Samantha Interesting Reply To Singer Chinmayi Tweet, Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha-Chinmayi: చాలా కాలం తర్వాత చిన్మయి గురించి ట్వీట్‌ చేసిన సామ్‌!

Published Thu, Feb 2 2023 1:38 PM | Last Updated on Thu, Feb 2 2023 3:55 PM

Samantha Calls Chinmayi is Queen not Her Son Twitter Goes Viral - Sakshi

చాలా రోజుల తర్వాత తన స్నేహితురాలు, గాయని చిన్మయి గురించి ట్వీట్‌ చేశారు స్టార్‌ హీరోయిన్‌ సమంత. కాగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇటీవల కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే చిన్మయి స్పందించినప్పటికీ సామ్‌ ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో సమంత తాజాగా చిన్మయి గురించి చేసిన ట్వీట్‌ ఆసక్తిని సంతరించుకుంది. కాగా మయోసైటిస్‌ బారిన పడిన సామ్‌ ప్రస్తుతం కోలుకున్నారు.

చదవండి: తీవ్ర గాయాల నుంచి కోలుకున్న స్టార్‌ హీరో

దీంతో ఆమె తన బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ సీటాడెల్‌ షూటింగ్‌ను ప్రారంభించారు. తాము తెరకెక్కించనున్న సిరీస్‌లోకి సామ్‌కు స్వాగతం పలుకుతూ హాలీవుడ్‌ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్‌ ట్వీట్‌ చేశారు. ఇక దీనిపై చిన్మయి భర్త, నటుడు రాహుల్‌ స్పందించాడు. ‘సమంత ప్రయాణం ఎలా మొదలైందో నాకు ఇంకా గుర్తుంది. ప్రముఖ హాలీవుడ్‌ దర్శకులు రస్సో బ్రదర్స్‌ సామ్‌ను తమ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించడం చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక అదే ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ చిన్మయి.. ‘సమంత ఒక క్వీన్‌.. దానికి ఇదే నిదర్శనం’ అని ప్రశంసించింది.

చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్‌.. వీల్‌ చైర్‌లోనే..

ఇక చిన్మయి ట్వీట్‌పై సామ్‌ స్పందిస్తూ.. ‘‘నేను కాదు నువ్వే చిన్మయి’’ అని అంటూ కిస్‌ ఎమోజీని జత చేసింది. దీంతో ట్విటర్‌ వేదికగా జరిగిన వీరి సంభాషణకు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా ఏమ మాయ చేసావే మూవీ నుంచి చిన్మయి సమంతకు డబ్బింగ్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే ‘యూటర్న్‌’ మూవీ నుంచి సామ్‌.. తెలుగులో తన పాత్రలకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటోంది. దాంతో చిన్మయి-సమంతకు మనస్పర్థలు వచ్చాయని, వారి మధ్య మాటలు లేవంటూ ప్రచారం జరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement