
Namitha Visits Temple With Her Twin Baby Boys: బ్యూటిఫుల్ హీరోయిన్ నమితను చూసినా, ఆమె పేరు విన్న కుర్రకారులో ఒక్కసారిగా జోష్ పెరుగుతుంది. కారణం ఆమె వారిని ఎక్కడ చూసినా మచ్చాస్ అంటూ ఫ్లైయింగ్ కిస్‌ల వర్షం కురిపించడమే. ఇక సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ అందాల ఆరబోతతో యువతను గిలిగింతలు పెడుతుంది. విజయకాంత్ సరసన ఎళుగళ్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయికిగా దిగుమతి అయింది ఈ గుజరాతి భామ నమిత. ఆ తర్వాత అజిత్, విజయ్, చరణ్ కుమార్ వంటి ప్రముఖ హీరోలందరితో జతకట్టి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
అదేవిధంగా తెలుగు, మలయాళం వంటి ఇతర చిత్రాలలో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. సినిమాలో నటిస్తూనే ఇతర వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారవేత్తగా ఎదిగిన ఈమె 2017లో వీరేంద్ర చౌదరి అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా ఆ మధ్య తను గర్భిణిగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి త్వరలో మాతృమూర్తిని కాబోతున్నట్లు సంతోషం వ్యక్తం చేసింది.
చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడో తెలుసా?
తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం
ఇక ఈ శుక్రవారం (ఆగస్టు 19) అనూహ్యంగా భర్త, ఇద్దరు పురిటి బిడ్డలతో దైవ దర్శనం చేసుకుంటున్న ఫొటోలతో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం అయ్యింది. అందులో తాను చెన్నైలోని రేలా ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఇద్దరూ మగ పిల్లలే అని, క్షేమంగా ఉన్నారనీ తెలిపింది. ఈ సందర్భంగా తనకు వైద్యం అందించిన ఆ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈమె ప్రసవం ఎప్పుడు జరిగిందన్నది మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా నమిత కవల పిల్లలకు జన్మనిచ్చిందన్న విషయం తెలిసి ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు.
చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు