Singer Chinmayi Slams Actor Sathish Over His Comments On Actress Dressing In Oh My Ghost Event - Sakshi
Sakshi News home page

Chinmayi: హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్‌.. నటుడిపై సీరియస్‌ అయిన చిన్మయి

Published Fri, Nov 11 2022 1:15 PM | Last Updated on Fri, Nov 11 2022 2:02 PM

Singer Chinmayi Slams Actor Sathish Over Comments On Actress Dressing - Sakshi

ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స‍్పందిస్తుంటుంది. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. అలా తరచూ వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలిచే చిన్మయి తాజాగా ఓ నటుడిపై ఫైర్‌ అయ్యింది. పబ్లిక్‌లో ఓ హీరోయిన్‌ను పాయింట్‌ అవుట్‌ చేస్తూ చేసిన అతడి వ్యాఖ్యలను తప్పుబట్టింది. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌, నటి దర్శగుప్తా లీడ్‌ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ఓ మై ఘోస్ట్‌. ఇందులో తమిళ నటుడు సతీష్‌ ఓ కీ రోల్‌ పోషించాడు.

చదవండి: రష్మికపై ఇంత నెగిటివిటీకి కారణం ఇదే! ఆ ఒక్క మాటకే విమర్శల దాడి

ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో తాజాగా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సన్నీలియోన్‌ సాంప్రదాయంగా చీరకట్టులో రాగా దర్శగుప్తా మోడ్రన్‌ లెహెంగాలో వచ్చింది. ఇదే అంశంపై ఈవెంట్‌లో నటుడు సతీశ్‌ మాట్లాడుతూ నటి దర్శగుప్తాను ఉద్దేశిస్తూ పబ్లిక్‌గా షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఆయన మాట్లాడుతూ... ‘ఎక్కబో ముంబై నుంచి తమిళనాడుకు వచ్చిన సన్నీలియోన్‌ పద్ధతిగా చీరకట్టుకుని వచ్చారు. చూడటానికి ఆమె చాలా అందంగా ఉన్నారు. కానీ అటూ చూడండి మన దగ్గరి అమ్మాయి మాత్రం మోడ్రన్‌ డ్రెస్‌ వేసుకుని వచ్చింది’ అంటూ దర్శగుప్తాను చూపిస్తూ అన్నాడు.

చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా?

అంతేకాదు తానేమి ఆమెను విమర్శించడం లేదని, జస్ట్‌ పాయింట్‌ అవుట్‌ చేశానంతేనని అనడంతో అక్కడి వచ్చిన వారంత పగలపడి నవ్వారు. ఇక అతడి వ్యాఖ్యలపై చిన్మయి స్పందించింది. మహిళల డ్రస్సింగ్‌పై బహిరంగంగా కామెంట్స్ చేయడాన్ని ఆమె తప్పుపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆమె ఘాటుగా స్పందించింది. ‘ఒక స్త్రీని లక్ష్యంగా చేసుకుని, ఆమె వేసుకున్న డ్రెస్‌పై విమర్శలు చేయడమేంటి? ఆ మాటలకు జనాలు పగలబడి నవ్వడం ఏంటి? మహిళల డ్రస్‌పై విమర్శలు చేసే ఇలాంటి మగాళ్ల ప్రవర్తన ఇంకెప్పుడు మారుతుందో? ఇదేం అంత సరద విషయం కాదు’ అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాత్రమే నటుడు కామెంట్స్‌పై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. అలా బహిరంగంగా ఓ నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement