Intinti Gruhalakshmi Daily Serial
-
Kasthuri Shankar : సీరియల్ నటి కస్తూరిని ఇలా గ్లామర్ లుక్‌లో చూశారా? (ఫోటోలు
-
అనారోగ్యంతో బాధపడుతున్న కస్తూరి, స్వయంగా వెల్లడించిన నటి
నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా తాను అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. తన వ్యాధి గురించి చెబుతూ కస్తూరి వాపోయింది. అలాగే ఆ వ్యాధి తనపై ఎంతగా ప్రభావం చూపిందో పేర్కొంటూ ఫొటోలను షేర్ చేసింది. ‘ప్రస్తుతం చికెన్ పాక్స్‌తో(అమ్మావారు) బాధపడుతున్నా. ఈ వ్యాధి సోకడంతో నా శరీరమంతా వికృతంగా మారింది. నా ముఖం, శరీరంపై ఈ చికెన్ పాక్స్ మచ్చలు చూడండి ఎలా ఉన్నాయో. అదృష్టవశాత్తు నా కళ్లపై వాటి ప్రభావం చూపలేదు. ఇందుకు చికెన్ పాక్స్‌కి కృతజ్ఞురాలిని. ఎప్పటి లాగే నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ(అభిమానులు) ప్రేమ, మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా. ఎంతోకాలంగా సంరక్షించుకుంటున్నా నా మృదువైన చర్మం ఇప్పుడు మచ్చలు, మొటిమలతో ఇబ్బందిగా మారింది’ అంటూ ఆమె రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Kasthuri Shankar (@actresskasthuri) -
నటి కస్తూరి తన సంపాదనను ఏం చేస్తుందో తెలుసా? బయటికొచ్చిన షాకింగ్ నిజాలు
నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్ ద్వారా తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సామాజం ఆమె ఎదుర్కొనే ఎదురుదెబ్బలు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఆమె సామాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుందనే విషయం తెలిసిందే. ఇటీవల నయనతార సరోగసిపై ట్వీట్ చేసి వివాదానికి తెరలేపింది. చదవండి: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం అలా గతంలో ఆమె ఎన్నో అంశాలపై ఆమె ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా కస్తూరి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల చెన్నై మెట్రోలో ప్రయాణించిన ఆమె తన ఫోన్ పొగొట్టుకుందట. దీంతో కస్తూరి మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో వెంటనే స్పందించిన అధికారులు ఆమె ఫోన్‌ను వెతికిపెట్టి ఇచ్చారట. దీంతో మెట్రో అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ రీసెంట్గా ఆమె ట్వీట్ చేసింది. ‘చెన్నై మెట్రో సిబ్బంది, అధికారులపై నాకు మరింత గౌరవం పెరిగింది. మెట్రో రైలులో పొగొట్టుకున్న నా ఫోన్‌ను వారు గంటల్లోనే వెతికిపెట్టి ఇచ్చారు. పని విషయంలో వారు చూపిస్తున్న నిబద్ధత, శ్రద్ధ, బాధ్యతలకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంది. ఇలా ఉంతోమంది ప్యాసింజర్ పొగొట్టుకున్న వస్తువులను వేతికి ఇస్తున్నారు. అందుకే చెన్నైమెట్రో అధికారులు, సిబ్బంది అంటే నాకు గౌరవం’ అంటూ ఆమె ట్వీట్లో రాసుకొచ్చింది. చదవండి: ‘బాహుబలి’తో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే.. ఆకట్టుకుంటున్న ప్రొమో గ్లింప్స్ ఇక ఆమె ట్వీట్ చూసిన ఓ నెటిజన్ ‘మీకు సొంతంగా కార్లుంటాయి కదా? వాటిలో వెళ్లొచ్చు? ఇదంతా ఎందుకు పబ్లిసిటీ కోసమా?’ అని ట్వీట్ చేశాడు. దీనిపై కస్తూరి స్పందిస్తూ. ‘నాకు కారు, ఏసీ, టీవీ ఇలా ఏవీ లేవు. నేను ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను’ అని సమాధానం ఇచ్చింది. దీంతో మరో నెటిజన్ స్పందిస్తూ.. నువ్ సంపాదించిందంతా ఏం చేస్తావ్? అని అడిగేశాడు. ‘నేను సంపాదించింది అంతా మెడికల్ హెల్ప్, చెల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతాను’ అని తెలిపింది. దీంతో మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెలబ్రెటీ అయి ఉండి ఆడంబరాలకు పోకుండ సాధారణ జీవితం గడుపుడుతూ ఉన్నంతో ఇతరులకు సాయం చేస్తున్న ఆమె పట్ల గౌరవం పెరిగిందంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా కస్తూరి నాగార్జున అన్నమయ్య చిత్రంలో హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే. OMG @cmrlofficial found my phone! No words to praise the dedication and integrity of CMRL staff. Many passengers have gotten back lost valuables. Special thanks to Mr Vijay Varadhan, joint GM . I already am a Chenno metro loyalist, now I have one more reason to love them! https://t.co/UGLpAYrFbR — Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022 I don't own a car. I don't have tv. I don't use Air conditioning. I practice a simpler lifestyle. https://t.co/bl4NJ6ecNt — Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022 -
నందును ఎగరేసుకుపోయిన లాస్య, ఒంటరైన తులసి!
Intinti Gruhalakshmi July 8వ ఎపిసోడ్: నందు, తులసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు జన్మించారు. బృందావనంలా కళకళలాడిన ఈ ఇంటిని చీల్చడానికి శూర్పణఖలా దిగింది మాయదారి లాస్య. ఆమె రాకతో నందు, తులసి మధ్య ఎంతటి అగాధం ఏర్పడింతో అందరికీ తెలిసిందే. ఆమె మాయలో నుంచి తన భర్తను బయటపడేసి తిరిగి తనదారికి తెచ్చుకోవాలన్న తులసి ఎంతగానో ప్రయత్నించింది, కానీ ఆమె కల కలగానే మిగిలిపోయింది. తులసి, నందుల విడాకుల ఘట్టం ఆఖరి దశకు చేరుకుంది. ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు కోర్టుకు చేరుకున్నారు. ఇంకా కోర్టు లోపలకు కూడా వెళ్లకముందే మరోసారి గొడవకు దిగారు. ఈ వాదనల వల్ల కొత్తగా ఏ ప్రయోజనమూ లేదంటూ తులసి అక్కడి నుంచి విసురుగా లోనికి వెళ్లిపోయింది. 'విడాకుల అర్జీ పెట్టుకుని సరిగ్గా ఏడాదవుతోంది. గతసారి వచ్చినప్పుడు మీ భార్య తన కాళ్ల మీద తను ఎలా బతుకుతుందో అని భయపడ్డారు. మరి ఇప్పుడు ఆ విషయంలో మీకు ఏదైనా భరోసా దొరికిందా?' అని జడ్జి నందును ప్రశ్నించగా అసలు ఆ విషయం గురించి తనకు అవసరం లేదని తేల్చి చెప్పాడు. దీంతొ మీ వల్ల కన్నీళ్లను దిగమింగుకున్నాను, ఎన్నో బాధలను భరించాను అని తులసి కంటతడి పెట్టుకుంది. అలా వీరిద్దరి మధ్య వాదన మొదలైంది. నీ వల్లే కోర్టు మెట్లెక్కానంటూ ఇద్దరూ ఒకరినొకరు నిందించుకున్నారు. దీంతో వారిద్దరినీ జడ్జి వారించారు. అనంతరం నందు నుంచి భరణం ఆశిస్తున్నారా? అని తులసిని అడిగాడు. అందుకు ఆమె తనకు విడాకులు మాత్రమే ఇప్పించండని, ఇంకేదీ వద్దని చెప్పింది. దీంతో జడ్జి వారికి విడాకులు మంజూరు చేశాడు. దీంతో తులసి ఏకాకిగా మారగా నందు మాత్రం లాస్యతో వెళ్లిపోయాడు. -
తులసి- నందుల విడాకుల కథ క్లైమాక్స్‌కు!
Intinti Gruhalakshmi July 7th Episode: తులసి, నందు విడిపోవాల్సిందేనా అని కుటుంబ సభ్యులంతా బాధపడుతుంటే అనసూయ మాత్రం దెప్పి పొడిచింది. ఎప్పుడెప్పుడు విడాకులు మంజూరవుతాయా? అని తహతహలాడిపోయింది. తులసి పీడ విరగడవుతుందని లోలోపలే ఆనందించింది. ఎప్పటిలాగే తులసి మీద విరుచుకుపడుతూ ఆమెను సూటిపోటి మాటలతో బాధ పెట్టింది. మనసుకు శూలాల్లా గుచ్చుతున్నా పైకి అవేవీ కనిపించకుండా జాగ్రత్తపడింది తులసి. ఆమెను నానామాటలు అన్న అనసూయ మీదకు విరుచుకుపడింది ఆమె కూతురు మాధవి. నీలాంటి ఆడదాన్ని ఈ ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చింది. సాటి ఆడది అనే జాలి లేకుండా వదిన జీవితం నాశనమైపోవాలని కోరుకుంటున్న నీకు పుట్టినందుకు నాకే సిగ్గుగా ఉందని చీదరించుకుంది. తులసికి విడాకులిస్తే నందు తన సొంతమైపోయినట్లేనని లాస్య తెగ ఆనందపడింది. మరికొద్ది క్షణాల్లో అతడు పూర్తిగా తనవాడు కాబోతున్నాడని సంబరపడిపోయింది. అయితే అప్పటిలోపు నందు మనసు మార్చుకోకుండా చూడమని భాగ్య హెచ్చరించడంతో లాస్య కన్నీటి డ్రామా మొదలు పెట్టింది. విడాకుల విషయంలో ఇప్పటికీ అనుమానంగానే ఉందని చెప్పడంతో అలాంటిదేమీ లేదని నందు బదులిచ్చాడు. అంతేకాకుండా లాస్యకు ప్రామిస్ కూడా చేశాడు. కోర్టుకు తులసి తల్లి కూడా వచ్చింది. ఎప్పటికైనా మీరిద్దరూ మళ్లీ కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అనుకున్న ప్రతీది జరగాలనుకోవడం అత్యాశేనని చెప్పుకొచ్చింది. రేపటి ఎపిసోడ్లో కోర్టు మెట్లెక్కిన నందు, తులసి ఇద్దరూ విడిపోవడానికి తప్పు నీదంటే నీదని నిందించుకున్నట్లు తెలుస్తోంది.. జడ్జి ముందే వాదులాటకు దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే విడాకులు ఖాయంగా కనిపిస్తోంది. -
శోకసంద్రంలో మునిగిపోయిన తులసి, నందు పరిస్థితి కూడా అంతే!
Intinti Gruhalakshmi Juny 2వ ఎపిసోడ్: తండ్రిగా, భర్తగా, కొడుకుగా అన్ని రకాలుగా మీరు ఓడిపోయారని నందును విమర్శించింది తులసి. జీవితంలో ఓడిపోతే అండగా నిలబడేదాన్ని కానీ విలువల్లో ఓడిపోయారని అసహ్యించుకుంది. దీంతో ఆమెకు నచ్చజెప్పాలని చూసిన నందును మధ్యలోనే ఆపేసింది తులసి. ఇన్నాళ్లూ మీరు చెప్పింది, నేను విన్నది చాలని తేల్చి చెప్పింది. దీంతో ఇదే సరైన సమయమనుకున్న లాస్య వీళ్లను శాశ్వతంగా విడగొట్టాలని భావించింది. నీకు విలువ లేని చోట ఉండాల్సిన అవసరం లేదని, మనం వెళ్లిపోదామంటూ నందు చేయి పట్టుకుని లాగింది. అందరి దగ్గర అవమానాలు పడే దుస్థితి మనకక్కర్లేదని చెప్పింది. నందు అప్పటికీ ఏం చేయాలో అర్థం కాని దిక్కు తోచని స్థితిలో శిలావిగ్రహంలా నిల్చుండిపోతే ఆమె అతడిని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయింది. తన భార్య, కుటుంబం నుంచి నందును దూరం చేసింది. నందుకు మానసికంగా విడాకులిచ్చేసిన తులసి భర్త లేకపోయినా తనను ప్రేమించే కుటుంబం ఉందని పైకి ధైర్యాన్ని నటించింది. మీ కొడుకులా మధ్యలో వదిలేసి పోనని, అలా వదలడం అంటూ జరిగితే అది నా ప్రాణం పోయాకే అని నందు తండ్రితో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక నందు కూడా జరిగినదాన్ని తలుచుకుంటూ తెగ బాధపడ్డాడు. విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నా తులసి తనతో తెగదింపులు చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో తనకు తెలియకుండానే అతడిలో అంతర్మథనం మొదలైంది. తను ఎంచుకున్న రూటు సరైనదేనా? అని పరిపరివిధాలా ఆలోచిస్తున్నాడు. నందు కట్టుకున్న భార్య కోసం తపిస్తాడా? లేదా మధ్యలో వచ్చిన లాస్య చేయి పట్టుకుని నడుస్తాడా?అతడిప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. చదవండి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటుడి తనయుడు -
లాస్యను చెప్పుతో కొట్టాలన్న తులసి, మౌనంగా ఉన్న నందు
Intinti Gruhalakshmi July 1వ ఎపిసోడ్: అనసూయ దంపతుల పెళ్లిరోజు వేడుక ఘనంగా, సంతోషంగా సాగింది. ఈ సందర్భంగా దంపతుల మధ్య అన్యోన్యతను, సఖ్యతను వివరిస్తూ నందు తండ్రి పెద్ద లెక్చరే ఇచ్చాడు. పెళ్లి గొప్పతనాన్ని వివరించాడు. కానీ ప్రస్తుత కాలంలో ఎంతమంది పెళ్లిని గౌరవిస్తున్నారని తులసి తల్లి సరస్వతి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇదే అదును అనుకున్న లాస్య తోక తొక్కిన తాచులా దిగ్గున లేచింది. ఆవిడ కావాలని నందును పని గట్టుకుని తిడుతోందని పేర్కొంది. అల్లుడిని అవమిస్తున్నావంటూ సరస్వతిని నోటికొచ్చినట్లు తిట్టింది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే చూడలేవా? మొగుడు పోయినదానివి నీకేం తెలుస్తుంది ఇలాంటి వేడుకల విలువ? అని ఈసడించుకుంది. దీంతో సహనం కోల్పోయిన తులసి ఆమె చెంప చెళ్లుమనిపించింది. ఇంకొక్క మాట మాట్లాడితే నిలువునా పాతేస్తానని వార్నింగ్ ఇచ్చింది. "నన్నంటే పడ్డాను, మంచితనంతో ఆడుకుంటే వదిలేశాను, నాది అనుకున్న ప్రతీదాన్ని లాక్కున్నా భరించాను, కానీ నా తల్లి జోలికొస్తే ఊరుకునేదే లేదు" అని హెచ్చరించింది. దీంతో లాస్య.. నా మీద చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకున్నావేంటని నందును రెచ్చగొట్టింది. ఆమె ఒత్తిడి మీద తులసి ముందుకు వచ్చిన నందు.. లాస్య చేసిన తప్పేంటని ప్రశ్నించాడు. నందు లాస్యకు సపోర్ట్ చేయడాన్ని చూసి తులసి షాక్ తింది. అప్పనంగా వస్తున్న ఆడపిల్ల కనిపిస్తుంది కానీ అప్పగింతల సమయంలో ఆడపిల్లల కన్నీళ్లు మాత్రం కనిపించవని నిందించింది. ఆడపిల్లల తల్లిదండ్రుల గొప్పతనం గురించి పెద్ద క్లాస్ పీకింది. "మీ అత్తను ఇన్ని మాటలు అన్నదాన్ని చెప్పు తీసుకుని కొట్టాలి, కానీ మీరు తన తప్పేంటని అడుగుతున్నారు? అవును, నిజమే.. తప్పు చేసింది నేను. నా భర్త ఏదో ఒకరోజు మారతాడని ఎదురు చూడటమే నేను చేసిన తప్పు. విడాకుల మీద సంతకం చేశాక కూడా మీరు నా సొంతం అవుతారని ఆశపడటం నేను చేసిన తప్పు. ఇప్పుడు చెప్తున్నా వినండి.. ఈ క్షణమే మీకు నా మనస్సాక్షిగా విడాకులిస్తున్నా. ఈ క్షణం నుంచి మీరెవరో, నేనెవరో?" అని తులసి తేల్చి చెప్పేసింది. ఈ హఠాత్పరిణామంతో లాస్య లోలోపలే తెగ సంతోషించింది. అయితే రేపటి ఎపిసోడ్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిన్ను అవమానించే ఈ కుటుంబం నీకొద్దంటూ లాస్య నందును శాశ్వతంగా తన ఫ్యామిలీకి దూరం చేయాలని చూసింది. వాళ్లతో తెగదింపులు చేసుకుందామని నందును అక్కడి నుంచి లాక్కుపోవాలని చూసింది. కానీ నందు మాత్రం శిలావిగ్రహంలా అక్కడే నిలబడిపోయాడు. మరి చివరికి నందు తన కుటుంబంతో ఉండటానికి సిద్ధపడతాడా? లేదా లాస్యతో వెళ్లిపోతాడా? అన్నది ఉత్కంఠగా మారింది. చదవండి: ఇక్కడ ఫెయిలైతే తర్వాత ఏంటి? ప్లాన్ బి కూడా లేదు! రాధే శ్యామ్ క్లైమాక్స్ సీన్ లీక్, కన్నీరు పెట్టించే ప్రేరణ మృతి! -
తులసి తల్లిని అవమానించడమే పనిగా పెట్టుకున్న లాస్య!
Intinti Gruhalakshmi June 30వ ఎపిసోడ్: సరస్వతి అనుమానించినట్లే జరిగింది. తను తీసుకొచ్చిన బట్టలను తిరస్కరిస్తారేమోన్న అనుమానమే నిజమైంది. ఆమె తెచ్చిన బట్టల కంటే లాస్య తెచ్చినవే బాగున్నాయని అనసూయ పెదవి విరిచింది. దీంతో లాస్య డిజైన్ చేయించుకు వచ్చిన ఖరీదైన చీర మాత్రమే కట్టుకుంటానని మొండిగా మాట్లాడింది. ఆమె ప్రవర్తనకు తులసి మనసు చిన్నబుచ్చుకున్నా బయటకు మాత్రం.. తన కోరిక ప్రకారమే జరగనీయండని తెలిపింది. లాస్య బట్టలే వేసుకోమంటూ తన మామయ్యకు కూడా సర్ది చెప్పింది. ఫంక్షన్లో అనసూయ దంపతులు నూతన వధూవరులుగా రెడీ అయి మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ కొత్త పెళ్లి జంటలాగా తెగ సిగ్గుపడిపోయారు. పెళ్లి చూపుల్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి ఇప్పటివరకు ఇద్దరూ ఎలా కలిసి జీవితాన్ని కొనసాగిస్తున్నామని చెప్తూ వారి మధుర క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ వేడుకలో అందరూ స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. అనసూయ దంపతులు కూడా పాటలకు కాళ్లు కదుపుతూ డ్యాన్స్ చేశారు. అనంతరం ఇంట్లోని ప్రతి ఒక్కరూ అనసూయ దంపతుల్లో ఎవరెక్కువ ఇష్టమో చెప్తూ అందుకు గల కారణాలను వివరించారు. నందు వంతు వచ్చేసరికి తనకిద్దరూ ఇష్టమేనన్నాడు. అమ్మ ప్రేమ, నాన్న కోపం రెండూ తన ఎదుగుదలకే పనికొచ్చాయన్నాడు. తర్వాత తులసి మాట్లాడుతూ.. అత్తలో అమ్మను, మామలో నాన్నను చూసుకున్నానని చెప్పుకొచ్చింది. తన బాధలను, కష్టాలను కూడా పక్కనపెట్టి కేవలం సంతోషాలను మాత్రమే ప్రస్తావించింది. దీంతో మాధవి స్పందిస్తూ.. నీకు జరిగే చేదును కూడా మంచి అనుకోవడం నీ గొప్పతనమని తులసిని ప్రశంసించింది. అప్పటిదాకా సంతోషంగా సాగుతున్న ఆ పార్టీలో లాస్య చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది. మరోసారి తులసి తల్లిని ఆవిడ దారుణంగా అవమానించినట్లు తెలుస్తోంది. దీంతో ఓపిక నశించిన తులసి ఉగ్రరూపం ఎత్తింది. నోటికొచ్చినట్లు వాగుతున్న లాస్య చెంప చెళ్లుమనిపించింది. తన తల్లి మీద నోరు జారిన లాస్యను వెనకేసుకొచ్చిన నందు మీద కూడా ఫైర్ అయినట్లు కనిపిస్తోంది. మరి ఈ గొడవ తీవ్రతరం కానుందా? దీని పరిణామాలు ఏవైపుకు దారి తీస్తాయి? అనేది రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే! చదవండి: AR Rahman: 'ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’ -
తులసి ఉగ్రరూపం, షాక్‌లో నందు! విడాకులు తప్పవా?
Intinti Gruhalakshmi June 29వ ఎపిసోడ్: నందు జరిపిస్తున్న తల్లిదండ్రుల పెళ్లిరోజు వేడుకకు ఆహ్వానం అందడంతో తులసి తల్లి సరస్వతి కూడా రిసార్ట్‌కు చేరుకుంది. ఆమెను చూడగానే లాస్య, భాగ్య తమ నోటికి పని చెప్తూ పెద్దావిడను అనరాని మాటలు అన్నారు. పిలవని పేరంటానికి రావడానికి సిగ్గుండాలని చీదరించుకున్నారు. నానామాటలని ఆమె మనసుకు తూట్లు పొడిచారు. సరిగ్గా అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన తులసి తన తల్లి మీద జరుగుతున్న మాటల దాడికి అడ్డుపడుతూ లాస్య మీద విరుచుకుపడింది. మొగుడిని వదిలేసి అనాథలా తయారయ్యావు, కన్నకొడును వదిలేసి వాడిని అనాథను చేశావు, నీకేం తెలుసు కన్నతల్లి విలువ అంటూ లాస్యను తిట్టిపోసింది. మీరసలు మనుషులే కాదంటూ అసహ్యించుకుంది. మరోవైపు తులసి తల్లి ఫంక్షన్‌కు రావడంతో నందు చాలా సంతోషించాడు. ఆమెకు ఒక రూమ్ చూపించమని లాస్యకు చెప్పాడు. అయితే ఇక్కడ కూడా లాస్య తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది. గదులు ఖాళీగా లేవని బయటే సర్దుకోమని చెప్పింది. దీంతో నందు ఎక్కడో ఎందుకు, మన గదిలో ఉంటుందిలే అని చెప్పడంతో ఖంగు తిన్న లాస్య కుదరదని తేల్చి చెప్పింది. గదిలో విలువైన వస్తువులున్నాయంటూ వారిని పరోక్షంగా దొంగలతో సమానంగా పోల్చింది. దీంతో చిర్రెత్తిపోయిన తులసి ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించానంది. అందుకే తన కొడుక్కి చెప్పి అమ్మ కోసం ప్రత్యేక గది రెడీ చేయించానంటూ లాస్యకు కౌంటరిచ్చింది. అయినా ఈ ఫంక్షన్‌కు తులసి తల్లి రావడమేంటని అంకిత అభిని ప్రశ్నించింది. అసలు అదేం ప్రశ్న అన్న అభి తను మా అమ్మమ్మ అని, ఇంట్లో వేడకకు ఆమె రాకపోవడమేంటి? ఇంత స్టుపిడ్‌గా మాట్లాడతావేంటి? అని అంకితకు అక్షింతలు వేశాడు. దీంతో అంకిత హర్ట్ అయినట్లు కనిపించడంతో ఆమె ఈ ఇంటి మనిషని, ఈ వేడుకలో ఆమె ఉండాల్సిందేనని సర్ది చెప్తాడు. ఇక ఫంక్షన్లో వేదిక మీద కూర్చునే అనసూయ దంపతుల కోసం తులసి తల్లి పట్టుబట్టలు తీసుకొచ్చింది. అయితే తన చేతుల మీదుగా ఇస్తే వారు తీసుకుంటారా? అని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అన్నట్లుగానే అనసూయ ఈ బట్టలు మేం కట్టుకోవాలా? అని ఎదురు ప్రశ్నించింది. అయితే ఆమె భర్త అనసూయకు ఎలాగోలా నచ్చజెప్పే చాన్స్ ఉంది. కానీ అడుగడుగునా సరస్వతిని అవమానించాలని కంకణం కట్టుకున్న లాస్య మాత్రం తనకొచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. మొగుడు పోయినదానివంటూ సరస్వతిని అనరాని మాటలు అంది. తన కళ్లముందే తల్లిని దారుణంగా నిందిస్తూ చులకనగా చూస్తుండటం సహించలేకపోయిన తులసి.. లాస్యను లాగి కొట్టింది. అయితే నందు మాత్రం అంత జరిగినా లాస్యను వెనకేసుకురావడం గమనార్హం. అతడి ప్రవర్తనకు మరింత బాధపడ్డ తులసి మానసికంగా నందుకు ఈ క్షణమే విడాకులిచ్చేస్తున్నాని చెప్పింది. మరి తర్వాత పరిణామాలు ఎలా మారబోతున్నాయనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? -
లాస్య చెంప చెళ్లుమనిపించిన తులసి, నందుకు విడాకులు!
Intinti Gruhalakshmi జూన్ 28వ ఎపిసోడ్: శృతి కాలిని తన ఒడిలోకి తీసుకున్న ప్రేమ్ ఎంతో ఇష్టంగా ఆమెకు నెయిల్ పాలిష్ పెట్టాడు. ఇది చూసిన అంకితకు ఒళ్లు మండిపోయింది. వీళ్లిద్దరినీ ఇలాగే వదిలేస్తే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకుంటుందని, శృతి ఈ ఇంటి కోడలవుతుందని, అది జరగడానికి అస్సలు వీల్లేదని మనసులో నిర్ణయించుకుంది. దీంతో వెంటనే ప్రేమ్ దగ్గరకు వెళ్లి శృతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అని నిలదీసింది. అలాంటి ఉద్దేశ్యం లేకపోతే మాత్రం ఇలాంటి పనులు చేయకూడదని చెప్తూ మంచిదానిలా నటిస్తూ ప్రేమ్‌ను నమ్మించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక తులసి అత్తామామల పెళ్లై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా నందు గ్రాండ్ ఫంక్షన్ జరిపించే ఏర్పాట్లలో ఉన్నాడు. ఈ వేడుకకు తులసి తల్లి వస్తుందన్న విషయం తెలిసిన లాస్య మరో కుట్ర పన్నింది. ఆమెను అడ్డుపెట్టుకుని ప్రళయం సృష్టించేందుకు రెడీ అయింది. మరో పక్క నందు ఈ వేడుకను సాంప్రదాయంగా జరిపించాల్సిన బాధ్యతను తులసికి అప్పగించాడు. అయితే దాన్ని సవ్యంగా జరగనివ్వకూడదని ఫిక్సైంది లాస్య. ఈ వేడుక ద్వారా నందు కుటుంబాన్ని అల్లకల్లోలం చేయాలని కంకణం కట్టుకుంది. అనుకున్నట్లుగానే ఈ ఫంక్షన్‌కు హాజరైన తులసి తల్లిని అవమానించింది. మొగుడు పోయినదానివి, నీకేం తెలుస్తుంది ఇలాంటి వేడుకల విలువ అని నిందించింది. తన కళ్లముందే తల్లిని అవమానించడంతో తట్టుకోలేకపోయిన తులసి లాస్య చెంప చెళ్లుమనిపించింది. పెద్దావిడను అవమానించిన లాస్యను తిట్టాల్సింది పోయి ఆమె మీద చేయి చేసుకున్నందుకు నందు తులసి మీద కోప్పడ్డాడు. దీంతో మరింత ఆవేశపడ్డ తులసి మానసికంగా మీకు నేనే విడాకులిస్తున్నానంటూ బాంబు పేల్చింది. భర్త స్థానం నుంచి మిమ్మల్ని చెరిపేస్తున్నానని తేల్చి చెప్పడంతో నందు షాకయ్యాడు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? తులసి, నందుల మధ్య మరింత అగాధం ఏర్పడనుందా? అన్న విషయాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: Rohit Shetty Love Story: డిన్నర్ డేట్స్, రొమాంటిక్ ఈవెనింగ్స్.. కళా దర్శకుడు అంగముత్తు షణ్ముఖం కన్నుమూత -
తులసిని గెంటేస్తానన్న లాస్య, సడన్‌గా సీన్లోకి నందు ఎంట్రీ!
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 25వ ఎపిసోడ్: నందు చేతుల మీదుగా తమ 50వ పెళ్లిరోజు ఫంక్షన్ జరిపించాలని అనసూయ మంకుపట్టు పట్టింది. దీనికి ఒప్పుకునేవరకు తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకునేది లేదని తేల్చి చెప్పింది. తులసి ప్రేమగా తీసుకొచ్చిన ఇడ్లీ ప్లేటును కూడా నేలకు విసిరి కొట్టింది. నీ మాయమాటలకు లొంగనంటూ తన పంతం నెగ్గించుకోవాలని చూసింది. మరోవైపు తులసి ఆంటీ వల్లే ఇంట్లో ఈ గొడవలన్నీ అని అంకిత అభితో వాపోయింది. ఆంటీ పంతం నెగ్గించుకోవడానికి, తనను అందరూ మెచ్చుకోవడం కోసం అమ్మమ్మను ఇంత బాధపెడుతోందని అభిప్రాయపడింది. దీంతొ అభి తల్లిని వెనకేసుకురాగా అంకిత మాత్రం ఇదంతా తులసి ఆంటీ వల్లే జరుగుతోందని విమర్శించింది. మరోవైపు శృతి, ప్రేమ్ కూడా ఆ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ నానమ్మ బ్లాక్మెయిల్ చేస్తుందని ఆగ్రహించారు. కానీ అనసూయ భోజనం మానేసి ఎక్కడ ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటుందోనని తులసి భయపడిపోయింది. కానీ తనకంత సీను లేదని, కడుపు మాడ్చుకుంటానని బెదిరిస్తుందే తప్ప అంతకు మించి ఏమీ చేయలేదని మామయ్య నచ్చజెప్పాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారో లేదో అనసూయ కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో వెంటనే డాక్టర్‌ను ఇంటికి పిలిపించారు. కానీ మొండిదల ఎక్కువ ఉండే అనసూయ వైద్యం చేయించుకోవడానికి కూడా నిరాకరించింది. అయితే ఆమె అన్నపానీయాలు మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదం అని వైద్యురాలు హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయినా సరే 50వ పెళ్లిరోజు ఫంక్షన్ తన కొడుకు చేతుల మీదుగా జరగాల్సిందేనని, అది వాడి నోటి వెంట వింటేనే తను ఈ నిరాహార దీక్ష వదిలేస్తానంది. దీంతో అత్త క్షేమం కోసం తులసి లాస్య గడప తొక్కక తప్పలేదు. ఇదే అదును అనుకున్న లాస్య తులసి మీద మాటల యుద్ధం ప్రకటించబోయింది. అవమానంతో తలదించుకునేలా చేయాలనుకుంది. బయటకు గెంటేస్తానంటూ బెదిరించింది. కానీ అంతలోనే నందు సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తులసిని చూసి భగ్గుమని లేచాడు. మరి నందు.. తులసి చెప్పేది వింటాడా? తన తల్లి కోసం ఆమె వెంట ఇంటికి వెళ్తాడా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: Michael Jackson: ఊహించాడు.. అచ్చం అలాగే చనిపోయాడు! -
అనసూయ నిరాహార దీక్ష, లాస్య గడప తొక్కిన తులసి
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 24వ ఎపిసోడ్: నందు తల్లిదండ్రులకు పెళ్లై 50 ఏళ్లు పూర్తయిందని భాగ్య లాస్యకు చెప్పింది. దీన్ని ఓ వేడుకలా జరుపుకుందామని తులసి ప్లాన్ చేస్తోందని తెలిపింది. కానీ ఆ వేడుక జరపాలంటే డబ్బులు అవసరమని, అంత డబ్బు తులసి దగ్గర లేదు కాబట్టి నువ్వే ఆ సెలబ్రేషన్స్ దగ్గరుండి జరిపించావంటే ఆ కుటుంబం అంతా నిన్ను తలకెక్కించుకుంటుందని చెప్పింది. దీంతో ఇదేదో వర్కవుట్ అయ్యేలా ఉందని లాస్య ఆలోచించింది. మరోవైపు తన అత్తామామల పెళ్లిరోజును పండగలా జరపాలని తులసి తెగ ఆశపడుతోంది. అయితే తన పెద్ద కొడుకు లేకపోతే ఆ ఫంక్షన్లో కూర్చునే ప్రసక్తే లేదని అనసూయ తెగేసి చెప్పింది. నందు వస్తే అతడి వెంట ఆ కొరివి దెయ్యం లాస్య వస్తుందని, అది నాకిష్టం లేదన్నాడు ఆమె భర్త. మీరు ఎన్ని చెప్పినా ఈ విషయంలో ఎవరి మాటా విననని, తన కొడుకు రావాల్సిందేనని అనసూయ తేల్చి చెప్పింది. నందు మాత్రం ఏకంగా ఈ ఫంక్షన్‌ను రిసార్ట్‌లో జరిపించాలనుకుంటాడు. ఇదే విషయాన్ని ఎంతో ఆదుర్దాగా ఇంటికి వెళ్లి మరీ చెప్తాడు. కానీ నందు నిర్ణయాన్ని అతడి తండ్రి అంగీకరించడు. నీ ఆఫర్లు ఇక్కడ ఎవరికీ అక్కర్లేదంటాడు. ఈ వేడుక జరిపే అర్హత కూడా లేదని నిందిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్లిపో అని అవమానిస్తాడు. దీంతో ఆవేశపడ్డ నందు తన మాట కాదన్నారంటే ఈ కొడుకు చచ్చిపోయినట్లేనని, ఇంకెప్పుడూ మీ ముఖం కూడా చూడనని చెప్పి విసురుగా వెళ్లిపోతాడు. అతడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న నందు తల్లి అతడి చేతుల మీదుగా ఫంక్షన్ జరగలేదంటే పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోనని చెప్పింది. నువ్వు చచ్చినా సరే, తాను మాత్రం ఆ ఫంక్షన్‌కు వచ్చేదే లేదని నందు తండ్రి తేల్చి చెప్తాడు. ఈ క్రమంలో అనసూయ తన పంతం నెగ్గించుకోవడానికి నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో కంగారుపడ్డ తులసి.. నందు చేతుల మీదుగా ఫంక్షన్ జరుగుతున్నట్లు అతడి నోటితోనే చెప్పించాలనుంది. ఇందుకోసం లాస్య ఇంటి మెట్లు ఎక్కక తప్పలేదు. మరి తన ఇంటికి వచ్చిన తులసిని లాస్య అవమానిస్తుందా? లేక అటు నుంచటే బయటకు పంపించేస్తుందా? అసలేం జరగనుందనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
అంకితకు షాకిచ్చిన అభి, ఉద్యోగం మానేయడంతో పాటు..
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 23వ ఎపిసోడ్: నువ్వు కనిపించినప్పుడల్లా కంపరం వేస్తోందంటూ అంకిత శృతిని చీదరించుకుంది. దీంతో శృతి ఎంతగానో బాధఫడింది. మీరందరూ బాగుండాలని, ఈ ఇంటివాళ్లు క్షేమంగా ఉండాలని అందు కోసం తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పింది. కానీ నువ్వు మాత్రం చెప్పుడు మాటలు విని మోసపోకని అంకితను హెచ్చరించింది. దీంతో చిర్రెత్తిపోయిన అంకిత.. నా ముందు నిలబడటానికి అర్హత లేని నువ్వు నాకు సుద్దులు చెప్తున్నావా? అని మండిపడింది. నిన్ను అందరూ అసహ్యించుకునేలా చేయనిదే తన పగ చల్లారదని చెప్పి అక్కడ నుంచి విసురుగా వెళ్లిపోయింది. అభిని వీలైనంత త్వరగా తన వాళ్ల దగ్గర నుంచి దూరం చేయాలని ఆ ఇంట్లో అడుగు పెట్టిన అంకితకు షాకిచ్చాడు అభి. తను ఉద్యోగం మానేశానని, పైగా ఫారిన్ వెళ్లడం లేదంటూ బాంబు పేల్చాడు. మీ అమ్మ మాటలు వినడం వల్లే బిడ్డను దూరం చేసుకున్నామని, ఇంకా వాళ్ల నిర్ణయాలకు తల వంచాల్సిన అవసరం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. దీంతో కొంత కంగారుపడ్డ అంకిత.. ఇప్పుడు తనేమన్నా చివరికి మాత్రం తన మాటకు తలొగ్గాల్సిందేనని లోలోపలే అభిప్రాయపడింది. ఇక దివ్య ల్యాప్‌టాప్ పాడైందని ప్రేమ్ తన డబ్బులతో ట్యాబ్ తీసుకొచ్చాడు. సరిగ్గా అప్పుడే అంకిత కూడా ల్యాప్‌టాప్ తీసుకొచ్చి ఆమెకు ఇవ్వబోయింది. అయితే దాన్ని తీసుకునేందుకు దివ్య నిరాకరించింది. ప్రేమ్ అన్న ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే తీసుకుంటానంటూ అంకితకు ఝలకిచ్చింది. ఇక నందు తల్లిదండ్రులు పెళ్లి చేసుకుని 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుదామని తులసి కుటుంబం ప్లాన్ వేసింది. కానీ ప్లాన్లు వేస్తే సరిపోదని, సెలబ్రేషన్ చేయడానికి సొమ్ములుండాలని దెప్పి పొడిచింది అనసూయ. అయితే నందు వచ్చి ఈ వేడుకను రిసార్ట్‌లో జరిపించాలనుకుంటున్నట్లు చెప్తాడు. దీనికి అతడి తండ్రి ససేమీరా కుదరదని తేల్చి చెప్తాడు. దీంతో ఆవేశపడ్డ నందు.. తన మాటను కాదంటే నీ కొడుకు చచ్చిపోయినట్లేనంటాడు. మరి నందు కోరికను అతడి తండ్రి మన్నిస్తాడా? ఈ వేడుకలు తులసి ఇంట్లో జరుగుతాయా? లేదా రిసార్ట్‌లో జరగనున్నాయా? అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: తోటలో పండ్లు తెంపి అమ్ముకుంటున్న నరేశ్! -
అత్త కోసం కొత్త స్కూటీ తెచ్చిన అంకిత, కానీ..
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 22వ ఎపిసోడ్: తులసి ఇంట్లో మంట పెట్టేందుకు అంకిత లాస్యతో చేతులు కలిపింది. దీనికోసం ముందుగా తులసిని తన మాయమాటలు, మంచితనంతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా అసలు రంగు బయటపెట్టనుంది. అందులో భాగంగా తులసిని మాయ చేసేందుకు ఆమెకు ఓ స్కూటీ కొనివ్వాలనుకుంటుంది. ఇందుకోసం తన తల్లికి ఫోన్ చేస్తుంది. ఆ ఇంటిని ముక్కలు చేసేందుకు లక్ష రూపాయలు ఇవ్వలేనా? అని అడిగిన మొత్తాన్ని కూతురికి పంపిస్తుంది. దీంతో అంకిత ఓ కొత్త స్కూటీ కొనుక్కొచ్చి అత్త ముందుంచుతుంది. అయితే దాన్ని తీసుకునేందుకు తులసి తటపటాయించడంతో 'నన్ను పరాయిదానిలా చూస్తున్నారా? మీ వారసుడిని చంపేశానని నాపై కోపమా?' అంటూ ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తుంది. ఇది నీ డబ్బుతో కాదు, మీ అమ్మ ఇచ్చిన డబ్బుతో కొన్నావు. ఆ డబ్బును అనుభవించే హక్కు నీకు మాత్రమే ఉంటుంది, అందుకే ఈ బైక్ వద్దంటున్నానని చెప్తుంది తులసి. మరోవైపు లాస్య కొత్త కారు కొందామని నందు వెంటపడింది. దివ్య ఫీజు కోసం ఆ కారు అమ్మేద్దామనుకున్నాం. కానీ తులసి అలా కాకుండా చేసింది. ఇప్పుడు ఆ కారు తులసి వేసిన ముష్టిలా అనిపిస్తోంది. ఆ కారెక్కాలంటేనే కంపరంగా ఉంది. ప్లీజ్.. కొత్త కారు తీసుకుందాం అని ఒత్తిడి చేస్తుంది. దీంతో అయిష్టంగానే నందు ఒప్పేసుకున్నాడు. ఇక తన అత్తామామలకు 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఘనంగా వేడుకలు జరిపించాలని తులసి ప్లాన్ చేసింది. అయితే కొడుకు రాకపోతే తాను కూడా ఫంక్షన్‌కు వచ్చేది లేదని తేల్చి చెప్పేసింది అనసూయ. మరి తులసి అందుకు ఒప్పుకుంటుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. -
Intinti Gruhalakshmi: లాస్యతో చేతులు కలిపిన అంకిత
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 21వ ఎపిసోడ్: అభి నేరుగా అంకితను తీసుకుని తులసి ఇంటికి వెళ్లినందుకు నందు ఆగ్రహించాడు. మీతో ఎంత ప్రేమగా ఉన్నా, ఎన్ని చేసినా ఇలా దూరం చేస్తున్నారని ఆవేశపడ్డాడు. అత్తిల్లు వదిలేసి వచ్చినట్లు తనతో ఒక మాటైనా చెప్పలేదేంటని నిలదీశాడు. లాస్యతో ఉన్నంత మాత్రాన పిల్లలను దూరం పెట్టనని స్పష్టం చేశాడు. దీంతో అభి తండ్రి అలకను పోగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అంకిత మనం అందరితో సమానంగా కలిసిపోవాలని, కాబట్టి మామయ్య ఇంటికి వెళ్లొద్దామని అభికి నచ్చజెప్పింది. మరోవైపు తనమూలంగా మళ్లీ ఇంట్లో గొడవలు రాకూడదని ఇక్కడి నుంచి వెళ్లిపోతానంది శృతి. అంకిత మనసులో తన మీదున్న ద్వేషం గొడవలకు దారి తీస్తుందని భయపడింది. కానీ తను ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదని, ఇంకోసారి అలాంటి ఆలోచన మనసులోకి రానివ్వొద్దని తులసి మరీమరీ చెప్పడంతో శృతి కిమ్మనకుండా ఉండిపోయింది. ఇక అభి, అంకిత.. నందు ఇంటికి వెళ్లి అతడికి సారీ చెప్పారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న లాస్య అంకిత దగ్గర అసలు కూపీ లాగింది. ఏ పని మీద తులసి ఇంటికొచ్చావని నిలదీసింది. దీంతో ఓపెన్ అయిపోయిన అంకిత.. అభిని తన వాళ్ల దగ్గర నుంచి శాశ్వతంగా దూరం చేద్దామనే ఇక్కడికి వచ్చానని చెప్పింది. ఇది విని సంతోషపడిపోయిన లాస్య.. ఎలాంటి సాయం కావాలన్నా తనను నిరభ్యంతరంగా అడగొచ్చని తెలిపింది. అలా వీళ్లిద్దరూ తులసి మీద కుట్ర పన్నేందుకు చేతులు కలిపారు. మరి వీరి పన్నాగాన్ని తులసి పసిగడుతుందా? మున్ముందు తులసికి మరిన్ని చిక్కులు తప్పవా? అనేది రానున్న ఎపిసోడ్లలో చూడాలి. చదవండి: 'ఇడియట్' హీరోయిన్ రక్షిత ఇలా అయిపోయిందేంటి? -
అంకిత సూసైడ్ ప్లాన్! దారుణంగా మోసపోతున్న అభి
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 18వ ఎపిసోడ్: ఇంటిల్లిపాది తనను చేతకానివాడిలా చూడటం తట్టుకోలేకపోయాడు నందు పెద్దకొడుకు అభి. దీంతో అత్తింటి నుంచి పెట్టేబేడా సర్దుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అంకిత అతడిని ఆపే ప్రయత్నం చేసింది కానీ అభి వినిపించుకోలేదు. ఈ గడప దాటి వెళ్తే మళ్లీ ఇంట్లో అడుగు పెట్టలేవు అని అంకిత తండ్రి హెచ్చరించినా అతడు వెళ్లిపోవడానికే రెడీ అయ్యాడు. నేల మీదకు రావాల్సిన పసిపాపను కడుపులో చంపేశారు, దీన్ని హత్య కాకపోతే ఇంకేం అంటారు. ఇలాంటి మనుషుల మధ్య నేనుండలేను అంటూ అక్కడివారికి గుడ్‌బై చెప్పి వెళ్లిపోయాడు. తిరిగి తన ఇంటికి వెళ్లిన అభి తల్లి కాళ్ల మీద పడి క్షమాపణ కోరాడు. ఈ ఇంటిని వదిలి వెళ్లాకే మీ అందర ప్రేమకు దూరమయ్యానని తెలిసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ అంకితను వదిలేసి వచ్చానని చెప్పగానే తులసి లాగి కొట్టింది. మీ నాన్నను చూసి నేర్చుకుంటున్నావా? అని మండిపడింది. ఇంతలో అంకిత తల్లి ఫోన్ చేసి తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పింది. కాకపోతే సకాలంలో చూశాం కాబట్టి తను ప్రాణాలతో బయటపడిందని తెలిపింది. దీంతో ఊపిరి పీల్చుకున్న అభి వెంటనే వస్తున్నానని చెప్పాడు. అయితే అంకితను వెంట తీసుకుని రమ్మని తులసి అభికి సూచించింది. మీ మధ్య దూరాలు పెంచే చోట ఉండకూడదని స్పష్టం చేసింది. దీంతో ఎలాగైనా అంకితను అక్కడి నుంచి తీసుకొచ్చేయాలన్న ధృడ సంకల్పంతో అభి ఆ ఇంటికి వెళ్లాడు. అప్పుడు బిడ్డను చంపి ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావా? అని నిలదీశాడు. ఇక్కడ మనం ఉండకూడదని, తనతో వచ్చేయమని అంకితను కోరాడు. దీనికి ఆమె తల్లిదండ్రులు కుదరదని చెప్పారు. కేవలం తన భార్య అభిప్రాయం మాత్రమే అడుగుతున్నానని అభి చెప్పడంతో అంకిత ఆలోచనలో పడింది. అభిని తిరిగి రప్పించాలనుకుని సూసైడ్ ప్లాన్ వేస్తే ఇలా అయ్యిందేటని అంకిత తల్లి పరిపరివిధాలా ఆలోచించింది. ఇంతలో అంకిత అభి వెంట వెళ్తానని, అక్కడివాళ్లకు, అతడికి మధ్య దూరాన్ని పెంచి ఆ ఇంటి నుంచి శాశ్వతంగా తిరిగొచ్చేలా చేస్తానని చెప్పింది. దీంతో తులసి ఇంట్లో మళ్లీ కలహాలు మొదలయ్యేటట్లు కనిపిస్తోంది. చదవండి: కాజల్ డేరింగ్ స్టెప్.. పెళ్లి తర్వాత వేశ్య పాత్రలో ‘చందమామ’! -
Intinti Gruhalakshmi: ఇంటికొచ్చిన కొడుకు చెంప పగలగొట్టిన తులసి
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 17వ ఎపిసోడ్: ఇంట్లోకి మనుమడో, మనుమరాలో వస్తారని సంతోషపడ్డ నందు, తులసి.. అంకిత అబార్షన్ చేయించుకున్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అభికి తెలీకుండా అలా ఎలా అబార్షన్ చేసుకుంటుంది? పాపం, నా కొడుకు ఎంత కుమిలిపోతున్నాడో? అని నందు తల్లడిల్లిపోయాడు. నందు కుటుంబం గురించి ఆలోచించడం చూసి లాస్య లోలోపలే ఉడుక్కుంది. మరోవైపు అభి, అంకిత బంధానికి బీటలు వారనున్నట్లు కనిపిస్తోంది. మనిద్దరి రక్తం కలిసి ప్రాణం పోసుకున్న బిడ్డను చంపేశావు, ఇంకా ఏం చేద్దామని నా దగ్గరికి వస్తున్నావ్ అని అభి తన భార్యను చీదరించుకున్నాడు అభి. నా ఆశలను ఆవిరి చేశావంటూ ఆగ్రహించాడు. నువ్వు చంపింది నీ కడుపులో ఉన్న బిడ్డను కాదు, మన ప్రేమను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పిచ్చి పని ఎందుకు చేశావని నిలదీశాడు. దీంతో అంకిత నీవల్లే అబార్షన్ చేయించుకున్నానని చెప్తూ బాంబు పేల్చింది. ఇప్పటివరకు మనం సెటిల్ కాలేదని, నువ్వు బిడ్డను పోషించలేవనే గర్భాన్ని తీయించేసుకున్నానని అభికి సూటిగా చెప్పింది. ఇప్పటికే నువ్వు చేతకానివాడిలా మిగిలిపోయావని నిందించింది. పైసా సంపాదించడం చేతకాదని సూటిపోటి మాటలతో అతడి మనసును ఛిద్రం చేసింది. దీంతో తను జీవితంలో ఫెయిల్ అయ్యానని రోదించాడు అభి. అటువైపేమో అభి పరిస్థితిని తలుచుకుని తులసి తల్లడిల్లిపోయింది. అతడి ఆశలు అడియాసలయ్యానని దిగులు చెందింది. ఆ ఇంట్లో అందరూ ఉన్నా అభి అనాధలా బతుకుతున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేమించిన అమ్మాయే వాడిని మోసం చేసిందని దుఃఖించింది. నిత్యం కుమిలిపోతూ ఉండే జీవితం వాడికొద్దని సంతోషకరమైన జీవితాన్ని అందించాలని తులసి ఆశపడుతోంది. రేపటి ఎపిసోడ్లో అభి అత్తింటిని వదిలి తిరిగి తల్లి దగ్గరకు వచ్చేశాడు. ఆ ఇంటినే కాదు అంకితను కూడా వదిలేశానని చెప్పడంతో తులసి చెంప పగలగొట్టింది. మీ నాన్నను చూసి నేర్చుకుంటున్నావా? అని కోప్పడింది. మరి అభిని తులసి ఇంట్లోకి రానిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: Sai Pallavi : బాలీవుడ్ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణం ఇదేనట -
చాచి కొట్టిన అభి, జీవితంలో క్షమించనంటూ చీదరింపు!
త్వరలోనే ఓ పసిబిడ్డకు తండ్రవుతానన్న సంతోషం అభికి ఎక్కువకాలం నిలవలేదు. అటు కొడుకును మనసారా ఆశీర్వదించడానికి వెళ్లిన తులసి, నందుల ఆనందం కూడా క్షణాల్లో ఆవిరైపోయింది. అంకిత అబార్షన్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో అభి గుండె బద్ధలైంది. అతడిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మరి నేటి(జూన్ 16) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. నందుతో కలిసి అభి దగ్గరకు వెళ్లడానికి తులసి అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ వేర్వేరు కార్లలో అభి ఇంటికి చేరుకున్నారు. కానీ కొడుకు సంతోషం కోసం ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. అంకిత త్వరలో ఓ పసిపాపను చేతిలో పెడుతుందని తెగ సంతోషడిపోయారు. ఇక గర్భవతిగా ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తులసి చెప్తుండగా ఉన్నట్లుండి అంకిత ఏడుపందుకుంది. తనను క్షమించమని వేడుకుంది. ఇంతలో ఏమైందని అందరూ గాబరా పడగా అంకిత అబార్షన్ చేయించుకున్న విషయాన్ని ఆమె తల్లి బయట పెట్టింది. దీంతో ఆడుకోవడానికి మాకు మనవడిని ఇస్తున్నాడని సంతోషంతో వెళ్లిన నందు దంపతులకు నిరాశే ఎదురైంది. పిల్లలంటే పడి చచ్చే అభి తన భార్య అబార్షన్ చేయించుకోవడాన్ని సహించలేకపోయాడు. అంకితను లాగి చెంప మీద కొట్టాడు. మా ముందే కూతురి మీద చేయి చేసుకుంటావా? అంటూ అంకిత తల్లిదండ్రులు ఆవేశంతో ఊగిపోయారు. దీంతో చిర్రెత్తిపోయిన అభి అబార్షన్ తప్పని మీ కూతురిని ఎందుకు ఆపలేదని ఎదురు ప్రశ్నించాడు. మా ప్రేమకు ప్రతీకలా పెరుగుతున్న పసిగుడ్డును చంపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంకితను జీవితంలో క్షమించను అని తేల్చి చెప్పాడు. అభికి తెలియకుండా అబార్షన్ చేయించడం తప్పన్న నందు మీద కూడా అంకిత తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. మీ క్యారెక్టర్ ఏంటో చూసుకోండి, మీరు నోరు విప్పితే నలుగురూ నవ్విపోతారు.. అంటూ చీవాట్లు పెట్టారు. దీంతో అవమానభారంతో తలదించుకున్న నందు, తులసి కన్నీళ్లతో అక్కడి నుంచి చెరో దారిన వెళ్లిపోయారు. అయితే అభి పరిస్థితిని తల్చుకుని బాధపడ్డ తులసి కొడుకుకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భావించింది. మరి అందుకు తల్లిగా తనేం చేయనుందనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. చదవండి: Tamanna Bhatia: బుల్లితెరపై సందడి చేయనున్న తమన్నా! -
Intinti Gruhalakshmi: కొడుకు కోసం కలవనున్న తులసి, నందు!
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 14వ ఎపిసోడ్: తన భార్య అంకిత గర్భవతన్న విషయం తెలిసి అభి ఎగిరి గంతేశాడు. కంటికి రెప్పలా చూసుకుంటానంటూ అంకితను ఎత్తుకుని తిరిగాడు. తండ్రవుతున్నాడన్న సంతోషంలో మునిగి తేలుతున్న అభి ఈ వార్తను అమ్మకు చెప్పాలంటూ వెంటనే తులసికి ఫోన్ చేశాడు. అంకిత గర్భవతి అని, నువ్వూ, నాన్న జంటగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండని కోరాడు. దీంతో నందుతో కలిసి రావాలా? వద్దా? అని తులసి ఆలోచనలో పడింది. ఈ కుటుంబమే వద్దనుకుని వెళ్లిన అతడిని ఎలా ఒప్పించాలో అర్థం కాక తల పట్టుకుంది. అయినా కొడుకు సంతోషం కోసం నందు దగ్గర కాళ్లబేరానికి పోవాలా? అని తనను తానే మథనపడింది. ఇది చూసిన తులసి మామయ్య వెంటనే తన కొడుక్కి ఫోన్ చేశాడు. అభి తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని నందుకు చెప్పాడు. నువ్వు, తులసి కలిసి అక్కడికి రావాలని అభి ఆశపడుతున్నాడని పేర్కొన్నాడు. తనకు మనుమడు రాబోతున్నాడని సంతోషించిన నందు తులసితో కలిసి కొడుకు ఇంటికి వెళ్లాలా? అని ఓ క్షణం తటపటాయించాడు. కానీ కొడుకు కోసం భార్యతో కలిసి వెళ్లేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరి దీనికి లాస్య ఒప్పుకుంటుందా? లేదా? అనేది పక్కన పడితే మొదలు తులసే అంగీకరించడానికి నిరాకరిస్తున్నట్లు కనిపిస్తోంది. నందుతో కలిసి వెళ్లడం నాకిష్టమేనా? అని ఎందుకు అడగలేదని తన మామయ్యను నిలదీసింది. ఇదిలా వుంటే అంకిత తనకు అబార్షన్ జరిగిన విషయాన్ని అభికి చెప్పలేక, మనసులో దాచుకోలేక నరకం అనుభవిస్తోంది. కడుపులో బిడ్డను తానే చంపేసుకున్నానని కుమిలిపోయింది. ఈ విషయం తెలియని అభి.. అంకిత కడుపులో బిడ్డ పెరుగుతోందనుకుని తన గదినంతా చిన్నపిల్లల పోస్టర్లతో నింపేశాడు. పుట్టే బిడ్డ కోసం ఇప్పటి నుంచే తన కళ్లు ఎదురు చూస్తున్నాయని ఆనంద భాష్పాలు రాల్చాడు. కడుపులో మోసే అమ్మ కన్నా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసే నాన్నకే ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పుకొచ్చాడు. పుట్టే బిడ్డ కోసం తాపత్రయపడుతున్న అభి సంతోషాన్ని తనే నాశనం చేశానని అంకిత కుమిలిపోయింది. మరి రేపటి ఎపిసోడ్లో అభి కోరిక మేరకు నందు, లాస్య జంటగా అతడి ఇంటికి వెళ్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: కూతురు ఫోటో షేర్ చేసి మురిసిపోతున్న హీరోయిన్ అసిన్ -
Intinti Gruhalakshmi: మెట్టు దిగిన నందు, అవమానించిన తులసి!
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 11 ఎపిసోడ్: తులసితో సంతకం చేయిస్తానని ధీమాగా వెళ్లిన లాస్యకు మొండిచేయే ఎదురైంది. ఇంట్లో అడుగు పెడితేనే కాళ్లు విరగ్గొడతానన్నదాన్ని సంతకం ఎలా పెడతానని తులసి నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన లాస్య.. నందు, నీ ఫ్యామిలీ మెంబర్స్‌ను దూరం పెట్టకూడదంటే సంతకం పెట్టాల్సిందే అని వార్నింగ్ ఇచ్చింది. ఇది విన్న తులసి, ఇదే మాట నందుతో అన్నావంటే చెప్పు తీసుకుని కొడతాడని తిట్టింది. దీంతో అవమానభారంతో వెనుదిరిగి వచ్చిన లాస్య నువ్వు వెళ్తేనే పనవుతుందంటూ నందును ఉసిగొల్పింది. చిన్న సంతకం పెట్టడానికి ఎందుకింత పోజు కొడుతుందని నందు తులసి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఆమె ఇంటి మెట్లు ఎక్కాడు. ఫైల్ మీద సంతకం చేయమని అడిగాడు. అలా సంతకం చేస్తే తను భార్య అని ఒప్పుకున్నట్లే కదా అని తులసి లాజిక్‌లు మాట్లాడింది. దీంతో అత్త అనసూయ తులసి మీద చిర్రుబుర్రులాడబోయింది. ఆమె మాటలనుమధ్యలోనే అడ్డుకున్న తులసి.. కొడుకు జీవితం బంగారంలా, కోడలు జీవితం బురదపాలవ్వాలనుకునే నీకు మాట్లాడే అర్హత లేదని ఆమె నోరు మూయించింది. మరోవైపు అభికి అంకిత గర్భవతన్న విషయం తెలిసింది. ఈ శుభవార్తను అతడు తల్లితో పంచుకున్నాడు. నాన్నను వెంటపెట్టుకుని వచ్చేయమని కోరాడు. దీంతో తులసి తను సంతకం పెట్టాలంటే తనవెంట అభి ఇంటికి రావాలని నందుకు కండీషన్ పెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి నిజంగానే తులసి ఈ కండీషన్ పెడుతుందా? లేదా అసలు సంతకమే పెట్టదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఆ సీక్వెల్లో నేను, నా కొడుకు కలిసి నటిస్తాం: బాలయ్య -
Intinti Gruhalakshmi: తులసి చేతిలో నందు జాతకం!
నందు పడ్డ కష్టానికి ప్రతిఫలం తులసి మీద ఆధారపడి ఉంది. అతడు పూర్తి చేసిన ప్రాజెక్టుకు డబ్బులు రావాలంటే తులసి సంతకం తప్పనిసరి అని చెప్పడంతో నందు, లాస్య టెన్షన్ పడ్డారు. ఎలాగైనా తులసితో సంతకం పెట్టిస్తానని లాస్య ఆమె ఇంటికి వెళ్లింది. మరి అక్కడేం జరిగింది? లాస్య అడిగినదానికి తులసి అంగీకరించిందా? లేదా? అనేది నేటి (జూన్ 10) ఎపిసోడ్లో చదివేయండి... కళ్లు తిరిగి పడిపోయిన అంకిత ఆరోగ్యానికి ఏమైందోనని అభి కలవరడ్డాడు. తను తీసుకోవాల్సిన ఫుడ్ దగ్గర నుంచి మెడిసిన్ వరకు అంతా తానే దగ్గరుండి చూసుకుంటానని చెప్పాడు. అతడి ప్రేమకు పరవశించిపోవాలో, గర్భవతి అన్న విషయాన్ని దాస్తున్నందుకు బాధపడాలో తెలీని దుస్థితిలో ఉంది అంకిత. మరోవైపు ఆమె తల్లి మాత్రం వీలైనంత త్వరగా అబార్షన్ చేయించాలని నిర్ణయించుకుంది. మరోపక్క ప్రేమ్, శృతిల మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ్ మీద అభిప్రాయమేంటి అని పనిమనిషి రాములమ్మ అడగ్గానే శృతి గుటకలు మింగింది. తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టాలా? వద్దా? అని నానారకాలుగా ఆలోచించింది. చివరకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు గుండె దాటి బయటకు రాలేవంటూ సమాధానం దాటవేసింది.. కానీ రాములమ్మ మాత్రం ప్రేమ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని తేల్చి చెప్పింది. ఏదో ఒకరోజు అతడే ఈ విషయాన్ని నీ ముందుకు వచ్చి చెప్తాడని అనడంతో శృతి సిగ్గుతో బిడుసుకుపోయింది. తులసి ఇంటికి వచ్చిన అంజలి తన స్నేహితురాలితో కాసేపు కబుర్లాడింది. బిజినెస్ స్టార్ట్ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. సరిగ్గా అప్పుడే అక్కడకు వచ్చిన మాధవి.. నందు అన్నయ్యతో బంధాన్ని తెగతెంపులు చేసుకోమని వదినకు సెలవిచ్చింది. ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకడం దేనికని ప్రశ్నించింది. అన్నయ్య వదిలేసినా ఆయన తిరిగొస్తాడని చూడటం వ్యర్థమని అభిప్రాయపడింది. దీనికి తులసి స్పందిస్తూ కలిసి ఉండాలా? విడిపోవాలా? అనేది నిర్ణయించుకునేందుకు ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చింది. మరో పక్క నందు పూర్తి చేసిన ప్రాజెక్టులో అతడి భార్య సంతకం కూడా ఉంటేనే ప్రాజెక్టు పూర్తి డబ్బులు పంపిస్తామని చెప్పాడు. తులసి సంతకాన్ని ఫోర్జరీ చేస్తే సరిపోతుంది కదా అని లాస్య సలహా ఇచ్చింది. ఆ సంతకం ఫోర్జరీ అని తెలిస్తే జైలుపాలవుతామని నందు హెచ్చరించాడు. ఎలాగైనా తన దగ్గర సంతకం తీసుకోవాల్సిందేనని చెప్పాడు. కానీ తులసి దగ్గరకు వెళితే ఒక మెట్టు దిగినట్లు అవుతుందని మధనపడ్డాడు. దీంతో లాస్య తన చేత ఎలాగైనా సంతకం చేయించుకొస్తానని చెప్పింది. అన్నట్లుగానే ఆమె ఇంటికి వెళ్లి సంతకం కోసం రిక్వెస్ట్ చేయకుండా ఆర్డర్ వేసింది. సంతకం పెట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. మరి లాస్య మాటలకు తులసి వెనకడుగు వేసి సంతకం పెడుతుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్ -
కాళ్లు విరగ్గొడతానన్న తులసి కాళ్ల బేరానికి!?
ఒక్కో మెట్టు ఎదగాలన్న తులసి ఆశయానికి బీజం పడింది. నలుగురు మహిళలను పనిలో చేర్పించుకుని వ్యాపారాన్ని మొదలుపెట్టింది. మరోవైపు జిత్తులమారి లాస్య కుట్రకు నందు అన్యాయంగా బలైపోతున్నాడు. ఎంతో పెద్ద ప్రాజెక్టును దక్కించుకున్న నందు మంచి లాభాలు వస్తాయని ఆశిస్తే చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితికి తానే కారణమంటూ తనలో తానే కుమిలిపోయాడు. మరి నేటి(జూన్ 9)ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. తులసి కుట్టు మిషన్లు తెచ్చి తన వ్యాపారాన్ని మొదలు పెట్టింది. ఆమె అత్త అనసూయ అయిష్టంగానే తులసిని ఆశీర్వదించింది. మూడు మిషన్లు మూడు వందల మిషన్లుగా మారాలని, వ్యాపారంలో వృద్ధి సాధించాలని శృతి ఆకాంక్షించింది. ఇక మొదటి రోజే తులసి పగలూరాత్రీ తేడా లేకుండా కష్టపడింది. ఏ చిన్న పొరపాటు కూడా ఉండకూడదని అన్నీ దగ్గరుండి చూసుకుంది. మరోవైపు పూటుగా తాగి వచ్చిన నందు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేశానని లాస్యకు తెలిపాడు. కానీ తులసి వ్యాపారం మొదలు పెట్టిందని, తానేమో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తాగి తూలుతున్నానని బాధపడ్డాడు. అసలు ఈ స్థితికి వచ్చేలా నన్ను మోసం చేసింది ఎవరో తెలిసిపోయిందనగానే లాస్య గుండె ఝల్లుమంది. అంతలోనే దీనికంతటికీ కారణం తానే అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఇక అంకిత పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. స్నేహితురాలితో సరాదాగా ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో కంగారుపడ్డ ఆమె తల్లి డాక్టర్‌కు కబురుపెట్టింది. ఇంటికి వచ్చి అంకితను పరీక్షించిన వైద్యురాలు అంకిత ఎక్కువగా టెన్షన్ పడటం వల్లే ఇలా అయ్యిందని చెప్పింది. మరీ ఆలస్యం చేస్తే ఆమెకు అబార్షన్ చేయడానికి కూడా ఆస్కారం ఉండదని హెచ్చరించింది. తులసి చీదరించినా, ఛీ కొట్టినా లాస్య తన బుద్ధి పోనిచ్చుకోలేదు. ఫైల్ మీద సంతకం పెట్టమంటూ మరోసారి తులసి ఇంటి గడప తొక్కింది, అంతేకాదు ఫైల్ మీద సంతకం పెట్టమంటూ డిమాండ్ చేసింది. దీంతో ఆమె మీద చిర్రుబుర్రులాడిన తులసి.. ఈ ఇంట్లో అడుగు పెడితేనే కాళ్లు విరిగి చేతిలో పెడ్తాను అని చెప్పినదాన్ని సంతకం ఎలా చేస్తాననుకున్నావు అని మండిపడింది. సంతకం పెట్టకపోతే నందుకు తన కుటుంబ సభ్యులను శాశ్వతంగా దూరం చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. మరి ఆమె వార్నింగ్‌కు తులసి భయపడుతుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: ‘శ్రుతీ.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ -
నిజం తెలుసుకున్న నందు, లాస్యలో మొదలైన టెన్షన్!
తులసిని ఓడించాలని లాస్య, తులసి మీద విజయం సాధించాలని నందు తెగ కష్టపడుతున్నారు. అయితే ఇందులో ఒకరిది స్వార్థం అయితే మరొకరిది అవసరం. ఏదేమైనా నందు ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి అతడి పరిస్థితి దయనీయంగా మారింది. కంపెనీ కష్టాల్లో కూరుకుపోతూ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్నాడు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లాస్యే కారణమైనప్పటికీ ఆ విషయం తెలియని నందు ఆమెను గుడ్డిగా నమ్ముతుండటం శోచనీయం. తులసిని ఓడించాలన్న లాస్య ప్లాన్ కూడా బెడిసికొట్టింది. అసలు నేటి(జూన్ 8) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. తులసి తన ప్రాజెక్ట్ చేజారిపోయినందుకు బాధపడలేదు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా నవ్వుతూ ఎదుర్కొనే ఆమె ఈ విషయాన్ని కూడా పాజిటివ్‌గానే స్వీకరించింది. కానీ అంతలోనే కంపెనీ నుంచి ఆమెకు ఫోన్‌కాల్ వచ్చింది. తనకు పోటీగా వచ్చిన స్టెల్లా డిజైన్లు కాపీవని తేలాయని, నిజాయితీగా స్వంత డిజైన్లు గీసిన మీకు ప్రాజెక్ట్ అప్పగిస్తున్నామని వెల్లడించింది. దీంతో తులసి ఇంట్లో ఆనందాలు వెల్లివిరిసాయి. మరోపక్క ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలా? అని నందు మల్లగుల్లాలు పడ్డాడు. తనకు సాయం చేయమని తండ్రి కాళ్ల మీద పడ్డాడు. తను పెట్టిన కంపెనీ కష్టాల్లో ఉందని, ఉద్యోగులకు చిల్లిగవ్వ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నానని కన్నీరు పెట్టుకున్నాడు. నీకేదైనా సాయం చేయగలిగితే అది తులసి మాత్రమేనని తండ్రి తేల్చి చెప్పడంతో నందు తన అహాన్ని అణుచుకుని భార్యను అర్థించాడు. తనను గండం నుంచి గట్టెక్కించమని కోరాడు. దీంతో విస్తుపోయిన తులసి తన తాళిని ఎగతాళి చేసినందుకు సాయం చేయాలా? కుటుంబాన్ని అనాథలా వదిలేసినందుకు సాయం చేయాలా? అని మండిపడింది. తన చేత పెట్టించిన కన్నీరే నీ పతనానికి కారణమైందంటూ భర్త మీద విరుచుకుపడింది. కానీ ఇదంతా కల అని తెలియడంతో నందు నిద్రలో నుంచి లేచి ఉలిక్కిపడ్డాడు నందు. తులసిని సాయం అడగకుండానే జీవితంలో గెలిచి తీరాలని సంకల్పించాడు. తులసిని మాత్రం ప్రాధేయపడకూడదని నిర్ణయించుకున్నాడు. నందు తనకు సాయం చేయమని స్నేహితుడు దివాకర్‌ను కోరాడు. ఇప్పుడు పెట్టుబడి పెడితే వచ్చే లాభం మొత్తాన్ని తనకే ఇస్తానని చెప్పడంతో అతడు సానుకూలంగా స్పందించాడు. ఈ మేరకు ఇద్దరూ అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. అయితే ఇలా లాభం లేకుండా బిజినెస్ చేయడం లాస్యకు ఏమాత్రం నచ్చలేదు. కానీ తులసిని ఓడించాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదని చెప్పడంతో ఆమె ఊరుకుండిపోయింది. ఇక రేపటి ఎపిసోడ్లో నందు మరోసారి తాగి తూగినట్లు కనిపిస్తోంది. తనకు తెలిసినవారే వెన్నుపోటు పొడుస్తూ ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారని ఆవేదన చెందాడు. నీడలా ఉంటూ మోసం చేస్తున్నదెవరో తనకు తెలిసిందంటూ చెప్పడంతో లాస్య నీళ్లు నమిలింది. మరి నిజంగానే తనకు నమ్మకద్రోహం చేస్తుంది లాస్య అన్న విషయం నందుకు తెలిసిందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
కాళ్ల మీద పడ్డ నందు, గట్టెక్కించంటూ వేడుకోలు
తులసి ప్రయత్నాన్ని దెబ్బ కొట్టాలన్న లాస్య ప్లాన్ విజయవంతమైంది. కానీ తొలి ప్రయత్నంలోనే ఓటమిపాలైనందుకు తులసి దిగులు చెందలేదు. తను ఎగసిపడే ఉప్పెనలాంటిదాన్నంటూ మరింత ధైర్యంగా ముందడుగు వేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఎలాగైనా తులసి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని రగిలిపోయింది లాస్య. మరి నేటి (జూన్ 7) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. ఎంతో కష్టపడి గీసిన డ్రెస్ డిజైన్స్‌కు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోవడంతో తులసి తెగ టెన్షన్ పడింది. కానీ ఆ ఫైళ్లను మాయం చేసిన అనసూయ మాత్రం లోలోపలే సంతోషించింది. అయితే అనసూయ కుట్రను పసిగట్టిన శృతి తిరిగి ఆ ఫైళ్లను వెతికి తీసుకొచ్చింది. దీంతో అప్పటివరకు ఆందోళన చెందిన తులసి హమ్మయ్య అని ఓ నిట్టూర్పు వదిలి వాటిని తీసుకుని బయటకు వెళ్లిపోయింది. ఇక తులసిని ఓడించేందుకు లాస్య డిజైనర్ స్టెల్లాను రంగంలోకి దింపింది. దీంతో కంపెనీ యాజమాన్యం తులసి, స్టెల్లా ఇద్దరి డిజైన్లు చూసి, చివరికి స్టెల్లాకు ప్రాజెక్టు అప్పజెప్పేందుకు మొగ్గు చూపింది. దీంతో లాస్య ఊహించినట్లుగానే తులసికి ప్రాజెక్టు దక్కకపోవడంతో ఆమె నిరాశగా వెనుదిరిగింది. ఇంతలో లాస్య తులసికి తారసడి ఆమెను ఎగతాళి చేసేందుకు ప్రయత్నించింది. కానీ తనపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదగడం తథ్యం అని లాస్య నోరు మూయించింది తులసి. ఇంట్లో తనకు కాంట్రాక్ట్ రాలేదన్న విషయాన్ని చెప్పడంతో గయ్యాలి అత్త అనసూయ మళ్లీ తన నోటికి పని చెప్పింది. తులసికి ఏమీ చేత కాదంటూ నానా మాటలు అంది. ఇదిలా వుంటే రేపటి ఎపిసోడ్లో ఆర్థిక సాయం కోసం నందు తండ్రి కాళ్ల మీద పడ్డాడు. కానీ ఇప్పుడు తాను సాయం చేసే స్థితిలో లేనని చేతులెత్తేసిన అతడు వెళ్లి తులసిని అడగమని సలహా ఇచ్చాడు. దీంతో తనను ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కించంటూ భార్యను ప్రాధేయపడ్డాడు. కానీ ఇందుకు తులసి ఏమాత్రం చలించనట్లు కనిపిస్తోంది. మరి ఆమె నందుకు సాయం చేస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: నందు నావాడు అంటూ గోతులు తీస్తున్న లాస్య! -
Intinti Gruhalakshmi: తులసి ప్రయత్నాన్ని దెబ్బ కొట్టిన లాస్య!
నందు నావాడు అంటూనే గోతులు తీయడం మొదలు పెట్టింది లాస్య. అతడిని పూర్తిగా తనవైపు తిప్పుకుని అతడి ఆఫీసులో పని చేసే ఉద్యోగి ద్వారా డబ్బు గుంజుతోంది. అటు తులసి కూడా ఎదగడానికి వీల్లేదని కంకణం కట్టుకుంది. తనను ఒక్క అడుగు కూడా ముందుకెళ్లనివ్వనని శపథం చేసింది. మరి నేటి(జూన్ 4) ఎపిసోడ్లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. నందు ఆఫీసులో ఉద్యోగులకివ్వాల్సిన జీతాలను లాస్య దొంగ లెక్కలతో తన అకౌంట్లోకి పంపించుకుంది. అతడి డబ్బులను కాజేసి నందుకే వెన్నపోటు పొడిచింది. ఈ విషయం తెలియని నందు ఆమెను గుడ్డిగా నమ్ముతుండటం గమనార్హం. పైగా ఆఫీసు లెక్కల బాధ్యతను కూడా లాస్యకే అప్పగించడం దురదృష్టకరం.. ఇదిలా వుంటే తులసి సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టాలని తహతహలాడుతోంది. అందులో భాగంగా కుట్టు మిషన్లు ఆర్డర్ ఇవ్వాలని, ఓ నలుగురిని పనిలో పెట్టుకోవాలని ప్లాన్లు వేస్తోంది. సరిగ్గా అప్పుడే వచ్చిన ప్రేమ్ ఒక టీవీ సీరియల్‌కు టైటిల్ సాంగ్ కంపోజ్ చేసే ఛాన్స్ వచ్చిందంటూ శుభవార్త చెప్పాడు. కొడుకు ఆశయం నెరవేరుతున్నందుకు తులసి తెగ సంతోషించింది. ఏదైనా సాధించి తీరాలన్న తులసి స్థైర్యాన్ని దెబ్బతీయాలని లాస్య ఫోన్ చేసింది. 'మొగుడు లేనివాళ్లకు చిన్ననాటి స్నేహితుడే చేదోడువాదోడు.. నందు లేకపోయినా పక్కన రోహిత్ ఉన్నాడుగా..' అంటూ వక్రమాటలు మాట్లాడింది. దీంతో చిర్రెత్తిపోయిన తులసి.. లాస్య మీద అసహనం ప్రదర్శించింది. నిద్రపోతున్న సింహాన్ని లేపితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన లాస్య 24 గంటల్లో తానేంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చింది. మరోపక్క ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలా? అని మల్లగుల్లాలు పడుతున్న నందుకు లాస్య మాయమాటలు చెప్పే ప్రయత్నం చేసింది. ఒక్కోసారి ఇలాంటివి ఎదురవుతాయంటూనే మళ్లీ అప్పు చేయమని సూచించింది. అప్పు చేస్తే వచ్చే ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోతుందని నందు టెన్షన్ పడుతుంటే లాస్య మాత్రం తన అకౌంట్లో డబ్బు జమైందని లోలోపలే సంతోషపడింది. ఇక రేపటి ఎపిసోడ్లో లాస్య.. తులసి తలపెట్టిన పనికి ఆదిలోనే ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించింది. తులసి ఎంతో కష్టపడి గీసిన డిజైన్లను తనకు తెలియకుండా మాయం చేసేసి దెబ్బ తీసింది. మరి ఇది జిత్తులమారి లాస్య పన్నిన కుట్ర అని తులసికి తెలుస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! చదవండి: సితార: చేతిలో పువ్వు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న శోభిత లుక్ -
Intinti Gruhalakshmi: నందుకు లాస్య వెన్నుపోటు!
