Netizens Trolls On Actress Kasthuri Shankar For Sharing Video Of Girls Buying Liquor - Sakshi
Sakshi News home page

Trolls On Kasthuri Shankar: మగవారికేనా.. అమ్మాయిలకు కూడా ఇష్టాలుంటాయ్‌ అంటూ నటిపై ఫైర్‌..

Published Sat, Jul 15 2023 11:10 AM | Last Updated on Sat, Jul 15 2023 11:32 AM

Actress Kasthuri Shankar Share Video Girls Buying Liquor At Wine Shop - Sakshi

నటి కస్తూరి శంకర్‌ మొదట్లో సినిమాలకు మాత్రమే పరిమితం అయిన ఆమె పలు స్టార్‌ హీరోలతో నటించడమే కాకుండా పాపులర్‌ అయింది. ప్రస్తుతం ఆమె స్టార్‌ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తుంది. దీంతో ఒక్కోసారి ఆమెపై వ్యతిరేకత కూడా వస్తుంటుంది.

(ఇదీ చదవండి; స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!)

తాజాగా ఆమె ఇద్దర అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను షేర్‌ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు వైన్‌ షాపునకు వెళ్లి మద్యం సీసాలు కొంటారు. దానిని షేర్‌ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది. 'తాగండి అమ్మాయిలు తాగండి.. ఏ మాత్రం తగ్గద్దు. ఎనిమిది మందిలో ఈమె ఒక్కరే మగరాయుడు. ఇదీ ఏ మాత్రం తప్పుకాదు, అసహ్యమూ కాదు. ఏమవుతుంది మహా అయితే వాట్సాప్ ఫార్వర్డ్ ఆఫ్ ద డే అవుతుంది. మీరు సూపర్.. మహిళల హక్కుల గురించి ఆలోచించకుండానే తిరిగి వస్తున్నాయి.' అంటూ కామెంట్‌ చేసింది.

దీంతో వాళ్లను పొగుడుతున్నావా..? లేదా తప్పుబడుతున్నావా..? ఏ మాత్రం అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే కస్తూరిపై సీరియస్‌ అవుతున్నారు. అమ్మాయిల వీడియోను ఇలా నెట్టింట షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిత్రపరిశ్రమలోని ప్రముఖలకు చెందిన అమ్మాయిలు పబ్‌లకు వెళ్తున్నారు. వారి ఫోటోలు కూడా ఇలా షేర్‌ చేసే దమ్ము నీకు ఉందా..? అంటూ మండిపడుతున్నారు.

ఇదే విషయంపై ప్రముఖ సింగర్‌ చిన్మయి కూడా స్పందించింది.  'కస్తూరి నువ్వు ఇలా షేర్ చేయాల్సిన అవసరం ఏమెచ్చింది. నిజాయితీగా చెప్తున్నా. ఇది చాలా తప్పు' అంటూ ట్వీట్ చేసింది. దీంతో చిన్మయిని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు అయినంత మాత్రనా మద్యం తీసుకోకుడదా..? వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయినేది గుర్తించాలి. మద్యం మగవారు మాత్రమే తీసుకోవాలని రాసి ఉందా..? అని కస్తూరిపై ఫైర్‌ అవుతున్నారు. ఏదేమైనా వీడియో షేర్ చేయడంతో ఆమెపై కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతుంది.

(ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్‌ కూతురితోనే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement