సత్యం - అసత్యం
రుజుమార్గం
మానవుడు తన నిత్య జీవితంలో అసత్యానికి తావు లేకుండా సదా సత్యమే పలకడానికి ప్రయత్నించాలి. కానీ, నేడు చాలామంది సత్యాన్ని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లు కనిపించ డం లేదు. తమకు సంబంధించినంతవరకు ఇత రులు అబద్దమాడకూడదని కోరుకుంటారు. తాము మాత్రం ఇతరుల వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తు న్నామో ఆత్మపరిశీలన చేసుకోరు. సత్యమనే ఈ మహత్తర సుగుణాన్ని గురించి దైవ ప్రవక్త మహ మ్మద్ (స) ప్రజలకు ఎటువంటి హెచ్చరికతో కూడిన సందేశమిచ్చారో గమనిద్దాం.
సత్యం మానవులను మంచివైపునకు మార్గ దర్శనం చేస్తుంది. మంచివారిని స్వర్గం వైపుకు తీసుకుపోతుంది. అలాగే అసత్యం మానవులను చెడువైపునకు మార్గదర్శనం చేస్తుంది. చెడు.. వారిని నరకం దాకా తోడ్కొని వెళుతుంది. సత్యానికి ఇంతటి మహత్తు, ప్రాముఖ్యత ఉన్నాయని అందరికీ తెలుసు. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు పలికేవారు కూడా సత్యానికి మించి సంపద మరొ కటి లేదని అంగీకరిస్తారు. అయినా ఆచరణలో మాత్రం అసత్యాన్నే ఆశ్రయిస్తారు.
ఈనాటి పరిస్థితుల్ని మనం కాస్త నిశితంగా గమనిస్తే అసత్యం నేడు చెడుల జాబితా నుంచి మిన హాయింపు పొంది, ఒక కళగా రూపాంతరం చెందిందా అనిపిస్తుంది. తమ పబ్బం గడుపుకోవ డానికి చాలామంది తమకు ప్రయోజనాన్ని, లాభా లను చేకూర్చి పెట్టే ఒక సాధనంగా అబద్దాన్ని ఆశ్రయిస్తున్నారంటే అతిశయోక్తి లేదు.
కానీ, మహమ్మద్ (స) ఎట్టి పరిస్థితిలోనూ అబద్దం ఆడవద్దని, సత్యం పలికిన కారణంగా మీరు సర్వం కోల్పోయినా సరే అసత్యాన్ని ఆశ్రయిం చవద్దని హితవు పలికారు. అసత్యాన్ని గురించి రేపు దైవం ముందు సమాధానం చెప్పు కోవలసి ఉంటుందన్నారు. ఒక వేళ మానవ సహజ బలహీనత కారణంగా పొరపాటున ఏదైనా అస త్యం దొర్లిపోతే, దానికి చింతించి పశ్చాత్తాపంతో దైవాన్ని క్షమాపణ వేడుకోవాలని సూచించారు. ఈనాడు చాలామంది చిన్న చిన్న ప్రయోజనాల కోసం చాలా తేలిగ్గా అబద్దాలాడేస్తుంటారు. ఇక వ్యాపార లావాదేవీల విషయమైతే, అబద్దాలా డందే వ్యాపారం సాధ్యం కాదని, అబద్దమా డకుండా లాభాలు గడించలేమన్నట్లు ప్రవర్తి స్తుంటారు.
కొందరైతే అసత్యాన్ని వ్యాపార చతురతగా భావించి గర్వపడుతుంటారు కానీ, సత్యవంతుడైన వ్యాపారి ఇహలోకంలో ప్రజలకు ప్రేమపా త్రుడవుతాడని, ప్రజల దీవెన పొందుతాడని, పర లోకంలో దైవప్రసన్నతను చూరగొంటాడని మహ మ్మద్ ప్రవక్త (స) చెప్పారు.
కనుక సర్వకాల సర్వావస్థల్లో సత్యమే పలక డానికి, అబద్దాలకు దూరంగా ఉంటూ దేవుని ప్రేమకు పాత్రులు కావడానికి ప్రయత్నిద్దాం. అబద్దా లకోరును ప్రజలు ఎన్నటికీ విశ్వసించరు, ప్రేమిం చరు, ఆదరించరు, గౌరవించరు. అవునా...?
- యం.డి. ఉస్మాన్‌ఖాన్