హిమాలయాలెక్కి... | Nayantara visits divine temples in Himalayas | Sakshi
Sakshi News home page

హిమాలయాలెక్కి...

Published Tue, Apr 22 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

హిమాలయాలెక్కి...

హిమాలయాలెక్కి...

సాధారణంగా హిమాలయాలనగానే ఠక్కున స్ఫురణకు వచ్చేది ఆధ్యాత్మిక భావనే. మునులు, బాబాల తపస్సుకు నిలయంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి. ఇక సినిమా రంగానికి సంబంధించి ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో అధికంగా హిమాలయాలు చుట్టొచ్చిన నటుడంటే సూపర్ స్టార్ రజనీకాంత్.   తాజాగా నయనతార రజనీ బాట పట్టినట్లు సమాచారం. కేరళకు చెందిన క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన నయనతార ప్రభుదేవా ప్రేమలో పడి పెళ్లికి మతం అడ్డుగా నిలవడంతో హిందూమతం స్వీకరించారు. ప్రభుదేవాతో పెళ్లి పెటాకులైనా ఆమె హిందూ మతంలోనే కొనసాగుతున్నారు. అదేవిధంగా నయనతారలో ఈ మధ్య దైవ చింతన బాగా పెరిగింది. షూటింగ్ ప్రాంతాల్లో కూడా విరామ సమయంలో ఆయా ప్రాంతాల్లోని ఆలయాల ప్రవేశం చేసి దైవ దర్శనం చేసుకుంటున్నారు.  ఇటీవల ఈ ముద్దుగుమ్మ హిమాలయాలను చుట్టొచ్చారట. కాషాయ రంగు దుస్తులు ధరించి మెడలో రుద్రాక్షమాలలు ధరించి హిమాలయాల్లోని ఆలయాలను దర్శించి వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement