
తనుశ్రీదత్తా
లైంగిక వేధింపుల గురించి అటు బాలీవుడ్‌లో తనుశ్రీదత్తా, తనతో చెప్పుకున్న వాళ్లకు జరిగిన వేధింపుల విషయమై ఇటు సౌత్‌లో గాయని చిన్మయి ఇద్దరూ ‘మీటూ’ ఉద్యమంలో తమ పోరాటం సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ ఆరోపించిన నానా పటేకర్, వైరముత్తులను ఒకే విధంగా ఇన్వెస్టిగేట్ చేయమని కోరుతున్నారు. ‘వైరముత్తుగారూ.. మాట్లాడింది చాలు. ఆయన లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోవాలి’’ అని ట్వీట్ చేశారు చిన్మయి. మరోవైపు తనుశ్రీ కూడా నానా పటేకర్‌కు లై డిటెక్టర్ టెస్ట్, నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారట. ఇందులో నృత్య దర్శకుడు గణేశ్ ఆచార్య, నిర్మాత రాకేశ్ సారంగ పేర్లు కూడా ఉన్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment