
తన ఇంటితో అన్ని బంధాలు తెగదెంచుకున్నాక నందు మొదటిసారి మళ్లీ తన ఇంటికి చేరాడు. అయితే అతడు వచ్చింది ఆమె మీద ప్రేమతోనో, ఏదో పని మీదో కాదు! తులసి మీద కోపంతో. తులసి తనను మోసం చేస్తుందన్న భ్రమలో ఉన్న నందు పూటుగా తాగి నానా రచ్చ చేశాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? నందు తిరిగి లాస్య ఇంటికి వెళ్లాడా? లేదా? అనేది తెలియాంటే ఇది చదివేయండి..
నందు పూటుగా తాగి లాస్య ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. తన కష్టార్జితంతో దివ్య ఫీజు కడదామనుకుంటే నువ్వు డబ్బులిచ్చి తనను అసమర్థుడిలా నిలబెట్టావని కోపంతో ఊగిపోయాడు. అలా వీళ్లిద్దరి మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. తాగిన మైకంలో ఏదేదో వాగిన నందు చివరికి అక్కడే నిద్రలోకి జారుకున్నాడు.దీంతో అతడిని సోఫాలో పడుకోబెట్టి దుప్పటి కప్పింది తులసి. మరోవైపు నందును పంపించమంటూ లాస్య ఇంట్లోకి రాగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ తులసి చెడామడా తిట్టేసింది.
మరోవైపు మగత నిద్రలోకి జారుకున్న నందు.. తన మీద తులసికి భయం, గౌరవం, ప్రేమా ఏవీ లేవని మైకంలో మాట్లాడుతుండగా విన్న తులసి బాధతో తల్లడిల్లిపోయింది. నిన్ను ఎప్పటికీ నమ్మను అంటుంటే విలవిల్లాడిపోయింది. తన ప్రేమ ఎన్నటికీ అర్థమవుతుందోనని నిట్టూర్పు విడిచింది.
ఇక తెల్లారిన తర్వాత నందు రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అనసూయ తన కొడుక్కి కనీసం టీ, కాఫీ కూడా ఇవ్వడం లేదని తులసి మీద ఆగ్రహించింది. దీనిపై తులసి మాట్లాడుతూ.. అతడు ఈ ఇంటి మనిషి కాడని, తను కాఫీ ఇస్తే తీసుకోడని అభిప్రాయపడింది. ఆమె అనుకున్నట్లుగానే నందు కూడా తనకేవీ అక్కర్లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇక నందు తల్లి అనసూయ కూడా లాస్య ఇంటికే వచ్చేస్తానని అడిగింది. కానీ ఆమెకు ఎక్కడ సపర్యలు చేయాల్సి వస్తుందోనని లాస్య అందుకు నిరాకరించింది. తులసి మీద పగ తీర్చుకున్న తర్వాతే ఈ ఇంటికి వచ్చేయమని సలహా ఇచ్చింది. అది కూడా కరెక్టే అంటూ తిరిగి తన ఇంటికి చేరిన అనసూయకు చుక్కెదురైంది. ఇక్కడి వార్తలను అక్కడికి మోసుకెళ్లిన అత్త మీద ఫైర్ అయింది తులసి. కొడుకును చూసి రావొచ్చు అని చెప్పాను కానీ, తన వ్యక్తిగత విషయాలు అక్కడ చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment