Visit temples
-
కవల పిల్లలతో దైవ దర్శనం చేసుకున్న నమిత
Namitha Visits Temple With Her Twin Baby Boys: బ్యూటిఫుల్ హీరోయిన్ నమితను చూసినా, ఆమె పేరు విన్న కుర్రకారులో ఒక్కసారిగా జోష్ పెరుగుతుంది. కారణం ఆమె వారిని ఎక్కడ చూసినా మచ్చాస్ అంటూ ఫ్లైయింగ్ కిస్ల వర్షం కురిపించడమే. ఇక సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ అందాల ఆరబోతతో యువతను గిలిగింతలు పెడుతుంది. విజయకాంత్ సరసన ఎళుగళ్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయికిగా దిగుమతి అయింది ఈ గుజరాతి భామ నమిత. ఆ తర్వాత అజిత్, విజయ్, చరణ్ కుమార్ వంటి ప్రముఖ హీరోలందరితో జతకట్టి టాప్ హీరోయిన్గా ఎదిగింది. అదేవిధంగా తెలుగు, మలయాళం వంటి ఇతర చిత్రాలలో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. సినిమాలో నటిస్తూనే ఇతర వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారవేత్తగా ఎదిగిన ఈమె 2017లో వీరేంద్ర చౌదరి అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా ఆ మధ్య తను గర్భిణిగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి త్వరలో మాతృమూర్తిని కాబోతున్నట్లు సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడో తెలుసా? తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం ఇక ఈ శుక్రవారం (ఆగస్టు 19) అనూహ్యంగా భర్త, ఇద్దరు పురిటి బిడ్డలతో దైవ దర్శనం చేసుకుంటున్న ఫొటోలతో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం అయ్యింది. అందులో తాను చెన్నైలోని రేలా ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఇద్దరూ మగ పిల్లలే అని, క్షేమంగా ఉన్నారనీ తెలిపింది. ఈ సందర్భంగా తనకు వైద్యం అందించిన ఆ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈమె ప్రసవం ఎప్పుడు జరిగిందన్నది మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా నమిత కవల పిల్లలకు జన్మనిచ్చిందన్న విషయం తెలిసి ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) -
దేవుళ్లకు మొక్కాను.. పూజించ వచ్చాను
పెదవేగి రూరల్/ద్వారకా తిరుమల : రియో ఒలింపిక్స్‌లో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం ద్వారకాతిరుమల చినవెంకన్న, రాట్నాలకుంట రాట్నాలమ్మను దర్శించుకున్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు రాట్నాలమ్మ, చినవెంకన్న, మద్ది ఆంజనేయస్వామికి మొక్కుకున్నానని, ఆ మొక్కులు తీర్చుకునేందుకు వచ్చానని చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి చినవెంకన్నకు పూజలు చేసిన అనంతరం రాట్నాలమ్మ దర్శనానికి వెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా పాల పొంగలి వండి.. ఆ పాత్రను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లక్ష్యంపై గురి పెడితే గెలుపు తలుపు తెరుచుకుంటుందని ఈ సందర్భంగా యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ స్వాగతం జీవితంలో మరచిపోలేను ఒలింపిక్ క్రీడల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని, పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాట్నాలమ్మ దేవస్థానానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన సింధుకు స్థానిక నాయకులు పుష్పగుచ్ఛం అందించిన అనంతరం గోపన్నపాలెం వ్యాయామ కళాశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. సింధు భక్తిశ్రద్ధలతో రాట్నాలమ్మను దర్శించుకుని రియో ఒలింపిక్స్‌కు వెళ్లేముందు మొక్కుకున్న మొక్కుబడులను తీర్చుకున్నారు. ప్రసాదాన్ని తలపై పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్థానిక నాయకులు, దేవస్థాన సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించి రాట్నాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. అనంతరం సింధు విలేకరులతో మాట్లాడుతూ రాట్నాలమ్మ దయవల్ల తాను ఈ స్థాయికి ఎదిగానని, తన ఆటలో అమ్మవారు వెన్నంటే ఉన్నట్టే భావించి నిరంతరం కష్టపడి భారతదేశానికి పతకం సా«ధించానని చెప్పారు. ఈ విజయం వెనుక అటు చిన తిరుపతి వెంకన్నస్వామి, ఇటు రాట్నాలమ్మ, మద్ది ఆంజనేయస్వామి ఆశీస్సులు అడుగడుగునా తనకు ఉన్నాయని, అందుకే అమ్మవారిని స్వయంగా వచ్చి దర్శించుకున్నానని చెప్పారు. తన జీవితంలో మరుపురాని ఘనస్వాగతం అమ్మవారి సన్నిధిలో లభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ స్వాగతాన్ని జీవితంలో ఎన్నడూ మరచిపోలేనని చెప్పారు. కార్యక్రమంలో రాట్నాలకుంట ఆలయ కమిటీ చైర్మన్ రాయల భాస్కరరావు, పెదవేగి ఎంపీపీ దేవర పల్లి బక్కయ్య, ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హిమాలయాలెక్కి...
సాధారణంగా హిమాలయాలనగానే ఠక్కున స్ఫురణకు వచ్చేది ఆధ్యాత్మిక భావనే. మునులు, బాబాల తపస్సుకు నిలయంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి. ఇక సినిమా రంగానికి సంబంధించి ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో అధికంగా హిమాలయాలు చుట్టొచ్చిన నటుడంటే సూపర్ స్టార్ రజనీకాంత్. తాజాగా నయనతార రజనీ బాట పట్టినట్లు సమాచారం. కేరళకు చెందిన క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన నయనతార ప్రభుదేవా ప్రేమలో పడి పెళ్లికి మతం అడ్డుగా నిలవడంతో హిందూమతం స్వీకరించారు. ప్రభుదేవాతో పెళ్లి పెటాకులైనా ఆమె హిందూ మతంలోనే కొనసాగుతున్నారు. అదేవిధంగా నయనతారలో ఈ మధ్య దైవ చింతన బాగా పెరిగింది. షూటింగ్ ప్రాంతాల్లో కూడా విరామ సమయంలో ఆయా ప్రాంతాల్లోని ఆలయాల ప్రవేశం చేసి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ హిమాలయాలను చుట్టొచ్చారట. కాషాయ రంగు దుస్తులు ధరించి మెడలో రుద్రాక్షమాలలు ధరించి హిమాలయాల్లోని ఆలయాలను దర్శించి వచ్చారు.