లాస్య తన వంకర బుద్ధిని పోనిచ్చుకోలేదు. నందు మీద ప్రేమను ఒలకబోస్తూనే అతడికి వెన్నుపోటు పొడుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల వేతనాల కోసం ఉంచిన డబ్బును నందుకు తెలియకుండా అప్పనంగా వాడుకుంటోంది. పైగా ఆ డబ్బంతా ప్రాజెక్టుకు ఖర్చైపోయినట్లు నమ్మించింది. దీంతో నందు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుర్భర పరిస్థితిలో ఉన్నాడు. మరోవైపు తులసి కొత్తగా ఏదైనా బిజినెస్ పెడదామని చూస్తోంది. మరి నేటి (జూన్ 3) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. తండ్రి ఆశీర్వాదం కోసం వచ్చిన దివ్య మీద నోరు పారేసుకుంటున్న లాస్యకు చుక్కెదురైంది. దివ్యకు క్లీస్ పీకుతున్న లాస్యను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించాడు నందు. తర్వాత కూతురిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడాడు. అప్పుడు దివ్య తను ఫస్ట్ డే కాలీజేకి వెళ్తున్నానంటూ తండ్రి కాళ్ల మీద పడిపోయింది. దీంతో ఆమెను చేరదీసిన నందు నువ్వు మంచి డాక్టర్‌గా ఎదగాలంటూ ఆశీర్వదించాడు. మరోవైపు అంకిత తను గర్భం దాల్చిన విషయాన్ని భర్తకు చెప్పకుండా తప్పు చేస్తున్నానా? అని లోలోపలే అంతర్మథనం చెందసాగింది. అది చూసిన ఆమె తల్లి అబార్షన్ చేయించుకోవాల్సిందేనని పదేపదే ఆమె మీద ఒత్తిడి తెచ్చింది. గర్భవతినన్న విషయం నీ భర్తకు చెప్తే అతడు అబార్షన్ జరగనివ్వడని హెచ్చరించింది. దీంతో అంకిత పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇక నందుకు నీడలా ఉండే లాస్య పాములా విషం చిమ్ముతోంది. నందు కోసం ఏదైనా చేస్తాను అని ప్రేమ ఒలకబోసే ఆమె వెనక మాత్రం గోతులు తీస్తోంది. ఆఫీసులో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ఉంచిన డబ్బును లాస్య లాగేసుకుంది. అయితే ఆ డబ్బు ప్రాజెక్టు వర్క్‌కు అయిపోయిందని నమ్మించి ఉద్యోగుల కోసం డబ్బు సర్దుమని వేరే ఉద్యోగితో చెప్పించింది. ఇది నిజమని నమ్మిన నందు నాలుగు రోజుల్లో వారికి వేతనాలు ఇచ్చేలా డబ్బు సర్దుతానని చెప్పాడు. మరోవైపు తులసి కుట్టు మిషన్ వచ్చినవాళ్లను చేర్చుకుని కుటీర పరిశ్రమ పెడితే బాగుంటుందని భావించింది. ఇంకా తన భవిష్యత్తులో ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అని ప్లానింగ్ చేస్తుండగా ఆమె స్నేహితురాలు అంజలి అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే తులసి అత్త అనసూయ అంజలి మీద నోరు పారేసుకుంది. ఆమె ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడికి వచ్చేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. తులసిలో వచ్చిన మార్పును చూసి అంజలి షాకైంది. మరి అంజలి ఏ పని మీద తులసి దగ్గరకు వచ్చింది? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: హీరో నిఖిల్ కారుకు రెండు చలాన్లు దిశా మాజీ ప్రియుడి ఫొటోలు.. సల్మాన్ 2 రూపాయల ఆర్టిస్ట్! -
Intinti Gruhalakshmi:ప్రేమ్, శృతి మధ్య ప్రేమ చిగురిస్తోందా?
మెడిసిన్‌లో సీటు సంపాదించిన దివ్య తన చదువుకు ఇక ఏ ఢోకా లేదన్న సంతోషంలో మునిగి తేలుతోంది. కాలేజీలో మొదటిసారి అడుగు పెట్టబోతున్నందుకు తల్లి ఆశీర్వాదాలు తీసుకుంది. తండ్రికి కూడా ఓ మాట చెప్దామని వెళ్తే నందుకు బదులు లాస్య తారసడింది. దొరికిందే ఛాన్సనుకున్న లాస్య.. దివ్య మనసులో విషబీజాలు నాటే ప్రయత్నం చేసింది. తులసితో ఏమీ కాదని, తల్లిని వదిలి వచ్చేయమని ఉచిత సలహా ఇచ్చింది. మరి దీనికి దివ్య ఏమని సమాధానమిచ్చింది? నేటి(జూన్ 2) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. చాలా రోజుల తర్వాత ప్రేమ్‌ను చూసిన శృతి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. దీంతో ఇంటి సభ్యులు ఆమెను ఆటపట్టించారు. ఇక సంగీతం ప్రాక్టీస్ చేస్తున్న ప్రేమ్ దగ్గరకు వెళ్లిన శృతి సరదాగా సెటైర్లు వేయడంతో అతడు ఆమె వెంటపడ్డాడు. అలా వీరిద్దరూ తమ మధ్య ఉన్న ఎడబాటును చెరిపేస్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి నీళ్లలో ఆడుకున్నారు. వీరి జలకాలాటలు చూసి తులసి, ఆమె మామయ్య ఆశ్చర్యపోయారు. దీంతో శృతి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి సిగ్గుతో వెళ్లిపోయింది. ఇదంతా చూస్తుంటే వీళ్ల మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అంకిత తను గర్భం దాల్చిన విషయాన్ని భర్తతో చెప్పలేక, అలా అని మనసులో దాచుకోలేక తెగ ఇబ్బందిపడింది. తనకు చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేకపోతున్న అభి దగ్గర ఇంత పెద్ద విషయం దాచి మోసం చేస్తున్నానేమోనని బాధతో కంటనీరు పెట్టుకుంది. ఒకవేళ నేను నీ దగ్గర ఏదైనా దాస్తే ఏం చేస్తావు? అని అంకిత అడగ్గా.. నువ్వు నా దగ్గర ఏదీ దాచలేవన్న నమ్మకం తనకుందని, ఒకవేళ అలా దాచితే అప్పుడు మన మధ్య ప్రేమ, నమ్మకానికి చోటు లేనట్లేనని అభి చెప్పడంతో అంకిత మరింత ఎమోషనల్ అయింది. ఇక దివ్య తను కాలేజీకి మొదటిసారి వెళ్తున్నానని, అందుకు ఆశీస్సులు కావాలంటూ తల్లి కాళ్ల మీద పడిపోయింది. నిజానికి తనకు ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయని, కాకపోతే ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని, అందుకోసమే వెళ్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే కాలేజీకి వెళ్లేముందు నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోమని తులసి సూచించింది. నువ్వు డాక్టర్ కావాలని నాన్న ఎన్నో కలలు కన్నాడని చెప్తూ తప్పకుండా ఈ విషయం మీ నాన్నకు చెప్పి తీరాల్సిందేనని అనడంతో దివ్య నేరుగా లాస్య ఇంటికి వెళ్లింది. దివ్య తన ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయిన లాస్య మెడిసిన్ ఫీజు కోసం వచ్చావా? అని ఎగతాళి చేసింది. అయినా నువ్వు మీ అమ్మతో ఉంటే భవిష్యత్తు గంగలో కలిసినట్లేనని, చదువుకోలేవని మనసులో విషం నింపే ప్రయత్నం చేసింది. నీ తల్లిని నమ్ముకుంటే ఏమీ మిగలదని, సరాసరిగా ఇక్కడికి వచ్చేయమని సూచించింది. ఎందుకంటే నీకు తండ్రైన నందు ఇప్పుడు తనవాడని చెప్పింది. దీంతో ఒక్కసారిగా నవ్వేసిన దివ్య మా నాన్నకు నీ మీదున్న నమ్మకం కన్నా నా మీదున్న ప్రేమే ఎక్కువ అని చెప్పడంతో లాస్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. తన తల్లి దగ్గర సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పడంతో లాస్య ముఖం మాడిపోయింది. మరి దివ్య నందు ఆశీర్వాదాలు తీసుకుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! చదవండి: Gunasekhar: అందుకే ఆ హీరోలు నన్ను దూరం పెట్టలేదు! -
గర్భం దాల్చిన అంకిత, అబార్షన్ చేయించుకోమన్న తల్లి
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిస్తుంటే నందు మాత్రం తన ప్రాజెక్ట్ ఇంకా పూర్తి చేయలేదన్న టెన్షన్లో మగ్గిపోతున్నాడు. అటు లాస్య మాత్రం తులసి ధైర్యాన్ని కుంగదీసేందుకు, ఆమెను ఒంటరిని చేసి చిత్తు చేసేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది. మరి నేటి (జూన్ 1) నాటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. లాస్య ఇంటికి వెళ్లొచ్చినందుకు అనసూయకు ఆమె భర్త చీవాట్లు పెట్టాడు. మనం నందు దగ్గరకు వెళ్లకూడదని, అతడికి బుద్ధి రావాలని, బంధాల విలువ తెలిసి రావాలని తెలిపాడు. అయితే కొడుకును చూసి రావడం తప్పేం కాదని తులసి అత్తకు మద్దతిస్తూనే అక్కడ తన వ్యక్తిగత విషయాలు చర్చించకూడదు అని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మరోవైపు అంకిత గర్భం దాల్చిన సంతోషకర విషయాన్ని తల్లితో పంచుకుంది. అయితే ఆమె ఊహించినదానికి భిన్నంగా అంకిత తల్లి పెద్ద నిట్టూర్పు విడిచింది. అదేమీ శుభవార్త కాదంటూ, పైగా భవిష్యత్తు అడ్డు అవుతుందని చెప్తూ అబార్షన్ చేయించుకోమని ఉచిత సలహా ఇచ్చింది. వీలైతే ఈ విషయాన్ని అభికి చెప్పకుండా దాచమని సూచించింది. ఎందుకంటే అతడు కుదరదంటే పెద్ద రాద్ధాంతం అవుతుందని అభిప్రాయపడింది. అయినా ఇప్పుడు నీకు పిల్లలు కాదు, భవిష్యత్తు ముఖ్యమని నొక్కి చెప్పింది. దీంతో అంకిత ఇప్పుడేం చేయాలా? అని ఆలోచనలో పడింది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ప్రేమ్ వచ్చీరాగానే లాస్య ఇంటికి వెళ్లి నందు మీద చిర్రుబుర్రులాడాడు. మా అమ్మను వదిలేసి లాస్యతో బయటకు వచ్చేసినప్పుడే ఆయన పతనం ప్రారంభమైందని చెప్పాడు. మా అమ్మ ఒక్కో మెట్టు ఎదగడం, మీరు రెండు మెట్లు దిగడం ఏకకాలంలో జరుగుతుందని, మీరు ఏదో ఒక రోజు మా అమ్మ కాళ్ల మీద పడతారని జోస్యం పలికాడు. దీంతో నందు, లాస్య భగభగమండిపోయారు. తులసి కావాలనే ప్రేమ్‌ను మిమ్మల్ని నిందించడానికి పంపిందని లాస్య చెప్పడంతో నందు మరింత ఆగ్రహం చెందాడు. ఇదిలావుంటే అంకిత తను గర్భవతినన్న విషయాన్ని భర్తకు చెప్తుందా? ఒకవేళ చెప్పిన తర్వాత అబార్షన్‌కు అతడిని ఒప్పిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: భార్య ఫిర్యాదుతో ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్ ఉపేంద్రపై యంగ్ హీరో సెటైర్లు.. ఫ్యాన్స్ ఆగ్రహం -
Intinti Gruhalakshmi: అత్తకు తులసి స్ట్రాంగ్ వార్నింగ్!
తన ఇంటితో అన్ని బంధాలు తెగదెంచుకున్నాక నందు మొదటిసారి మళ్లీ తన ఇంటికి చేరాడు. అయితే అతడు వచ్చింది ఆమె మీద ప్రేమతోనో, ఏదో పని మీదో కాదు! తులసి మీద కోపంతో. తులసి తనను మోసం చేస్తుందన్న భ్రమలో ఉన్న నందు పూటుగా తాగి నానా రచ్చ చేశాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? నందు తిరిగి లాస్య ఇంటికి వెళ్లాడా? లేదా? అనేది తెలియాంటే ఇది చదివేయండి.. నందు పూటుగా తాగి లాస్య ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. తన కష్టార్జితంతో దివ్య ఫీజు కడదామనుకుంటే నువ్వు డబ్బులిచ్చి తనను అసమర్థుడిలా నిలబెట్టావని కోపంతో ఊగిపోయాడు. అలా వీళ్లిద్దరి మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. తాగిన మైకంలో ఏదేదో వాగిన నందు చివరికి అక్కడే నిద్రలోకి జారుకున్నాడు.దీంతో అతడిని సోఫాలో పడుకోబెట్టి దుప్పటి కప్పింది తులసి. మరోవైపు నందును పంపించమంటూ లాస్య ఇంట్లోకి రాగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ తులసి చెడామడా తిట్టేసింది. మరోవైపు మగత నిద్రలోకి జారుకున్న నందు.. తన మీద తులసికి భయం, గౌరవం, ప్రేమా ఏవీ లేవని మైకంలో మాట్లాడుతుండగా విన్న తులసి బాధతో తల్లడిల్లిపోయింది. నిన్ను ఎప్పటికీ నమ్మను అంటుంటే విలవిల్లాడిపోయింది. తన ప్రేమ ఎన్నటికీ అర్థమవుతుందోనని నిట్టూర్పు విడిచింది. ఇక తెల్లారిన తర్వాత నందు రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అనసూయ తన కొడుక్కి కనీసం టీ, కాఫీ కూడా ఇవ్వడం లేదని తులసి మీద ఆగ్రహించింది. దీనిపై తులసి మాట్లాడుతూ.. అతడు ఈ ఇంటి మనిషి కాడని, తను కాఫీ ఇస్తే తీసుకోడని అభిప్రాయపడింది. ఆమె అనుకున్నట్లుగానే నందు కూడా తనకేవీ అక్కర్లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక నందు తల్లి అనసూయ కూడా లాస్య ఇంటికే వచ్చేస్తానని అడిగింది. కానీ ఆమెకు ఎక్కడ సపర్యలు చేయాల్సి వస్తుందోనని లాస్య అందుకు నిరాకరించింది. తులసి మీద పగ తీర్చుకున్న తర్వాతే ఈ ఇంటికి వచ్చేయమని సలహా ఇచ్చింది. అది కూడా కరెక్టే అంటూ తిరిగి తన ఇంటికి చేరిన అనసూయకు చుక్కెదురైంది. ఇక్కడి వార్తలను అక్కడికి మోసుకెళ్లిన అత్త మీద ఫైర్ అయింది తులసి. కొడుకును చూసి రావొచ్చు అని చెప్పాను కానీ, తన వ్యక్తిగత విషయాలు అక్కడ చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగనుందో చూడాలి. చదవండి: బాలయ్య సినిమాకు నో చెప్పిన రకుల్.. కారణం ఇదేనట! -
Intinti Gruhalakshmi: తులసి కాళ్ల మీద పడేలా చేస్తా!
ఇన్నాళ్లు సహనానికి మారుపేరుగా ఉన్న తులసి తన విశ్వరూపం చూపిస్తోంది. లాస్యను ఒక చీడపురుగులా చూస్తూ ఆమె పొగరు అణిచేలా చేస్తోంది. తులసి ఇలా రెచ్చిపోయి మాట్లాడటం, తనను ఒక పాచికపుల్లలా చూడటం సహించలేకపోయిన లాస్య ఎదురుదెబ్బ కొట్టాలని పగతో రగిలిపోతోంది. మరి నేటి(మే 28) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే దీన్ని చదివేయండి.. నందు మర్చిపోయిన డాక్యుమెంట్లను తీసుకువచ్చిన లాస్యకు చీవాట్లు పెట్టింది తులసి. లాస్యను వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించిన అనసూయ నోరు మూయించాడు నందు తండ్రి. లాస్యది జనాల మధ్య బతకడానికి అర్హత లేని పుట్టుక అని నిందించాడు. సిగ్గు లేని జన్మలు అంటూ చీదరించుకోవడంతో లాస్య ఒళ్లు భగభగ మండిపోయింది. ఇక మీదట ఇంట్లో వాళ్లు తులసి చెప్పినట్లే నడుచుకోవాలని, లేదంటే లాస్యకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించాడు. ఏదైనా అవసరమైతే తన భర్త నందు రావాలి కానీ నువ్వు మాత్రం ఇంట్లోకి వస్తే మరింత హీనంగా చూస్తామని తులసి వార్నింగ్ ఇవ్వడంతో లాస్య మారు మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. మరోవైపు తులసి, నందుతో సత్యనారాయణ వ్రతం చేయించేందుకు తులసి తల్లి ఆమె ఇంటికి బయలు దేరింది. ఇంతలో ఆటో పాడవటంతో నడుచుకుంటూ వస్తున్న ఆమెను నందు కారులో ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఇంటి లోపలికి మాత్రం అడుగు పెట్టకుండా అక్కడే బయట ఉండిపోయాడు. దీంతో అయోమయానికి లోనైన ఆమె అల్లుడు ఇంట్లోకి రావడం లేదేంటని కూతురిని ప్రశ్నించింది. అప్పుడే అక్కడికి వచ్చిన లాస్య మనింట్లోకి పద నందూ అంటూ మాట్లాడటంతో ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఇక తన అక్కకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయాడు తులసి తమ్ముడు. నందు మీద పోలీసు కేసు పెడదామంటూ తులసి మీద ఒత్తిడి తెచ్చాడు. తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇష్టం లేని తులసి వద్దంటూ అతడిని ఆపే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆవేశంతో ఊగిపోయిన అతడు నందు ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. విడాకులు మంజూరవకముందు ఇలా వేరొకరితో ఉండటం చట్టరీత్యా నేరమని, ఇందుకుగానూ పోలీసు కేసు పెడతానని బెదిరించాడు. అప్పుడు వాళ్లే నిన్ను కాలర్ పట్టుకుని తులసక్క కాళ్ల మీద పడేస్తారని చెప్పాడు. మరి అతడు నిజంగానే నందు మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాడా? లేదా? అన్నది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: NTR 31: ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ ఎంతంటే.. -
తులసి నేను తాళి కట్టిన భార్య: లాస్యకు నందు ఝలక్
తులసితో విడాకులు మంజూరు కాకముందే లాస్యతో వేరు కాపురం పెట్టాడు నందు. తన ఇంటి ముందే మరో ఇల్లు అద్దెకు తీసుకుని దిగాడు. ఈ క్రమంలో భార్య ఉద్యోగం చేయబోతుందని తెలిసి సహించలేకపోయాడు. అలా అని ఆమె దగ్గరకు వెళ్లి కుదరదని చెప్పలేకపోయాడు. మరి నేటి(మే 27) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే చదివేయండి.. నన్నే మెడపట్టుకుని బయటకు గెంటేస్తుందా? అంటూ ప్రతీకారంతో రగిలిపోయింది లాస్య. తనకు జరిగిన అవమానం వల్ల ఇప్పుడు ఏకంగా కురుక్షేత్రమే జరగబోతుందని, అందుకు సిద్ధంగా ఉండమంటూ తులసికి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ యుద్ధంలో ఓడేందుకు సిద్ధంగా ఉండమంటూ తులసి రివర్స్ కౌంటరిచ్చింది. మరోవైపు రోహిత్ దగ్గర తులసి తిరిగి ఉద్యోగంలో చేరుతుందన్న విషయం తెలిసి నందు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె ఉద్యోగం చేస్తే నీకేంటని లాస్య నిలదీయగా తులసి తను తాళి కట్టిన భార్య అని స్పష్టం చేశాడు. ఆమెతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు తను నీ భార్య అని గుర్తు రాలేదా? అని లాస్య తిరిగి ప్రశ్నించింది. నీ మనసులో భార్య స్థానంలో ఇంకా తులసే ఉందంటూ అలక బూనింది. దీంతో నందు అలాంటిదేమీ లేదంటూ లాస్యను ఊరడించే ప్రయత్నం చేశాడు. మరోవైపు అభి తన దగ్గర డబ్బులు లేకే బయటకు తీసుకెళ్లడం లేదని, ఏమీ కొనివ్వలేకపోతున్నాని అంకితతో చెప్పాడు. ఈ మాటలు విన్న అంకిత తల్లి తన దగ్గర డబ్బుందని, దాన్ని తీసుకుని బయట తిరిగి రండని సూచించింది. నీ డబ్బుతో నా కూతురిని ఏమీ ఉద్ధరించలేవని నానామాటలు అంది. నువ్వు సంపాదించేదానితో కూతురికి కనీసం నెయిల్ పాలిష్ కూడా కొనలేవని సూటిపోటి మాటలతో అతడిని ఛిద్రం చేస్తూ డబ్బు చేతిలో పెట్టింది. ఇన్ని అవమానాలు పడాల్సి వస్తున్నందుకు అభి కోపంతో రగిలిపోయాడు. ఇక తులసి, నందుతో వ్రతం చేయించేందుకు తులసి తల్లి నేరుగా ఇంటికి వచ్చింది. ఇక్కడ తన కూతురి కాపురం చిన్నాభిన్నమైందన్న విషయం తెలుసుకున్న ఆమె ఏం చేయనుంది అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: 'పుష్ప' ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ? -
Intinti Gruhalakshmi: అత్త నోరు మూయించిన తులసి
కట్టుకున్న భర్త తన చెంతకు వస్తాడన్న తులసి కల కలగానే మిగిలిపోయింది. మధ్యలో వచ్చిన లాస్య.. తన జిత్తులమారి ప్లాన్లతో నందును ఎగరేసుకుపోయింది. తులసి పేరు చెప్తేనే పూనకం వచ్చేలా నందును తన వైపు తిప్పుకుంది. లాస్యను ఇంటి నుంచి పంపించాలనుకుంటే ఆమె కొంగు పట్టుకుని భర్త కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో అయోమయంలో పడిపోయింది తులసి. కానీ ఇప్పుడిప్పుడే ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యంతో ఎదురు చెప్పడం ప్రారంభించిన తులసి తిరిగి ఉద్యోగంలో చేరబోతోంది. మరి నేటి (మే 26) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. "నేను అన్నం తినకపోతే అమ్మ అల్లాడిపోయేది, నాకు దెబ్బ తగిలితే అమ్మకు కన్నీళ్లొచ్చేవి.. అప్పుడు అమ్మ ఇంత ఓవరాక్షన్ చేస్తుందేంటి అనుకున్నా.. కానీ ఇప్పుడర్థమవుతోంది అదే అసలైన ప్రేమ అని, అది నాకు కావాలనిపిస్తోంది.." అంటూ అభి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రారమ్మని అమ్మ ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోలేదని పశ్చాత్తాపపడ్డాడు. ఓ వైపు కడుపులో ఆకలి మెలివేస్తుంటే కన్నీళ్లు దిగమింగుకుంటూ మంచినీళ్లతో సరిపెట్టుకున్నాడు. తన దగ్గర మొసలి కన్నీళ్లు కారుద్దామనుకున్న భాగ్య నోరు మూసుకునేలా చేసింది తులసి. తనను చూస్తే చాలా బాధగా ఉందన్న భాగ్య మాటలకు మధ్యలోనే అడ్డుపడింది. ఎవరెలాంటివారో తనకు తెలుసని, జరుగుతున్నదానికి ఎక్కువ సంతోషపడుతున్నట్లున్నావ్ అని చెప్పడంతో భాగ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. అనంతరం తన మామయ్య దగ్గరికి వెళ్లిన తులసి ఇంటిని నడపాలంటే తను ఉద్యోగం చేయాలని అందుకోసం ఆయన అనుమతి తీసుకుంది. ఆర్థికంగా బలపడితేనే అనుకున్నవి చేయగలవని, కాబట్టి నిశ్చింతగా జాబ్ చేయమంటూ ధైర్యం నూరిపోశాడు. నా కొడుకు నీ ప్రేమను ఎలాగో గుర్తించలేకపోయాడు, కానీ ఇప్పుడు నీ గెలుపుతో అతడిని నీవైపు తిప్పుకో అని సూచించాడు. ఇక శృతి తిరిగి ఇంట్లోకి రావడంతో నందు తల్లి నిప్పులు చెరిగింది. అయినవాళ్లను ఆమడ దూరంలో కూర్చోబెట్టడం, కానివాళ్లను కుర్చీలో కూర్చోబెట్టడం మీకు అలవాటే కదూ అంటూ నిప్పులు చెరిగింది. అయితే ఆమె నోటికి అడ్డుకట్ట వేస్తూ.. శృతి తన మనిషి అని, ఆమెను ఏమన్నా ఊరుకునేది లేదని లాస్య అత్తకు వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆమెను కిమ్మనకుండా ఉండిపోయింది. ఆమెలో వచ్చిన మార్పు చూసి శృతి ఒక్కసారిగా షాకైంది. మరోవైపు నందు, లాస్య తులసి ఇంటెదురుగా ఓ కొత్తిల్లు అద్దెకు తీసుకుని దిగారు. ఇక ఇప్పటి నుంచి తులసికి అందరినీ దూరం చేస్తూ చివరకు ఏకాకిగా మార్చుతానని లాస్య గట్టి ప్లాన్‌లో ఉంది. మరోవైపు తన కొడుకు అభితో పాటు, భర్త నందును ఎలాగైనా ఇంటికి తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఉంది తులసి. మరి వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు? ఎవరు ఏకాకిగా మారుతారు? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. చదవండి: RRR Movie: ఫైట్ సీన్‌కి కన్నీళ్లొస్తాయి! మహేష్‌బాబుకు పిన్నిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్! -
Intinti Gruhalakshmi: తులసిని ఏకాకిని చేసే ప్లాన్‌లో లాస్య!
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో నందు ఫ్యామిలీ చిన్నాభిన్నమైంది. లాస్య కోసం నందు ఇల్లు వదిలేసి వెళ్లిపోవడంతో తులసి అయోమయంలో పడిపోయింది. దివ్య కూడా తన తండ్రి మళ్లీ ఇంటికి వస్తాడా? లేదా? అని కంగారుపడుతోంది. మరి వీరి సమస్యలకు పరిష్కారం దొరికేనా? లేదా ఈ సమస్యలు ఇంకా పెద్దవిగా మారనున్నాయా? అసలు నేటి(మే 25వ) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. అంకిత తనను బయటకు తీసుకెళ్లమని మారాం చేస్తే అభి ఒప్పుకోలేదు. తనకు ఓపిక లేదని, రోజంతా పని చేసొచ్చి అలిపోయినందున బయటకు తీసుకెళ్లలేనని చెప్పాడు. దీంతో తన కోరిక కూడా తీర్చడం చేతకాదంటూ అంకిత గొడవ మొదలు పెట్టింది. 'నీ తల్లి కోసం రోజంతా గొడ్డులా కష్టపడాలి, వచ్చాక కూతురిని షికారుకు తీసుకెళ్లాలి' అని అభి అసహనం వ్యక్తం చేశాడు. అలా వీళ్లిద్దరి మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది. ఇక ఎలాగో బయటకెళ్లి అక్కడే భోజనం చేస్తామని అనుకున్న అంకిత రాత్రికి ఏమీ వండిపెట్టలేదు. అసలే ఆకలితో ఉన్న అభి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే అక్కడంతా ఖాళీ గిన్నెలే దర్శనమిచ్చాయి. ఎందుకు వంట సిద్ధం చేయలేదని నిలదీస్తే.. బయటకు వెళ్దాం అనుకుంటే వద్దన్నావ్, అందుకే వండలేదు, ఈ ఒక్కపూటకు నీళ్లు తాగి అడ్జస్ట్ అయిపో అని భార్య దురుసుగా బదులిచ్చింది. దీంతో అభికి తన తల్లి తులసి గుర్తొచ్చింది. తనకు గోరుముద్దలు తినిపించే తల్లికి అనవసరంగా దూరమయ్యానే అని అమ్మను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టినందుకు నందు, లాస్య ఆవేశంతో అట్టుడికిపోయారు. జీవితంలో మర్చిపోలేని అవమానం చేసిన లాస్య మీద ప్రతీకారం తీర్చుకుంటానని మనసులోనే ప్రతిజ్ఞ చేసింది లాస్య. అటు నందు పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇన్నాళ్లూ తన వెనకే ఉంటూ గోతులు తీసిందని మండిపడ్డాడు నందు. తన కూతురు ముందు కూడా తల దించుకునేలా చేసిందని ఆక్రోశించాడు. ఇదే అదును అని భావించిన లాస్య మరో ప్లాన్‌కు తెరదీసింది. మనం అనుక్షణం సంతోషంగా ఉంటూ తులసి కుమిలిపోయేలా చేయాలని, అందులో భాగంగా అదే ఇంటి ముందు మరో ఇల్లును అద్దెకు తీసుకుని దిగుదామని సలహా ఇచ్చింది. అన్నట్లుగానే రేపటి ఎపిసోడ్లో నందు నివాసం ముందే మరో ఇల్లు అద్దెకు తీసుకుని దిగుతున్నారు. అంతేకాదు, ఆ ఇంట్లో నుంచి ఒక్కొక్కరినీ తులసికి దూరం చేసి ఆమెను ఏకాకిగా మారుస్తానని సవాలు విసిరింది లాస్య. మరి ఆమె ఎత్తులను తులసి ఎలా చిత్తు చేస్తుందో చూడాలి.. చదవండి: Hari Teja: కరోనాతో పోరాడుతూ... బిడ్డను కన్నాను! -
Intinti Gruhalakshmi: తులసి మీద పగతో రగిలిపోతున్న నందు!
మమతల కోవెల కలహాలతో విలవిల్లాడుతోంది. చిరునవ్వుకు చోటు లేకుండా గొడవలతో చిగురుటాకులా వణికిపోతోంది. చివరికి ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. నందు తన కుటుంబం కన్నా లాస్యే ఎక్కువ అంటూ ఆమెతో వెళ్లిపోయాడు. అందుకు గల కారణమేంటి? అసలు నేటి(మే 24) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే. సహనానికి మారుపేరుగా ఉండే తులసి ఈరోజు ఉగ్రరూపం చూపించింది. తను కిమ్మనకుండా కూర్చుంటే సమస్య మరింత పెద్దదవుతుందని గ్రహించిన ఆమె కాళికా అవతారం ఎత్తింది. పామును చేరదీసి పాలు పోస్తే అది విషం కక్కుతుందని తెలిసినా నిన్ను ఇంట్లో ఉంచి ఆదరించానని లాస్య మీద ఫైర్ అయింది. భార్యాభర్తల మధ్యలోకి వచ్చిన నిన్ను వేరే పేరుతో పిలుస్తారని ఆమెను చీదరించుకుంది. మీరు బరితెగించింది, తాను భరించింది ఇక చాలు అని నందుకు తులసి తేల్చి చెప్పింది. సహనం చచ్చిపోయిందని, ఓపిక నశించిందని ఇంకా భరించడం తన వల్ల కాదని కుండ బద్ధలు కొట్టింది. లాస్య ఇంటి గడప బయట ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడింది. అయినా సమస్యను తోసిపడేస్తే ఎవరికీ ఏ దిగులూ ఉండదంటూ తులసి ఏకంగా లాస్య చేయి పట్టుకుని ఆమెను ఇంటి బయటకు గెంటేసింది. ఊహించని పరిణామానికి షాకైన నందు లాస్యతోనే తన సంతోషమంటూ ఆమెతో పాటు వెళ్లిపోతానని హెచ్చరించాడు. అయినప్పటికీ వెనక్కు తగ్గని తులసి ఏదేమైనా లాస్య మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని కరాఖండిగా చెప్పేసింది. దీంతో నందు, లాస్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. దివ్యను కూడా వెంటరమ్మని కోరాడు, కానీ ఆమె అందుకు నిరాకరించింది. మీరు లాస్యతో ఉంటే చూడలేనని వెనకడుగు వేసింది. ఇక అయినవాళ్లెవరూ తనకు మద్దతుగా లేరని అర్థమైన నందు లాస్యను తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయాడు. దీంతో నందు తల్లి అనసూయ ఆవేశంతో తులసిని నానా మాటలు అంది. తన కొడుకు ఇల్లొదిలి వెళ్లడానికి కారణం నువ్వే అంటూ తులసిని నిందించింది. నీ తల్లి పెంపకం ఇలా తగలడింది కాబట్టే ఇలా తయారయ్యావని విరుచుకుపడింది. దీంతో చిర్రెత్తిపోయిన తులసి ఇంకొక్క మాట మాట్లాడితే బాగోదు అని ఆమెకు వార్నింగ్ ఇచ్చింది. కొడుకును దారిలో పెట్టడం చేతకాదు కానీ వేరేవాళ్ల పెంపకం గురించి మాట్లాడతారేంటని చురకలు అంటించింది. దీంతో అనసూయ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. మరోవైపు తులసి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోయారు నందు, లాస్య. తనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయంచుకున్నారు. అందులో భాగంగా నందు నివాసం ముందు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని దిగుదామని లాస్య చెప్పిన ప్లాన్‌కు నందు సై అన్నాడు. ఇంతకింతా అనుభవించేలా చేస్తానని పగతో రగలిపోతున్నాడు. మరి తర్వాత ఏం జరగనుందన్నది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: Radhe Shyam: లవ్ సాంగ్ కోసం ముంబైలో సెట్ -
Intinti Gruhalakshmi: ఇంటిని వల్లకాడుగా మార్చనున్న లాస్య!
విడాకుల ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో మాధవి దంపతులు తులసికి క్షమాపణలు చెప్పారు. తమ మూలంగా నీ మీద ద్వేషం పెరిగిందంటూ దిగులు చెందారు. ఇప్పుడు నందు మనల్ని నమ్మే పరిస్థితిలో లేడని, అతడిని ఎలా దారికి తెచ్చుకుంటావని ఆవేదని చెందారు. కష్టాలు, కన్నీళ్లతోనే సహజీవనం చేసిన తులసికి చేజారిన పరిస్థితిని ఎలా దారికి తేవాలో అర్థం కాక తల పట్టుకుంది. మరి నేటి(మే 21వ) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. మాధవి ఆడిన విడాకుల నాటకం బయటపడటంతో నందు తులసికి విడాకులు ఇచ్చి తీరుతానని శపథం చేశాడు. ఇంకా విడాకులైనా మంజూరు కాకముందే లాస్యను నెత్తిన ఎక్కించుకుని తిరుగుతున్నాడు. ఆమె కోసం ఇంటివాళ్లనే ఎదిరిస్తున్నాడు. మరోవైపు తన పాచిక పారడంతో మరింత రెచ్చిపోయిన లాస్య నందు ఎదుట మొసలి కన్నీళ్లు కార్చింది. మీ ఇంట్లో వాళ్లు నన్ను పురుగులా చూస్తారని, అవి నేను భరించలేనని ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటూ బ్లాక్మెయిల్ చేసింది. దీంతో ఏం చేయాలో చెప్పమని నందు ఆమెకు లొంగిపోయాడు. ఇదే అదునుగా భావించిన లాస్య.. తనను ఇంటి కోడలిగా చేయమని పరోక్షంగా సూచించింది. అది అర్థమైన నందు.. ఇంట్లో వాళ్లందరినీ పిలిచి లాస్యకు ఇంటి సర్వాధికారాలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇంటికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అది లాస్య ఆధ్వర్యంలోనే జరగాలని ఆదేశించాడు. ఎవరేం చేయాలన్నా లాస్య అనుమతి తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పాడు. ఇకపై ఈ ఇంట్లో కోడలి స్థానం, తన భార్య స్థానం కూడా లాస్యదే అని చెప్పడంతో అందరూ షాకయ్యారు. తనకిచ్చే విలువను లాస్యకు కూడా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పాడు. తన భార్య స్థానంలో తులసి ఉండదని నందు కుండ బద్ధలు కొట్టాడు. ఇక ఇంట్లో జరుగుతున్న పరిణామాలకు దివ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. అన్నయ్య అభికి ఫోన్‌కు చేసి జరిగిందంతా చెప్తూ ఏడ్చేసింది. ఇంతలో ప్రేమ్ వచ్చి దివ్యను మందలించాడు. సమస్యను చూసి పారిపోయేవాడికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావ్ అని మండిపడ్డాడు. భార్య మాటలు విని అమ్మను అపార్థం చేసుకున్నవాడికేం తెలుస్తుందని నిందించాడు. అతడి మాటలు విన్న అభికి నోట మాట రాక కళ్లలో నీళ్లు తిరిగాయి. అయినా దుఃఖాన్ని దిగమింగుకుని తనను తాను తమాయించుకున్నాడు. ప్రేమ్ మాటలతో అభిలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. మరోపక్క జిత్తులమారి లాస్య తన అసలు రంగును చూపించేందుకు రెడీ అవుతోంది. ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిని ఈ ఇంటి నుంచే కాదు, ఏకంగా ఈ లోకం నుంచే పంపించేస్తానని తులసికి వార్నింగ్ ఇచ్చింది. కళకళలాడుతున్న ఇల్లు వల్లకాడు చేయాలనుకుంటున్న లాస్య ఆలోచనకు తులసి బెంబేలెత్తింది. ముందుగా నందు తండ్రి మీద గురి పెట్టిన లాస్య అతడికి పాలల్లో మోతాదుకు మించి ఎక్కువగా బీపీ ట్యాబ్లెట్లు వేసిచ్చింది. దీంతో అతడు గుండెనొప్పితో విలవిల్లాడిపోయాడు. ఇది చూసిన తులసి తన మామయ్యను రక్షించుకుంటుందా? లాస్యకు ఎలా బుద్ధి చెప్తుంది? అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్ తర్వాతి సినిమా? -
Intinti Gruhalakshmi: ఇంటి కోడలిగా లాస్య!
నేటి(మే 20) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో భారీ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముందునుంచీ ఊహించినట్లుగానే మాధవి విడాకులు ఉట్టి డ్రామా అని తేలింది. తులసి జీవితం బాగుచేసేందుకు, నందులో మార్పు కోసం చేసిన ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. వీరి ప్లాన్‌ను లాస్య తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇదంతా తులసే దగ్గరుండి చేయించిందని చెప్తూ ఆమెను అన్యాయంగా ఇరికించింది. ఇది నిజమని నందును నమ్మించి అతడిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరి ఈరోజు ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. సీక్రెట్‌గా ఓ చోట కలుసుకున్న మాధవి దంపతులు ఒక్కసారిగా పడీపడీ నవ్వుకున్నారు. వాళ్ల నటనను అందరూ నమ్మేశారని సంతోషించారు. ఏదైతేనేం, తులసి దంపతులు మళ్లీ కలిసిపోతారు అని సంబరపడ్డారు. దీనికి కారణమైన లాస్యను కూడా అన్నయ్య మనసులో లేకుండా చేయాలని రగిలిపోయింది మాధవి. అయితే వీరిని ఫాలో అయి వచ్చిన భాగ్య వీరి బండారం బయటపెట్టేందుకు వారి మాటలను సీక్రెట్‌గా వీడియో తీసింది. దీన్ని లాస్యకు చూపించడంతో ఆమె దానికి మరింత మసాలా కలిపి తులసిని ఓడించాలనుకుంది. వారి విడాకుల నాటకానికి రచన, దర్శకత్వం అన్నీ తులసే అని నమ్మిస్తే నందు తన భార్యను జీవితంలో నమ్మడని ఆలోచించింది. అనుకున్నట్లుగానే నందును ఈజీగా నమ్మించింది లాస్య. ఈ విషయం నిజంగా తనకు తెలియదని, తనకు ఈ ప్లాన్‌తో ఎటువంటి సంబంధం లేదని తులసి మొత్తుకున్నా నందు ఆమె మాటలను చెవికెక్కించుకోలేదు. అందరూ కలిసి తనను మోసం చేశారని మండిపడ్డాడు. తులసితో చేతులు కలిపి తనను వెర్రివాడిని చేశారని ఆవేదన చెందాడు. ఇక జీవితంలో తులసిని నమ్మేది లేదని తేల్చి చెప్పాడు. లాస్యే తనకు సర్వస్వం అన్నట్లుగా మారిపోయాడు. ఇకపై ఇంటి సర్వాధికారాలు లాస్యకు ఇద్దాం అనుకుంటున్నానని నందు చెప్పడంతో ఇంటి సభ్యులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఇంటి కోడలి స్థానం లాస్యదే అని తెగేసి చెప్పడంతో తులసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ బాధతో కుమిలిపోతే తనకు ఒరిగేదేమీ లేదనుకున్న తులసి రేపటి ఎపిసోడ్లో తిరగబడనున్నట్లు తెలుస్తోంది. మరి తులసి తన స్థానం కోసం పోరాడుతుందా? బాధతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుందా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. చదవండి: Intinti Gruhalakshmi: లాస్యను గెంటేసిన తులసి -
Intinti Gruhalakshmi: వాటే ట్విస్ట్, లాస్యను గెంటేసిన తులసి
విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న మోహన్ మనసు ఎలా మార్చాలా? అని నందు ఫ్యామిలీ మల్లగుల్లాలు పడుతోంది. కానీ వీరి ఆలోచనకు భిన్నంగా మాధవి కూడా విడాకులకై సై అనడం గమనార్హం. మరి వీరి మనసు మార్చేదెవరు? విడాకులను అడ్డుకున్నారా? అందుకోసం ఏం చేశారు? అనేది తెలియాలంటే నేటి(మే19) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్ స్టోరీ చదివేయాల్సిందే! భవిష్యత్తు అల్లకల్లోలం అవుతుందని తెలిసీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది మాధవి. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయే తప్ప సమస్యకు మాత్రం మంచి పరిష్కారం దొరకలేదు. ఆర్తనాదాన్ని కూడా అల్లరే అనుకునేవారికి మన గుండె ఘోష అర్థం కాదంటూ తులసి మాధవిని ఊరుకోబెట్టింది. తనను వద్దనుకున్న వ్యక్తిని పట్టుకుని వేలాడుతూ ఉండటం వల్ల లాభం లేదని భావించిన మాధవి విడాకుల పత్రం మీద సంతకం పెట్టింది. తనకు విడాకులు మంజూరైన వెంటనే తులసి, తాను ఇంటి నుంచి వెళ్లిపోతామని నిర్ణయం తీసుకుంది. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఈ ఇంట్లో బతకాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇంట్లో జరుగుతున్న వరుస పరిణామాలపై నందు కలత చెందాడు. ఈ సమయంలో ప్రేమ్ తండ్రి దగ్గరకు వెళ్లి వీటన్నింటికీ కారణం నువ్వే అని నిందించాడు. మీ వల్లే రెండు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించకపోతే జీవితాంతం బాధపడతారని హెచ్చరించాడు. దీంతో నందు ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో లాస్య కాల్ చేసిందంటూ భాగ్య ఫోన్ తీసుకెళ్లడంతో నందు చిరాకు ప్రదర్శించాడు. ఫోన్ చేసింది సీఎం, పీఎం కాదు కదా, తర్వాత చేస్తానంటూ చిర్రుబుర్రులాడాడు. తన ఫోన్ కాల్ పట్టించుకోకపోవడమేంటి? అని లాస్యకు ఒక క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. మన ప్లాన్ మనకే తిప్పికొట్టేలా ఉందని కంగారుపడిపోయింది. వీలైనంత త్వరగా తిరిగి ఇంట్లో అడుగుపెట్టాల్సిందేనని డిసైడ్ అయింది. చెల్లెలి జీవితం ఏమైపోతుందోనన్న ఆలోచనలతో నందుకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మాధవి కూడా తెగదెంపులు చేసుకోవడానికే రెడీ అయిందని తెగ బాధపడ్డాడు. తాను చేసిన తప్పే తన చెల్లెలి రూపంలో వచ్చి వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తోందని దిగులు చెందాడు. తులసి జీవితంలో నిప్పులు పోయడానికి ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది లాస్య. తన భార్య స్థానం లాస్యదేనని నందు తేల్చి చెప్పడంతో సహించలేకపోయింది. లాస్య చేయి పట్టుకుని బయటకు గెంటేసింది. దీంతో రేపటి ఎపిసోడ్ రసవత్తరంగా మారనున్నట్లు కనిపిస్తోంది. చదవండి: Intinti Gruhalakshmi: లాస్యను పక్కన పడేసిన నందు! -
Intinti Gruhalakshmi: లాస్యను పక్కన పడేసిన నందు!
మాధవి పుట్టింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నందు ఇంట్లో ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాక, ఆమె కన్నీళ్లను చూడలేక సతమతమవుతున్నారు ఇంటిసభ్యులు. దీనికి పరిష్కారం వెతికేందుకు ఇంటిల్లిపాది ఆలోచిస్తుంటే విడాకులకే సై అంటున్నాడు మోహన్. ఈ క్రమంలో అతడు విడాకుల పత్రాలు తీసుకుంటూ నేరుగా నందు ఇంటికే వచ్చాడు. ఇంటి కోడలికి అన్యాయం జరుగుతుంటే లేపని నోరు ఇప్పుడెందుకు లేస్తుందని ప్రశ్నిస్తూ అందరి నోరు మూయించాడు. ఈ క్రమంలో నేటి(మే 18) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. మాధవి సంతకం కోసం నందు ఇంట్లో అడుగు పెట్టాడు మోహన్. నువ్వు నా కూతురికి ద్రోహం చేస్తుంటే కడుపు రగిలిపోతుందని అతడిని తిట్టిపోసింది గయ్యాళి అత్త. ఆమె మాటలకు అసహనం వ్యక్తం చేసిన మోహన్ మరి ఇదే స్థానంలో మీ కోడలు ఉన్నప్పుడు ఇంత కోపం రాలేదేంటని అడిగాడున్. అయినా వాదనలు అనవసరమని 24 గంటల్లో సంతకం పెట్టు అంటూ విడాకుల పేపర్‌ను ఆమె చేతిలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తనకు విడాకులు తథ్యమేనా అని భయపడిపోయిన మాధవి కన్నీరుమున్నీరుగా విలపించింది. కట్టుకున్న భర్త తనను వద్దంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలిసిన తులసికి ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. దీంతో తన చెల్లెలిని ఓదార్చడానికి వెళ్లిన నందుకు భంగపాటు ఎదురైంది. నువ్వు చేస్తుంది కూడా తప్పే అంటూ కాళికా అవతారం ఎత్తింది. విడాకుల విషయంలో నీ చెల్లెలికి ఒక న్యాయం, నీ భార్యకు ఒక న్యాయమా అని సూటిగా ప్రశ్నించింది. ఈ మాటలు విని నందు తల్లి అగ్గి మీద గుగ్గిలమైంది. నీ మొగుడిని హద్దుల్లో పెట్టుకోవడం చేతకాక నా కొడుకును అంటావేంటి అని నందు తల్లి మాధవి మీద విరుచుకుపడింది. నా భర్త, అన్నయ్య ఇద్దరూ చేస్తున్న తప్పు ఒకటే కదా అని గుర్తు చేసింది. అసలు నీ వల్లే అన్నయ్య ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్నాడంటూ తల్లిని ఏకిపారేసింది మాధవి. మరోవైపు ఫారిన్ వెళ్తున్నందుకు అంకిత సంతోషపడుతుంటే అభి మాత్రం లోలోపలే ఉడికిపోయాడు. నీ వల్ల మనసు చంపుకుని, మీ తల్లిదండ్రుల ముందు తల దించుకుంటున్నాను అని ఆవేదన చెందాడు. మన కోసమే ఇదంతా చేశానన్న అంకిత మాటలకు మధ్యలోనే అడ్డు చెప్తూ కేవలం నీ సంతోషం కోసమే ఫారిన్‌కు వెళ్లడానికి ఒప్పుకున్నానని తేల్చి చెప్పాడు. దీంతో దిగులు చెందిన అంకిత తను తప్పు చేశానా అని మథనడపడటం ప్రారంభించింది. ఇదిలా వుంటే నందులో మార్పుకు పునాది పడినట్లు కనిపిస్తోంది. లాస్య ఫోన్ కాల్‌ను కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పు ఎటువైపు సాగుతుంది? లాస్య దీన్ని ఎలా అడ్డుకుంటుంది? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే! చదవండి: కోలివుడ్లో విషాదం: నటుడు, దర్శకుడి సతీమణి మృతి -
Intinti Gruhalakshmi: మాధవి విడాకుల నాటకం! లాస్యకు చుక్కలే?
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న చందంగా మారిది లాస్య పరిస్థితి. తను ఏ లక్ష్యంతో నందు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందో అది నెరవేరేలా కనిపించడం లేదు. పైగా నందు సోదరి మాధవి సడన్‌గా ఇంట్లోకి వచ్చేయడంతో ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తన భర్త వదిలేయాలనుకుంటున్నాడంటూ మాధవి ఆత్మహత్యకు ప్రయత్నించడం వెనక ఏదో కుట్ర ఉంటుందని భావిస్తోంది లాస్య. మరి నేటి(మే 17) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. మొన్నటివరకు దివ్యను ఎలా చదివించాలన్న టెన్షన్‌తో మథనపడిపోయిన నందుకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. తన సోదరి మాధవి జీవితం అర్థం కాని ప్రశ్నలా మారిపోతుందేమోనని కలవరపడుతున్నాడు. ఎలాగైనా ఆమె జీవితం చక్కదిద్దాలని ప్రయత్నించాడు. మాధవి భర్త మోహన్ తీసుకున్న నిర్ణయాన్ని వేలెత్తి చూపాడు. తనను విడిచిపెడితే అస్సలు బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. కానీ మరో ఆడదాని కోసం కట్టుకున్న భార్యను వదిలేసుకునేందుకు సిద్ధపడ్డ నందు తనకు నీతులు చెప్పే అర్హత లేదని మోహన్ విమర్శించాడు. మోహన్ మాత్రం విడాకులకే మొగ్గు చూపడం గమనార్హం. పైగా విడాకుల ఆలోచన మనసులోకి రావడానికి మాత్రం నందునే కారణమని చెప్పాడు. పక్కవారికి నీతులు చెప్పేముందు తన తప్పొప్పుల గురించి ఆలోచించుకోమని హితవు పలికాడు. అతడి ధోరణితో ఖంగు తిన్న నందు మారు మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన లాస్య.. మాధవి ఇలా డిప్రెషన్లోకి వెళ్లిపోవడం వెనక ఏదో కుట్ర ఉంటుందని భావించింది. ఎందుకైనా మంచిది, ఆమెను ఓ కంట కనిపెడుతూ ఉండమని భాగ్యకు మరీ మరీ చెప్పింది. అక్కడ మాధవి కూడా తన భర్త ఎవరిని చూసి ప్రేరణ పొందుతున్నారో అని పరోక్షంగా నందును విమర్శించింది. ఎవరిని చూసి ఇలా భార్యను వదిలేస్తానంటున్నాడో అని అతడికి చురకలంటించింది. దీన్నిబట్టి మాధవి దంపతులు నందులో మార్పు తీసుకురావడానికి విడాకుల నాటకం ఆడుతున్నారా? లేదా నిజంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నారా? అనేది తేలాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే! చదవండి: Intinti Gruhalakshmi: తులసి సాయం, లాస్య మొసలి కన్నీళ్లు -
Intinti Gruhalakshmi: నందు ఇంట్లో కలకలం, మరొకరు ఆత్మహత్యాయత్నం
లాస్య ప్లాన్ బెడిసికొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయి అల్లకల్లోలం సృష్టించాలనుకుంది. అనుకున్నట్లుగా వరుస సమస్యలు కూడా వచ్చిపడ్డాయి. కానీ వాటన్నింటిని చాకచక్యంగా దాటుకుంటూ ముందుకు సాగుతోంది తులసి కుటుంబం. దీంతో త్వరలోనే తానేంటో చూపిస్తానని మంగమ్మ శపథం చేస్తోంది లాస్య. మరి నేటి(మే 14) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. నా చదువుకు డబ్బులు కూర్చింది నువ్వే కదా అని దివ్య తన తల్లిని అడిగింది. అందుకు తులసి అవునని తలూపడంతో దీన్నెందుకు దాచిపెట్టడం? ఈ మంచి విషయాన్ని అందరికీ చెప్తానని మారాం చేసింది. దీంతో ఆందోళన పడ్డ తులసి.. చేసిన పని అందరికీ తెలియాల్సిన అవసరం లేదని, దీనికి ఫలితం దక్కితే అంతే చాలు అని చెప్పి కూతురిని ఆప్యాయంగా హత్తుకుంది. తన కలలు నిజమవుతుండటంతో దివ్య గాల్లో తేలుతోంది. తన కూతురు సంతోషాన్ని చూసి ఉప్పొంగిపోయాడు నందు. తన చదువు కోసం సాయపడ్డ ఇంటి సభ్యులందరికీ (తులసితో సహా) థ్యాంక్స్ చెప్పాడు. ఈ సంతోషాన్ని చిన్నాభిన్నం చేసేందుకు లాస్య తులసికి ఫోన్ చేసింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది నీకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడానికేనంటూ తులసిని హెచ్చరించింది. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడని తులసి.. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే పెళ్లి రోజున ఆయనను బయటకు తీసుకెళ్లి మనసారా మాట్లాడేలా చేశాను. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే ఇంత చేసిన నేను.. నువ్వు ఆయన పక్కన లేనప్పుడు ఇంకెంత చేస్తానో ఊహించలేవు అని రివర్స్ కౌంటరిచ్చింది. ఇదేమీ పెద్దగా పట్టించుకోని లాస్య.. త్వరలోనే నిన్ను గెంటేస్తానని తులసికి సవాలు విసిరి ఫోన్ పెట్టేసింది. మరోవైపు అభి తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసం ఇంటర్వ్యూ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రయత్నాన్ని అంకిత అడ్డుకుంది. అమ్మ చెప్పినట్లు ఫారిన్‌కు వెళ్లి అక్కడ ఇంకా చదవుకుని డాక్టర్స్‌గా స్థిరపడదాం అని సూచించింది. కానీ మీ అమ్మ ఇచ్చే డబ్బుతో ముందడుగు వేయలేనని తేల్చి చెప్పాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య అగ్గి రాజుకోవడంతో అభి ఆవేశంలో అంకిత మీద చేయి చేసుకోబోయాడు. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే అభి తన మీద చేయెత్తడం తట్టుకోలేకపోయిన అంకిత కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన అంకిత తల్లి.. ఇదే సరైన సమయమని, ఫారిన్‌కు వెళ్దామని అభిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయమని సూచించింది. దీంతో అమ్మ సలహాను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమైంది అంకిత. ఇక దివ్య సమస్య పరిష్కారం అయిందనుకుంటున్న తరుణంలో నందు ఇంట్లో మరో కొత్త సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. తన భర్త విడాకులు అడుగుతున్నాడంటూ నందు సోదరి ఉరేసుకోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన ఇంటి సభ్యులు ఆమెను అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరి ఆమె సమస్యను నందు దంపతులు ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: ఇంట్లో ఉంటే ఆకలి, బయటకు వెళితే కరోనా: నటి భావోద్వేగం -
Intinti Gruhalakshmi: తులసి సాయం, లాస్య మొసలి కన్నీళ్లు
గత కొద్దిరోజులుగా తులసి ఇంట్లో దివ్య టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. దివ్యను ఎలా చదివించాలి? తన మెడిసన్ ఫీజు ఎలా కట్టాలి? అన్నదాని మీదే అందరూ మల్లగుల్లాలు పడ్డారు. కానీ కుటుంబం అంటే సంతోషాలను మాత్రమే కాదు బాధలను కూడా పంచుకునేది అని నిరూపిస్తూ అందరూ చేతులు కలిపారు.. తలా ఇంత పోగు చేసి నందు చేతిలో పెట్టారు. దీంతో తన కళ్లను తనే నమ్మలేకపోయిన నందు దివ్య చదువుకు ఇక ఎలాంటి ఆటంకం లేదన్న విషయం అర్థమై సంతోషంలో మునిగి తేలాడు. మరి నేటి ఇంటింటి గృహలక్ష్మి(మే 13) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. దివ్యను చదివించాలన్న తాపత్రయానికి తులసి సంతోషించింది. కానీ అందుకోసం నందు కారు అమ్మేయడానికి రెడీ అవడం మాత్రం అస్సలు మింగుడుపడలేదు. దీంతో తను మొదట్లో ఉద్యోగం చేరినప్పుడు ఇచ్చిన చెక్‌ను బయటకు తీసింది. అది ఇప్పుడు అక్కరకు వస్తుందని భావించి కొడుకు చేతికి అందించింది. ఇది చూసిన నందు తండ్రి తన పెన్షన్ డబ్బు లక్ష రూపాయలు ఇస్తానని ముందుకొచ్చాడు. అలాగే తులసి కొడుకు కూడా తన ఆఫీస్‌లో ఎంతో కొంత అడ్వాన్స్ అడిగి తీసుకుంటాను అని చెప్పాడు. అలా అందరూ కలిసి సమకూర్చిన డబ్బును నందుకు ఇచ్చి దివ్య మెడిసిన్ విద్యకు మార్గం సుగమం చేశారు. ఇక దివ్య ప్రాబ్లమ్ క్లియర్ కావడంతో నందు మనసు మళ్లీ లాస్య వైపు మళ్లింది. ఆమెకు ఫోన్ చేసి.. ఇంకా ఎన్నాళ్లు దూరంగా ఉంటావు, అంత పాపం ఏం చేశాను? అని నిలదీశాడు. దీంతో లాస్య.. నువ్వు నీ కుటుంబ సభ్యులతోనే ఆనందంగా ఉంటావు. అందుకే అక్కడనుంచి వచ్చేశాను అని చెప్పింది. నువ్వు నాతోనే, నా పక్కనే ఉండాలని నందు అభ్యర్థించాడు. కానీ అది జరిగి తీరదని, తులసి నన్ను అవమానిస్తూ, చీదరించుకుంటూ ఉంటుందని, పైగా మనల్ని దూరం చేస్తోందని చెప్తూ మొసలి కన్నీళ్లు కార్చింది. కాబట్టి ఇకపై నీతో కలిసి జీవించలేనని తెగేసి చెప్పేసింది. దీంతో నందుకు అప్పటివరకు పడ్డ ఆనందం అంతా ఆవిరైపోయినట్లు అనిపించింది. కానీ లాస్య నందును వదిలేసే ప్రసక్తే లేదు. కేవలం అతడి సంతోషాన్ని పోగొట్టేందుకు గుండెల్లో దిగులు పుట్టేందుకు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. మరి వీరి సంతోషాన్ని కాలరాసేందుకు లాస్య ఇంకా ఎన్ని ఎత్తులు వేస్తుందో చూడాలి! చదవండి: క్షేమంగా ఇంటికి చేరుకున్న దివ్య, లాస్య మరో ప్లాన్! -
Intinti Gruhalakshmi: దివ్య క్షేమం, లాస్య మరో ప్లాన్!
మెడిసిన్ చదవలేనేమోనన్న భయంతో తనకు తెలియకుండానే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోంది దివ్య. ఏదో మైకంలో ఆత్మహత్యకు యత్నించడం, ఇంటి నుంచి వెళ్లిపోవడం లాంటివి చేస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఆమెను ఎలా ఓదార్చాలో, డిప్రెషన్లో నుంచి ఎలా బయటపడేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు దివ్య తల్లిదండ్రులు. మరి నేటి(మే 12) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో వారు దివ్య కోసం ఏం చేశారు? తనను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారా? అనేది తెలియాలంటే దీన్ని చదివేయండి.. కన్నకూతురును కంటిపాపలా చూసుకునే నందుకు దివ్య అదృశ్యమవడం అశనిపాతంలా మారింది. తనను జాగ్రత్తగా చూసుకోనందుకు తులసి మీద రంకెలు వేసిన అతడు పోలీస్ స్టేషన్లోనూ సహనాన్ని కోల్పోయాడు. తన కూతురు ఎవరితోనో లేచిపోయిందంటూ చులకనగా మాట్లాడిన ఇన్స్పెక్టర్ మీద నిప్పులు చెరిగాడు. ఏకంగా అతడి కాలర్ పట్టుకున్నాడు. దీంతో అందరి ముందు తనను అవమానించిన నందును అరెస్ట్ చేసి లాకప్‌లో వేశారు. ఈ విషయం తెలిసిన తులసి మరింత షాక్‌కు గురైంది. పరుగుపరుగున పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడిని వదిలేయండి అంటూ ఇన్స్పెక్టర్ను చేతులెత్తి వేడుకుంది. దీంతో రవ్వంత కరిగిపోయిన అతడు నందు సారీ చెప్తే వదిలేస్తానని మెలిక పెట్టాడు. సారీ చెప్పడం కష్టమే అయినప్పటికీ తప్పదంటూ, ఈ ఒక్కసారికి సారీ చెప్పేయమని కొడుకు వేడుకున్నాడు. ఇక తప్పని పరిస్థితుల్లో తనను తాను తమాయించుకున్న నందు క్షమించమని చెప్పి అక్కడ నుంచి బయటపడ్డాడు. మరోవైపు దివ్య తనకు తెలియకుండానే రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే గుర్తించిన బంధువు ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెను చూడగానే ఇంటివాళ్లకు పోయిన ప్రాణం లేచివచ్చినట్లైంది. కన్నకూతురు కళ్లెదురుగా కనిపించడంతో సంతోషపడిపోయారు నందు దంపతులు. అయితే నందు తల్లి మాత్రం దివ్యకు మాయదారి రోగం వచ్చిందంటూ ఆడిపోసుకుంది. ఇది నచ్చని నందు తన కూతురును అలా అనొద్దంటూ హెచ్చరించాడు. మొత్తానికి దివ్య క్షేమంగా ఇల్లు చేరింది. కానీ అక్కడ లాస్య మరో ఎత్తు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నందుతో కాన్ఫరెన్స్ కాల్లో తులసిని ఇరికించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ సక్సెస్ అయిందా? బెడిసి కొట్టిందా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే! చదవండి: TNR 'ప్లే బ్యాక్', ఆహాలో ఎప్పటినుంచంటే? -
Intinti Gruhalakshmi: పోలీస్ కాలర్ పట్టుకున్న నందు
నందు కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేయాలన్న లాస్య పాచిక పారింది. దివ్య ఆత్మహత్యకు యత్నించడం, ఆమె చదువుకు ఫీజు కడదాం అని వెళ్తుంటే శశికళ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పుడు దివ్య కనిపించకుండా పోవడం.. అన్నీ ఆమెకు కలిసొస్తున్నాయి. మొత్తానికి నందు ఇంట్లో ఆనందానికి స్థానం లేకుండా పోయిందని తెగ సంతోషించింది. అసలు దివ్య ఎలా అదృశ్యమైంది? ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడం కోసం నందు, తులసి ఏం చేశారు? అన్న విషయాలు నేటి(మే 11) ఎపిసోడ్లో చదివేయండి.. తను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే దివ్యను చదివించడం కోసం పక్కనపెట్టిన డబ్బును శశికళ గద్దలాగా తన్నుకుపోయింది. దీంతో తన కూతురి ముఖంలో సంతోషం, భవిష్యత్తుకు ధీమా కల్పించేందుకు ఏం చేయాలా? అని మల్లగుల్లాలు పడ్డాడు నందు. తన దగ్గర అంత డబ్బు కూడా లేదే? అని తల పట్టుకున్నాడు. ఇంతలో తన కారును అమ్మేయాలన్న మెరుపులాంటి ఆలోచన మెదడులో కదిలింది. అంతే.. ఎప్పటినుంచో తన కారులాంటి మోడల్‌ను కొనాలని తెగ ఆసక్తి చూపిస్తున్న స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతడు కూడా కొనడానికి అంగీకారం తెలపడంతో మెడిసిన్ ఫీజు కట్టొచ్చని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఈ విషయం తెలియక దివ్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ముందు రోజు తల్లి ఒడిలో నిద్రపోయిన ఆమె తెల్లారేసరికి కనిపించకుండా పోవడంతో ఇంటిల్లిపాది కంగారు పడిపోయింది. దివ్యను ఆమాత్రం చూసుకోలేవా? అని నందు, అతడి తల్లి తులసిని ఏకిపారేశారు. వయసొస్తే సరిపోదని కాస్త బుర్ర కూడా ఎదగాలని ఆమెను నిందించారు. ఇలా గొడవపడితే సమస్యకు పరిష్కారం దొరకదని నందు తండ్రి సూచించడంతో అందరూ ఆమెను వెతకడం మొదలు పెట్టారు. కానీ భాగ్య మాత్రం వీరి ఆందోళనను పోగొట్టాల్సింది పోయి, వారి టెన్షన్‌ను రెట్టింపు చేసేలా మాట్లాడింది. దివ్య చావడానికి వెళ్లిపోయి ఉంటుందిలే, అలాంటి వాళ్ల కోసం ఎందుకు వెతకడం అంటూ నోటికొచ్చినట్లు వాగింది. తన కూతురి గురించి దురుసుగా మాట్లాడిన భాగ్య మీద చెయ్యి చేసుకోబోయిన నందు తర్వాత తనను తాను తమాయించుకున్నాడు. ఛీ కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇవేవీ పెద్దగా పట్టించుకోని భాగ్య ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ పూస గుచ్చినట్లు లాస్యకు ఫోన్లో చేరవేసింది భాగ్య. దివ్య బకెట్ తన్నేసిందంటే నీకు లైన్ క్లియర్ అంటూ మరో పథకాన్ని రచించమమని చెప్పకనే చెప్పింది. ఇదే కనక జరిగితే దివ్యతో పాటు, లాస్య కూడా నందు జీవితంలో దూరమవుతుందని విషాన్ని చిమ్మింది. మరోవైపు తన కూతురు కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేద్దామని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నందుకు చేదు అనుభవం ఎదురైంది. అతడి ఫిర్యాదును తీసుకోకుండా కాలక్షేపం చేస్తున్న పోలీస్ మీద నందు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన పోలీస్.. నీ కూతురు ఎవరితోనో లేచిపోయి ఉంటుందని చులకనగా మాట్లాడాడు. ఆ మాటలను సహించలేకపోయిన నందు ఏకంగా అతడి కాలర్ పట్టుకున్నాడు. దీంతో డ్యూటీలో ఉన్న పోలీసాఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు అతడిని స్టేషన్లో బందీని చేశారు. మరి అతడిని తులసి విడిపించుకుంటుందా? భర్త, కూతురు కోసం తులసి ఏం చేయనుందనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా -
Intinti Gruhalakshmi: దివ్య మిస్సింగ్, షాక్‌లో తులసి!
లాస్యను తన భర్తకు దూరం చేయాలన్న తులసి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. మరోవైపు జరిగే ప్రతి విషయానికి తులసిని దోషిగా నిరూపించాలన్న లాస్య ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా వర్కవుట్ అవుతోంది. మెడిసిన్ చదవాలన్న దివ్య కలకు ఆదిలోనే అడ్డంకులు సృష్టించింది. శశికళను రంగంలోకి దింపి తను అనుకున్నది జరిగేలా చూసుకుంది. తులసి మీద నందుకు ద్వేషం కలిగేలా చేసి, ఆ ఇంటిని రణరంగంగా మలిచాకే మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెడతానని ఫిక్సయింది లాస్య. మరి నేటి(మే 10) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లో ఏం జరిగిందో చదివేయండి.. కన్నకూతురును చదివించి తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాలనుకున్నాడు నందు. కానీ ఆ డబ్బులు దివ్య చదువుకు ఖర్చవడం లాస్య, భాగ్యలకు అస్సలు ఇష్టం లేదు. దీంతో వీరిని ఎలా ఆపాలా అని పన్నాగం పన్ని శశికళను రంగంలోకి దింపారు. డబ్బు కోసం ప్రాణాలను సైతం తీసే ఆమెను నందు ఇంటికి ఉసిగొల్పారు. సరిగ్గా అప్పుడే మెడిసిన్ ఫీజు కట్టేందుకు వెళ్తున్న నందు ఆమెను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. తన అప్పు, వడ్డీని తీర్చడం పక్కనపెట్టి బిడ్డ చదువుకు డబ్బులు ఖర్చుపెట్టబోతున్నాడని తెలిసి అగ్గి మీద గుగ్గిలమైంది శశికళ. నాకు వడ్డీ ఇవ్వాలన్న సంగతి గుర్తులేదా? అని నిలదీసింది. ఇప్పుడు కూతురి మెడిసిన్ సీటుకు ఫీజు కట్టాలని, తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కాస్త ఆలస్యంగా ముట్టజెప్తానని నందు అభ్యర్థించాడు. కానీ ఆమె ఏదీ చెవికెక్కించుకోలేదు. డబ్బులిస్తేనే గడప దాటుతావు, లేదంటే ఈడనే శవంలా మారుతావు అని గన్ ఎక్కుపెట్టి బెదిరించింది. దీంతో భయపడిపోయిన నందు చేసేదేం లేక, ఆమెకు ఎదురు తిరగలేక ఆమెకివ్వాలసిన డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక లాస్య పాచిక పారడంతో ఆమె కన్నా భాగ్య ఎక్కువగా సంతోషపడిపోయింది. అంతేకాగు, నువ్వు లేకపోతే బావగారు ఎంత కష్టపడుతున్నారో తెలిసొచ్చేలా చేస్తానని లాస్యకు హామీ ఇచ్చింది. ఇదిలా వుంటే తన భర్త తల దించుకోవడం ఎప్పుడూ చూడలేదని విలవిల్లాడిపోయింది తులసి. అది కూడా ఓ ఆడదాని ముందు తల దించాల్సిన పరిస్థితి రావడమేంటని ఆవేదన చెందింది. మరోవైపు దివ్య తన మెడికల్ సీటు పోయినట్లేనని దిగులు పడింది. తన కలలు కళ్ల ముందే కూలిపోతున్నాయని డిప్రెషన్‌కు లోనైంది. కూతురి మనసులోని భావాలు అర్థమైన తులసి.. ఆఖరు నిమిషం వరకు ఓపిక పట్టమ్మా అని బుజ్జగించింది. తన ఒడిలో పడుకోబెట్టి నిద్రపుచ్చింది. కానీ తెల్లారేసరికి దివ్య కనిపించకుండా పోయింది. దీంతో నందు మరోసారి తులసి మీద నిప్పులు చెరిగాడు. కూతురును చూసుకునే బాధ్యత కూడా లేదా? అని చీవాట్లు పెట్టాడు. మరి దివ్య ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? అన్న విషయాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే! చదవండి: OTTకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే! -
Intinti Gruhalakshmi: నందు ప్రయత్నానికి శశికళ ఆటంకం!
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో దివ్య ఆత్మహత్యాయత్నం నందుకు తన భాధ్యతను గుర్తు చేసుకుంది. కన్న కూతురు ఈ పరిస్థికి రావడానికి కారణం ఏంటో అర్థం కాక సైకియాట్రిస్ట్‌ను పిలిపించారు. ఆమె ముందు కూర్చున్న దివ్య తనకు ఈ మధ్య ఓ కల తరచూ వస్తోందని చెప్పింది. అందులో అమ్మానాన్న విడిపోతున్నట్లు కనిపిస్తున్నారని, తాను ఒంటరిని అయిపోతున్నానని వాపోయింది. ఆమె అసలు బాధ అర్థమైన డాక్టర్.. మీ దగ్గరే శాశ్వత పరిష్కారం ఉందంటూ నందు దంపతులకు చెప్పి వెళ్లిపోతుంది. మరి నేటి(మే 7) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.. తన బిడ్డకు అప్పుడే ఇన్ని కష్టాలా అని బాధపడ్డ తులసి, తన కూతురును ఒడిలో పెట్టుకుని తల నిమురుతూ ఆమెకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేసింది. చదువు ఒకటే లోకం కాకూడదని, అన్నింటిలో ఉండాలని సూచించింది. మనోధైర్యం ఉంటే ఎలాగైనా బతికేయొచ్చంటూ మంచి మాటలు చెప్తూ నిద్ర పుచ్చింది. అనంతరం ఆ గదిలోకి వెళ్లిన నందు తండ్రిగా తాను ఫెయిల్ అయ్యానని, అందుకు క్షమించంటూ వేడుకుని విలపించాడు. ఇంతలో అక్కడో డైరీ కనిపించడంతో దాన్ని తీసి చదవడం మొదలు పెట్టాడు. "డాడీ చాలా మంచివాడు.. కానీ ఈ మధ్య అతడిలో చాలా మార్పులొస్తున్నాయి. అవేవీ నచ్చడం లేదు. ఆయన ఎప్పటిలాగా ఉంటే ఎంత బాగుండో! ఆయన ప్రాముఖ్యతనిచ్చే మనుషులు మారిపోయారు. ఇది ఇంకా బాధగా అనిపిస్తోంది. అమ్మను నాన్నెందుకు దూరం పెడుతున్నారు? వీళ్లిద్దరూ కలిసుంటే ఎంత బాగుంటుంది. మరోవైపు నాన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అలాంటిది నన్ను మెడిసిన్ చదివించేందుకు డబ్బులు కట్టమని ఎలా అడుగుతాను. నాన్నను కష్టపెట్టకూడదు. అందుకే డాక్టర్ కోర్స్ వదిలేద్దాం అనుకుంటున్నా.." అని డైరీలో రాసుకుంది. ఇది చదివిన నందు ఆనంద భాష్పాలు కార్చాడు. తనంటే దివ్యకు అంత ఇష్టమా? అని సంతోషించాడు. రెక్కలు ముక్కలు చేసుకునైనా డాక్టర్ కోర్సు చదివిస్తాను అని ఆ క్షణమే భీష్మించుకుంటాడు. కేవలం అలా అని ఊరుకోలేదు. ఇంట్లో ఉన్న డబ్బులను కోర్సు కోసం కట్టేందుకు దివ్యను తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు శశికళ రంగంలోకి దిగింది. ఏకంగా నందు మీదకే గన్ పెట్టి బెదిరించింది. మరి ఆమె ప్రయత్నాన్ని తులసి ఎలా అడ్డుకుంది? దివ్య మెడిసిన్ సీటు ఫీజు కట్టిందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే! చదవండి: మా నాన్న పిచ్చి వల్ల ఆస్తి పోయింది: అనసూయ సినీ కవి ఆత్రేయ అసలు పేరు తెలుసా? -
Intinti Gruhalakshmi: దివ్యను చాచి కొట్టిన తులసి
కుటుంబం కోసం పరితపించే తులసికి మరో గడ్డు పరిస్థితి ఎదురైంది. కళ్ల ముందే కూతురి కలలు కల్లలవుతుంటే తట్టుకోలేకపోయింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న తులసి.. దివ్య చదువుకు నందును ఎలా ఒప్పించాలా అని లోలోపలే మధనపడుతోంది. మరోవైపు దివ్య ఇప్పటివరకు టాపర్‌గా ఉన్న తాను ఇకపై చదవకుండా ఇంట్లోనే ఉండిపోవాలా అని అయోమయంలో పడిపోయింది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లోని నేటి ఎపిసోడ్లో దివ్య ఏం చేసింది? తులసి కన్నకూతురును ఎందుకు కొట్టింది? అన్న విషయాలు తెలియాలంటే ఇది చదివేయండి.. త్వరగా జాయిన్ అవకపోతే మెడికల్ సీటు పోతుందని దివ్య స్నేహితురాలు ఆమెకు ఫోన్ చేసి చెప్పింది. మెడిసిన్‌లో చేరేందుకు ఇంకా నాలుగు రోజులే ఉండటంతో టెన్షన్లో పడిపోయింది దివ్య. అసలే మెడిసిన్ చేయాలన్నది తన కల. దీంతో కూతురు భవిష్యత్తు నాశనం కాకూడదనే ఆలోచనతో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ తులసి భర్తను అభ్యర్థించింది. కానీ ఆమె మాటలకు విసుగెత్తిపోయిన నందు.. మెడిసిన్ చేయకపోతే దివ్య చచ్చిపోతుందా? అని మండిపడ్డాడు. ఏం చదవకపోతే నీలాగే ఇంట్లో అంట్లు తోముతుంది అని విసుక్కున్నాడు. ఈ మాటలు విన్న దివ్య హృదయం ముక్కలైంది. తను మెడిసిన్ చదవలేనా? డాక్టర్‌ను కాలేనా? అని ఆవేదన పడింది. మరోవైపు నందు కూడా ఫ్రస్టేషన్లో అలా ఎలా మాట్లాడాను అని బాధపడ్డాడు. తనకోసం ఏమైనా చేస్తానని, తన చదువు కోసం తల తాకట్టు పెడతానని చెప్పాడు. కానీ తన చదువు ఆగిపోతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది దివ్య. కానీ సకాలంలో ఆమెను చూసిన తులసి వెంటనే పరుగు పరుగున వెళ్లి ఆమెను కాపాడింది. తను ఏమీ మాట్లాడకపోవడంతో చాచి చెంప దెబ్బ కొట్టింది. దీంతో స్పృహలోకి వచ్చిన దివ్యను దగ్గరకు తీసుకుని లాలించింది. చదవండి: విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేస్తుంది.. -
Intinti Gruhalakshmi: దివ్య ఆత్మహత్యాయత్నం!
కళ్ల ముందే కట్టుకున్నోడిని ఒకరు ఎగరేసుకుపోతుంటే ఏ భార్యా సహించదు. భూదేవి అంత సహనమున్న ఓ మహిళ కూడా తనకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకపోయింది. పైగా తన భర్త కావాలనుకుంటోంది ఓ జిత్తులమారి నక్కను అని తెలిసి అతడిని కాపాడాలనుకుంది. ఈ ప్రయత్నంలో భర్తకు, ఏకంగా ఇంటిల్లిపాదికే ఆమె శత్రువుగా మారింది. అయినా సరే తన భర్తను తిరిగి తన సొంతం చేసుకునేందుకు పోరాడుతున్న తులసి కథే "ఇంటింటి గృహలక్ష్మి". మూడు వందలకు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్లో తులసి కష్టాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయే తప్ప తగ్గడం లేదు. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు ఇంకిపోయినా బాధలు ఆమెను వదిలి పెట్టడం లేదు. మరి నేటి(మే 5న) ఎపిసోడ్లో ఏం జరిగిందో చదివేయండి.. నందు.. తులసికి దూరం కావాలన్న కసితో పక్కా ప్లాన్‌తో ఇల్లు వదిలి పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది లాస్య. దీనికంతటికీ కారణం తులసే అంటూ భార్య మీద అగ్గి మీద గుగ్గిలమయ్యాడు నందు. దీనికి తోడు లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి వీడియోను చూపించడంతో విడాకులు ఇచ్చి తీరుతానని శపథం చేశాడు. నాలుగు నెలల తర్వాత ఎవరి దారి వారిదేనని తేల్చి చెప్పాడు. అలా లాస్య ప్లాన్ అనుకున్నదానికంటే బాగా సక్సెస్ అయింది. ఇక కళ్లెదుటే తల్లిదండ్రులు విడిపోవడం గురించి మాట్లాడటం జీర్ణించుకోలేకపోయిన తులసి కూతురు దివ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. అమ్మ ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదని తండ్రిని నిలదీసింది. దీనికి సమాధానం చెప్పలేకపోయిన నందు నువ్వు చిన్నపిల్లవి అంటూ తను మారు మాట్లాడకుండా చేవాడు. ఎవరినైతే తన చెంతకు చేర్చుకోవాలని ప్రయత్నిస్తుందో అతడే విడాకులు తథ్యం అని చెప్పడంతో కూలబడిపోయింది తులసి. అన్నీ తలచుకుని ఒంటరిగా తనలో తానే కుమిలిపోయింది. తనను అలా చూసి చలించిపోయిన తులసి చిన్నకొడుకు మంచి రోజు వస్తుందంటూ తల్లికి ధైర్యం చెప్పాడు. మరోవైపు దివ్యకు మెడిసిన్ సీటు వచ్చింది, కానీ అందులో జాయిన్ చేయడానికి నందు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. దీంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది దివ్య. మరి సూసైడ్‌కు ప్రయత్నించిన దివ్యను తులసి కాపాడుకుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: హిందీలోకి దృశ్యం 2 రీమేక్ 'ఆయనతో సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా'