'మా దగ్గర ఆ పరిస్థితి లేదు'.. హీరో కామెంట్స్‌పై మండిపడ్డ సింగర్‌! | Kollywood Actor Jiiva Responds On Malayalam Metoo Issue | Sakshi
Sakshi News home page

Jiiva: 'కోలీవుడ్‌లో అలా జరగదు'.. ఇది కేవలం పార్ట్‌-2 అంతే'

Published Mon, Sep 2 2024 7:56 AM | Last Updated on Mon, Sep 2 2024 9:57 AM

Kollywood Actor Jiiva Responds On Malayalam Metoo Issue

హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీనే కాదు.. కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ ఆ విషయం తనకేం తెలియదంటూ కామెంట్స్ చేశారు. తాజాగా కోలీవుడ్ నటుడు జీవా సైతం కోలీవుడ్‌లో హేమ కమిటీ నివేదికపై స్పందించారు. నేను కూడా దాని గురించి విన్నా.. అయితే తమిళ సినీ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు మాత్రం లేవన్నారు. గతంలో మీటూ పార్ట్‌-1 చూశామని.. ఇ‍ప్పుడు పార్ట్-2 వచ్చిందని అన్నారు. వారిపేర్లను బయటికి చెప్పడం తప్పు.. కానీ సినిమాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగి ఉండాలని తెలిపారు. ఓ షాపింగ్‌ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన జీవా.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.

తమిళంలో ఆ పరిస్థితి లేదు..

జీవా మాట్లాడుతూ..' నేను ఒక మంచి ఈవెంట్ కోసం ఇక్కడకు వచ్చా. కాబట్టి మంచి విషయాలు అడగండి. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. తేనవట్టు అనే సినిమా షూటింగ్ ముగించుకునివస్తున్నా. చాలా సినీ పరిశ్రమలలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మా పని మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం. నటులుగా మేము చాలా మంది వ్యక్తుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తాం. మలయాళంలో లాగా కోలీవుడ్‌లో జరగడం లేదు. ఈ విషయం గతంలోనూ చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నా' అని అన్నారు. ఈ సందర్భంగా అయితే అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్‌తో కాసేపు వాగ్వాదం తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. రంగం సినిమాతో జీవా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 

చిన్మయి రిప్లై.. 

కోలీవుడ్‌లో అలాంటి పరిస్థితులు లేవని జీవా చెప్పడంపై సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. తమిళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు లేవని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. ఇలా ఎలా మాట్లాడుతారో తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో చాలాసార్లు చిన్మయి ఇండస్ట్రీలో జరుగుతన్న వేధింపులపై మాట్లాడారు. మహిళలపై ఎక్కడా అఘాయిత్యాలు జరిగినా సరే చిన్మయి సోషల్ మీడియా వేదికగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement