Intinti Gruhalakshmi Serial Fame Actress Kasthuri Shankar Suffer With Chicken Pox - Sakshi
Sakshi News home page

Actress Kasturi: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్‌ చేసిన నటి

Feb 21 2023 12:55 PM | Updated on Feb 21 2023 1:48 PM

Actress Kasthuri Shankar Suffer With Chicken Pox Shared Post - Sakshi

నటి కస్తూరి శంకర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్‌ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే కస్తూరి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. తాజాగా తాను అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. తన వ్యాధి గురించి చెబుతూ కస్తూరి వాపోయింది. అలాగే ఆ వ్యాధి తనపై ఎంతగా ప్రభావం చూపిందో పేర్కొంటూ ఫొటోలను షేర్‌ చేసింది.

‘ప్రస్తుతం చికెన్‌ పాక్స్‌తో(అమ్మావారు) బాధపడుతున్నా. ఈ వ్యాధి సోకడంతో నా శరీరమంతా వికృతంగా మారింది. నా ముఖం, శరీరంపై ఈ చికెన్‌ పాక్స్‌ మచ్చలు చూడండి ఎలా ఉన్నాయో. అదృష్టవశాత్తు నా కళ్లపై వాటి ప్రభావం చూపలేదు. ఇందుకు చికెన్‌ పాక్స్‌కి కృతజ్ఞురాలిని. ఎప్పటి లాగే నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్యామిలీ(అభిమానులు) ప్రేమ, మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా. ఎంతోకాలంగా సంరక్షించుకుంటున్నా నా మృదువైన చర్మం ఇప్పుడు మచ్చలు, మొటిమలతో ఇబ్బందిగా మారింది’ అంటూ ఆమె రాసుకొచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement