు.’’ అంటుంది తల్లి. వాడు అన్నం తినటానికి పేచీ పెడతాడని ఒక పట్టాన నిద్రపోడని ఆ తల్లికి తెలుసు. వినగా, వినగా ఆ లక్షణాలు కొడుకులో పెంపొందుతాయేమోననే ఆశతో ఆ విధంగా పొగుడుతుంది. ఒక రాజుకి ఒక కన్ను లేదు. తన చిత్రాన్ని అందంగా వేసిన వారికి బహుమతి ప్రకటించాడు. ఒక చిత్రకారుడికి ఆ బహుమతి దక్కింది. రాజు విల్లు ఎక్కుపెట్టి లక్ష్యం వైపు చూడటానికి ఒక కన్ను మూసినట్టు వేశాడు. పొగడటానికి అబద్ధాలు చెప్పనక్కర లేదు. సాధారణంగా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి లేని సద్గుణాలని అపాదించి ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించేదే ముఖస్తుతి. పిల్లికి బిచ్చం పెట్టని వాణ్ణి దానకర్ణుడని, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేని వాణ్ణి బృహస్పతి అని పొగడటం ముఖస్తుతి కాక మరేమిటి? ముఖస్తుతికి అలవాటు పడిన వారు విమర్శను అంగీకరించ లేరు. ఆత్మవిమర్శ అసలే ఉండదు. తాము చేసింది సరైనదే అనే మొండిపట్టు ఉంటుంది. పొరపాట్లని సరిదిద్దుకునే లక్షణం ఉండదు కనుక నాశాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మహత్కార్యాలు చేయటానికి ఈ పొగడ్త ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి హనుమ. – డా.ఎన్.అనంత లక్ష్మి -
జగన్ సర్కార్ ను ఎదుర్కోలేనంటూ చెప్పేసిన పవన్ కల్యాణ్
-
Rahul Gandhi: 'నిజం మాట్లాడినందుకు మూల్యం!'
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ రోజు (శనివారం) ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి.. అధికారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అనంతరం రాహుల్ గాంధీ మీడియా ముందు మాట్లాడుతూ.. నిజం మాట్లాడినందుకు ఎంతటి మూల్యాన్ని చెల్లించేందుకైనా రెడీ అంటూ తనదైన శైలిలో బీజేపీకి కౌంటరిచ్చారు. అదీగాక శుక్రవారం సూరత్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించినా.. రాహుల్‌కి ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు రాహుల్. తనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ బలవంతపు దాడులకు దిగుతోందన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.."హిందూస్తాన్ ప్రజల నాకు 19 సంవత్సరాలుగా ఈ ఇంటిని ఇచ్చారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. ఇది నిజం మాట్లాడినందుకు మూల్యం. నేను నిజం మాట్లాడినందుకు ఎంత ధరనైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా." అని తన అధికారిక నివాసం వెలుపల విలేకరులతో అన్నారు. తన వస్తువులను జన్‌పథ్ 10లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి తరలిస్తున్నట్లు రాహుల్ చెప్పారు. బంగ్లాను ఖాళీ చేసి వెళ్లేందుకు సోదరి ప్రియాంక గాంధీ రాహుల్‌కి సహాయం చేస్తూ కనిపించారు. కాగా, సూరత్ హైకోర్టులో సైతం రాహుల్‌కి చుక్కెదురు కావడంతో కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు దీన్ని ప్రజాస్వామ్యంపై దాడి అని ముక్త కంఠంతో నినదించాయి. కానీ బీజేపీ మాత్రం కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ..అతని పార్టీ న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తూ చట్టాన్ని అగౌరపరుస్తుందని ఆరోపణలు చేస్తోంది. #WATCH | "People of Hindustan gave me this house for 19 years, I want to thank them. It's the price for speaking the truth. I am ready to pay any price for speaking the truth...," says Congress leader Rahul Gandhi as he finally vacates his official residence after… pic.twitter.com/hYsVjmetYw — ANI (@ANI) April 22, 2023 (చదవండి: షిర్డి ఆలయం నుంచి నాణేలను బ్యాంకులు తీసుకోమన్నాయ్! ఎందుకంటే..) -
'మిత్రకాల్'పై పోరాటం.. సత్యమే నా ఆయుధం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను పోరాటం చేస్తున్నానని, సత్యమే తన ఆయుధమని పదునైన వ్యాఖ్యలు చేశారు. 'నేను మిత్రకాలంపై పోరాటం చేస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సత్యమే నా ఆయుధం. అదే నాకు అండ..' అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. ये ‘मित्रकाल’ के विरुद्ध, लोकतंत्र को बचाने की लड़ाई है। इस संघर्ष में, सत्य मेरा अस्त्र है, और सत्य ही मेरा आसरा! pic.twitter.com/SYxC8yfc1M — Rahul Gandhi (@RahulGandhi) April 3, 2023 హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం స్నేహితుడు అదానీ కోసమే మోదీ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శల జోరు పెంచిన విషయం తెలిసిందే. అందుకే మోదీ పాలనను మిత్రులకు లాభం చేకూర్చే మిత్రకాల్‌గా ఆయన అభివర్ణిస్తున్నారు. కాగా.. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో మార్చి 23న రాహుల్‌ను సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. తీర్పుపై స్టే విధించాలని, శిక్ష రద్దు చేయాలని కోరారు. అయితే న్యాయస్థానం మాత్రం రాహుల్‌కు ఈ కేసులో ఏప్రిల్ 13 వరకు బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై స్టే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి విచారణను వాయిదా వేసింది. చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
సత్యమే గెలుస్తుంది: గౌతం అదానీ
సాక్షి, ముంబై: అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై అదానీ గ్రూపు చైర్మన్ గౌతం అదానీ స్పందించారు. సమయాను కూలంగా నిజాలు నిగ్గు తేలతాయని... సత్యమే గెలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు. (ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు) The Adani Group welcomes the order of the Hon'ble Supreme Court. It will bring finality in a time bound manner. Truth will prevail. — Gautam Adani (@gautam_adani) March 2, 2023 హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌పై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీని ఆదేశించింది. రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని కూడా రెగ్యులేటరీ బాడీని కూడా కోర్టు ఆదేశించింది. అలాగే ఆరుగురు నిపుణులతో ఒక కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణలన్నింటినీ ఇప్పటికే అదానీ కొట్టిపారేశారు. హిండెన్‌బర్గ్ నివేదికను ఖండిస్తూ అదానీ గతంలోనే గ్రూపు సమూహం 413 పేజీల ప్రతిస్పందనను కూడా విడుదల చేసింది. హిండెన్‌బర్గ్ ,వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని సెబీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీనియర్ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. హిండెన్‌బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణ జరిపి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ మరో పిటిషన్లో కోరారు. దీంతోపాటు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరగాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్, ఒకసామాజిక కార్యకర్త కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. -
సత్యం ఉన్నది ఉన్నట్లుగానే
ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోతే ఉన్న మనకు లేనిపోని నష్టం జరుగుతుంది. మనకు కష్టం కలుగుతుంది. సత్యం లేదా నిజం తెలియకపోవడం వల్లా, లేకపోవడం వల్లా, మనకు ఎంతో హాని జరుగుతుంది, జరుగుతోంది, జరుగుతూ ఉంటుంది... ప్రతి ఒక్కరికీ సత్యం అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ సత్యమే అవసరం అవుతుంది. ఏదో అనుకోవడం, ఏదో అభిప్రాయపడడం ఈ రెండిటినీ వీలైనంత తొందరగా మనం వదిలేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మన ఇష్ట, అయిష్టాల్లో సత్యం లేకపోవచ్చు; మనకు నచ్చిన, నచ్చని వాటిల్లో సత్యం లేకపోవచ్చు. కాబట్టి మనం మనల్ని దాటుకుని లేదా మనల్ని మనం మార్చుకుని సత్యంలోకి వెళ్లవలసి ఉంటుంది. ఆ పని ఎంత తొందరగా జరిగితే మనకు అంత మేలు జరుగుతుంది. క్షేత్ర వాస్తవాన్ని తెలుసుకోగలగడం, ఆపై సత్యాన్ని అవగతం చేసుకోగలగడం మనిషి జీవితంలో తప్పకుండా నేర్చుకోవలసినవి. మనకు ముందు వచ్చిన వాళ్లు చెప్పారు కాబట్టి, మనకు ముందే కొందరు నమ్మారు కాబట్టి, కొందరు చెబుతున్నారు కాబట్టి, కొందరు అనుకుంటున్నారు కాబట్టి, ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, వాడుకలో ఉన్నాయి కాబట్టి ఉన్నవి సరైనవే అని స్వీకరించే ధోరణి వాంఛనీయం కాదు. అది నాసిరకం పోకడ. అది ఆదర్శనీయమైనది కాదు. ఏదో అనుకోవడం, దేన్నో ఊహించుకోవడం సరైనవి కాకపోవడమే కాదు, అత్యంత హానికరమైనవి కూడా. ఒక రోగి తనకు రోగం ఉంది అన్న వాస్తవాన్ని తెలుసుకుంటే దానికి తగిన వైద్యం చేసుకుని లాభపడడం జరుగుతుంది. ఏ విషయంలో అయినా ఎంత తెలుసుకుంటే అంత లాభం ఉంటుంది. తెలివిడిలోకి వెళ్లేందుకు అభిప్రాయాలవల్ల ఏర్పడ్డ నమ్మకం అడ్డంకిగా ఉంటూనే ఉంటుంది. మనం ఆ అడ్డంకిని వీలైనంత వేగంగా తొలగించుకోవాలి. చలామణిలో ఉన్నవాటిని నమ్మడం మనిషి బలహీనతల్లో బలమైంది. ఆ బలమైన బలహీనత మనిషిని ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు కొడుతూనే ఉంటుంది. మనిషి ఆ దెబ్బల నొప్పిని అనుభవిస్తూనే ఉన్నాడు. ‘నమ్మడంపై నాకు నమ్మకం లేదు, తెలుసుకోవడమే నా విధానం’ అని ఓషో ఒక సందర్భం లో అన్నారు. తెలుసుకునే విధానానికి మనం అలవాటుపడాలి.‘ఏది సత్యం?’ ఈ ప్రశ్నకు ‘దేని ప్రభావం మంచి చేస్తుందో అది సత్యం’ అని మనుస్మృతిలోని మాటల్ని ఉటంకిస్తూ బుద్ధుడు తెలియజెప్పాడు. అమెరికా దేశపు తత్త్వవేత్త విలియమ్ జేమ్స్ కూడా ఈ మాటల్ని చెప్పారు. ఒక ప్రయత్నానికి వచ్చిన ప్రభావంవల్ల జరిగిన మంచి సత్యం. మనకు మంచి కావాలి కనుక మనకు సత్యం కావాలి. నమ్మడం, అభిప్రాయపడడం ఇవి అర్థంలేనివి. ఆపై అనర్థదాయకమైనవి. అధ్యయనం చేస్తే కానీ అవగాహన రాదు. ఏది ఉందో, ఏది లేదో, ఏది అవునో, ఏది కాదో మనం తెలుసుకోవాలి. ఇకనైనా, ఇపుడైనా నిజానిజాలను తేల్చుకుందాం. కళ్లు తెరిస్తే కానీ దృశ్యం కనిపించదు. నిద్రలేస్తే కానీ నడక మొదలవదు. మనం నిద్రలేచి నడక మొదలుపెడదాం. ‘నా భావన’, ‘నేనేం అంటానంటే’ అన్న మధ్యతరగతి మాంద్యాన్ని వదిలించుకుందాం; ఉన్న మిథ్యలను విదిలించుకుని ముందుకెళదాం. ప్రయత్నించి సత్యాన్ని సాధిద్దాం; సత్యంతో మనుగడను సాగిద్దాం. ‘సత్యాన్ని అమృతంలా సేవించు’ అని అష్టావక్రగీత చెబుతోంది. సత్యాన్ని సేవించడానికి అలవాటు పడదాం. సత్యం రుచిగా ఉంటుంది. ఆ రుచిని తెలుసుకుందాం. ఆ తరువాత సత్యం రుచికి మాలిమి అయిపోయి జీవితాన్ని మనం రుచికరం చేసుకుందాం. సత్యం జ్ఞానాన్ని ఇస్తుంది. ‘జ్ఞానం స్వేచ్ఛకు ఆధారం’ అని తెలియజెప్పారు ఆదిశంకరాచార్య. సత్యం ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా స్వేచ్ఛను పొంది మనం సరిగ్గా, ఉన్నతంగా జీవిద్దాం; జీవితాన్ని విలువైందిగా చేసుకుందాం. అభిప్రాయాలు, అనుకోవడాలు, నమ్మకాలు వీటిని మనలో పేర్చుకుని మనల్ని మనం మోసుకోవడం జీవనం కాదు; వాటివల్ల మనలో మనం కూరుకు పోవడం జీవితం కాకూడదు. ఎరుకను అనుసరిద్దాం; ఎదుగుతూ ఉందాం. – రోచిష్మాన్ -
Viral Video: అలియా భట్‌కు కవలలు? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ranbir Kapoor Says He Having Twins With Alia Bhatt: బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగానే రణ్‌బీర్‌తో యాంకర్ సరదాగా ఒక గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో 'రెండు నిజాలు, ఒక అబద్ధం' చెప్పాల్సిందిగా రణ్‌బీర్‌ను ఆ యాంకర్ కోరారు. ఈ గేమ్‌లో మూడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు రణ్‌బీర్ కపూర్. యాంకర్ అడిగిన ప్రశ్నకు 'నేను కవలలకు తండ్రి కాబోతున్నాను. నేను చాలా పెద్ద పౌరాణిక చిత్రంలో భాగం కాబోతున్నాను. నేను పని నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నాను' అని మూడు ఆసక్తికర విషయాలు చెప్పాడు రణ్‌బీర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఏవి రెండు నిజాలు, ఏది ఒక అబద్ధం అని తేల్చుకోలేకపోతున్నారు నెటిజన్స్. తన భార్య అలియా భట్‌తో కలిసి బ్రహ్మాస్త్రం సినిమాలో రణ్‌బీర్ నటిస్తున్న విషయం తెలుసు కాబట్టి, పౌరాణిక చిత్రంలో భాగం కానున్నాను అనేది నిజమేనని ఊహించడం తేలికైంది. మిగతా రెండు విషయాలకొస్తే నిజంగా అలియా భట్‌కు ట్విన్స్ పుట్టనున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రణ్‌బీర్ సుధీర్ఘ విరామం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే రణ్‌బీర్ సినిమా కెరీర్‌కు రెండేళ్లు గ్యాప్ (2018లో చివరి సినిమా విడుదలైంది) వచ్చింది. దీంతో మరోసారి నిజంగా గ్యాప్ తీసుకుంటారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే 'అతను తండ్రి కాబోతున్నాడు. విరామం తీసుకునే అవకాశం ఉంది' అని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ఈ ప్రశ్నలన్నింటికి అసలైన సమాధానం దొరకాలంటే అలియా భట్ డెలివరీ దాకా ఆగాల్సిందే. -
కచ్చితంగా వాటిల్లో నిజం లేదు! తెగేసి చెప్పిన యూఎస్
US Says Absolutely No Truth: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలన పట్ల విముఖతతో ఉన్న ప్రతిపక్షాల తోపాటుగా సొంత పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు యత్నించారు కూడా. అయితే ఈ సంక్షోభానికి కారణం యూఎస్ అని ఇమ్రాన్ ఖాన్ గతంలోనే కొన్ని మిమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీల సహాయంతో తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి వాషింగ్టన్లో కుట్ర పన్నారని, ఇదంత విదేశీ కుట్ర అని ఆరోపణలు చేశారు. తన స్వతంత్ర విదేశాంగ విధానం కారణంగా తనపై ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేలా చేసిందని విమర్శలు గుప్పించారు. అయితే యూఎస్ అప్పుడే ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది కూడా. ఈ మేరకు శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మళ్లీ తాజాగా యూఎస్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. యూఎస్‌లోని ఒక సీనియర్ దౌత్యవేత్త పాకిస్తాన్లో పాలన మార్పుల పై బెదిరింపులకు దిగారంటూ ఆరోపణలు పునరుద్ఘాటించారు. విదేశాంగ శాఖలోని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లూ తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘విదేశీ కుట్ర’లో పాలుపంచుకున్నారని కూడా ఖాన్ ఆరోపించారు. అయితే యూఎస్ డిప్యూటీ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి జలీనా పోర్టర్ తాజా ఆరోపణలనింటిని ఖండించడమే కాకుండా వాటిలో ఏ మాత్రం నిజం లేదని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. తాము పాకిస్తాన్లో ఎదురవుతున్న పరిణామాలను గమనిస్తున్నామన్నారు. అంతేగాదు తాము పాకిస్తాన్ రాజ్యాంగ ప్రక్రియ, చట్ట నియమాలను గౌరవించడమే కాకుండా మద్దతు ఇస్తాం అని చెప్పారు. ఇలా ఖాన్ ఆరోపణలను అమెరికా బహిరంగంగా ఖండిచడం మూడోసారి. (చదవండి: భారత్‌పై పొగడ్తల ఎఫెక్ట్.. ఇమ్రాన్ ఖాన్‌పై నవాజ్ కూతురి తీవ్ర విమర్శలు) -
అబద్ధం లాంటి నిజం... నిజమైన అబద్ధం
నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా మహారాజా? అంటాడు ‘పాతాళభైరవి’లో తోటరాముడు. ఎందుకలా అడగాలి? నిజమే చెప్పచ్చు కదా? అబద్ధం కూడా ఓ ఆప్షన్ ఎందుకయ్యింది? ఎందుకంటే ఎక్కువ మంది కోరుకునేది అబద్ధం కావచ్చు. లేదా ఎక్కువ మంది చెప్పేవి అబద్ధాలు కావచ్చు. బుజ్జాయిలను ఊరడించడానికి అమ్మలు అందమైన అబద్ధం ఆడతారు. ‘చందమామ రావే...జాబిల్లి రావే.. కొండెక్కి రావే..గోగుపూలు తేవే‘ అని పాడతారు. నిజానికి చందమామ రానూ రాదు... గోగుపూలు తేనూ తేదు. చాలా సందర్భాల్లో అబద్ధాన్ని ప్రమోట్ చేసినంతగా నిజాన్ని ప్రమోట్ చేసినట్లు కనిపించదు. ‘వంద అబద్ధాలు ఆడినా సరే ఓ పెళ్లి చేయాల’న్నారు పెద్దలు. అంటే వైవాహిక జీవితం అలా కొన్ని అబద్ధాలతో మొదలవుతుందన్నమాట. అంతేకాదు ‘అబద్ధం ఆడితే గోడకట్టినట్లు ఉండాలి’ అంటారు. అంటే అబద్ధాన్ని ప్రమోట్ చేయడమేగా? ‘నిజం నిప్పు లాంటిది... దాన్ని దాచాలంటే దాగదు’ అంటారు. అది నిజంగా నిజం కాదు. పచ్చి అబద్ధం. బహుశా నిజం నిప్పులాంటిది అయితే అయి ఉండచ్చు. కాకపోతే అది నిజం చెప్పినవాళ్లనే అది కాల్చేస్తుంది. దానికి ఇటలీకి చెందిన బ్రూనో మరణమే తిరుగులేని నిదర్శనం. 16వ శతాబ్ధంలో పుట్టిన బ్రూనో ఖగోళ శాస్త్రజ్ఞుడు. భూమిని పోలిన గ్రహాలు... వాటి చుట్టూ తిరిగే ఉప గ్రహాలూ చాలా ఉన్నాయని లోకానికి చాటాడు. అంతే... నాటి మతపెద్దలు అది దైవద్రోహం అన్నారు. చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. బ్రూనో ఒప్పుకోలేదు. అంతా కలిసి బ్రూనోని సజీవదహనం చేశారు. బహుశా దీన్ని చూసిన తర్వాతే నిజం నిప్పులాంటిదని ఎవరికైనా తోచి ఉండచ్చు. ‘అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను’ అని మన న్యాయస్థానాల్లో పవిత్ర గ్రంథాల సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉంటారు. అలా ప్రమాణం చేసిన వాళ్లంతా నిజాలే చెబితే కోర్టుల్లో అసలు కేసులే ఉండకూడదు. వాళ్లు ఏం చెబుతున్నారో అందరికీ తెలుసు. కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవతకూ తెలుసు. మహాభారత యుద్ధంలో కౌరవుల ఆర్మీ కమాండర్‌గా ఉన్న ద్రోణాచార్యుడు తిరుగులేని యోధుడు. అతను ఉన్నంత సేపూ కౌరవులను ఓడించడం సాధ్యం కాదని కృష్ణుడికీ తెలుసు. అందుకే ద్రోణాచార్యుని ఓ అబద్ధంతో తప్పించాలని కృష్ణుడు ప్లాన్ చేశాడు. ఎప్పుడూ అబద్ధం ఆడని ధర్మరాజును పిలిచి చెవిలో ఓ ఉపాయం చెప్పాడు. ఆ వెంటనే అంతటి ధర్మరాజూ మరో ఆలోచన లేకుండా ‘అశ్వత్థామ హతః’ అని గట్టిగా అని... టోన్ డౌన్ చేసి ‘కుంజరః’ అన్నాడు. అంటే అబద్ధం ఆడకుండా, నిజం చెప్పకుండా ద్రోణుణ్ణి దెబ్బతీశాడన్నమాట. నిజం దాచిపెట్టడం కూడా అబద్ధమే కాబట్టి ధర్మరాజు ఎలాంటి మొహమాటాలూ లేకుండా అబద్ధం ఆడాడని మహాభారతమే చాటి చెప్పింది. ‘ఏం నిజాలే ఎందుకు చెప్పాలి? అవసరం పడితే అబద్ధం ఆడమని కృష్ణపరమాత్ముడే చెప్పాడు కదా నువ్వు ఆయన కన్నా గొప్పోడివేటి?’ అని ఎవరైనా లాజిక్ లాగితే... ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. సూర్యుడు ఏడు గుర్రాల రథంపై తిరుగుతూ ఉంటాడని నమ్మకం. ఖగోళశాస్త్రంలో పరిశోధనలు మొదలు కానంత వరకు అందరూ అదే నిజం అనుకున్నారు. కానీ గ్రహాల గురించి చదువుకున్నాక.. సూర్యుడు రథంపై తిరగడం లేదని.. ఆ మాటకొస్తే సూర్యుడు సౌర వ్యవస్థ మధ్యలో మఠం వేసుకుని కూర్చుంటే... ఆయన చుట్టూరా భూమి వంటి గ్రహాలు తిరుగుతున్నాయని తేలిన తర్వాత కూడా ఏడు గుర్రాలపై సూర్యుడు తిరుగుతాడని నమ్మేవాళ్లు ఉన్నారంటే... అందమైన అబద్ధం యొక్క గొప్పతనం అది. ఈ నిజాన్ని మొట్టమొదట కనిపెట్టింది కోపర్నికస్. ఆ తర్వాత గెలీలియో మరింత లోతుగా పరిశోధనలు చేసి ‘నాయనలారా... మనం ఇప్పటి వరకు అనుకుంటున్నట్లు సూర్యుడు ఎటూ తిరగడం లేదురా బాబూ. సూర్యుడి చుట్టూరా భూమి తిరుగుతోంటే... మనం ఖాళీగా ఉండడం ఎందుకని చంద్రుడు మన భూమి చుట్టూరా తిరుగుతున్నాడురా నాయనలారా’ అని చెప్పాడు. అంతే... ‘నువ్వు దైవదూషణకు పాల్పడుతున్నావ’ని మతపెద్దలు మండిపడ్డారు. ఎంత బెదిరించినా గెలీలియో తాను చెప్పిందే నిజమన్నాడు. దాంతో పాలకులు గెలీలియోని జీవితాంతం గృహనిర్బంధంలో పెట్టారు. నిజం చెప్పినందుకు దొరికిన బహుమానం అది. నిజాన్ని ప్రమోట్ చేయడానికి సత్యహరిశ్చంద్రుడి జీవితాన్ని చూపిస్తారు. ఎన్ని కష్టాలెదురైనా నిజానికే కట్టుబడి ఉండాలన్న హరిశ్చంద్రుని గొప్పతనాన్ని కొనియాడుతూ అందరూ నిజాలే చెప్పాలని సూచిస్తారు. హరిశ్చంద్రుని జీవితకథను చదివిన వారికి ఏమనిపిస్తుంది? నిజాలు చెబితే జీవితాంతం హరిశ్చంద్రుడిలా ఇలా కష్టాలు అనుభవించాలన్నమాట. దీని బదులు అబద్ధం చెప్పేసి హాయిగా ఉండచ్చు కదా అన్న కొంటె ఆలోచన వస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. నిజాలు చెప్పాలి. నిజమే. కానీ కొందరు అబద్ధాలు ఆడేస్తూ... కొందరే నిజాలు చెబితే రెంటి మధ్య ఘర్షణ వస్తుంది. ఎవరో ఎందుకు మహాసాధ్వి సీతమ్మ ఏం చేసింది? ‘అలో లక్ష్మణా’ అంటూ రాముడిలా రాక్షసుడు అరవగానే అంతటి దశరథుని కోడలూ అమాయకంగా నమ్మేసి ‘లక్ష్మణా... మీ అన్న కష్టాల్లో ఉన్నాడు వెళ్లి కాపాడు’ అనేసింది. ‘వదినమ్మా... అది రాముడి గొంతు కాదు ఏదో మాయ’ అన్నా సరే సీతమ్మ వినలేదు. అది అబద్ధమని లక్ష్మణుడికి తెలిసినపుడు సీతమ్మకు ఎందుకు తెలియలేదు? అంటే అబద్ధానికి ఉన్న పవర్ అది అని అర్థం చేసుకోవాలి. ఇటలీకి చెందిన నావికుడు కొలంబస్ అబద్ధంతో జీవితం గడిపేశాడు. రాణి ఇసాబెల్లా, రాజు ఫెర్డినాండ్ల ఆర్థికసాయంతో నావికా యాత్ర చేసిన కొలంబస్ అమెరికా తీరాన్ని చూసి భారత్ అనుకున్నాడు. తాను భారత్‌ను కనుగొన్నానని రాణిని నమ్మించాడు. అయితే అది భారత్ కాదని తర్వాత తేలింది. అప్పటికీ కొలంబస్ తాను ఆర్థిక సాయం పొందిన రాణికి నిజం చెప్పలేదు. కొలంబస్ అబద్ధం చెప్పాడని తెలిసిన తర్వాత రాజదంపతులు కొలంబస్ను క్షమించి వదిలేశారు. నిజం చెప్పిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేసే సమాజం... అబద్దం చెప్పిన వాళ్లకు ప్రాణభిక్ష పెట్టి ప్రోత్సహించిందన్నమాట. బహుశా ఇవి చూసిన తర్వాతే తోటరాముడికి ‘నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా?’ అన్న డైలమా వచ్చి ఉంటుంది. – సి.ఎన్.ఎస్. యాజులు -
రూపా దత్తా తప్పులో కాలేశారా?
సాక్షి, ముంబై: మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపణల అనంతరం బెంగాలీ నటి రూపా దత్తా కూడా ఇదే ఆరోపణలతో ముందుకు వచ్చారు. అయితే ఇక్కడే తీవ్ర గందరగోళం ఏర్పడింది. అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడంటూ దీనికి సంబంధించిన అనురాగ్ సఫర్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ చాట్ స్క్రీన్ షాట్స్ షేర్ చేయడంతో పెద్ద దుమారమే రేగుతోంది. మరోవైపు కశ్యప్‌కు స్త్రీల పట్ల ఏ మాత్రం గౌరవం లేదంటూ పాయల్ ఘోష్ ఆరోపణలను గట్టిగా సమర్ధించారు రూపా. అంతేకాదు ఆయన డ్రగ్స్ కూడా తీసుకుంటారని, కఠినంగాశిక్షించాలని కోరారు. ఎన్సీబీ తనిఖీలు చేపట్టాలని ట్వీట్ చేశారు. తాజా పరిణామంపై రూపా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (వాళ్లిద్దరికీ అతడితో సంబంధం: నటి స్పందన) అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన రూపా దత్తా ... అనురాగ్ సఫర్ 2014 నాటి ఛాటింగ్ షేర్ చేయడం సరికొత్త వివాదాన్ని రేపింది. ఐర్లాండ్ కు చెందిన అనురాగ్ సఫర్ 2010, సెప్టెంబరు చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. తాను దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను కాదని తనకూ అనురాగ్ కశ్యప్ కు సంబంధం లేదనే ఆ సమాచారాన్ని ట్వీట్ చేశాడు. అనురాగ్ సఫర్కి గతంతో అనురాగ్ కశ్యప్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఉండేదని, పలు మీడియా సంస్థలు కూడా అతడిని కశ్యప్ గా భావించడంతో ఈ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. కాగా పాయల్ ఘోష్ ఫిర్యాదు ఆధారంగా మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు. అయితే మీరు గొప్ప స్త్రీవాది అంటూ తాప్సీ పన్ను కశ్యప్‌కు కితాబివ్వడం విశేషం. ఈ ఆరోపణలు రుజువైతే కశ్యప్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటానని తాప్సీ ప్రకటించారు. మీటూ ఉద్యమానికి చెడ్డపేరు తేవద్దంటూ నటి స్వర భాస్కర్ కూడా రూపాను తప్పుబట్టారు. అలాగే సైయమీ ఖేర్, రాం గోపాల్ వర్మ, అనుభవ్ సిన్హా తోపాటు, అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కూడా కశ్యప్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలను అనురాగ్ ఇప్పటికే ఖండించారు. अनुराग कश्यप ख़ुद बोल रहा है मैं अनुराग कश्यप नहीं हूँ चैटिंग में।वाह ! पायेल घोष के साथ अश्लील हरकते करने के बाद भी बोल रहा है मैंने कुछ नहीं किया।गुनहगार गुनह करके स्वीकार नहीं करता ये स्वाभाविक है।अरेस्ट के बाद उसका भी तरीक़ा है गुनह कुबूलने की।चिन्ता ना करे सच सामने आएगा। — Rupa Dutta (@iamrupadutta) September 22, 2020 Pl Excuse me friends!!! I am not film director or producer Anurag Kashyap. I am another Anurag. Please do not bug me considering him. — Anurag Safar (@anurag_safar07) September 15, 2010 अनुराग कश्यप के नज़रों में किसी भी औरत का कोई इज्ज़त नहीं है।जो मुझे उसे जानने के बाद पता चला।इसीलिए पायेल घोष का इल्ज़ाम बिलकुल सही है।अनुराग कश्यप को कठोर से कठोर सज़ा मिलनी चाहिए।और यह ड्रग भी लेता है।अपने आर्टिस्ट को भी सप्लाई करता है NCB जांच करे कृपा।#arrestanuragkashyab pic.twitter.com/ckK5ZfUDOW — Rupa Dutta (@iamrupadutta) September 19, 2020 -
ధర్మాన్ని తెలుసు కోవడమే జ్ఞానం తత్త్వ రేఖలు
భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం హేతుబద్ధతను మించిన తర్కాన్ని ఏనాడో చేసింది. వాటి రూపాలే ఉపనిషత్తులు. పూర్ణమదః పూర్ణమిదం అంటూ ‘థియరీ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ’ సూత్రాన్ని సంస్కృత భాష వేల ఏళ్ల క్రితమే ఉద్భోధించింది. తదేజతి తన్నైజతి అంటూ విశ్వశక్తి గురించి అప్పుడే విశ్లేషణ చేసింది. కామం, సంకల్పం, సంశయం, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యం, అధైర్యం, లజ్జ, బుద్ధి, భయం అన్నీ మనోరూపాలేనని మానసిక శాస్త్రాన్నీ విడమర్చింది. ఇలా అనేక శాస్త్రాలకు బీజమేశాయి ఉపనిషత్తులు. వీటిని ఆకళింపు చేసుకుంటే ఆత్మ, పరమాత్మల ఏకత్వాన్ని అర్థం చేసుకోవడంతోపాటు ఆచరణలో పెట్టడం సాధ్యం అవుతుంది. తద్వారా మనిషి అరిషడ్వర్గాలను అణచివేసి, నిష్కామకర్మను దినచర్యగా చేసుకోగలుగుతాడు. నిష్కామకర్మ వలన ఎలాంటి భవబంధాలు మనిషిని తాకలేవు. తద్వారా మృత్యుంజయ మంత్రంలో చెప్పినట్టుగా మనిషి మృత్యుభావనను జయించి అమృతమయ జీవితాన్ని జీవించగలుగుతాడు. అదే ఆధ్యాత్మికజ్ఞాన లక్ష్యం.ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక సాధారణ మానవుడు రజ్జుసర్ప భ్రాంతిని పొందుతున్నాడు. అంటే ఈ కనిపించే భౌతిక రూపాలు సత్యమనుకుంటూ బంధనాలు వేసుకుంటున్నాడు. కులం మతం లాంటి బలహీనతలను పొందుతున్నాడు. ప్రకృతిలో మానవుడు ఒక భాగమేనన్న నిజాన్ని మనం అనుక్షణం గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్రాకృతిక రూపాలు ఏ విధంగా తమ తమ కర్మలను ఆచరించి ఇతర ప్రాకృతిక రూపాల మనుగడకు దోహదపడుతున్నాయో, ఆ విధంగా మానవుడు కూడా తన మానవత్వ కర్మలను ఆచరించి, పాంచభౌతిక రూపాన్ని సాధించి, చివరకు పంచభూతాల ద్వారా అనంతశక్తిగా మార్పుచెందడమే ధర్మం. అదే మోక్షం. దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. అజ్ఞానం చేత కర్మఫలాలు శాశ్వతం అనుకుంటున్నాం. అయితే, సృష్టి, స్థితి, లయలు అనేవి నిరంతర క్రియలు అని తెలుసుకుని కర్మఫలాలు ఆశించకుండా కర్మలు ఆచరించడమే నిష్కామకర్మ. ఏతావాతా నిష్కామకర్మకు ఆధారం జ్ఞానం. జ్ఞానమంటే హేతువాదమే! జ్ఞాన సాహిత్య నిధి అయిన ఉపనిషత్తులు, ఆదిశంకరుని అద్వైతాన్ని అవగాహనలోకి తెచ్చుకోవడం తద్వారా నిష్కామ కర్మలను ఆచరించడం ద్వారా అరిషడ్వర్గాలను చిదిమి వేయగలం. నిష్కామ కర్మ వల్ల ప్రతిఫలించే తాదాత్మ్యత హృదయాంతరాల నుండి మొదలుకొని ముఖవర్చస్సు వరకు ఆవహించి ఉంటుంది. అద్వైతజ్ఞాని ప్రతి జీవిలోనూ, నిర్జీవిలోనూ, పంచభూతాలలోనూ, శూన్యంలోనూ అంతర్లీనంగా ఉండే ఈశావాస్యమిదం సర్వాన్ని దర్శించగలుగుతాడు. ’అహం బ్రహ్మాస్మి’ని అనుభవించగలుగుతాడు. – గిరిధర్ రావుల -
సత్యాన్వేషణమే జ్ఞానం
చీకటి తొలగాలంటే వెలుగు కావాలి. అరిషడ్వర్గాలు తొలగాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానార్జన అంత సులభమైన విషయం కాదు. జ్ఞానమంటే హేతువును అర్థం చేసుకోవడం. జ్ఞానమంటే స్థితిని అవగతం చేసుకోవడం. కార్యకారణ తత్వాన్ని ఆకళింపు చేసుకోవడం. ఆత్మానాత్మ వివేకం పొందడమే జ్ఞానం. ఏతావాతా ‘నేను’ లోపల, బయట ఏముందో అవగతం చేసుకోవడమే జ్ఞానం. జ్ఞాని స్థితప్రజ్ఞుడు. అతనికి సుఖదుఃఖాలతో, జయాపజయాలతో, కష్టనష్టాలతో, ఆరోగ్యానారోగ్యాలతో, కలిమిలేములతో పనిలేదు. ఏదైనా సమానమే. కంటికి కనిపించే భౌతిక రూపాలన్నీ ఆ అనంతమైనశక్తి నుండి ఉద్భవించినవే. పంచభూతాల మేలిమి కలయిక వల్ల శరీరాలు ఏర్పడ్డాయని తెలుసుకోవడం, తిరిగి పాంచభౌతికమైనవన్నీ అదేశక్తిలో విలీనమవుతుందని అర్థం చేసుకోవడం జ్ఞానం. అదే అద్వైతవాదం. జ్ఞానం అనేది ఓ మానసిక తపస్సు. నిరంతర శోధన దృశ్యమాన ప్రపంచం లో ఉన్న మానవుడు దృశ్యమాన ప్రపంచం ద్వారా అదశ్యమైన శక్తిని సాధ్యం చేసుకోవడమే జ్ఞానం. అదే సత్యాన్వేషణ. మరి ఈ సత్యం అంటే ఏమిటి? ‘సతత యతీతి సత్యం’. అంటే నిరంతరంగా ఉండేదే సత్యం. నేను ఉంటానా? ఉండను. మీరు ఉంటారా? ఉండరు. చుట్టూతా ఉండే చెట్టు, పుట్ట, గట్టు, ఏరులు, నదులు, కొండలు, కోనలు ఏవీ నిరంతరంగా ఉండేవి కావు. అంతేనా సూర్యుని నుండి జన్మించిన భూమి నశించేదే. మనందరికీ ఆధారమైన సూర్యుడూ నశిస్తాడు. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు నశించి తిరిగి అనంతశక్తిలో భాగమవుతాయి. అంటే భౌతిక రూపంలో ఉన్న ఖగోళ పదార్థాలన్నీ తిరిగి ఆ అనంత ఖగోళ శక్తిగా మారిపోవడం అనేది, అదే శక్తి నుండి ఖగోళ పదార్థాలు రూపొందడం అనేది నిరంతర ప్రక్రియ. అదే విషయాన్ని అంటే దృశ్యమాన భౌతిక ప్రపంచం ఆ అనంతశక్తి నుండి ఏ విధంగా ఉద్భవిస్తుంది అనే విషయం బృహదారణ్యకోపనిషత్తు స్పష్టంగా వివరించింది. ఏ విధంగానైతే సాలీడు నుండి దారం వెలువడుతుందో, ఏ విధంగానైతే నిప్పు నుంచి నిప్పురవ్వ లు వెలువడతాయో, అదే విధంగా ఈ ఆత్మ(అనంతశక్తి) నుండి అన్ని రకాల శక్తులు, అన్ని రకాల లోకాలు, అన్ని రకాల దేవతలు(అభౌతిక జీవులు), సంపూర్ణ స్థూల జగత్తు ఉత్పన్నమౌతుంది. దానిని తెలుసుకో! దాని దగ్గరకు వెళ్ళు! అది సత్యానికే సత్యం! ఆ మూలాధార ప్రాణమే సత్యం! అలా చెప్పేదీ సత్యమే! – రావుల గిరిధర్ -
బంగారం లాంటి సత్యం
‘దేవుడు లేడు, రసవాదం లేదు అన్న విషయం కొండ మీదినుంచి గుండును దొర్లించినట్టు! అవి వున్నాయనుకోవడం, నమ్మగలగడం గుండును కొండ మీదకు ఎక్కించినట్లు. రెండో పనిని చేయలేక అందరూ మొదటి పనే చేస్తారు’ అంటాడు శ్రీపతి. ప్రాచీన కాలంలో రసవాదం ఉందా? సిద్ధులు, యోగులు తమ అవసరాన్ని బట్టి బంగారం చేసుకునేవారా? వేమన పద్యాల్లో పరుసవేది విద్యకు సంబంధించిన జ్ఞానాన్ని గుప్త సంజ్ఞల్లో అందించాడా? ఈ ప్రశ్నలకు జవాబులు విప్పుతూ ఆసక్తికరంగా సాగుతుంది చివుకుల పురుషోత్తం నవల ‘మహావేధ’. గంగాధరుండె దైవము సంగీతమె చెవులకింపు సర్వజ్ఞులకున్ బంగారమె యుపభోగము అంగజుడే మృత్యు హేతువరయుగ వేమా నీలకంఠశాస్త్రి ఇంటికి శ్రీపతి వెళ్లినప్పుడు అక్కడ సిద్ధవైద్యం చేసే రామారెడ్డి స్వామి పై పద్యం చదువుతుండటంతో నవల ప్రారంభం అవుతుంది. పైకి సామాన్యంగా కనబడే ఈ పద్యంలో బంగారం చేసే ప్రక్రియకు సంబంధించిన ఒక గురుసూత్రం ఒక పిసరును వేమన విడిచారంటాడు రామారెడ్డి స్వామి. వారి సంభాషణ రసవాదం వైపు మరలుతుంది. రసవాదంలో అదివరకే నమ్మకమున్న శ్రీపతికి ఇది ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. శ్రీపతి లోతుగా తన పరిశోధన మొదలుపెడతాడు. తన విశ్వాసాన్ని నిరూపించేందుకు యావజ్జీవితాన్ని పణంగా పెడతాడు. ఎన్నో దారుల్లో ప్రయాణిస్తాడు. ఎన్నో అనుభవాలను గడిస్తాడు. అయినవాళ్లకీ పరాయివాళ్లకీ కూడా కాకుండా పోతాడు. ఏవో ఆకులు, ఏవో పసరులు, ఏవో మూలకాలు, ఏవో పూజాద్రవ్యాలతో తన హోమం సాగిస్తాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో శాస్త్ర విజ్ఞానాల గురించీ, స్త్రీ పురుష సంబంధాల గురించీ, బ్రాహ్మణ శూద్ర అంతరాల గురించీ, అచల సంప్రదాయం గురించీ, ఎన్నో వ్యాఖ్యానాలను శ్రీపతి రూపంలో రచయిత చేస్తాడు. చిట్టచివరకు బంగారం కనిపెడతాడు శ్రీపతి. కానీ దాన్ని జనం ముందు ప్రదర్శన పెట్టినరోజు ‘విఫలమవుతాడు’. ఆయన మీద చెప్పులు, అరటి తొక్కలు, ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు విసిరేస్తారు. ఎవరివల్లయితే ఈ అన్వేషణకు పూనుకున్నాడో ఆ రామిరెడ్డి స్వామిని మాత్రం తన సత్రానికి తీసుకెళ్లి తను తయారుచేసిన బంగారుకడ్డీని ‘గురు బ్రహ్మార్పణమస్తు’ అని అందజేస్తాడు. రామిరెడ్డి ఆశ్చర్యపోతే, ‘మీకు తెలియాలి, మూర్ఖులకు తెలిస్తేనేం తెలియకపోతేనేం’ అంటాడు. బంగారం తయారుచేసే విద్య తెలిసినా అది లోకానికి తెలియడం వల్ల ప్రయోజనం లేదు. ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి కూడా ఒక అర్హత కావాలన్న అంతరార్థంతో నవల ముగుస్తుంది. -
తాగినోడి నోట నిజం...!
బూర్గంపాడు : ‘తాగినోడి నోట నిజం.. తన్నుకుని వస్తాదయ్యా..’ – అన్నాడో కవి.. ఏనాడో! ఇది నిజమేనని నిరూపితమైంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుందా..? చదవండి మరి... సారపాక పంచాయతీలోని శ్రీరాంపురం కాలనీకి చెందిన శ్యామల కృష్ణమూర్తి(35) అవివాహితుడు. అతనికి తల్లిదండ్రులు కూడా లేరు. అతను బోర్ మిషన్ వెంబడి కూలీ పనులకు వెళ్తుండేవాడు. ఎక్కడ బోరు పనులు ఉంటే అక్కడే నెలలతరబడి ఉండేవాడు. పనులు పూర్తయిన తరువాత ఇంటికి వచ్చేవాడు. అదే గ్రామానికి చెందిన కొర్సా రమేష్ అలియాస్ రామయ్యకు మూడువేల రూపాయలను కృష్ణమూర్తి అప్పుగా ఇచ్చాడు. డబ్బు ఇవ్వాలని ఎంత అడిగినా రమేష్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు నెలల కిందట (డిసెంబర్లో) డబ్బులు ఇవ్వాలని కృష్ణమూర్తి నిలదీశాడు. అప్పుడు రమేష్ మద్యం మత్తులో ఉన్నాడు. డబ్బులు ఇస్తానంటూ కృష్ణమూర్తిని శ్రీరాంపురం సమీపంలోగల అటవీప్రాంతానికి తీసుకెళ్లి చంపేశాడు. బోరు పనులకు కృష్ణమూర్తి వెళ్లుంటాడని గ్రామస్తులు, బంధువులు అనుకున్నారు. రమేష్‌కు వెట్టి ముత్తయ్య అనే వ్యక్తి కూడా అప్పు ఇచ్చాడు. తన అప్పు తీర్చాలంటూ రమేష్‌ను అతడు వారం కిందట గట్టిగా అడిగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రమేష్.. ‘‘అరే.. నన్ను డబ్బులు అడిగితే, కృష్ణమూర్తికి పట్టిన గతే నీకూ పడుతుంది’’ అని బెదిరించాడు. ముత్తయ్యకు అర్థమవలేదు. కృష్ణమూర్తికి ఏదో హాని జరిగిందని మాత్రం గ్రహించాడు. ఈ విషయాన్ని పోలీసులతో చెప్పాడు. రమేష్‌ను ఎస్ఐ సంతోష్ అదుపులోకి తీసుకుని విచారించారు. కృష్ణమూర్తిని తానే చంపినట్టుగా రమేష్ చెప్పాడు. చంపి పడేసిన ప్రదేశానికి తీసుకెళ్లి చూపించాడు. కృష్ణమూర్తి మృతదేహం పూర్తిగా కుళ్లి పోయింది. కేవలం పుర్రె, ఎముకలు మాత్రమే మిగిలాయి. ఆ స్థలాన్ని పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. కృష్ణమూర్తి సోదరుడు గంగయ్య ఫిర్యాదుతో కేసును ఎస్ఐ సంతోష్ దర్యాప్తు చేస్తున్నారు. -
వాస్తవం చెబితే సీఎంకు రుచించదా!
– సభలో ఎమ్మెల్యే ఐజయ్య మైక్ కట్ చేయడం అవమానకరం – వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ):ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వాస్తవం చెబితే రుచించదా అని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముచ్చుమర్రి, కేసీ కెనాల్ ఆయకట్టు కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. 2014లోనే దాదాపుగా 70 శాతం నిర్మాణ పనులు పూర్తయితే, చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. తనే పూర్తి చేసినట్లు రైతుల్ని నమ్మించడానికే చంద్రబాబు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆరోపించారు. వేదికపై నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య వాస్తవాలు తెలిపేందుకు ప్రయత్నించగా ఆయన మైక్ కట్‌చేసి నాయకులచేత బలవంతంగా అక్కడ్నుంచి పంపివేయడం అవమానకరమన్నారు. ఈ ఘటనను వైఎస్ఆర్సీపీ రైతు విభాగం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. -
అవిశ్వాసుల ఆగడాలు
ప్రవక్త జీవితం సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ధర్మం విస్తరిస్తున్నకొద్దీ అవిశ్వాసుల ఆగడాలు కూడా అధికమయ్యాయి. ప్రవక్తను, ఆయన అనుచరులను రకరకాల మాటలనడం, అపనిందలు వేయడం, వారిపైకి రౌడీమూకలను ఉసిగొల్పడం లాంటి వేధింపులు పెరిగిపోయాయి. అయినా సమాజంలోని సద్వర్తనులు, ఆలోచనాపరులు ధర్మపరివర్తన చెందుతూనే ఉన్నారు. ప్రవ క్త అనుచరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది వారిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఒకరోజు అవిశ్వాస ప్రముఖులు కాబా గృహంలో కూర్చొని ఈ విషయమే చర్చించుకుంటున్నారు. ‘మనమంతా చచ్చిన తరువాత మళ్ళీ బ్రతికి లేస్తామట. ఇక్కడ చేసిన పనుల్ని గురించి అక్కడ సమాధానం చెప్పుకోవాలట. మంచిపనులు చేస్తే సత్ఫలితమట, చెడ్డపనులు చేస్తే దుష్ఫలితమట.. వింత వింతగా ఉన్నాయి కదా ఈ మాటలు.. ఎప్పుడైనా విన్నామా ఇలాంటి ప్రేలాపనలు’ అన్నాడు అందులోని ఒక వ్యక్తి. ‘అంతే కాదు, స్వర్గనరకాలు కూడానట... బుద్ధిలేకపోతే సరి’ అన్నాడు మరోప్రబుద్ధుడు. ‘ఇదంతా కాదుగాని, అతన్నొకసారి ఇక్కడికి పిలిచి మాట్లాడదాం. నువ్వు చెప్పే మాటలకు రుజువులు, ఆధారాలు చూపించమని నిలదీద్దాం. ఈ విధంగా అతన్ని హింసించడానికి, వేధించడానికి మనకొక సాకు దొరుకుతుంది. ఎవరూ పల్లెత్తుమాట అనడానికి కూడా అవకాశం ఉండదు’ అన్నాడు మరొకడు. (వచ్చేవారం మరికొంత) - ఎండీ ఉస్మాన్‌ఖాన్ -
సత్యానికి సమాధి కట్టొద్దు!
- విశ్లేషణ మనిషికి, పశువుకు ఉన్న మౌలికమైన తేడాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ ఒకటి. పశువులు అత్యంత ప్రాథమిక సహజ లక్షణంతో మాత్రమే తమ భావ వ్యక్తీకరణ చేయగలవు. కాని మనిషి తన భాష సాయంతో హావభావాలను జోడించి మరీ భావాలను వ్యక్తం చేయగలడు. ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం అంటే మనుషులను పశువులుగా మార్చడమే. అలా భావాలను పరస్పరం చర్చించుకుని, సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియకు ఆస్కారం లేకుండా చంద్రబాబు ఏపీలో ద్వారాలు మూసేశారు. ఏ విషయంలో అయినా బలప్రయోగం ద్వారా వ్యతిరేకతను అణచివేయాలన్న తలంపే అసంబద్ధమైనది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ అయినా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా సరే, అణచివేతకు పాల్పడటమన్నది వారిలోని అభ ద్రతా భావాన్ని, ప్రజలపట్ల వారికి ఉన్న భయాన్ని బయట పడుతుందే కానీ అంతిమంగా అది వారికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. ఏ యుద్ధంలో అయినా ముందు మరణించేది ‘సత్యం’ అని అంటారు. అంటే వాస్తవాలను ప్రజలకు తెలియకుండా, సత్యాన్ని హత్య చేయాలన్న ప్రయత్నం సమాచార స్వేచ్ఛపైనే జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత వార్తా కథనాలతోపాటు, వీడియో దృశ్యాల ద్వారా జరిగిన వాస్తవం కళ్లకు కట్టినట్లు చానల్ చూసిన వారందరికీ తెలిసిపోతుంది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలివితక్కువ అత్యుత్సాహం వల్ల స్వయంగా ఏపీ సీఎం చంద్ర బాబు కూడా కన్నంలో దొరికినట్లుగా ప్రజలందరి ముందూ దొరికిపోయిన విషయం మనమెరిగిందే. ముద్రగడ పద్మనాభం ఉదంతంలో తమ దుర్మా ర్గానికి ప్రత్యక్ష సాక్ష్యం దొరకకుండా సాక్షి చానల్ ప్రసారాలపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాగుడుమూతలు లేని ‘సాక్షి’ వాస్తవాలను వక్రీకరించే ధోరణులు మితిమీరడంవల్ల ప్రజలకు రెండో కోణం తెలియజేయడం కోసం పత్రికను స్థాపిస్తున్నామని సాక్షి యాజమాన్యం మొద ట్లోనే ప్రకటించింది. ఆ స్ఫూర్తికి అనుగుణంగానే సాక్షి పత్రిక కొనసాగు తోంది. వాస్తవాలలోని రెండో కోణాన్ని, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ, వార్తలను, కథనాలను అందిస్తోంది. సాక్షి పత్రికలో శషభిషలు, చాటు మాటులు, దాగుడుమూతలు ఉండవు. వైఎస్సార్ అచరణ, ఆశయాలను ప్రతిబింబించేలా ఆ పత్రిక ఉంటోంది. అందులోని కథనాలను నేను లేదా మరొకరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ సాక్షి ప్రకటించ దలిచిన వాస్తవం మాత్రం అదే. కొన్ని పత్రికలు తాము ఏ రాజకీయ పార్టీ కొమ్ముకాయమని, నిష్పక్షపాతంగా, తటస్థంగా ఉంటామని చెప్పుకుం టాయి. సత్యానికి, అసత్యానికి మధ్య, ప్రజాశ్రేయస్సుకు ప్రజా వ్యతిరేకతకు మధ్య తాటస్థ్యం ఎక్కడ ఉంటుంది? దుర్మార్గానికి, సన్మార్గానికి మధ్య నిష్పక్ష పాతం ఎలా సాధ్యం? ఏదేమైనా, ‘వినదగునెవ్వరు చెప్పిన - వినినంతనె వేగపడక వివరింపదగన్’ అన్నారు. అయితే మా మాట తప్పితే మరో మాట విననీయం అని అనడం, ‘నేను చెప్పిందే విను... రెండో మాట వినకు’ అనేది సినిమాలో ‘డిక్టేటర్’కు చెల్లుతుందేమో కాని, ఇంకా పరిపూర్ణత సాధించన ప్పటికీ ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థకు మాత్రం చెల్లదు. పాలించేవారికి మూర్ఖత్వంతోపాటు, రోడ్డురోలరు తరహా మొరటుతనం కూడా పనికిరాదు. ఈరోజు ఉన్న పాలకులు వచ్చేసారి మారిపోవచ్చు. ఎవరికైనా ఇది వర్తిస్తుంది. ప్రతి సమాజంలోనూ - వర్గ, వర్ణ, లింగ తదితర ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అసమానతలు తొలగేవరకు నైతిక ఘర్షణ పూర్వక సమాజం దానితోపాటు భావ సంఘర్షణలూ ఉంటూనే ఉంటాయి. పాలకులు ఈ వాస్తవాన్ని గుర్తించి, తదనుగుణంగా ఓరిమితో చాకచక్యంగా వ్యవహరించాలి. అంతేగానీ, ప్రతిపక్ష భావజాలాన్ని అణచివేస్తే కుదరదు. ప్రజలు ఎంతకాలమో మూగజీవుల మాదిరి ఉండలేరు. బయటకు వెళ్లే మార్గాలు మూసివేసి, ఒక చిన్న గదిలో పిల్లిని బంధించి, అదేపనిగా హింసి స్తుంటే పిల్లి అయినా సరే పులిలా తిరగబడుతుంది. అందులో ప్రాణమున్న మనుషులు శవాలవలే, కట్టెలవలే వాలునేపడి కొట్టుకుపోరు. నిరంకుశత్వాన్ని ఎల్లకాలం భరించలేరు. ఎదురు తిరుగుతారు. నిరంకుశత్వాన్ని ఓడిస్తారు. అందునా సున్నిత అంశాలపట్ల పాలకులు మరింత జాగ్రత్తతో వ్యవహ రించాలి. ప్రస్తుతం ఏపీలో ముద్రగడ పద్మనాభం దీక్ష, తదనుగుణంగా కాపుల సంఘీభావ కార్యాచరణ నడుస్తున్నాయి. గతంలో, కాపు సామాజిక వర్గానికి చెందిన కాపునేత, కాంగ్రెస్ యువనేత వంగవీటి రంగా హత్యకు గురయ్యారు. కమ్మ కులానికి చెందిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన కులతత్వంతో వ్యవహరించలేదు. ప్రజలు ఎన్టీఆర్‌ను మూడు తరాల వెండితెర కథానాయకునిగా అభిమానించి, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన పదహారణాల తెలుగు జాతీయ నేతగా ఆదరించి, అనితర సాధ్యంగా గెలిపించారు. కానీ ఆయన కులానికే చెందిన, మిడిమేళపు దొరలు కొందరు తమవాడు మూడు దశాబ్దాల అనంతరం అధికారంలోకి వచ్చాడని, ఇక తమ ఆధిక్యతను చాటిచెప్పాలని ‘అతి’గా వ్యవహరింపసాగారు. ఎన్టీఆర్ వారాశిం చినట్లు వారి దూకుడును ప్రోత్సహించకపోగా, దానికి అడ్డు కట్టవేసే ప్రయ త్నం చేశారు. కుల వైషమ్యాలను తెగనాడుతూ తాను దుర్యోధన పాత్రలో అనితర సాధ్యంగా పల్కిన ‘కులము-కులమని’ అన్న సంభాషణ ఆయనకు ఇష్టమైన డైలాగ్! ఎన్టీఆర్‌నే ‘పరువు హత్య’ చేశారు అప్పటికే విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ రెండు సామాజిక వర్గాల పోరులో పైచేయి సాధించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగా నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను నడిరోడ్డుపై ఆయన దీక్షా శిబిరం లోనే అర్ధరాత్రి ప్రత్యర్థులు హత్య చేశారు. తమ నేత అయిన ఎన్టీఆర్ ఇలాంటి దుశ్చర్యలకు అంగీకరించడని భావించి అన్నగారికి తెలియకుండా జరిగిన, ఆయన అంతేవాసులు వేసిన ఈ పథకం ఆ తర్వాత తీవ్రమైన శాంతి భద్ర తల సమస్యగా మారి తదుపరి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ పిదప ఎన్టీఆర్ శ్రీమతి లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. ఆమె బీసీ లకు చెందిన మహిళ. తమ సామాజిక వర్గం కాని, ఆ వర్ణాంతర వివాహం కూడా తోడై ‘పరువు హత్య’ల మాదిరి, చివరకు తెలుగుదేశం పార్టీ నేతలే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేశారు. ప్రస్తుత సందర్భంలో ప్రభుత్వం మరింత సంయమనంతో వ్యవహ రించి ఉండాల్సింది. ఉదాహరణకు ముద్రగడ పుత్రుడు బాలు ఇచ్చిన ప్రక టన ‘సాక్షి’ పత్రికలో వచ్చింది. అలాగే ఆయన కుటుంబ సభ్యులను అవ మానకరంగా నిర్బంధించిన విజువల్స్ సాక్షి చానల్లో వచ్చాయి. కొన్ని చానళ్లలో, పత్రికల్లో ఈ వార్తలే లేవు. దాంతో ‘సాక్షి’పై ఆంక్షలు విధించి, అవి బయటకు రాకుండా నిలుపుదల చేస్తే - ఇంకెన్ని దారుణాలు, దుర్మార్గాలు జరుగుతున్నాయో - మనకి వార్తలు చేరడం లేదేమో అని జనం మరింత ఊహించుకుని, పుకార్ల షికార్లు చేసినా నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అది రాష్ట్రానికి, ప్రజలకూ ఏమీ మంచిది కాదు. పైగా అనవసరంగా, అనాలోచితంగానే ‘సాక్షి’కి ప్రజలలో విశ్వస నీయతనూ, ‘సాక్షి’ లేకపోతే.. ఎట్లా అనే ప్రచారాన్నీ ఇలాంటి చర్యలద్వారా తానే కల్పించినదౌతుంది ప్రభుత్వం. పైగా ‘‘సాక్షి చాన ల్ను, పత్రికనూ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని’’ యన మల రామకృష్ణుడి వంటి సీనియర్ నేత చేసిన ప్రకటన - ఉత్తర కుమార ప్రగల్భంగానే మిగిలిపోతుంది. అయినా తమకు ఎదు రులేదు. తాము నంది అంటే నంది, పంది అంటే పంది అని ప్రవ ర్తిస్తే ప్రభుత్వం భంగపడుతుంది. అక్రమానికి తలొగ్గని ధీరత్వం! అత్యవసర పరిస్థితిలో పత్రికలపై ఆంక్షలు, నిషేధాజ్ఞలు ఉన్న తరుణంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక యజమాని రామనాథ్ గోయెంకా వాటిని ఆమోదించలేదు. ఆచరించలేదు. అప్పుడు ఆయన కుమారుడు వచ్చి ‘‘నాన్నా! అన్ని పత్రికలూ - ఇందిరాగాంధీకి, అత్యవసర పరిస్థితికీ ఎలాగో సర్దుకుపోతూ, తలవంచుకు నడుస్తున్నాయి. మన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా అలాగే....’’ అని పూర్తి చేయకముందే ‘దిన మణి’, ‘ఆంధ్రప్రభ’ వంటి స్థానిక భాషా పత్రికల యాజమాన్యం మీరు తీసు కోండి! ఒక్క ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (ఆంగ్ల) పత్రికను మాత్రం నాకు ఉంచండి. ఈ లోకంలోకి మొలతాడు లేకుండా వచ్చాను. అంతగా అయితే మొలతాడు లేకుండానే పోతాను. అంతేగానీ నిరంకుశత్వానికి తలవొగ్గేది లేదని’’స్పష్టం చేశారట. అలాంటి ఆదర్శాలూ, వాటిని ఆచరించే యాజమా న్యాలూ, సంపాదకులు, పత్రికా సిబ్బందీ నేటికీ ఉన్నారు. చివరిగా - ఎన్టీఆర్‌కు ఆత్మగౌరవం, అందునా ఆంధ్రుల ఆత్మగౌరవం ముఖ్యం. ‘ఎవరీ కేంద్రం? ఎక్కడిది? కేంద్రం మిథ్య...’ అని ధిక్కరించగల ధైర్యం.. కుట్రలు, కుతంత్రాలు ఎరుగని ముక్కుసూటి మొండితనం ఉన్నది. ‘రాజసం’ ఎన్టీఆర్ ప్రధాన గుణం అని సినారే అననే అన్నారు. చంద్రబాబుకు తద్భిన్నంగా, లౌక్యం ఎక్కువ. నాలుగు కాసులు సాధించడం, ప్రజలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి సామదాన భేద దండోపాయాలతో పాటు, వంచనాత్మక చాణక్య రాజకీయం తెలిసినవాడు. ‘మోదీ’ శిక్షార్హుడు (మతతత్వవాదిగా) అన్న నోటితోనే, ‘మోదీ’ భారతదేశ అత్యున్నత ప్రధాని అని అనగలిగినవాడు.. బాబు రాజకీయం ముందు మోదీ సైతం ‘ఫ్లాట్’ అయి తీరుతాడని ఆయన అనుయాయుల భావన. అంతటి పాలనాపర కౌటి ల్యుడు - చూస్తూ చూస్తూ, ఇలాంటి అక్రమ ఆంక్షలను విధించి కొరివితో తలగోక్కొనే, చేయి దాటిపోయే పరిస్థితి రానివ్వరనీ ఆశిద్దాం! కొసమెరుపు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించడంపై జయప్రకాష్ నారా యణ్ను అభిప్రాయం అడిగినప్పుడు ‘వినాశకాలే విపరీత బుద్ధిః’ అన్నారట. ఎమర్జెన్సీ అనంతరం జేపీ వ్యాఖ్య అక్షరసత్యమై చరిత్రలో నిలిచిపోయింది. ఆ వ్యాఖ్య సారాంశం నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా వర్తిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. - డా॥ఎ.పి. విఠల్ వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు 9848069720 -
సత్యం - అసత్యం
రుజుమార్గం మానవుడు తన నిత్య జీవితంలో అసత్యానికి తావు లేకుండా సదా సత్యమే పలకడానికి ప్రయత్నించాలి. కానీ, నేడు చాలామంది సత్యాన్ని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లు కనిపించ డం లేదు. తమకు సంబంధించినంతవరకు ఇత రులు అబద్దమాడకూడదని కోరుకుంటారు. తాము మాత్రం ఇతరుల వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తు న్నామో ఆత్మపరిశీలన చేసుకోరు. సత్యమనే ఈ మహత్తర సుగుణాన్ని గురించి దైవ ప్రవక్త మహ మ్మద్ (స) ప్రజలకు ఎటువంటి హెచ్చరికతో కూడిన సందేశమిచ్చారో గమనిద్దాం. సత్యం మానవులను మంచివైపునకు మార్గ దర్శనం చేస్తుంది. మంచివారిని స్వర్గం వైపుకు తీసుకుపోతుంది. అలాగే అసత్యం మానవులను చెడువైపునకు మార్గదర్శనం చేస్తుంది. చెడు.. వారిని నరకం దాకా తోడ్కొని వెళుతుంది. సత్యానికి ఇంతటి మహత్తు, ప్రాముఖ్యత ఉన్నాయని అందరికీ తెలుసు. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు పలికేవారు కూడా సత్యానికి మించి సంపద మరొ కటి లేదని అంగీకరిస్తారు. అయినా ఆచరణలో మాత్రం అసత్యాన్నే ఆశ్రయిస్తారు. ఈనాటి పరిస్థితుల్ని మనం కాస్త నిశితంగా గమనిస్తే అసత్యం నేడు చెడుల జాబితా నుంచి మిన హాయింపు పొంది, ఒక కళగా రూపాంతరం చెందిందా అనిపిస్తుంది. తమ పబ్బం గడుపుకోవ డానికి చాలామంది తమకు ప్రయోజనాన్ని, లాభా లను చేకూర్చి పెట్టే ఒక సాధనంగా అబద్దాన్ని ఆశ్రయిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. కానీ, మహమ్మద్ (స) ఎట్టి పరిస్థితిలోనూ అబద్దం ఆడవద్దని, సత్యం పలికిన కారణంగా మీరు సర్వం కోల్పోయినా సరే అసత్యాన్ని ఆశ్రయిం చవద్దని హితవు పలికారు. అసత్యాన్ని గురించి రేపు దైవం ముందు సమాధానం చెప్పు కోవలసి ఉంటుందన్నారు. ఒక వేళ మానవ సహజ బలహీనత కారణంగా పొరపాటున ఏదైనా అస త్యం దొర్లిపోతే, దానికి చింతించి పశ్చాత్తాపంతో దైవాన్ని క్షమాపణ వేడుకోవాలని సూచించారు. ఈనాడు చాలామంది చిన్న చిన్న ప్రయోజనాల కోసం చాలా తేలిగ్గా అబద్దాలాడేస్తుంటారు. ఇక వ్యాపార లావాదేవీల విషయమైతే, అబద్దాలా డందే వ్యాపారం సాధ్యం కాదని, అబద్దమా డకుండా లాభాలు గడించలేమన్నట్లు ప్రవర్తి స్తుంటారు. కొందరైతే అసత్యాన్ని వ్యాపార చతురతగా భావించి గర్వపడుతుంటారు కానీ, సత్యవంతుడైన వ్యాపారి ఇహలోకంలో ప్రజలకు ప్రేమపా త్రుడవుతాడని, ప్రజల దీవెన పొందుతాడని, పర లోకంలో దైవప్రసన్నతను చూరగొంటాడని మహ మ్మద్ ప్రవక్త (స) చెప్పారు. కనుక సర్వకాల సర్వావస్థల్లో సత్యమే పలక డానికి, అబద్దాలకు దూరంగా ఉంటూ దేవుని ప్రేమకు పాత్రులు కావడానికి ప్రయత్నిద్దాం. అబద్దా లకోరును ప్రజలు ఎన్నటికీ విశ్వసించరు, ప్రేమిం చరు, ఆదరించరు, గౌరవించరు. అవునా...? - యం.డి. ఉస్మాన్‌ఖాన్ -
వడదెబ్బతో ఇద్దరి మృతి
భానుడి ప్రతాపం నానాటికీ పెరుగుతోంది. వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఇద్దరు మృతిచెందారు. ఖానాపురం వుండలం రాగంపేటకు చెందిన మొగిళి సత్యం(86) సుమారు 20 కిలోమీటర్ల దూరంలో గల వుండలంలోని చిలుకవ్మునగర్‌లోని తవు బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రవుంలో వడదెబ్బకు గురై చిలుకవ్మునగర్ సమీపంలో రోడ్డు పక్కనే మృతి చెందాడు. మరో ఘటనలో వరంగల్ నగరంలోని కరీమాబాద్ తొట్లవాడకు చెందిన పాకాల సారంగపాణి(58) మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చే శాడు. ఆ తర్వాత కాసేపటికే కళ్లుతిరిగి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. -
నిజం చంపుతుంది
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 4 కేప్కార్లోని ఐదు వందల ఇళ్లల్లో రాబర్ట్ది ఒకటి. అతని ఎదురిల్లు లిచీది. రెండు నెలల క్రితం రాబర్ట్ ఆ ఇంట్లోకి మారినప్పటినించి రాబర్ట్‌కి, అతని భార్య సిల్వియాకి ఓ సమస్య ఎదురైంది. అది ఎదురింటి లిచీయే. ఆమె సదా తమని గమనిస్తోందని వాళ్లు మొదటి వారంలోనే గ్రహించారు. వాళ్లు ఎప్పుడూ తలుపు తెరిచి బయటికి వెళ్లినా అంతసేపూ తెరిచి ఉన్న ఎదురింటి కిటికీ వెనీషియన్ బ్లైండ్స్ మూసుకుంటాయి. తమ కిటికీ వెనీషియన్ బ్లైండ్స్‌ని ఎప్పుడు ఎత్తిచూసినా ఆమె కిటికీ వెనీషియన్ బ్లైండ్స్ వెనక రెండు కళ్లు కనిపించసాగాయి. వాటిని తెరిచి లిచీ తమ ఇంటినే గమనిస్తోందని వారు ఇట్టే గ్రహించారు. అది వాళ్లకి ఇబ్బందిగా ఉంది. ‘తెల్లవారుఝామున నాలుగున్నరకి బాత్రూంలో లైట్ వెలిగిందే? నిన్న రాత్రి మీలో ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? మీ మధ్య పోట్లాటలే ఉండవనుకుంటా. మీ ఇద్దరి గొంతులూ నేనెప్పుడూ వినలేదు’ లాంటివి లిచీ తమ డోర్ బెల్ నొక్కి అడిగి తెలుసుకుని, తను చేసిన ‘ఏపిల్ పై’ నో, గుమ్మడి సూప్నో ఇచ్చి వెళ్తూంటుంది. రాబర్ట్, సిల్వియాలు ఆ సమస్య మీద చర్చించుకున్నారు. ‘‘ఆమెకి ఇంతదాకా పెళ్లికాలేదు. బహుశ ఓ జంటని గమనించడం ఆమెకి ఆనందాన్నిస్తుందేమో?’’ సిల్వియా చెప్పింది. ‘‘లేదా అసూయతో చూస్తోందేమో?’’ రాబర్ట్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘‘అసూయే అయితే కష్టమే. అది మనకి మంచిది కాదు.’’ సిల్వియా చెప్పింది. ‘‘ఆవిడతో మనకి స్నేహమూ లేదు. శత్రుత్వమూ లేదు. స్నేహం కలిగితే ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి లిచీ పలకరించినా ఆమెతో మాట్లాడకు. శత్రుత్వం ఉంటే మనమీద ఆసక్తి పోతుంది’’ రాబర్ట్ సూచించాడు. ‘‘నాకన్నా మీరే తెలివిగలవారు. కాబట్టి ఎలా శత్రువులం అవుతామో కూడా మీరే ఆలోచించండి.’’ రాబర్ట్ నాలుగైదు రోజులు ఆలోచించాక చెప్పాడు. ‘‘రేపు ఏప్రిల్ ఫస్ట్. మనకి లిచీతో శత్రుత్వం తెచ్చుకోడానికి ఓ మంచి అవకాశం వచ్చే రోజు.’’ ‘‘ఎలా?’’ సిల్వియా ప్రశ్నించింది. ‘‘మనం ఏదైనా నేరం చేసినట్లుగా లిచీ పోలీసులకి ఫిర్యాదు చేసేలా చేస్తే వాళ్లు మన దగ్గరికి వస్తారు. ఆ నేరం జరగలేదని తెలిశాక మనమీద తప్పుడు ఫిర్యాదు ఇచ్చినందుకు వాళ్లు లిచీని మందలిస్తారు. దాంతో తనని ఫూల్ చేసినందుకు ఆమెకి మనమీద ద్వేషం కలుగుతుంది.’’ ‘‘బావుంది. ఆ తర్వాత మన ఇంటి బయట ‘ఏప్రిల్ ఫూల్’ అనే బోర్డుని ఉంచుదాం. అది చూసినప్పుడల్లా ఆమె మనసు భగ్గుమంటుంది. ఇక మన జోలికి రాదు. కాని ఏం నేరం చేసినట్లుగా మనం నటించాలి?’’ సిల్వియా నవ్వుతూ ప్రశ్నించింది. ‘‘పోలీసులు తక్షణం చర్య తీసుకునే నేరం ఒకటి ఉండనే ఉందిగా’’ రాబర్ట్ నవ్వుతూ చెప్పాడు. ‘‘ఏమిటది?’’ సిల్వియా ఆసక్తిగా అడిగింది. ఇంటి బయట తన కారు దగ్గరికి వచ్చిన సిల్వియాకి ఎదురింటి కిటికీ బ్లైండ్స్ మూసుకోవడం కనపడింది. లిచీ అక్కడే ఉండి సన్నటి కంతలోంచి తనని గమనిస్తోందని ఆమెకి తెలుసు. ‘‘సిల్వియా. ఇంట్లోకి రా’’ రాబర్ట్ గుమ్మంలోంచి గట్టిగా పిలిచాడు. బయట కారు దగ్గర ఉన్న సిల్వియా లోపలకి రాకపోవడంతో రాబర్ట్ మళ్లీ అరిచాడు. ‘‘సిల్వియా. నిన్నే! రమ్మన్నాను.’’ ‘‘నేను రాను రాబర్ట్. నీతో విసిగిపోయాను. నువ్వో మృగానివి. ఇక నీతో కలసి జీవించలేను’’ సిల్వియా కోపంగా అరిచింది. లిచీ చెవిటిదైతే తప్ప ఆమెకి వారి మాటలు వినపడకుండా ఉండవు. రాబర్ట్ బయటికి పరిగెత్తుకు వచ్చి సిల్వియా చేతిని గట్టిగా పట్టుకుని లోపలికి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె విదిలించుకుని అరిచింది. ‘‘వదలండి. నన్నాపద్దు. మీరు సారీ చెప్పరు. నేను వెళ్తున్నాను. మీకు విడాకులు ఇవ్వదలచుకున్నాను.’’ ఆ కుటుంబ కలహాన్ని లిచీ కళ్లు పెద్దవి చేసుకుని ఆసక్తిగా గమనించసాగింది. ‘‘తప్పు నీది. ఐనా సారీ చెప్పనన్నావు. సారీ చెప్పి ఇంట్లోకి రా. నేనెందుకు సారీ చెప్పాలి?’’ రాబర్ట్ కంఠం పెంచాడు. ‘‘మీరు ఇప్పుడు సారీ చెప్పినా నేను రాను.’’ వెంటనే రాబర్ట్ ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్లి చేతిలో ఓ సుత్తితో బయటికి వచ్చి అడిగాడు. ‘‘ఆఖరిసారి అడుగుతున్నాను. మర్యాదగా ఇంట్లోకి రా.’’ ‘‘రాను. ఏం చేస్తారేమిటి?’’ సిల్వియా ఉక్రోషాన్ని నటిస్తూ అడిగింది. ఆమె కన్ను కొట్టింది. రాబర్ట్ నవ్వుని ఆపుకుని సుత్తితో ఆమె నెత్తిమీద కొట్టినట్లు నటించాడు. ముందు అనుకున్నట్లుగా సిల్వియా కెవ్వున అరిచి నేలమీద కూర్చుంది. రాబర్ట్ మరో రెండు దెబ్బలు వేయడం లిచీ చూసింది. కాని కారువెనక కూర్చున్న సిల్వియాకి అవి తాకాయో లేదో కనపడలేదు. ఆమె అరుపులు మాత్రం వినపడ్డాయి. రాబర్ట్ కారు డిక్కీ తలుపు తెరిచి అందులో సిల్వియా శరీరాన్ని ఉంచి మూసి కారెక్కి పోనించాడు. కొద్ది దూరం వెళ్లాక తమ పథకం ప్రకారం కారుని ఆపి సిల్వియాని ముందు సీట్లో ఎక్కించుకోవాలని కారుని ఆపబోయాడు. దాని వేగం తగ్గగానే వెనక నించి వచ్చే ఓ లారీ అతని కారు వెనక ఫెండర్‌ని ఎడమవైపు రాసుకుంటూ వెళ్లిపోయింది. ‘ఇడియట్’ అని తిట్టుకుంటూ కారు దిగి డిక్కీ తలుపు తెరిచాడు. సిల్వియా గడ్డం నించి కిందికి కారుతున్న రక్తాన్ని చూశాడు. ఆమె మరణించిందని కొద్ది నిమిషాల్లో తెలుసుకున్న రాబర్ట్‌కి ముచ్చెమటలు పోశాయి. జీవం లేకుండా చూేన సిల్వియా కళ్లని చూడలేక కనురెప్పలని మూసేశాడు. అతనిలో దుఃఖం, భయం రెండూ సమానంగా తన్నుకు వచ్చాయి. ఆ సరికే లిచీ పోలీసులకి ఫోన్‌చేసి ఉండచ్చు. తను ఇంటికి తిరిగి వెళ్లేసరికి వాళ్లు తనకోసం ఎదురు చూస్తూంటారు. ఎంతో నైపుణ్యంగా తను అల్లిన సాలెగూడులో తనే చిక్కుకున్నాడు! రక్తం డిక్కీలోకి కారకుండా దుప్పటి మీదకి కారడం అదృష్టం అనుకున్నాడు. ఆమె తప్ప మరో సాక్షి లేరు. ఒంగి ‘సిల్వియా! సారీ’ అని ఆమె శవాన్ని ఎత్తి భుజాన వేసుకున్నాడు. టూల్ బాక్స్‌లో తవ్వడానికి అణుగుణంగా ఓ పెద్ద స్క్రూ డ్రైవర్ కనిపించింది. ఉదయం పదిన్నరకి డోర్ బెల్ మోగితే రాబర్ట్‌కి మెలకువ వచ్చింది. గత రాత్రి జరిగింది గుర్తుకురాగానే పోలీసులు వచ్చి ఉంటారని అనుకున్నాడు. లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా లిచీ! చేతిలోని గిన్నెలో హేంబర్గర్, చికెన్ శాండ్విచ్లు కనిపించాయి. ‘‘సిల్వియా వెళ్లిపోయిందిగా. ఇక మీ ఆలనా పాలనా నేనే చూసుకుంటాను. ఇదవకండి.’’ చెప్పి దాన్ని ఇచ్చి వెళ్లిపోయింది. అతనికి చాలా రిలీఫ్ కలిగింది. ఆ మధ్యాహ్నం లిచీ మళ్లీ వచ్చింది. ‘‘రేపట్నించీ మా ఇంట్లోనే మీ తిండి, పడక. ఒకే పడక మనది. దీన్ని ఖాళీ చేసేయండి. ఇవాళ నేనే వండుతాను. దేనికి పోట్లాడుకున్నారు?’’ వంట చేస్తూ లిచీ ప్రశ్నించింది. ‘‘మా మధ్య పోట్లాట లేదు. మిమ్మల్ని దూరంగా ఉంచాలని...’’ నిజాన్ని దీనంగా లిచీకి వివరించాడు. ఆమె దాన్ని మౌనంగా విని దీర్ఘంగా నిట్టూర్చింది. లిచీ వంట అధ్వానంగా ఉంది. అతను తిన్నాక బయటికి వెళ్తూ గుమ్మం దగ్గర ఆగి చెప్పింది. ‘‘మీరు ఆ నిజం చెప్పకుండా ఉండాల్సింది. కొన్ని నిజాలు సుత్తి దెబ్బల కన్నా బాధిస్తాయి.’’ ‘‘సారీ’’ వెంటనే ఆమెకి క్షమాపణ చెప్పాడు. గంట తర్వాత డోర్ బెల్ మోగింది. ఆమె మనసు మార్చుకుని సారీ చెప్పడానికి వచ్చిందని అనుకుని లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా యూనిఫాంలోని పోలీసులు. ఒకడు అతని కారు డిక్కీ తలుపు తెరిచి చూస్తున్నాడు. ‘‘మీమీద ఓ ఫిర్యాదు అందింది’’ రెండో పోలీస్ అధికారి చెప్పాడు. లిచీ ఇంటి కిటికీ బ్లైండ్స్ కొద్దిగా పెకైత్తి ఉన్నాయి. -
కత్తిలాంటి నిజం!
చరిత్ర రాబిన్ హుడ్ నిజంగానే ఉన్నాడా? కల్పిత పాత్ర? అనే చర్చలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ‘‘ఇలాంటి మనిషి ఒకడుంటే ఎంత బాగుండేది!’’ అని ఆశించే రచయితల కల్పనలో నుంచి పుట్టిన పాత్ర ‘రాబిన్‌హుడ్’ అని కొందరు అన్నారు. ‘‘అదేమీ కాదు. రాబిన్‌హుడ్ నిజంగానే ఉన్నాడు. రోజర్ గాడ్బెర్డ్ అనే రైతే...రాబిన్ హుడ్!’’ అని బలంగా వాదించిన వారూ ఉన్నారు. ఈ వాదానికి బలం చేకూరుస్తూ డేవిడ్ బాల్డ్విన్ అనే ఆయన ‘రాబిన్ హుడ్: ది ఇంగ్లీష్ ఔట్లా అన్మాస్క్డ్’ పేరుతో పుస్తకం కూడా రాశారు. ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే...‘‘రాబిన్ హుడ్ దారి దొంగ మాత్రమే...అంతకు మించి ప్రాధాన్యత లేదు’’ అని కొందరు నమ్మితే ‘‘దారిదొంగ, గజదొంగ అనే మాటలు నిజమేగానీ, మానవత్వం మూర్తీభవించిన దొంగ. పెద్దలను దోచి పేదలకు పెట్టేవాడు’’ అని కొందరు కీర్తించేవారు. ఇక రాబిన్‌హుడ్ ఏ ప్రాంతానికి చెందిన వాడు? ఏ అడవిలో సంచరించాడు? అతని స్థావరం ఏమిటి? అనేదాని గురించి కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ వాదనలలో పుస్తకాలలో సమాచారం తప్ప ‘భౌతిక ఆధారాలు’ పెద్దగా తొంగి చూడలేదు. తాజా విషయం ఏమిటంటే... ‘‘రాబిన్‌హుడ్ యాంక్షైర్(ఇంగ్లాండ్)కు చెందిన వాడే అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి’’ అంటున్నారు డాన్‌కాస్టర్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీకి చెందిన ఉద్యోగులు. డాన్‌కాస్టర్ మ్యూజియం క్యూరేటర్ క్లారన్ డాల్టన్ 14వ శతాబ్దానికి చెందిన కత్తిని మీడియా వర్గాలకు చూపుతూ చాలాసేపు మాట్లాడారు. ‘‘రాబిన్‌హుడ్ యాంక్షైర్కు చెందిన వాడు అని చెప్పడానికి ఇదొక ఆధారం మాత్రమే’’ అని చెప్పారు ఆమె. బహుశా...యాంక్షైర్లో రాబిన్‌హుడ్ తిరుగాడిన ప్రాంతంలో ఈ కత్తి దొరికి ఉంటుంది. తమ వాదనకు బలం చేకూర్చే మరిన్ని భౌతిక ఆధారాలు కూడా ఉన్నాయని డాల్టన్ చెబుతున్నారు. ఈ భౌతిక ఆధారాల గొడవ మాట ఎలా ఉన్నా...రాబిన్ గురించి మరోసారి తృప్తిగా మాట్లాడుకునే అవకాశం ఆయన అభిమానులకు కలిగింది.