Intinti Gruhalakshmi July 8వ ఎపిసోడ్: నందు, తులసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు జన్మించారు. బృందావనంలా కళకళలాడిన ఈ ఇంటిని చీల్చడానికి శూర్పణఖలా దిగింది మాయదారి లాస్య. ఆమె రాకతో నందు, తులసి మధ్య ఎంతటి అగాధం ఏర్పడింతో అందరికీ తెలిసిందే. ఆమె మాయలో నుంచి తన భర్తను బయటపడేసి తిరిగి తనదారికి తెచ్చుకోవాలన్న తులసి ఎంతగానో ప్రయత్నించింది, కానీ ఆమె కల కలగానే మిగిలిపోయింది.
తులసి, నందుల విడాకుల ఘట్టం ఆఖరి దశకు చేరుకుంది. ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు కోర్టుకు చేరుకున్నారు. ఇంకా కోర్టు లోపలకు కూడా వెళ్లకముందే మరోసారి గొడవకు దిగారు. ఈ వాదనల వల్ల కొత్తగా ఏ ప్రయోజనమూ లేదంటూ తులసి అక్కడి నుంచి విసురుగా లోనికి వెళ్లిపోయింది. 'విడాకుల అర్జీ పెట్టుకుని సరిగ్గా ఏడాదవుతోంది. గతసారి వచ్చినప్పుడు మీ భార్య తన కాళ్ల మీద తను ఎలా బతుకుతుందో అని భయపడ్డారు. మరి ఇప్పుడు ఆ విషయంలో మీకు ఏదైనా భరోసా దొరికిందా?' అని జడ్జి నందును ప్రశ్నించగా అసలు ఆ విషయం గురించి తనకు అవసరం లేదని తేల్చి చెప్పాడు.
దీంతొ మీ వల్ల కన్నీళ్లను దిగమింగుకున్నాను, ఎన్నో బాధలను భరించాను అని తులసి కంటతడి పెట్టుకుంది. అలా వీరిద్దరి మధ్య వాదన మొదలైంది. నీ వల్లే కోర్టు మెట్లెక్కానంటూ ఇద్దరూ ఒకరినొకరు నిందించుకున్నారు. దీంతో వారిద్దరినీ జడ్జి వారించారు. అనంతరం నందు నుంచి భరణం ఆశిస్తున్నారా? అని తులసిని అడిగాడు. అందుకు ఆమె తనకు విడాకులు మాత్రమే ఇప్పించండని, ఇంకేదీ వద్దని చెప్పింది. దీంతో జడ్జి వారికి విడాకులు మంజూరు చేశాడు. దీంతో తులసి ఏకాకిగా మారగా నందు మాత్రం లాస్యతో వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment