నాగ చైతన్యతో విడాకుల తర్వాత నెట్టింట సమంత పేరు వినిపించని రోజంటూ లేదు. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. మళ్లీ తన పంథాను కొనసాగిస్తూ..అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇదిలా ఉంటే సామ్‌కి సంబంధించిన ఓవార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
(చదవండి: బాహుబలి ఆఫర్‌ని వదులుకున్నందుకు గర్వపడుతున్న: మంచు లక్ష్మీ)
సామ్ తాజాగా తన ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిందట. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. సామ్‌కు చిన్మయి చాలా క్లోజ్ ఫ్రెండ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి సమంత పాత్రకు చిన్మయియే డబ్బింగ్ చెబుతూ వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా వీరిద్దరి మధ్య స్నేహం చెడిందట. మనస్పర్థలు రావడంతో చిన్మయిని సామ్ పక్కకు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సామ్ పాన్ ఇండియా మూవీ యశోదకు చిన్మయి డబ్బింగ్ కూడా చెప్పలేదు. చిన్మయిని దూరం పెట్టి స్వయంగా సమంతనే డబ్బింగ్ చెప్పుకుందట. ఇకపై ప్రతి సినిమాకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుందట. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది.. సామ్ కానీ చిన్మయి కానీ స్పందిస్తేనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment