
'సమోసాలో ఆలూ ఉన్నంత కాలం..'
ఆలూ సమోసాలో ఆలూ ఎంతకాలం ఉంటుంది? అసలు ఆలూ లేకుండా ఎక్కడైనా ఆలూ సమోసా ఉంటుందా? అదే ఉదాహరణగా చెప్తుంది ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. సమంతకు తెలుగులో డబ్బింగ్ చెప్తానంటోంది. సమంత హీరోయిన్గా నటించిన 'జనతా గ్యారేజ్' విడుదల సందర్భంగా విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది చిన్మయి.
'ఏ మాయ చేశావే' లో జెస్సీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరినీ నిజంగానే మాయ చేసింది సమంత. జెస్సీ క్యారెక్టర్ అంతగా ఆకట్టుకోవడానికి ఆమెకు చెప్పిన డబ్బింగ్ ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు. సమంతకు గాత్రదానం చేసింది సింగర్ చిన్మయే. ఇక అప్పటినుంచి తెలుగులో సమంతకు చిన్మయే డబ్బింగ్ చెప్తూ వస్తుంది. ఆమె గొంతు సమంత రూపానికి చక్కగా సరిపోయి ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచేసింది. ప్రస్తుతం సమంత టాప్ హీరోయిన్గా ఉన్న సంగతి తెలిసిందే.
సమంత కూడా పలుమార్లు చిన్మయి డబ్బింగ్ తన విజయానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. అంటూ చిన్మయి చేసిన ట్వీట్కు 'థాంక్యూ పాపా' అంటూ సమంత ముద్దులతో స్పందించింది.
Wishing Sam papa the best for Janatha Garage. As saying goes, Jab tak rahega samose mein aaloo (God-willing) I’ll dub for Sam in Telugu.😜
— Chinmayi Sripaada (@Chinmayi) 31 August 2016
😋😋😋😋ha ha Muah thanks Paapa https://t.co/vFgjIdcpIR
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 31 August 2016